India
LPG Price Hike: బిగ్ షాక్.. మరోసారి గ్యాస్ ధరల పెంపు, ఏఏ నగరాల్లో గ్యాస్ ధరలు ఎంత ఉన్నాయో తెలుసా?
Arun Charagondaవినియోగదారులకు షాక్. గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. డిసెంబర్ 1న తొలిరోజే గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ షాకిచ్చాయి చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్ ధర రూ.16 పెరుగగా ఇది నేటి నుండే అమల్లోకి రానుంది. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,818గా ఉంది. కోల్ కతాలో రూ. 1,927 రూపాయలకు పెరిగింది.
Black Magic in Stream: మేకపోతును బలిచ్చి, కొబ్బరికాయలు, అన్నం, బట్టలను వదిలేసి వాగులో క్షుద్ర పూజల కలకలం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం (వీడియో)
Rudraజయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం కుదురుపల్లి గ్రామానికి చెందిన యువకులు వాకింగ్ కు వెళ్లగా వాగులో క్షుద్ర పూజలు చూసి భయాందోళనలకు గురయ్యారు.
Tamilnadu Rains: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్..రోడ్డపై చేపలు పడుతున్న యువకులు, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు..చెరువులను తలపిస్తున్న రోడ్డు..వీడియో ఇదిగో
Arun Charagondaఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తుండగా తిరువణ్ణామలై తిండివనం రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో కొందరు యువకులు వాన నీటిలో చేపలు పడుతుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hyderabad: రోడ్డుపై పడ్డ ఆయిల్.. బైకులు స్కిడ్ అయి 60 మందికి గాయాలు..నాగారం రోడ్డుపై ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaనాగారం - ఎస్వీ నగర్ మెయిన్ రోడ్డుపై ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీ నుండి ఆయిల్ లీక్ అయింది. అది గమనించని బైకర్స్ ఆయిల్ మీద నుండి వెళ్లి స్కిడ్ అవడంతో 60 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై నుంచి ఆయిల్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
CM Revanth Reddy: పాలమూరును అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు, రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ.. , రైతు సంక్షేమంపై చర్చకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
Arun Charagondaఅధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో మూడు రోజులపాటు జరిగిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
Road Accident: ఏపీలోని అనంతపురం జిల్లా విడపనకల్లులో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం (వీడియో)
Rudraఏపీలోని అనంతపురం జిల్లా విడపనకల్లు 42వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టును వేగంగా వస్తున్న ఓ కారు బలంగా ఢీకొట్టింది.
Horrific Accident in Hyderabad: హైదరాబాద్ రోడ్డుపై డీజిల్ లీక్.. జారి పడిపోయిన 70 మంది వాహనదారులు.. ఒకరి మృతి (వీడియో)
Rudraహైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుషాయిగూడ డీమార్ట్ నుంచి నాగారం వరకూ రోడ్డుపై డీజిల్ లీక్ అయ్యింది. ఇది గమనించకపోవడంతో బైక్స్ పై అటుగా వెళ్లిన దాదాపు 60 నుంచి 70 మంది వాహనదారులు రోడ్డు మీద జారిపడ్డారు.
Encounter in Telangana: తెలంగాణ దండకారణ్యంలో అలజడి.. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
Rudraతెలంగాణలోని దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లింది. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు – గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Cyclone 'Fengal' Update: వణికిస్తున్న'ఫెంగల్' తుఫాను.. తమిళనాడు సహా దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు.. తూర్పు తెలంగాణలోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుఫాను తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరం దాటింది.
Harish Rao Challenge To Revanth Reddy: కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్, నిరూపించేందుకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరిన హరీష్ రావు
VNSముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి పచ్చి అబద్దాలు మాట్లాడటానికి నోరెలా వచ్చింది రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు. నిరూపించేందుకు సిద్దమా..? నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా..?అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు.
Champions Trophy: హైబ్రిడ్ మోడల్ లో చాంపియన్స్ ట్రోఫీ, దాదాపు అంగీకరించిన పాకిస్థాన్! కానీ కండీషన్స్ పెట్టిన పాక్ క్రికెట్ బోర్డు
VNSఐసీసీ సూచనలు మేరకు ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy) హైబ్రిడ్ మోడల్‌లో ( Hybrid Model) నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆ దేశంలో కొనసాగుతున్న ఆందోళన హక్కుల విషయంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. ఐసీసీకి షరతులు విధించినట్లు సమాచారం.
Hydraa Police Station: లొటస్ పాండ్ లో ఎకరం కబ్జా చేసేందుకు యత్నం, త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్, రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
VNSచెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై ఎక్కువగా దృష్టిపెట్టామన్న రంగనాథ్.. లోటస్‌పాండ్‌లో (Lotus Pond) ఏకంగా ఓ వ్యక్తి ఎకరం స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే హైడ్రా అడ్డుకుందన్నారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు.
Man Falls To Death While Spitting Paan: పాన్ ఉమ్మేందుకు బస్సు డోర్ తీసి కింద పడిపోయిన వ్యక్తి, భార్య కళ్లెదుటే ఘోరం
VNS45 ఏళ్ల వ్యక్తి, పాన్ ఉమ్మేందుకు బస్సు డోర్ తెరిచాడు. అదుపు కోల్పోయిన అతడు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేలో (Purvanchal Express) వేగంగా వెళ్తున్న ఆ బస్సు నుంచి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
Cyclone Fengal Update: తీరం దాటిన ఫెంగల్ తుఫాన్, తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం
VNSతుఫాను ప్రభావంతో చెన్నైలో వర్షాలు కొనసాగుతున్నాయి. చెన్నై విమానాన్ని తాత్కాలికంగా మూసివేయగా.. పలు విమానాలు రద్దయ్యాయి. వర్షాలతో హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై మధ్య నడవాల్సిన విమానాలను ఎయిర్‌లైన్స్ సంస్థలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి.. లిక్విడ్ పోసిన దుండగుడు...ఇది బీజేపీ పనేనని సీఎం అతిషి ఫైర్
Arun Charagondaఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. కేజ్రీవాల్ పై లిక్విడ్ పోశాడు ఓ దుండగుడు. పాదయాత్రలో భాగంగా ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ కేజ్రీవాల్ నడుస్తుండగా ఘటన జరిగింది. ఇది ముమ్మాటికీ బీజేపీ పనే అని ఎక్స్ లో స్పందించారు ఢిల్లీ సీఎం అతిషి. ఇలాంటి చౌకబారు చర్యలకు ఢిల్లీ ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు.
Pawan Kalyan: హరిహర వీరమల్లు షూటింగ్‌లో పవన్ కళ్యాణ్..అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
Arun Charagondaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' . 2025 మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇవాళ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 - 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు.
Cyclone Fengal: ఫెంగల్ తుఫాను 3D విజువల్స్...90 కిమీల వేగంతో తీరం దాటనున్న తుపాను..వీడియో ఇదిగో
Arun Charagondaచెన్నైలోని IMD రాడార్ ఫెంగల్ తుఫాను క్లౌడ్ స్ట్రక్చర్ 3D విజువల్స్. ఫెంగల్ తుఫాను ఈరోజు 90 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశం ఉంది. అధికారులు ప్రమాదాలను తగ్గించడానికి భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.
Teegala Krishna Reddy: టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీటీడీపీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం!
Arun Charagondaతెలంగాణ టీడీపీపై ఫోకస్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే టీటీడీపీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు. డిసెంబర్ 3న టీడీపీలో చేరనున్నారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. చేరిక అనంతరం తీగలకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు చంద్రబాబు.
Pushpa 2 Tickets Price: పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు, డిసెంబర్ 5 నుంచి రోజు ఏడు ఆటలు, బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా?
Arun Charagondaసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2పై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా టీజర్ , ట్రైలర్‌తో బన్నీ ఆ అంచనాలను మరింతగా పెంచేశాడు. డిసెంబర్ 6న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండగా ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ హంగామా మొదలైంది.
Hyderabad: కీచక టీచర్... విద్యార్థినితో తప్పుడు ప్రవర్తన, కాలేజీ ముందు విద్యార్థిని తల్లిదండ్రుల ఆందోళన
Arun Charagondaచదువు చెప్పాల్సిన టీచర్ కీచకుడిగా మారాడు. విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు. మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. తప్పుగా ప్రవర్తించిన కెమిస్ట్రీ లెక్చరర్‌ను కాలేజీ నుంచి తొలగించింది యాజమాన్యం.