తాజా వార్తలు

Janhvi Kapoor Visits Tirupati: తిరుమల శ్రీవారి సన్నిధిలో జాన్వీ కపూర్, ప్రత్యేక పూజలు, దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటి జాన్వీ కపూర్. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవర సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది జాన్వీ. దీంతో తొలి సినిమా హిట్‌పై భారీ ఆశలు పెట్టుకోగా ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్‌తో ఆకట్టుకుంది.

Health Tips: మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ రెమెడీస్ తోటి మీ సమస్యకు పరిష్కారం.

sajaya

ఈవర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లగాలితో చాలామందికి మైగ్రేన్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వాతావరణ మారిన వెంటనే కూడా ఈ మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

Health Tips: నాన బెట్టిన శనగలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

sajaya

శనగలు మనందరికీ బాగా తెలుసు. వీటిని నానబెట్టుకొని పోపేసుకొని తింటాం. ముఖ్యంగా శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క శుభకార్యం లో ఈ శనగలను వాడుతూ ఉంటాం. ఇందులో మటన్ ,చికెన్ కంటే అధికంగా ప్రోటీన్ ఉంటుంది.

Health Tips: ఎలాంటి ఎక్సర్‌‌సైజ్ లేకుండా ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..ఈ టిప్స్ తో అది సాధ్యం.

sajaya

ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయి. ముఖ్యంగా భానపట్ట అనేది చాలా డేంజర్. ముఖ్యంగా గుండె జబ్బులు, కాలేయ సంబంధ జబ్బులు, వంటివి ఏర్పడతాయి.

Advertisement

Bengaluru Accident Video: బెంగళూరు ఫ్లై ఓవర్‌పై బస్సు బీభత్సం, స్పీడును కంట్రోల్ చేయలేక బైకులు, కార్లకు ఢీ, పలువురికి గాయాలు..వీడియో ఇదిగో

Arun Charagonda

బెంగాళూరులో ఓ వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది. హెబ్బాల్ ఫ్లై ఓవర్‌పై విమానాశ్రయం నుంచి హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌కు ప్రయానిస్తున్న బీఎంటీసీ వోల్వో బస్సు అదుపు తప్పి బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. దీంతో వరుస ప్రమాదాల్లో ఓ వాహనదారుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Telangana Nominated Posts: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మధుయాష్కి, కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల జాతర, మంత్రివర్గ విస్తరణ కూడా, రేసులో ఉంది ఎవరంటే?

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ జాతర మొదలు కానుందా?, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందా?, ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ACB Rides On Rangareddy Additional Collector:ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ధరణిలో మార్పులు చేసేందుకు రూ.8 లక్షలు డిమాండ్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ధరణిలో మార్పులు చేసేందుకు రూ. 8 లక్షలు డిమాండ్ చేయగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిన్న రాత్రి నుంచి ఇద్దరి ఇళ్లలో అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి.

Delhi: రోడ్డుపై గుంత, మురుగు కాలువ దెబ్బతినడంతో రోడ్డపై ఏర్పడిన రంధ్రం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

Arun Charagonda

ఢిల్లీలో రోడ్డుపై గుంత ఏర్పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మురుగు కాలువ దెబ్బతినడంతో గాజీపూర్ డెయిరీ ఫామ్ రోడ్డులో ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతుండగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు పోలీసులు. ఆనంద్ విహార్ నుండి వచ్చే & నోయిడా వైపు వెళ్లే ప్రయాణికులు ఖిచ్రిపూర్ రోడ్డును ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Andhra Pradesh Shocker: అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపిన భర్త, పరారీలో నిందితుడు, పోలీసుల గాలింపు ముమ్మరం

Arun Charagonda

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపాడు భర్త. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుని గాలింపు చర్యలు చేపట్టారు.

Telangana Shocker: గంజాయి మత్తులో సీఐ కొడుకు వీరంగం, రోడ్డుపై మూత్రం పొయవద్దని చెప్పినందుకు ఓ డ్రైవర్‌పై దాడి, వీడియో వైరల్‌

Arun Charagonda

గంజాయి మత్తులో సిద్దిపేట AR CI పూర్ణ చందర్ కొడుకు హర్ష వీరంగం సృష్టించాడు. వరంగల్ జిల్లా కాజీపేట చౌరస్తాలో రోడ్డు మీద మూత్రం పొయ్యకని చెప్పిన కారు డ్రైవర్ మీద విచక్షణ రహితంగా దాడి చేశాడు. సీఐ కొడుకుతో పాటు స్నేహితులు కూడా గంజాయి తీసుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leopard Caught On Srisailam: వీడియో ఇదిగో.. శ్రీశైలంలో చిరుత పులి సంచారం, ఓ ఇంట్లో కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత పులి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వద్ద చిరుత సంచారం సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇంటి ప్రహరీ గోడ పై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లింది చిరుత పులి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు

Kalki 2898 AD OTT: డార్లింగ్ ఫ్యాన్స్‌ కు గుడ్ న్యూస్.. రెండు ఓటీటీల్లోకి కల్కి.. వచ్చే వారమే స్ట్రీమింగ్.. ఏ డేట్ రోజు అందుబాటులోకి రానున్నదంటే?

Rudra

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కల్కి సినిమా థియేటర్లలో ఇంకా సందడి చేస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటివరకు సుమారు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

Advertisement

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం, పంజాగుట్ట, అమీర్ పెట్, బంజారాహిల్స్‌లో భారీ వర్షం, వీడియో వైరల్‌

Arun Charagonda

హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, అమీర్ పెట్, బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్, బేగంపేట,కోటి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Jurala Dam: జూరాల డ్యామ్‌ లో లీకేజీలు... తుంగభద్ర గేట్ ఘటన నేపథ్యంలో జూరాల డ్యామ్ భద్రతపై అనుమానాలు.. ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేత (వీడియో)

Rudra

తుంగభద్ర డ్యామ్ లో ఓ గేటు ఇటీవల కొట్టుకుపోవడం ఆ డ్యాం భద్రతపై అనుమానాలను రేకెత్తించింది. గేటు కొట్టుకుపోవడంతో భారీ ఎత్తున నీరు వృథాగా పోయింది. వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది.

Visakha MLC By Elections: సీఎం చంద్రబాబు వెనకడుగు, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటికి దూరం, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమే!

Arun Charagonda

అంతా ఉహించిందే జరిగింది. బలం లేని చోట పోటీ చేసి పరువు పొగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే ఉత్తమమని భావించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నంతో నామినేషన్ గడువు ముగస్తుండగా పోటీ చేయట్లేదని ప్రకటించారు చంద్రబాబు. ఇందుకు సంబంధించి విశాఖ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బలం లేకుండా పోటీ చేయడం సరికాదని కేడర్‌కు తేల్చి చెప్పారు చంద్రబాబు.

China Girl’s Arangetram: భరతనాట్య ప్రదర్శనతో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల చైనా బాలిక

Rudra

భారత సాంప్రదాయాలకు విదేశాల్లో ఎంతో గౌరవం ఉంది. మన ఆచార, వ్యవహారాలను విదేశీయులు ఎంతో ఇష్టపడుతారని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. పొరుగు దేశం చైనాలో మన సంప్రదాయ నృత్యానికి కూడా ఆదరణ పెరుగుతోంది.

Advertisement

Tamil Nadu Horror: ఇదేం పని..? ఫుట్‌ బాల్ మ్యాచ్ ఓడిపోయారని విద్యార్థుల చెంపలపై కొడుతూ, తిట్టిన పీఈటీ టీచర్.. తమిళనాడులో ఘటన.. వీడియో వైరల్

Rudra

ప్రయత్నించడమే మన పని. గెలుపోటములు దైవాదీనం. నిజమే కదా. అయితే, తమిళనాడులోని సేలంలో ఉన్న ఓ స్కూల్ లో పనిచేస్తున్న పీఈటీ టీచర్ ఈ విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు.

Hyderabad Shocker: హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. ట్రాఫిక్‌ ఎస్‌ఐపై మహిళల దాడి.. అసలేం జరిగింది?

Rudra

ప్రజల భద్రత కోసమే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే, కన్నూమిన్నూ కానకుండా డ్యూటీలో ఉన్న పోలీసులపట్ల కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ, హోంగార్డుపై కొందరు మహిళలు దాడికి పాల్పడటం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.

Snake Vs 3 Mongooses: పాట్నా విమానాశ్రయంలోని రన్ వే పై ముంగిస, పాము మధ్య ఫైట్.. వీడియో వైరల్

Rudra

పాము, ముంగిస మధ్య శత్రుత్వం ఉందన్న విషయం తెలిసిందే. అవి రెండూ ఎదురుపడితే యుద్ధమే. బీహార్ లోని పాట్నా విమానాశ్రయంలో ఇలాంటి ఆసక్తికర దృశ్యమే చోటుచేసుకుంది.

Sagar, Srisailam Gates Closed: తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు

Rudra

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అన్ని గేట్లను అధికారులు మూసి వేస్తున్నారు.

Advertisement
Advertisement