India

Telangana Shocker: వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం, కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పద మృతి...పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం రేపింది. వికారాబాద్ - ధారూర్ మండలంలో కుమ్మరపల్లి గ్రామ పరిధిలోని కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పదంగా గ్రామస్థుడు పాండునాయక్ డెడ్‌బాడీ లభ్యమైంది. వాకింగ్‌కు వెళ్లిన యువకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

Arun Charagonda

మహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం పని చేసిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత కనిపించిందన్నారు. రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. తెలంగాణ లోనూ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని...ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మంత్రుల్లో అసంతృప్తి ఉందని చెప్పారు బండి.

KTR: చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్, కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు..పట్నం నరేందర్ రెడ్డి భార్య

Arun Charagonda

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ ద్వారా కలిశారు.కేటీఆర్ వెంట ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి భార్య‌, శ్రీనివాస్ గౌడ్, మ‌హ‌ముద్ అలీ, బండారు ల‌క్ష్మారెడ్డి ఉన్నారు.

Nayanthara: ఢిల్లీలోని రెస్టారెంట్‌లో నయనతార, 30 నిమిషాల పాటు క్యూలో నిలబడ్డ నయన్ దంపతులు..పట్టించుకోని జనం..వీడియో ఇదిగో

Arun Charagonda

నయనతార - విఘ్నేశ్ దంపతులకు వింత అనుభవం ఎదురైంది. తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌‌కు డిన్నర్‌‌కు వెళ్లిన నయన్.. దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడ్డారు. ఒక్కరు కూడా ఈ స్టార్‌ జంట వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం . ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు విఘ్నేశ్ శివన్‌.

Advertisement

Jharkhand Election Results: జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా, 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి..మేజిక్ ఫిగర్‌ను దాటిన జేఎంఎం

Arun Charagonda

జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా కొనసాగుతోంది. మొత్తం 81 స్థానాలకు గాను 50కి పైగా స్థానాల్లో జేఎంఎం కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా జేఎంఎం కూటమి దూసుకెళ్తోంది.

Sanjay Raut: ఇది ప్రజా తీర్పు కాదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారన్న శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ప్రజలు ఈ తీర్పును అంగీకరించని కామెంట్

Arun Charagonda

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు శివసేన( ఉద్దవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్. ఇది ప్రజా నిర్ణయం కాదని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. ప్రజలు ఈ నిర్ణయాన్ని అమోదించరన్నారు. అజిత్ పవార్, షిండే వర్గం చేసిన మోసంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మాకు తెలుసు అన్నారు.

Telangana: సిగరేట్ తాగొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు...కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Arun Charagonda

సిగరెట్ తాగొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థి(16)ని సిగరెట్ తాగొద్దని తండ్రి మందలించడంతో 6 నెలల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స అందించడంతో కోలుకోగా, విద్యార్థి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఫ్రెండ్స్, కుటుంబంతో మాట్లాడకుండా ఉండేవాడు.. కాగా నిన్న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

India Vs Australia: ఆస్ట్రేలియా 104 ఆలౌట్‌, 5 వికెట్లు తీసిన కెప్టెన్ బుమ్రా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం

Arun Charagonda

పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో జ‌స్‌ప్రీత్ బుమ్రాకు 5 వికెట్లు ద‌క్క‌గా, హ‌ర్షిత్ రాణాకు 3 వికెట్లు ద‌క్కాయి. టెస్టుల్లో బుమ్రా 5 వికెట్లు తీసుకోవ‌డం ఇది 11వ సారి.

Advertisement

Ola Electric Layoffs: ఓలా ఎలక్ట్రిక్‌ లో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. జాతీయ మీడియాలో కథనాలు

Rudra

పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునేందుకుగానూ 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకాలని ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Student Suicide: హైద‌రాబాద్‌ మియాపూర్ శ్రీ చైత‌న్య క‌ళాశాల‌లో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం.. మృతుడి స్వస్థలం ఏపీలోని విజ‌య‌వాడ‌

Rudra

హైద‌రాబాద్‌ లోని మియాపూర్‌ లో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. శ్రీ చైత‌న్య క‌ళాశాల‌లో ఇంట‌ర్‌ విద్యార్థి ఒకరు బలవన్మరణానికి పాల్ప‌డ్డాడు.

Priyanka Gandhi Vadra Leading in Wayanad: వయనాడ్‌ లో 46 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీ

Rudra

వయనాడ్‌ లో లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఉదయం 9.20 నిమిషాల సమయానికి అందిన సమాచారం ప్రకారం 24 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ఉన్నారు.

Cyber Nude Call: ఇంజినీరింగ్ విద్యార్థికి యువతి నగ్న వీడియో కాల్.. ఘట్‌ కేసర్‌ లో మరో స్కాం.. ఏంటది??

Rudra

హైదరాబాద్ లోని ఘట్‌ కేసర్‌ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఓ అనామక యువతి నగ్న వీడియో కాల్ చేసి.. డబ్బులు వసూలు చేసింది.

Advertisement

Heavy Rains in AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా.. ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత

Rudra

ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వచ్చేవారం ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో దారుణం జరిగింది. బిడ్డ కంటిలో నలక సమస్యతో హాస్పిటల్ ను ఆశ్రయించిన ఆ తల్లిదండ్రులకు చివరకు కడుపుకోతే మిగిలింది.

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా.. కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే (లైవ్)

Rudra

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు, నాందేడ్‌, వయనాడ్‌ లోక్‌ సభ స్థానాల (ఉపఎన్నికల) ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధం, వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే

VNS

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 8 గంటలకు రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. వీటితోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు, నాందేడ్‌, వయనాడ్‌ (Wayanad) లోక్‌సభ స్థానాల (ఉపఎన్నికల) ఓట్లను లెక్కించనున్నారు

Advertisement

Mahindra Xuv700 Price Hiked: కారు కొనాల‌నుకుంటున్నారా? ఈ మోడల్ ధ‌ర ఏకంగా రూ. 50వేలు పెంచేసిన కంపెనీ

VNS

కొత్త కారు కొంటున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra Xuv700) కారు ధరలను అమాంతం పెంచేసింది. ఇప్పుడు, కస్టమర్లు ఎవరైనా వడ్డీ ద్వారా ఈ మల్టీ వేరియంట్లను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. రూ. 50వేల వరకు అదనంగా చెల్లించాల్సి (Mahindra Xuv700 Price Hiked) ఉంటుంది.

ICC To Conduct Emergency Meeting: ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌పై స‌స్పెన్స్ కు తెర ప‌డ‌నుందా? అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసిన ఐసీసీ

VNS

ఐసీసీ అత్య‌వ‌స‌ర‌ స‌మావేశం నిర్వ‌హించాలి అనుకుంటోంది. చాంపియ‌న్స్ ట్రోఫీ వేదిక ఖ‌రారు చేయ‌డమే కాకుండా దాయాది బోర్డుల‌ను ఒప్పించ‌డ‌మే ప్ర‌ధాన అజెండాగా ఈ స‌మావేశం జ‌రుగ‌నుంది.

WhatsApp New Feature: వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ల‌ను ఇక‌పై విన‌డ‌మే కాదు చ‌ద‌వ‌చ్చు! అంద‌రికీ అందుబాటులోకి కొత్త ఫీచ‌ర్

VNS

అలా వీలు కాకుంటే సదరు వాయిస్ మెసేజ్ వదిలేయాల్సి ఉంటది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టడానికి.. వాయిస్ మెసేజ్.. టెక్ట్స్ రూపంలో చదువుకోవడానికి వీలుగా వాయిస్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్ (Voice Message Transcripts) ఫీచర్ తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో వాయిస్ మెసేజ్ వినొచ్చు.

Free Bus Service In Srisailam: శ్రీ‌శైలం వెళ్లే భ‌క్తుల‌కు ఫ్రీ బ‌స్, కార్తీక మాసం సంద‌ర్భంగా ప్రారంభించిన అధికారులు

VNS

శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం శుక్రవారం సాయంత్రం నుంచి ఉచిత బస్సు సౌకర్యం (Free bus) ప్రారంభించింది. వారాంతపు సెలవులతోపాటు పర్వ దినాల్లో అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి (Free Bus in Srisailam) భక్తులు తరలి వస్తున్నారు.

Advertisement
Advertisement