India

Manchu Vishnu Meets Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ని కలిసిన హీరో మంచు విష్ణు...శివుడి ఆశీస్సులతో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించిన 'మా' అధ్యక్షుడు

Arun Charagonda

ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు. నా బ్రదర్ ను కలిసి ఎన్నో విషయాలు చర్చింకున్నాం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు విష్ణు. లోకేష్ పాజిటివ్ ఎనర్జీ నిజంగా అద్భుతం.. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలి..హార హార మహదేవ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం విష్ణు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా ప్రాజెక్టు కన్నప్ప తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Cyclone Fengal Updates: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..ఏపీలో భారీ నుండి అతి భారీ వర్షాలు!

Arun Charagonda

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. నాగపట్నానికి 230 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 210 కిలో మీటర్లు, చెన్నైకి 210 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నంకు పుదుచ్చేరిలోని కార్తెకాల్, తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Astrology: డిసెంబర్ 6 శుక్రుడు, గురు గ్రహాల కలయిక వల్ల గజలక్ష్మి యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

డిసెంబర్ 6 గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల అనేక శుభ ఫలితాలు ఉన్నాయి. అంతే కాకుండా అనేక శుభయోగాలు కూడా ఉన్నాయి. అందులో గజలక్ష్మి యోగం డిసెంబర్ 6న ఏర్పడింది. దీనివల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టము కలిసి వస్తుంది.

RS Praveen Kumar: కొండా మురళిపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్..ఎంతోమంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేశాడు, దీనికి సాక్ష్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు అని వెల్లడి

Arun Charagonda

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ గెస్ట్ హౌజుల్లో కొండా మురళి దారుణాలు చేశాడని ఆరోపించారు. వరంగల్‌లో ఎంతో మంది అమ్మాయిలు, విద్యార్థుల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడని...2002లో ఆయన ఘోరాలు భరించలేక నళిన్ ప్రభాకర్ అనే పోలీస్ ఆఫీసర్ హన్మకొండ చౌరస్తాలో బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చాడని గుర్తు చేశారు.

Advertisement

Astrology: డిసెంబర్ 1 కార్తీక అమావాస్య, ధృతి యోగం ఏర్పడుతుంది. మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 1 నా కార్తీక అమావాస్య సందర్భంగా ధృతి యోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైన యోగంగా చెప్తారు. ఆదివారం అమావాస్య కావడంతో అనేక శుభ ఫలితాలను తీసుకొస్తుంది

Astrology: నవంబర్ 30 నుండి చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత వేగవంతంగా కదిలె గ్రాహం చంద్రగ్రహం చంద్రగ్రహం నవంబర్ 30వ తేదీన శనివారం ఉదయం 6 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.

Health Tips: ఈ మూడు జ్యూస్ లతో శరీరంలోని మలినాలను బయటికి పంపించవచ్చు.

sajaya

మన ఆరోగ్యం ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి. అంటే మన శరీరం లోపల ఉన్న వ్యర్ధాలను బయటకు పంపించడం చాలా ముఖ్యం. మన శరీరంలో మలినాలు ఎక్కువైనప్పుడు అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Health Tips: ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

sajaya

ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. పాలలో క్యాల్షియం, విటమిన్ డి , విటమిన్ ఏ, విటమిన్ బి, రెబఫ్లోవిన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.

Advertisement

Health Tips: ఐరన్ లోకం సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

ఐరన్ మన శరీరానికి చాలా ముఖ్యమైన మూలకం వల్ల రక్తహీనత ఎనీ మియా హిమోగ్లోబిన్ లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను మనము గుర్తించి వాటిని తీసుకోవడం ద్వారా ఈ ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.

CM Revanth Reddy: పాలమూరుకు వస్తున్నా..రైతులతో కలిసి ఆనందం పంచుకోవడానికి, ఓటు అభయ హస్తమై రైతన్నల చరిత్ర తిరగరాసిందన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు…పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు...ఆ ఓటు అభయహస్తమై…రైతన్న చరిత్రను తిరగరాసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి...ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…రూ.7,625 కోట్ల రైతు భరోసా…ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్…రూ.1433 కోట్ల రైతుబీమా…రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం…రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టామన్నారు.

Health Tips: మధుమేహ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ జ్యూస్ లను తాగకూడదు.

sajaya

మధుమేహ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ జ్యూస్ లను తాగకూడదు.అయితే షుగర్ పేషెంట్స్ కొన్ని పండ్లు జ్యూస్ లకు దూరంగా ఉండడం మంచిది.

Vishva Hindu Parishad: ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్‌ను విడుదల చేయాలి, బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని హైదరాబాద్‌లో మానవహారం

Arun Charagonda

ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్‌ను విడుదల చేయాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇస్లామిక్ మతోన్మాదం నశించాలని.. బంగ్లాదేశ్‌లోని హిందువుల రక్షణకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Andhra Pradesh: మందుబాబులకు గుడ్ న్యూస్..మూడు బ్రాండ్ల మద్యం ధరలు తగ్గింపు, చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.99కే!

Arun Charagonda

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. మూడు బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించింది ప్రభుత్వం. చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.99కే అందిస్తుండగా త్వరలోనే మరో రెండు కంపెనీల ధరలు తగ్గించనున్నట్లు సమాచారం.

Uttar Pradesh: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో కాలిపోయిన 200 బైకులు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్-వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌తో పార్కింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగగా మంటల్లో 200లకు పైగా బైకులు కాలిపోయాయి. ఆరు ఫైరింజన్లతో మంటలార్పారు ఫైర్ సిబ్బంది.

Burra Venkatesham: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా బుర్రా వెంకటేశం, ఫైలుపై సంతకం చేసిన గవర్నర్..డిసెంబర్ 2న బాధ్యతలు చేపట్టనున్న వెంకటేశం

Arun Charagonda

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్ పర్సన్ గా ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం నియామకమయ్యారు. డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించనుండగా ఇందుకు సంబంధించిన ఫైల్ పై తెలంగాణ గవర్నర్ సంతకం చేశారు.

Medak: మెదక్‌లో ఫన్నీ సంఘటన.. అర్ధరాత్రి ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ.. యజమాని సడెన్ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

Arun Charagonda

మెదక్ జిల్లా నార్సింగిలో ఫన్నీ సంఘటన జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ.. యజమాని సడెన్ ఎంట్రీ ఇచ్చారు. చుట్టూ పక్కల రెక్కీ నిర్వహించి గేటు తాళం పగలగొట్టగా ఇంతలోనే సడెన్ ఎంట్రీ ఇచ్చారు ఇంటి యజమాని. వేరేవాళ్లు అనుకుని గేటు లోపలికి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేయగా యజమాని సంతోష్ అదే ఇంటికి రావడంతో అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత దొంగ అక్కడి నుండి పారిపోగా సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Advertisement

Andhra Pradesh: విజయనగరంలో జిల్లా భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు-లారీ ఢీ..నలుగురు మృతి, వీడియో ఇదిగో

Arun Charagonda

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా నలుగురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Telugu Student Dies in US: అమెరికాలోని చికాగోలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి

Rudra

అమెరికాలోని చికాగోలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాలోని రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26) మృతి చెందారు.

Harishrao: రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే కుట్ర..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో షేర్ చేసిన హరీశ్‌ రావు, రైతులను మోసం చేసి రైతు పండుగ నిర్వహిస్తారా అని ఫైర్

Arun Charagonda

సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన వీడియోను షేర్ చేసిన హరీశ్‌....రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ, రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయం అన్నారు.

Acid Attack on Bus: విశాఖలో ఆర్టీసీ బస్సుపై యాసిడ్ ఎటాక్.. ముగ్గురు మహిళలకు గాయాలు (వీడియో)

Rudra

విశాఖలోని ఐటీఐ జంక్షన్‌ వద్ద శుక్రవారం రాత్రి బీఆర్టీఎస్‌ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్‌ దాడి చేశాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ముగ్గురు మహిళలపై ఆ యాసిడ్ పడింది. దీంతో వారు కండ్లు మండి కేకలు వేశారు.

Advertisement
Advertisement