తాజా వార్తలు

Hyderabad: వీడియో ఇదిగో, స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి, బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా వ్యాన్ రివర్స్ చేయడంతో బస్సు కింద పడి..

Hazarath Reddy

గురువారం హయత్‌నగర్‌లోని పెద్ద అంబర్‌పేట్‌లోని హనుమాన్ హిల్స్‌లో నాలుగేళ్ల చిన్నారి వ్యాను కిందపడి నుజ్జునుజ్జు అయి మృతి చెందింది. మృతురాలు బి. రిత్విక శ్రీ చైతన్య స్కూల్‌లో ఎల్‌కేజీ విద్యార్థిని. చిన్నారి మినీ వ్యాన్ నుంచి దిగుతుండగా బస్సు డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది.

Telangana: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిపై భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దారుణం, గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా? అంటూ..

Hazarath Reddy

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు వైద్యులు. డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది. ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్నా కనికరం చూపడం లేదు వైద్యులు.

RBI Cuts Repo Rate: ఆర్‌బీఐ గుడ్‌ న్యూస్, రెండేళ్ల తర్వాత వడ్డీరేట్లు సవరింపు, రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా, గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం

Hazarath Reddy

ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లపై 0.25 శాతం తగ్గింపునిస్తూ గుడ్‌ న్యూస్ తెలిపింది. రెపో రేటును (RBI Cuts Repo Rate) 0.25 శాతం మేర తగ్గించింది.ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. దీంతో 6.50 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి దిగొచ్చింది.

Hyderabad: కీచక ప్రిన్సిపాల్.. విద్యార్థినిపై అత్యాచారయత్నం, ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు, గతంలోనూ ప్రిన్సిపాల్‌పై అత్యాచార ఆరోపణలు!

Arun Charagonda

రంగారెడ్డి జిల్లాలో కీచక ప్రిన్సిపాల్‌(principal) ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదివే విద్యార్థినిపై అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు.

Advertisement

Vijayasai Reddy: వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి.. క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరి, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని కామెంట్

Arun Charagonda

వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే(Vijaya saireddy on Jagan Words), ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు అని తేల్చిచెప్పారు.

Hyderabad: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతిని గర్బవతిని చేసిన కానిస్టేబుల్.. ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు, కానిస్టేబుల్‌పై కేసు, రిమాండ్‌కు తరలింపు

Arun Charagonda

న్యాయం చేస్తానని నమ్మించి యువతిని గర్భవతిని చేశాడు ఓ కానిస్టేబుల్(Medchel Police Station). డబ్బుల విషయంలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని.. గతేడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు(Constable) వచ్చింది యువతి.

PM Kisan 19th Installment Date: రైతులకు శుభవార్త..పీఎం కిసాన్ 19వ విడత నిధుల విడుదల తేదీ ఖరారు... బిహార్ పర్యటన సందర్భంగా రిలీజ్ చేయనున్న ప్రధాని, వివరాలివే

Arun Charagonda

రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల విడుదలకు సంబంధించి తేది ఖరారైంది(PM Kisan 19th Installment Date).

Virus From Dog: తస్మాత్ జాగ్రత్త..! కుక్కల ద్వారా చిన్నారికి వైరస్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

Rudra

కుక్కల ద్వారా ఓ చిన్నారికి వైరస్ సోకిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చేపూరి శ్రీమేధ (4) అనే చిన్నారికి జ్వరం, అలర్జీ రావడంతో సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Leopard In Khammam: ఖమ్మం జిల్లాలో చిరుతపులి కలకలం.. పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో సంచారం

Rudra

ఖమ్మం జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో చిరుతపులి కనిపించినట్టు స్థానికులు తెలిపారు.

Police Saves Women Life: పోలీస్ అన్నలూ మీరు గ్రేట్.. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వివాహితను కాపాడిన రాచకొండ పోలీసులు (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్‌ లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువతిని పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు రక్షించారు.

Allu Aravind About Tandel Ticket Rates: ‘తండేల్’ సినిమా టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరలేదు.. నిర్మాత అల్లు అరవింద్

Rudra

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'తండేల్' చిత్రం నేడు విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.

Train Services Alert: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. 10-21వ తేదీల మధ్య 30 రైళ్లు రద్దు.. కారణం ఏమిటంటే??

Rudra

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 30 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా, 9 రైళ్లను దారి మళ్లించారు.

Advertisement

Hyderabad-Vijayawada EV Buses: హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు.. బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. టికెట్ ధర రూ. 99 మాత్రమే!

Rudra

హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణాలు చేసే వారికి ఇది శుభవార్తే. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్తు వాహనాలు) బస్సులు అందుబాటులోకి వచ్చాయి.

Trouble For Sonu Sood: నటుడు సోనూ సూద్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలన్న లుథియానా కోర్టు.. ఎందుకంటే??

Rudra

బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ పై పంజాబ్‌ లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో ఆయనను ఎక్కడున్నా అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.

Liquor Sales By Street Vendors: హైదరాబాద్‌లో తోపుడు బండ్లపై మద్యం అమ్మకాలు, శేరిలింగంపల్లిలో పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు

VNS

రోడ్డు పక్కన తోపుడు బండికొట్టుపై (Street Vendor) మద్యం బాటిల్ విక్రయిస్తున్న స్థావరంపై శేరిలింగంపల్లి సర్కిల్ జిహెచ్ఎంసి (GHMC) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు (Liquor Sales) చేపడుతున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి సర్కిల్ ఏఎంహెచ్‌ఓ శ్రీకాంత్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు.

MG Astor 2025 Launched: పనోరమిక్‌ సన్‌రూఫ్‌తో మార్కెట్లోకి ఎంజీ అస్టర్‌, కేవలం రూ.9.99 లక్షలకే ప్రారంభం

VNS

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) దేశీయ మార్కెట్‌లో ఎంజీ ఆస్టర్‌- 2025 (MG Aster- 2025) కారును ఆవిష్కరించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఫీచర్లతో వస్తున్న తొలి కారు. షైన్‌ (Shine), సెలెక్ట్‌ (Select) వేరియంట్లలో కొత్త ఫీచర్లతో ఎంజీ ఆస్టర్‌ – 2025 (MG Aster- 2025) తీసుకొచ్చింది.

Advertisement

Vyjayanthi Movies: క్రికెట్‌ బెట్టింగ్ వ్యవహారంపై స్పందించిన వైజయంతి మూవీస్, సోషల్‌ మీడియాలో ప్రకటన విడుదల

VNS

ఆన్‌లైన్ క్రికెట్‌ బెట్టింగ్ (Online Betting) నిర్వ‌హిస్తూ నీలేష్ చోప్రా అనే వ్య‌క్తి హైదరాబాద్ ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈ వ్య‌క్తి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్‌కి చెందిన వ్య‌క్తి అని.. వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. దీంతో తాజాగా ఈ వార్త‌ల‌ను ఖండిస్తూ.. వైజ‌యంతీ బ్యాన‌ర్ (Vyjayanthi Movies) ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టింది.

Ravindra Jadeja Completed 600 International Wickets: అంతర్జాతీయ క్రికెట్‌లో రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్‌, ఏకంగా 600 వికెట్లు తీసి లెజెండ్స్ సరసన నిలిచిన జడ్డూ

VNS

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌ జడేజా. జడ్డూ 80 టెస్టు మ్యాచుల్లో 323 వికెట్లు, వన్డేల్లో 233 వికెట్లు, 72టీ20 మ్యాచ్‌లో 54 వికెట్లు తీశాడు

IND Win By Four Wickets: తొలి వన్డేలో4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం, చెలరేగిన శుభ్‌మన్‌ గిల్

VNS

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ (Team India Won) శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం (Team India Won) సాధించింది. 249 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి 38.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది.

CM Revanth Reddy: పార్టీ గీత దాటితే వేటే.. అనుమానులుంటే అంతర్గతంగా చర్చించాలి, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, సర్పంచ్‌లను ఏకగ్రీవం చేయాలని ఎమ్మెల్యేలకు టార్గెట్!

Arun Charagonda

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు. పార్టీ గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు.

Advertisement
Advertisement