India
Bank Holidays in December 2024: డిసెంబర్‌లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఇదిగో, ఈ నెలలో పనిచేసేది కొన్ని రోజులే కాబట్టి అలర్ట్ కాక తప్పదు
Hazarath Reddyడిసెంబర్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితా: భారతదేశం ఏడాది పొడవునా అనేక బ్యాంక్ సెలవులను పాటిస్తుంది , ఇందులో జాతీయ కార్యక్రమాలు, ప్రాంతీయ వేడుకలు, ముఖ్యమైన ఆచారాలు ఉంటాయి.
Lagacharla: లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్న ప్రభుత్వం, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaకాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషనన్ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషనన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
TRAI Clarifies OTP Delays: ఓటీపీ ఆలస్యాలపై క్లారిటీ ఇచ్చిన ట్రాయ్, యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా, డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
Hazarath Reddyటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డిసెంబర్ 1 నుండి నెట్ బ్యాంకింగ్, ఆధార్ OTP మెసేజ్‌లలో ఎలాంటి జాప్యాల గురించి ఆందోళన చెందవద్దని వినియోగదారులకు భరోసా ఇచ్చింది. కొత్త నిబంధనలకు ధన్యవాదాలు చెబుతూ ఈ ముఖ్యమైన వాటి డెలివరీలో ఎటువంటి మందగమనం ఉండదని వారు స్పష్టం చేశారు.
Glenn Phillips Catch Video: వారెవ్వా, డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్న గ్లెన్ ఫిలిప్స్, ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్ ఒల్లీ పోప్
Hazarath Reddyక్రోవ్-థోర్ప్ ట్రోఫీ టోర్నమెంట్ ప్రారంభ టెస్టులో ఇంగ్లండ్ జాతీయ క్రికెట్ జట్టుతో న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో పోరాట ప్రదర్శన చేసింది. కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ అర్ధ సెంచరీలు సాధించి ఆతిథ్య జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు
Robbery In Wine Shop: ఘరానా దొంగలు..ఏకంగా వైన్స్ షాప్ గోడకే కన్నం వేసి దొంగతనం, శంషాబాద్ మండలం పాలమాకుల వైన్స్‌లో ఘటన
Arun Charagondaవైన్స్ షాప్ గోడకు కన్నం పెట్టి మద్యం బాటిళ్లు చోరీ చేశారు దొంగలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని SVB లక్ష్మీనరసింహ వైన్స్ షాప్ గోడకు తెల్లవారుజామున దొంగలు కన్నం పెట్టి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. మాస్కులు ధరించి లోపలికి వెళ్లి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు.
Pune Shocker: షాకింగ్ వీడియో, కారు కింద కుక్కపడినా ఆపకుండా వెళ్లిన డ్రైవర్, విలవిలలాడుతూ మృతి చెందిన శునకం
Hazarath Reddyమహారాష్ట్రలోని పూణేలో జంతు హింసకు సంబంధించిన షాకింగ్ సంఘటనలో, ఒక కుక్కను కారు ఢీకొట్టింది. నవంబరు 25, సోమవారం పూణేలోని స్వర్గేట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pune: గుండెపోటుతో గ్రౌండ్‌లోనే క్రికెటర్ మృతి, ఛాతి నొప్పి వస్తుందని చెప్పాడు...అంతలోనే..వీడియో ఇదిగో
Arun Charagondaపుణెలోని క్రికెట్ స్టేడియంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే గ్రౌండ్‌లోనే క్రికెటర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఓపెనర్‌గా వెళ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఇమ్రాన్ పటేల్ తన ఛాతిలో నొప్పి వస్తుందని అంపైర్లకు ఆ విషయాన్ని చెప్పాడు. ప్లేయర్లు కొంత సేపు ఆట నిలిపివేశారు. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో గుండెపోటు రాగా అక్కడిక్కడే మృతి చెందాడు.
Asifabad: ఆసిఫాబాద్‌లో పులి సంచారం, మహిళపై దాడి..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి...మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా..వీడియో
Arun Charagondaపులి దాడిలో మహిళ మృతి చెందింది. పత్తి చేనులో పత్తి ఏరుతుండగా లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేయగా ఈ దాడిలో మహిళ మృతి చెందింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఘటన చోటు చేసుకోగా ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు.
Tamilnadu: షోరూం ముందే ఎలక్ట్రిక్ స్కూటీ తగలబెట్టిన వ్యక్తి..ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కరించలేదని స్కూటీని కాల్చేశాడు..వీడియో
Arun Charagondaసమస్యను పరిష్కరించలేదని.. OLA షోరూమ్ ముందే స్కూటీ తగలబెట్టాడు ఓ వ్యక్తి. చెన్నై - అంబత్తూరులో ఉన్న OLA షోరూమ్ ముందు ఓ వ్యక్తి తన స్కూటీని తగలబెట్టాడు. అతడు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఓలా వాళ్ళు సమస్యను పరిష్కరించలేదని సీరియస్ అయ్యి ఇలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Telangana: గురుకులంలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..షాక్ తిన్న వైనం, రోజు వారి కూలీలతో వంట..కుళ్లిన గుడ్లు,నీళ్ల సాంబార్...వీడియో ఇదిగో
Arun Charagondaగురుకులంలో తనిఖీకి వెళ్లి ఖంగుతిన్నారు ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీకి వెళ్లారు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ. వంట మనిషి లేకపోవడంతో రోజువారీ కూలీలతో వంట చేయిస్తున్నారు. స్టోర్ రూంలో కుళ్లి బూజు పట్టిన ఆలుగడ్డలు, ఐఎస్ఐ మార్క్ లేని ఉప్పు ప్యాకెట్లు దర్శనం ఇచ్చాయి.
Andhra Pradesh Shocker: మడకశిరలో బాలుడి అదృశ్యం..దారుణ హత్య, కర్ణాటకలో శవమై కనిపించిన 8వ తరగతి విద్యార్థి
Arun Charagondaసత్య సాయి జిల్లా మడకశిరలో దారుణం చోటు చేసుకుంది. ఆమిదాలగొంది గ్రామ ప్రభుత్వ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో నిన్నటి దినం 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ అదృశ్యం అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇవాళ మడకశిర సరిహద్దున ఉన్న కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో బాలుడి హత్య చేయబడి శవంగా కనిపించారు విద్యార్థి చేతన్. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Naga Babu On Rajya Sabha Seat: రాజ్యసభ పదవిపై ఆసక్తి లేదు.. స్వార్థం తెలియని ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్, ఏపీ ప్రయోజనాల కోసమే ఢిల్లీకి పవన్ అని తెలిపిన నాగబాబు
Arun Charagondaరాజ్యసభకు తాను వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు మెగాబ్రదర్ నాగబాబు.నాకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు, ఆశయాలు లేవు అని తెలిపారు. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే,వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు .
Child Heart Attack: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి.. మంచిర్యాల జిల్లాలో ఘోరం
Rudraడెబ్బై, ఎనభై ఏండ్ల వయసులో రావాల్సిన గుండెపోటు ఇప్పుడు చిన్నరుల్లోనూ కనిపిస్తున్నది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామంలోనూ ఇదే జరిగింది.
Telangana Diksha Divas: తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు.. దీక్షా దివస్, కేసీఆర్ చచ్చుడో - తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ఆమరణ దీక్ష..రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌లో బీఆర్ఎస్ శ్రేణులు
Arun Charagondaతెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ నవంబర్ 29, 2009న చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.
12 Feet Snake: అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్.. చాకచక్యంగా పట్టుకుని బంధించిన స్నేక్ క్యాచర్ (వీడియో వైరల్)
Rudraఅనకాపల్లి జిల్లా మాడుగుల శివారులోని ఓ రైతు పొలంలో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్ చేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు పొలంలో కనిపించడంతో సదరు రైతు భయపడ్డాడు.
Nagachaitanya-Sobhita Haldi Function: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్
Rudraఅక్కినేని హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్ వేడుకలు ఎంతో అంగరంగ వైభోగంగా మొదలయ్యాయి. హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
AP Cabinet Meeting: డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
Rudraఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.
AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? (వీడియో)
Rudraఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు.
BRS Deeksha Diwas: నేడు తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’.. కరీంనగర్ లో పాల్గొననున్న కేటీఆర్
Rudraతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లుచేసింది.
AP Rain Alert: ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అటు తెలంగాణలో చలి పంజా
Rudraఏపీకి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదు. నేడు సాయంత్రానికి ఆ వాయుగుండం బలహీన పడుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్ , మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది.