India

Sukma Encounter Update: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌, పది మంది మావోలు హతం, ఇంకా కొనసాగుతున్న వేట

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రంలో దక్షిణ సుక్మా (Sukma)లోని భెజ్జీ ప్రాంతం కుంటా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టుల మద్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు హతమయ్యారు.

Hyderabad: ఫ్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ టోకరా..రూ. 150 కోట్లు వసూలు, బాధితులు 600 మందికి పైనే!

Arun Charagonda

ఫ్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ టోకరా వేసింది. ఆర్జే గ్రూప్ పేరుతో వినియోగదారులతో డబ్బులు కట్టించుకున్నారు భాస్కర్, సుధారాణి. దాదాపు 600 మంది నుంచి రూ.150 కోట్ల వసూలు చేశారు. డబ్బులు కట్టి నాలుగేళ్లు అయినా ఇంతవరకూ ఫ్లాట్స్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని బాధితుల ఆరోపించారు.

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్

Arun Charagonda

నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారు అని వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ నేత షర్మిల. మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎం గా ఉన్నారు..అప్పుడు గాడిదలు కాశారా? చెప్పాలన్నారు. అప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల.

China: దొంగల నయా టెక్నిక్, చైనాలో చిన్న రోబోలతో పెద్ద రోబోల దొంగతనం, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

చైనాలో దొంగల న‌యా టెక్నిక్‌ ఫాలో అయ్యారు. చిన్న రోబోల‌తో పెద్ద రోబోల‌ను కిడ్నాప్ చేయిస్తున్నారు మాయ‌గాళ్ళు. ఓ రోబో షోరూమ్‌లోకి దూరి త‌న వెంట కొన్ని పెద్ద రోబోల‌ను తీసుకుపోయింది ఓ మినీ రోబో. సోష‌ల్‌మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Australia vs India: కుప్పకూలిన టిమిండియా టాప్‌ ఆర్డర్..150 పరుగులకే ఆలౌట్, 41 పరుగులతో రాణించిన నితీశ్ రెడ్డి

Arun Charagonda

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ పేస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒక్క నితీశ్ రెడ్డి ఒక్కడే 41 పరుగులతో రాణించగా పంత్ 37, రాహుల్ 26 పరుగులు చేశౄరు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హజల్‌వుడ్ 4,స్టార్క్, కమిన్స్,మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.

PAC Elections: వైసీపీ సంచలన నిర్ణయం, పీఏసీ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Hazarath Reddy

ప్రజా పద్దుల కమిటీ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

Gautam Adani Bribery Case: లంచం ఆరోపణలను ఖండించిన వైసీపీ, అదాని గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ప్రకటన, సెకీతోనే ఒప్పందం చేసుకున్నామని వెల్లడి

Hazarath Reddy

విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని... అదానీ గ్రూప్ తో ఏపీ డిస్కమ్ లు ఒప్పందాలు చేసుకోలేదని తెలిపింది. వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పింది.

Lagacharla Incident: లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు, రూ.10 కోట్లు కేసీఆర్ ఇచ్చారని ప్రభుత్వ తరపు లాయర్ ప్రస్తావన, మాజీ ఎమ్మెల్యే రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఆధారాలు సమర్పణ

Arun Charagonda

లగచర్ల ఘటనలో తొలిసారి కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. కోర్టులో కేసీఆర్ పేరు ప్రస్తావించారు ప్రభుత్వ తరపు న్యాయవాది నాగేశ్వరరావు. మాజీ సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు ఇచ్చారని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ ని హైకోర్టుకు అందజేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఇదంతా చేశారని కోర్టుకు వెల్లడించారు ప్రభుత్వ తరపు న్యాయవాది.

Advertisement

Telangana: ఉరి వేసుకొని 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం, కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో విషాదం నెలకొంది. 10వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుద్దాల ప్రభుత్వ పాఠశాలలో 10వ. తరగతి చదువుతున్నారు వెంకటేష్. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తుండగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Pawan Kalyan Hugs Botsa Satyanarayana: వైసీపీ నేత బొత్సను కౌగిలించుకున్న పవన్ కళ్యాణ్, పీఏసీ ఎన్నిక ఓటింగ్ వేళ ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పీఏసీ ఎన్నిక ఓటింగ్ వేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎదురుపడ్డారు. ఈ క్రమంలో పవన్‌ను బొత్స ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Cockroaches In Chutney: బయట టిఫిన్ చేస్తున్నారా?, ఇది చూస్తే ఇకపై జన్మలో బయట టిఫిన్ చేయరు?..ఒక్క చట్నీలోనే ఎన్ని బొద్దింకలో తెలుసా?

Arun Charagonda

బయట టిఫిన్ చేస్తున్నా? అయితే ఇది మీ కోసమే. హైదరాబాద్ - కేపీహెచ్‌బీలోని నెక్సస్ మాల్ వద్ద ఉన్న మధురం టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్న వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఒకేసారి చాలా మందికి చట్నీలో బొద్దింకలు వచ్చాయి. బొద్దింకలతో ఉన్న ఆహారాన్ని సగం తిన్నాక అవి బయటపడటంతో టిఫిన్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

KCR: దటీజ్ కేసీఆర్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్...గులాబీ బాస్ వ్యూహంతో వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో టచ్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు!

Arun Charagonda

ఓ వైపు ఓటమి మరోవైపు నేతల పార్టీ జంప్ దీనికి తోడు ఎమ్మెల్యేల ఫిరాయింపులు వెరసీ గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డారు. దీంతో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం బీఆర్ఎస్ నేతలకు కీలకంగా మారింది. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి కేసీఆర్‌ది. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ ఉంటుందా? ఉండదా అనే సందేహం కూడా అందరిలో నెలకొంది. కానీ ఈ పరిస్థితుల్లో కేసీఆర్ వేసిన త్రిముఖ వ్యూహం ఫలించింది. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్ పడింది.

Advertisement

Hyderabad Police: సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్ పోలీసుల ఫోకస్, సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిఘా..అసభ్య పోస్టులు పెడితే ఇకపై కఠిన చర్యలే

Arun Charagonda

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. సైబర్ పెట్రోలింగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టులపై నిఘా పెట్టామని, ఇలాంటి పోస్టులు పెట్టి కేసులు ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, సాధారణ ఉద్యోగులు మరియు చిరు వ్యాపారులు ఉన్నారు.

Complaint Against Ram Charan: అయ్యప్ప మాల ధరించి కడప దర్గాకు వెళ్లిన రామ్ చరణ్.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎయిర్ పోర్టు పీఎస్ లో అయ్యప్ప స్వాముల ఫిర్యాదు

Rudra

టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ పై అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశారు. అయ్యప్ప దీక్షలో ఉండి చరణ్ కడప దర్గాను దర్శించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

Theft in Yellamma Temple: మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ సమీపంలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. గుడిలో అమ్మవారినీ ఎత్తుకెళ్ళిన దుండగులు (వీడియో)

Rudra

మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫకిరిటెక్యా తండాలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహంతోపాటు అమ్మవారికి అలంకరించిన ఐదు గ్రాముల బంగారు పుస్తెలు, 5 తులాల వెండి కళ్లను దుండగులు దొంగిలించారు.

Telangana BC Commission: పిచ్చకుంట్ల అనే పదం వాడితే క్రిమినల్ కేసు..బీసీ కమిషన్ సంచలన నిర్ణయం, త్వరలో ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వస్తాయని నిరంజన్ వెల్లడి

Arun Charagonda

ఇకపై పిచ్చకుంట్ల అనే పదం వాడితే క్రిమినల్ కేసు నమోదుకానుంది. రాజకీయ నాయకులు గానీ, ఇతర కులాలు ఎవరైనా పిచ్చకుంట్ల అనే పదం వాడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం అన్నారు బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్.

Advertisement

Duct-taped Banana Sold for $6.2 Million: గోడకు టేపుతో అతికించి ఉన్న ఈ అరటిపండుకు అక్షరాలా 52.7 కోట్లు. ఇదేదో అంత గొప్ప అరటిపండు ఏమీ కాదు మరి!

Rudra

వెర్రి వెయ్యి విధాలు అంటారు పెద్దలు. మీరు చదువబోయే వార్త కూడా అలాంటిదే. ఆకలేస్తే బండి మీద ఓ డజను అరటిపండ్లు కొంటాం. మహా అయితే, ఓ రూ. 60-70 ఇస్తాం. అయితే,

Maoists Killed Two Men: ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య.. మృతుల్లో పంచాయతీ కార్యదర్శి కూడా

Rudra

ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్‌ ఫార్మర్లనే నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు.

Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా

Rudra

ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వచ్చేవారం ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

Accident at Kondagattu: కొండగట్టులో రెండు లారీలు ఢీ.. ముగ్గురికి గాయాలు.. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటమే కారణం (వీడియో)

Rudra

కరీంనగర్-జగిత్యాల రహదారి కొండగట్టు వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా అందులో రాజస్థాన్ నుండి టైల్స్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ దేవిలాల్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు.

Advertisement
Advertisement