India
Eknath Shinde: అలక వీడిన ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు సిద్ధం, సుధీర్ఘంగా సాగిన చర్చలు సఫలం
VNSమహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పదవి చేపట్టేందుకు ఆ రాష్ట్ర కేర్ టేకర్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకారం తెలిపారు. షిండేను (Eknath Shinde) ఒప్పించేందుకు ఫడ్నవీస్ ఆయన ఇంటికి వెళ్లి జరిపిన చర్చలు ఫలించాయి. ఫడ్నవీస్ విజ్ఞప్తితో డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు షిండే ఒకే చెప్పారు.
Burra Venkatesham VRS Approved By Govt: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్, బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం ఆమోదం
VNSఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం (Burra Venkatesham) స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా (TGPSC Chairman) గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
Good News For UPI Lite Users: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్, ఆ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
VNSయూపీఐ ద్వారా చెల్లింపులు చేసే యూజర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.5వేలకు పెంచడంతో పాటు ప్రతి రూ.1000 వరకు గరిష్ఠంగా చెల్లింపు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను మరింత ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది.
Allu Arjun Entry Scene Video Leaked: పుష్ప 2 మూవీ నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ లీక్, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyతాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయింది. అభిమానులు ఎక్స్ వేదికగా దీన్ని షేర్ చేస్తున్నారు.
Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: అంగరంగ వైభవంగా నాగచైతన్య, శోభిత పెళ్లి, నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు
VNSటాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya), హీరోయిన్ శోభిత ధూళిపాల (Shobjitha) పెళ్లితో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో వివాహ వేడుక వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి సరిగ్గా 8.15 గంటలకు నిర్వహించారు. పెళ్లి వేడుకకు (Naga Chaitanya Sobhita Dhulipala Marriage) ఇరు కుటుంబాలతో పాటు సినీ ప్రముఖులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన అల్లు అర్జున్, అభిమానులను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీఛార్జ్
Hazarath Reddyఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేశారు. రాత్రి 9.30 గంటల షోకి అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్య 70mm థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి పుష్ప2 సినిమా చూసేందుకు వచ్చారు.
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, విజయవాడలో పుష్ప 2 మేనియా, శైలజ థియేటర్ ముందు టఫాసులు పేలుస్తూ ఫ్యాన్స్ హంగామా
Hazarath Reddyథియేటర్ల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. తాజాగా నటుడు అల్లు అర్జున్ అభిమానులు ఈరోజు రాత్రి 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోకి ముందు విజయవాడలోని శైలజ థియేటర్ వెలుపల పటాకులు పేల్చారు.
Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: మూడు ముళ్లతో ఒక్కటైన అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్
Hazarath Reddyనాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఒక్కటయ్యారు. కాసేపటి క్రితమే వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు రాత్రి 8.15 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది.ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సినీ పెద్దలు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.
YS Jagan Slams Chandrababu: చంద్రబాబులాగా బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన జగన్
Hazarath Reddyటీడీపీ జనసేన బీజేమీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Pushpa 2 The Rule: కర్ణాటకలో పుష్ప 2 బెనిఫిట్ షోలు రద్దు, మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని ఆదేశాలు జారీ చేసిన బెంగళూరు జిల్లా కలెక్టర్
Hazarath Reddyపుష్ప 2 సినిమాకు కర్ణాటకలో ఊహించని షాక్ తగిలింది.ఈ మూవీని కర్ణాటకలో మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 6 గంటల కంటే ముందు సినిమాను ప్రదర్శించడం అక్కడ చట్ట విరుద్ధమని కన్నడ ప్రొడ్యూసర్‌లు ఫిర్యాదు చేశారు.
Hyderabad: వీడియో ఇదిగో, బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు
Hazarath Reddyహైదరాబాద్ - కొత్తపేట కృతుంగ రెస్టారెంట్ బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Harish Rao:పంజాగుట్టలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు
Hazarath Reddyహైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని అందులో పేర్కొన్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో అంగన్‌వాడీ టీచర్‌పై యాసిడ్ దాడి, బాధితురాలికి తీవ్ర గాయాలు
Hazarath Reddyవిశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నేడు దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్ మున్నీసా బేగంపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు
Hyderabad: హైదరాబాద్‌లో మరో రాష్ డ్రైవింగ్ కేసు..మల్లేపల్లిలో హోండా సిటీ కారు బీభత్సం, వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిన వైనం..పలువురికి గాయాలు...వీడియో ఇదిగో
Arun Charagondaలంగర్ హౌస్ ఘటన మరవక ముందే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రాష్ డ్రైవింగ్ కేసు నమోదు అయింది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి హోండా సిటీ కారులో రాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిపోయాడు.
Tamil Nadu Shocker: తీవ్ర విషాదం వీడియో, కొబ్బరికాయలు తెంచుతుండగా కరెంట్ షాక్, కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన కూలి
Hazarath Reddyచెన్నైలోని అంపత్తూరులోని సూరపట్టుకు చెందిన గుణశేఖరన్ (వయస్సు 53) అనే కూలి కొబ్బరి చెట్లకు కొబ్బరికాయలు తెంచుతుండగా కరెంట్ షాక్ తో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
Pushpa 2: The Rule: ఒళ్లు కొవ్వెక్కి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నావు, చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకో, అల్లు అర్జున్‌పై జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు తీవ్ర వ్యాఖ్యలు
Hazarath Reddyఅల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటామని జనసేన నేత రమేష్ తెలిపారు. మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్టపడుతుంది. నువ్వు ఒక్కడివే ఒళ్లు కొవ్వెక్కి వారికి వ్యతిరేకంగా ఉంటున్నావని మండిపడ్డారు.
Google Safety Engineering Centre: తెలంగాణలో గూగుల్ భారీ పెట్టుబడులు, హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు..సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ కంపెనీ ప్రతినిధుల చర్చలు సఫలం
Arun Charagondaతెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది గూగుల్ కంపెనీ. హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చర్చలు జరిపారు గూగుల్ ప్రతినిధులు. ఆగస్టు 2024లో గూగుల్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లిన సమయంలో చర్చలు జరిపారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు. గూగుల్ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించారు రేవంత్ రెడ్డి.
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్లు చించివేత, పని చేసినవారెవరో విచారించే పనిలో ఉన్న బన్నీ ఫ్యాన్స్
Hazarath Reddyఅల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇక పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్లు చించివేత కలకలం రేపింది.
PSLVC59: పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా, ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతికలోపం కారణంగా ప్రయోగం రీషెడ్యూల్ చేసినట్లు ఇస్రో వెల్లడి
Arun Charagondaపీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రేపు 4.12 గంటలకు ప్రయోగం రీషెడ్యూల్ చేసినట్టు 'ఎక్స్' వేదికగా ప్రకటించింది ఇస్రో.