తాజా వార్తలు

Ambernath Road Accident: వీడియో ఇదిగో, మనిషిని ఢీకొట్టి సగం దూరం అలాగే ఈడ్చుకెళ్లిన SUV కారు, ఆగిన వెంటనే మరొక కారును ఢీకొట్టిన డ్రైవర్

Hazarath Reddy

మహారాష్ట్రలోని ఒక ఆందోళనకరమైన సంఘటనలో, అంబర్‌నాథ్‌లో ఒక మహిళ, ఆమె పిల్లలు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడానికి ముందు SUV డ్రైవర్ ఒక వ్యక్తిని ఈడ్చుకుంటూ వెళ్లాడు. అంబర్‌నాథ్‌లో సంభవించిన ఆరోపించిన రోడ్ రేజ్ యొక్క వీడియో ఈరోజు, ఆగస్టు 20న ఆన్‌లైన్‌లో కనిపించింది.

Health Tips:పేగుల్లో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా..ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.

sajaya

మన మొత్తం ఆరోగ్యానికి పేగులు చాలా ముఖ్యమైనవి. మనం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం కావడానికి ఈ ప్రేగులు ఉపయోగపడతాయి. ఒకవేళ వీటిలో ఇన్ఫెక్షన్ ఏర్పడడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి.

Is This Place Haunted? డేంజర్ స్పాట్ అంటే ఎలా ఉంటుందో వీడియోలో చూడండి, గత రెండేళ్లలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్‌లన్నీ జంతువులు అడ్డు రావడం వల్లే..

Hazarath Reddy

అనేక ప్రాంతాల్లో కొన్ని రోడ్లు డేంజర్ స్పాట్ లుగా ఉంటాయని ఆ ప్రాంతాల స్థానికులు చెబుతుంటారు. ఈ రోడ్డు గుండా వెళితే ఏదో ప్రమాదం జరుగుతుందని చెబుతుంటారు. దీనికి సరైన ఆధారాలు అంటే గతంలో జరిగిన ప్రమాదాలను కూడా ప్రస్తావిస్తుంటారు. తాజాగా అలాంటి డేంజర్ స్పాట్ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Health Tips: పొట్లకాయ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలు తినకండి .. తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.

sajaya

పొట్లకాయ ఈ సీజన్లో వచ్చే పోషకాహారమైన కూరగాయ. దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ పొట్లకాయ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. అంతే కాకుండా పొట్లకాయతో కొన్ని ఆహార పదార్థాలు కలపడం కూడా మంచిది కాదు.

Advertisement

Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, పెట్రోల్ ముందు పెట్టుకుని బీడి వెలిగించి అగ్గిపుల్ల కింద వేయడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు, షాపులు, ద్విచక్ర వాహనాలకు అంటుకున్న మంటలు

Hazarath Reddy

రోడ్డుపై పెట్రోల్ పడి ఉన్నా, గమనించని ఓ వ్యక్తి బీడీ వెలిగించుకుని అగ్గిపుల్ల పడేయడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.రోడ్డు పక్కన ఉన్న షాపులు, ద్విచక్ర వాహనాలకు అంటుకున్న మంటలు.అప్రమత్తమైన దుకాణాల యజమానులు. నీళ్లు చల్లి మంటలు అదుపులోకి తీసుకొచ్చిన స్థానికులు.

Botsa Meet YS Jagan: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను అభినందించిన వైఎస్‌ జగన్‌, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ నేత

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం చేయాల్సి ఉండగా అంతకంటే ముందు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి జగన్‌ను కలిశారు.ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్‌ అభినందించారు.

Manu Bhaker: ఒలింపిక్ పతక విజేత మను బాకర్ డ్యాన్స్ చూశారా..చెన్నైలోని ఓ స్కూల్‌లో కాలా చష్మా పాటకు స్టెప్పులు..వీడియో

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్‌తో సత్తాచాటాంది యువ షూటర్ మను బాకర్. తాజాగా చెన్నైలోని ఓ స్కూల్‌లో జరిగిన ఫంక్షన్‌కు హాజరై విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. కాలా చష్మా పాటకు మను వేసిన స్టెప్పులు అందరిని ఇంప్రెస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Andhra Pradesh: ఏపీలో హీటెక్కిన ఎగ్ పఫ్స్ అంశం, టీడీపీ-వైసీపీ పార్టీల మధ్య వార్, ఎవరేమంటున్నారంటే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎగ్ పఫ్స్" కోసం కోట్ల రూపాయల ఖర్చు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది.

Advertisement

Badlapur Sexual Assault Case: స్కూలు పిల్లలపై లైంగికదాడి, మహారాష్ట్రలో వెలువెత్తిన నిరసనలు, బద్లాపూర్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్, 300 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Hazarath Reddy

మహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్‌ లైంగిక దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో దుమారం రేపుతోంది. జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. లోకల్ రైళ్లను సైతం అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి ట్రాక్‌ ఆందోళనకారులను చెదరగొట్టారు.

Madhya Pradesh: మా నాన్న ని జైల్లో వేయండి.. ఐదేళ్ల బుడ్డోడి ఫిర్యాదు!, ఈత కొట్టనివ్వడం లేదని తండ్రితోనే కలిసి ఫిర్యాదు...వీడియో వైరల్

Arun Charagonda

మధ్య ప్రదేశ్ లోని ధార్ పోలీస్ స్టేషన్‌లో ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. నదిలో ఈత కొట్టనివ్వడం లేదని ఐదేళ్ల హుస్సేన్ అనే బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను ఆడుకోనివ్వడం లేదని తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చి రాని మాటల తో ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Badlapur Sexual Assault Case: బద్లాపూర్‌లో దారుణం, స్కూల్లో టాయిలెట్‌కు వెళ్లిన పసిపాపలపై అటెండర్‌ లైంగికదాడి, ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద నొప్పిగా ఉందంటూ తల్లిదండ్రుల ముందు ఏడ్చిన పిల్లలు

Hazarath Reddy

మహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్‌ లైంగిక దాడి చేశారు. కిండర్‌ గార్టెన్‌లో చదువుతున్న మూడు, నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై అటెండర్‌ వేధింపులకు పాల్పడినట్లు బాలికల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. టాయిలెట్‌కు వెళ్లిన విద్యార్థినులతో అటెండర్ అసభ్యంగా ప్రవర్తించాడు.

Maharashtra Shocker: టీచర్ కాదు కామాంధుడు, అమ్మాయిలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ అది పట్టుకుని అలా చేయాలంటూ లైంగిక వేధింపులు, అరెస్ట్

Hazarath Reddy

అకోలా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులకు నెలల తరబడి పోర్న్ వీడియోలు చూపిస్తూ వారిని లైంగికంగా వేధిస్తున్నాడు. వారిని అనుచితంగా తాకుతున్నాడు.నిందితుడైన ఉపాధ్యాయుడిని 47 ఏళ్ల ప్రమోద్ సర్దార్‌గా గుర్తించారు.

Advertisement

Akola School Molestation Case: మహారాష్ట్రలో దారుణం, విద్యార్థినులకు పోర్న్ వీడియోలు చూపిస్తూ అలా చేద్దామంటూ ప్రభుత్వ టీచర్ లైంగిక వేధింపులు, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

అకోలా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులకు నెలల తరబడి పోర్న్ వీడియోలు చూపిస్తూ వారిని లైంగికంగా వేధిస్తున్నాడు. వారిని అనుచితంగా తాకుతున్నాడు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయం బయటపడింది.

Landslide In Srisailam: శ్రీశైలంలో విరిగిపడ్డ కొండ చరియలు, తప్పిన పెను ప్రమాదం, రోడ్డుపై పడ్డ పెద్దపెద్ద బండరాళ్లు..వీడియో

Arun Charagonda

శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కొండ చరియలు విరిగి పడ్డాయి. అయితే రాత్రి సమయం కావడంతో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడ్డ బండరాళ్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా!, ఎన్నికల బరి నుండి తప్పుకున్న ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే!, షా ఎన్నిక ఏకగ్రీవమే!

Arun Charagonda

అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి ఛైర్మన్‌గా జైషా ఎన్నిక దాదాపు ఖాయమైంది. ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. మూడోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని బార్‌క్లే నిర్ణయించారు. దీనికి తోడు ఈ నెల 27న నామినేషన్లకు ఆఖరు తేది కావడంతో జైషా ఎన్నిక లాంఛనమే కానుంది. ఇందుకు సంబంధించి ఎన్డీటీవీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Variety Wedding Card: ప్రశ్నపత్రంలా పెళ్లి శుభలేఖ, ఏపీలో ఓ టీచర్ వెరైటీ వెడ్డింగ్ కార్డు, అందరిని ఆకట్టుకుంటున్న పెళ్లి పత్రిక

Arun Charagonda

ఏపీలోని ఓ టీచర్ వెడ్డింగ్ అందరిని ఆకట్టుకుంటోంది. పెళ్లి శుభలేఖని ప్రశ్నాపత్రంలా తయారుచేయించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ఓ టీచర్ ప్రత్యూష. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్‌గా పెళ్లి పత్రికను రూపొందించారు ప్రత్యూష. ఈ వెడ్డింగ్ అందరిని ఆకట్టుకుంటోండగా నెట్టింట్లో వైరల్‌గా మారింది

Advertisement

Konda Surekha Birthday: ఏసీపీ నందిరాం నాయక్‌కు షోకాజ్ నోటీస్, ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలన్న సీపీ, మంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకల్లో పాల్గొనడంపై వివాదం

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకల్లో పోలీస్ సిబ్బంది వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీని పై స్పందించిన వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా.. ఐదు రోజుల్లో జవాబు చెప్పాలని ఏసీపీ నంది రామ్ నాయక్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌ పై కేంద్ర అనుమతి అవసరం లేదు, హైకోర్టులో కేంద్రం కౌంటర్, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై తమకు సమాచారం లేదని వెల్లడి

Arun Charagonda

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని, ఇందులో కేంద్రం అనుమతి అవసరం లేదని వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉంటుందని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

Leopard Spotted In Srisailam: శ్రీశైలంలో చిరుతపులి సంచారం, వీడియో తీస్తూ కారు లైట్లు వేయడంతో అడవీలోకి వెళ్లిన చిరుత, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారుల సూచన

Arun Charagonda

శ్రీశైలం నీలం సంజీవరెడ్డి భవనం దిగువ గేట్ వద్ద చిరుతపులి సంచారం కలకలం రేపింది. రాత్రి సమయంలో గేటు వద్ద భక్తులకు కనపడింది చిరుతపులి. గేటు వద్ద చిరుతపులిని వీడియో తీస్తూ కారు లైట్లు వెయ్యడంతో అటవీప్రాంతంలోకి వెళ్లింది చిరుత. దీంతో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ, దేవస్థానం అధికారులు ప్రజలకు సూచించారు.

Viral Video: బస్సులో సీటు కోసం ఓ మహిళా ఏం చేసిందో చూడండి, ఏకంగా వెనుక సీటులో నుండి..చివరకు!

Arun Charagonda

ఉత్తర ప్రదేశ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రయాణీకుల రద్దీతో తనకు బస్సులో సీటు దొరకదని భావించిన ఓ మహిళ బస్సు వెనుక వైపు నుంచి పైకి ఎక్కింది. కిటికీపై కాలు పెట్టి పల ఉన్న వారిని తోసుకుంటూ లోపలికి వెళ్లి మొత్తానికి సీటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement