India

Health Tips: గర్భాశయం బలహీనంగా ఉండడానికి కారణాలు ,నివారణ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

sajaya

ప్రతి స్త్రీకి తల్లి కావాలని కల ఉంటుంది. స్త్రీ శరీరంలో ప్రత్యేకమైన భాగాలలో గర్భాశయం ఒకటి. గర్భశ్యం ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు కొంతమంది మహిళల్లో బలహీనమైన గర్భాశయం ఉంటుంది.

Andhra Pradesh: విద్యార్దినిపై శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దారుణం, తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయ‌పరిచిన సత్యనారాయణ

Hazarath Reddy

ఆకివీడులో దారుణం చోటు చేసుకుంది. తొమ్మదవ తరగతి విద్యార్దినిపై దాడిచేసిన శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ . విద్యార్ధిని తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయ‌పరిచిన సత్యనారాయణ . స్కూల్ బస్సులో హేళనగా మాట్లాడిందని కరస్పాండెంట్ కు డ్రైవర్ ఫిర్యాదు చేశారు.

Maharashtra Election Result 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, 288 నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థుల జాబితా ఇదిగో

Hazarath Reddy

గత కొంత కాలంగా మహారాష్ట్రతో పాటు, దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర ఫలితాలు ఎట్టకేలకు వచ్చేశాయి. ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.

Jharkhand Election Result 2024: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాలుగో సారి సీఎం కాబోతున్న హేమంత్‌ సొరేన్‌, 56 స్థానాల్లో జేఎంఎం కూటమి విజయభేరి, 26 స్థానాలతో సరిపెట్టుకున్న ఎన్డీఏ కూటమి

Hazarath Reddy

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో జార్ఖండ్‌ ముక్తి మోర్చా కూటమి ఘన విజయం సాధించింది. హేమంత్‌ సొరేన్‌కు జార్ఖండ్‌ జనం మళ్లీ పట్టం కట్టారు.56 స్థానాలతో జేఎంఎం కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చింది.

Advertisement

Divvela Madhuri: పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దివ్వెల మాధురి, రెండేళ్ల క్రితం దువ్వాడపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు

Hazarath Reddy

పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు దివ్వెల మాధురి ఫిర్యాదు చేశారు, రెండేళ్ల క్రితం దువ్వాడపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.దువ్వాడ తరఫున పోలీసులకు మాధురి ఫిర్యాదు చేసింది

Assembly Elections Results 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో 21 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నిక, ప్రతిపక్షం నుంచి ఒకే ఒక్కరు గెలుపు

Hazarath Reddy

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 21 మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించగా, వారిలో ఒక్కరు మాత్రమే ప్రతిపక్షం నుంచి గెలుపొందినట్లు పోల్ ఫలితాల్లో వెల్లడైంది.

Assembly Elections Results 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎంకు ఎదురుదెబ్బ, కేవలం ఒక స్థానానికే పరిమతమైన పార్టీ, ఈ ఎన్నికల్లో మొత్తం 10 మంది శాసనసభకు ఎన్నిక

Hazarath Reddy

అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంకు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం నవంబర్ 23న వెల్లడైన తర్వాత మొత్తం 10 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు.

Viral Video: దాడి చేస్తున్నా వదలకుండా ఉడుమును ఈ మహిళ చేతితో ఎలా పట్టుకుందో వీడియోలో చూడండి, బాబోయ్ ఇంత ధైర్యమా అంటున్న నెటిజన్లు

Hazarath Reddy

ఓ ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయిన ఉడుము గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ చేరుకున్నారు. వాటర్ ట్యాంక్‌లో ఉన్న జంతువును కర్ర సహాయంతో పైకి లాగి చేతులతోనే పట్టుకుంది. బయటకు రాగానే ఆ ఉడుము ఆమెపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Assembly Elections Results 2024: మహారాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్ష నేత లేకుండా అసెంబ్లీ, అన్ని పార్టీలను ఊడ్చిపారేసిన బీజేపీ కూటమి

Hazarath Reddy

మహారాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం మొత్తం 288 సీట్లలో 10 శాతం లేదా 29 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే ఎంవీఏలోని ఏ పార్టీ కూడా ఆ మేరకు సీట్లు గెలువలేదు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి ఏ పార్టీ కూడా అర్హత సాధించలేదు

Assembly Elections Results 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, కాషాయ సునామిలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

Hazarath Reddy

మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా కాంగ్రెస్ కూటమి దాటలేదు. ఈ కూటమి 45 స్థానాల్లో విజయం సాధించింది. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్‌ 15, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు గెలిచాయి.

Sambhal Shahi Jama Masjid Survey: యూపీలో మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై రాళ్లు రువ్విన స్థానికులు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

భారీ పోలీసు మోహరింపు మధ్య సంభాల్ జిల్లాలోని మసీదును సర్వే చేసేందుకు షాహి జామా మసీదు వద్దకు వచ్చిన సర్వే బృందం ఆదివారం ఉదయం కొందరు "సామాజిక వ్యతిరేకుల" నుండి రాళ్లదాడికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

Young Man Dies by Suicide in Bus: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య, చివరి సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఉరేసుకుని సూసైడ్

Hazarath Reddy

ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు మృతిచెందిన విషాదకర ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రేణిగుంట వద్ద కండక్టర్‌ దీన్ని గుర్తించారు.

Advertisement

Andhra Pradesh: నిమ్మకాయలు పట్టుకుని మీసాలు, గడ్డంతో అఘోరీ హల్‌చల్, కర్నూలు జిల్లాలో భయాందోళనకు గురైన స్థానికులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కర్నూలు జిల్లాలో మరోసారి అఘోరీ హల్చల్ చేశారు. గడ్డం, మీసంతో కనిపించి ఆశ్చర్యానికి గురిచేశారు. అఘోరీని చూసి స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. నిమ్మకాయలతో ఏం చేస్తున్నావంటూ కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించగా.. తాను దిష్టి తీస్తున్నట్లు తెలిపారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ వల్లే గెలిచా.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్‌ కోఠే (వీడియో)

Rudra

అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ వల్లే గెలిచానని మహారాష్ట్రలోని సోలాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగు యువకుడు దేవేంద్ర రాజేశ్‌ కోఠే తెలిపారు.

Agniveer Recruitment Rally: ఆర్మీలో చేరాలనుకునే యువతీయువకులకు గుడ్ న్యూస్.. డిసెంబరు 8 నుంచి హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ

Rudra

ఆర్మీలో చేరాలనుకునే యువతీయువకులకు శుభవార్త. ఆర్మీ రిక్రూట్‌ మెంట్ బోర్డు.. అభ్యర్ధుల ఎంపికకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ 8 నుండి 16 వరకు హైదరాబాద్‌ లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.

Accident in Shadnagar: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. పలువురికి గాయాలు.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘటన (వీడియో)

Rudra

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఓ ప్రయాణికుల బస్సు రివర్స్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Advertisement

Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం.. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ రేపటికల్లా (సోమవారం) దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

CAT Exam Today: నేడు క్యాట్‌ ఎగ్జామ్‌.. మూడు సెషన్లలో పరీక్ష.. తెలంగాణలో సెంటర్లు ఇవే..!

Rudra

ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో ఎంబీఏ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్‌ ఎగ్జామ్‌ ఆదివారం జరగనుంది.

No Number Plate: వాహనాలకు నంబరు ప్లేట్లు లేకపోతే కఠిన చర్యలు: ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవీస్‌

Rudra

నంబర్‌ ప్లేట్లు లేని వాహనదారులపై కఠిన చర్యలకు ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోతే భారీ జరిమానాతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవీస్‌ హెచ్చరించారు.

Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

Rudra

నాలుగేండ్ల కిందట యావత్తు భూప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ఎన్నో లక్షల మందిని పొట్టనబెట్టుకున్నది. అయితే, ఈ కరోనా వైరస్ మన శరీరానికి ఒక విధంగా మంచే చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement
Advertisement