India

MP Kirankumar Reddy: రాహుల్ గాంధీపై దుష్ప్రచారం..గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిపై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు, కేసు నమోదు చేయాలని హయత్‌నగర్ పీఎస్‌లో కంప్లైంట్

Arun Charagonda

బీజేపీ గుజరాత్ అధ్యక్షులు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌పై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ గుజరాత్ ఎక్స్ ఖాతాలో మార్ఫింగ్ ఇమేజ్ పోస్టు చేసి రాహుల్ గాంధీ నల్లధనం కలిగి ఉన్నారంటూ దుష్ర్పచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత న్యాయ సంహిత, ఐటీ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Telangana: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం..డేట్ అయిపోయిన మెడిసిన్స్ విద్యార్థులకు ఇచ్చిన వైద్య సిబ్బంది, మండిపడుతున్న తల్లిదండ్రులు...వీడియో

Arun Charagonda

గురుకులంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులు ఇచ్చారు వైద్య సిబ్బంది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊరిలోనే ఈ ఘటన జరిగింది. మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండలంలోని చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కాలం చెల్లిన మందులు ఇచ్చారు వైద్య సిబ్బంది. నిన్ననే మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇచ్చారని చెప్తున్న అటెండర్..ఒక వైపు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే.. మరో వైపు డేట్ అయిపోయిన మందులు ఇస్తున్నారని ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు.

Astrology: డిసెంబర్ 8న కుజ గ్రహం వ్యతిరేక దిశలో ప్రయాణం, దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఏ గ్రహమైన తన వ్యతిరేక దిశల్లో కదిలినప్పుడు కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తుంది.

Astrology: డిసెంబర్ 14వ తేదీ శుక్రుని సంచారం కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహము అనేక రకాల రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శుక్ర గ్రహం ఈనెల 14వ తేదీన తన రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలను కలిగి ఉంది.

Advertisement

Health Tips: చలికాలంలో తరచుగా జలుబు, దగ్గు అంటే సమస్యతో బాధపడుతున్నారా ఈ కషాయం తోటి ఈ సమస్యకు పరిష్కారం..

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

Health Tips: పసుపు పచ్చగా ఉన్న ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

sajaya

ఈ మధ్యకాలంలో తరచుగా చాలామందిలో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత సమస్యను ఎనీమియా అని అంటారు. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Health Tips: పచ్చి బఠానీలు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

sajaya

శీతాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో పచ్చి బఠానీలు విరివిరిగా లభిస్తూ ఉంటాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Health Tips: ముల్లంగితో కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాలను తినకూడదు..చాలా ప్రమాదం

sajaya

ముల్లంగిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబరు పొటాషియం, మెగ్నీషియం ,ఐరన్, జింక్ ,సెలీనియం వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

Advertisement

Veerlapalli Shankar: నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా..వెలమ కులస్తుల్ని తిట్టలేదు, కేసీఆర్‌ కుటుంబాన్నే తిట్టానని స్పష్టం చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Arun Charagonda

నా మాటలను వెనుకకు తీసుకుంటున్నాను అన్నారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. వెలమ కులస్తుల్ని దృష్టిలో పెట్టుకుని నేను తిట్టలేదు అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వెలమ కుటుంబం అని తిట్టాను తప్ప వేరే వారిని అనలేదు అని స్పష్టం చేశారు.

Hyderabad: 2254 కిలోల భారీ కేక్.....గిన్నిస్ రికార్డ్స్ లో చోటు, భారీ కేకును తయారుచేసిన హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ

Arun Charagonda

హైదరాబాద్ కు చెందిన హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ అద్భుతం సృష్టించింది. 2254 కిలోల రష్యన్ మెడోవిక్ హనీ కేక్ ను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. 200 మంది చెఫ్ లు 90 రోజులపాటు శ్రమించి ఈ భారీ కేక్ ను తయారు చేశారు. తేనె, వెన్న, క్యారమెల్, చీజ్ క్రీమ్ వంటివి వాడి కేక్ తయారు చేశారు.

Mohammed Siraj Angry Video: సహనం కోల్పోయిన మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్‌ని బండబూతులు తిడుతూ బంతి అతని మొహాన విసిరికొట్టిన భారత బౌలర్

Hazarath Reddy

అడిలైడ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు మొదటి రోజున మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ మెక్‌స్వీనీ స్థిరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ రోజు చివరి సెషన్‌లో వారి భాగస్వామ్యం భారత బౌలర్‌లను ఎంతగానో నిరాశపరిచింది.

Vemulawada Temple: వివాదంలో మంత్రి కొండా సురేఖ..భక్తులు విరాళంగా ఇచ్చిన కోడెల విక్రయం, మంత్రి సిఫారసుతోనే జరిగిందని భక్తుల ఫైర్, వీడియో ఇదిగో

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న కోడెల విక్రయం కలకలం రేపింది. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడేలు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అప్పగించారు. 49 కోడెలను అక్రమంగా విక్రయించారు రాంబాబు. దైవభక్తితో భక్తులు రాజన్నకు సమర్పించిన కోడలను మంత్రి సిఫారసుతో రాంబాబు పొంది విక్రయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు.

Advertisement

TDP Vs YCP: పుష్ప 2 థియేటర్ల వద్ద ఆగని పొలిటికల్ పైట్..కట్టెలు- ఇనుప రాడ్లతో దాడి చేసుకున్న ఇరువర్గాలు...వీడియో ఇదిగో

Arun Charagonda

పుష్ప 2 రిలీజ్ ఏమో కానీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ ఫైట్ మాత్రం ఆగడం లేదు. పకాలలోని శ్రీ రామకృష్ణ థియేటర్ వద్ద పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్,మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతో పాటుగా టీడీపీ వారిని రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించమని టీడీపీ నేతలు చెప్పడంతో గొడవ పెద్దదై కట్టెలు ,ఇనుప రాడ్లతో దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mini Brain in Heart: మీ చిట్టి గుండెలో మరో మినీ బ్రెయిన్‌.. హృదయ స్పందనను నియంత్రించేది ఇదేనట.. అమెరికా, స్వీడన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Rudra

మన చిట్టి గుండె మెదడుపై ఆధారపడి కాకుండా తన సొంత నాడీ వ్యవస్థపైనే ఆధారపడి పని చేస్తుందని స్వీడన్‌, అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటివరకు గుండెలోని నాడీ వ్యవస్థ కేవలం మెదడుపై ఆధారపడే పని చేస్తుందని అందరూ భావిస్తున్నారు.

SI Suicide Case: ఎస్సీ - ఎస్టీ కేసు....ఆత్మహత్య డ్రామా...వెరసీ ఎస్‌ఐ ఆత్మహత్య..వాజేడు ఎస్‌ఐ హరీష్ ఘటనలో పోలీసుల నిర్థారణ

Arun Charagonda

వాజేడు SI ఆత్మహత్య ఘటనలో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేటలో ఇద్దరు యువకులను, ఓ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసింది యువతి. పరిచయం పెంచుకుని ఆపై పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేసింది.

Viral Video: షాకింగ్ వీడియో...జాయింట్ వీల్‌ నుంచి జారిన యువతి,చివరకు ఏం జరిగిందంటే!

Arun Charagonda

జాయింట్ వీల్‌లో కూర్చున్న ఓ యువతి.పైకి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు అందులో నుంచి జారి బయటికి వచ్చేసింది. కిందపడిబోతుండగా మధ్యలో ఇనుప కడ్డీలను పట్టుకుని వేలాడింది. అంతా కేకలు వేయడంతో జాయింట్ వీల్ నిర్వాహకులు అలెర్ట్ అయ్యారు. వెంటనే జాయింట్ వీల్‌ వేగాన్ని తగ్గించి, మెల్లగా యువతి కిందకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement

Leave Syria-India Travel Advisory: సిరియాలో దాడులు.. వెంటనే దేశాన్ని విడిచిపెట్టి రావాలంటూ ట్రావెల్‌ అడ్వైజరీ జారీచేసిన విదేశాంగ శాఖ

Rudra

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ గద్దె దిగాలంటూ తిరుగుబాటుదారులు భీకర దాడులకు దిగారు.

CM Revanth Reddy: విద్యార్థులకు వేడి భోజనం, ప్రతీరోజు ప్రిన్సిపాల్- మెస్ ఇంఛార్జీ రుచి చూశాకే విద్యార్థులకు భోజనం పెట్టాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు

Arun Charagonda

గురుకులాల్లో, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వంట వండిన వెంటనే ప్రిన్సిపల్, మెస్ ఇన్ఛార్జి రుచి చూడాలి.. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలన్నారు. సిబ్బంది మాస్కు, టోపీ, ఆప్రాన్ ధరించాలి.. రెండు పూటలకు పప్పు ఒకేసారి వండకూడదు అన్నారు. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలి.. బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాడకూడదంటూ ప్రత్యేక నిబంధనలు జారీ చేశారు.

Ponnam Meets KCR: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎందుకంటే??

Rudra

తెలంగాణలో నేడు రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ సీఎం కేసీఆర్‌ ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలవనున్నారు.

Viral Video: ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తలపెట్టిన చిన్నారి.. ఇరుక్కుపోయిన తల.. ఆ తర్వాత ఏమైంది? (వీడియో)

Rudra

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పులిజాల గ్రామంలో తృటిలో ఓ చిన్నారికి పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పిల్లర్ల మధ్య తల పెట్టింది.

Advertisement
Advertisement