India

Maharashtra Assembly Polls: ప్రశాంతంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...ఓటేసిన సచిన్,దీపికా-రణవీర్ దంపతులు, అక్షయ్ కుమార్

Arun Charagonda

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుండే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇక పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు సచిన్ టెండూల్కర్. అలాగే దీపికా-రణవీర్ దంపతులు, అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగంచుకున్నారు.

GHMC Demolitions: 50 గజాల్లో ఐదు అంతస్తుల భవనం, అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసు, భవనం కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్ణయం..వీడియో

Arun Charagonda

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిద్దిక్ నగర్‌లో భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. 50 గజాల్లో ఐదు అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు. 60 శాతం పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు గుర్తించారు ఇంజనీరింగ్ నిపుణులు. సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కనే ఉన్న ఐదంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకు రాగా అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసు నమోదు చేశారు.

Viral Video: షాకింగ్.. పాములతో రైలెక్కి ప్రయాణికులకు బెదిరింపులు, డబ్బులు ఇవ్వకపోతే అంటూ పాములను బయటకు తీసి భయపెడుతున్న దుర్మార్గులు..వీడియో ఇదిగో

Arun Charagonda

పాములతో రైలెక్కి ప్రయాణికులను భయపెడుతున్నారు దుర్మార్గులు. ఇప్పటివరకూ రైలు ప్రయాణం అనగానే చిరుతిండ్లు, అప్పుడప్పుడూ పలకరించే హిజ్రాలు, యాచకులు అనేలా ఉండేది. కానీ, అడుక్కునేందుకు కొత్తగా కొందరు పాములను ఉపయోగిస్తున్నారు. డబ్బులిస్తారా? లేదా అంటూ పాముతో భయపెడుతున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Andhra Pradesh: అమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిని చితకబాదిన ముగ్గురు యువకులు, తూర్పు గోదావరి జిల్లాలో ఘటన..వీడియో ఇదిగో

Arun Charagonda

అమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిపై ముకుమ్మడిగా పాశవికంగా దాడి చేశారు ముగ్గురు యువకులు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితుడు మలికిపురం AFDT జూనియర్ కళాశాలలో చదువుతున్నాడని తెలుస్తోంది.

Advertisement

Telangana: అఘోరితో అర్ధరాత్రి హిజ్రాల భేటీ.. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నావని హిజ్రాల ప్రశ్న.. స్మశాన వాటికలో ఉన్న అఘోరిని కలిసిన వరంగల్ హిజ్రాలు..వీడియో ఇదిగో

Arun Charagonda

అఘోరితో అర్ధరాత్రి హిజ్రాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. స్మశాన వాటికలో సేద తీరుతున్నఅఘోరిని కలిశారు వరంగల్ హిజ్రాలు. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నావని, పర్యటనల పేరుతో ప్రజల్లోకి రావడంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని ప్రశ్నించారు హిజ్రాల సంఘం నాయకురాలు. అఘోరి మానసిక స్థితి తెలుసుకునేందుకు ప్రయత్నం చేయగా తాను ఏమీ మాట్లాడలేనని చెప్పింది అఘోరి.

Lagacharla Accused Suresh: సంగారెడ్డి సెంట్రల్ జైలుకు సురేష్, కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సెంట్రల్ జైలుకు తరలింపు..వీడియో

Arun Charagonda

లగచర్ల కేసులో A2 సురేష్‌ లొంగిపోవడంతో మరిన్ని విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. A2 సురేష్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తరలించారు. కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తరలించగా పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఈ కుట్రకి మాస్టర్ ప్లాన్ వేసిన పెద్దల పేర్లు బయటపడతాయని భావిస్తున్నారు పోలీసులు.

Harishrao: శాతగానోనికి మాటలెక్కువ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌ రావు ఫైర్, రేవంత్ నోట.. బూతులు తప్ప నీతులు రాలేదు అని మండిపాటు

Arun Charagonda

వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి ఉందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు అన్నారు.

AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్..రెహమాన్ స్పందన ఇదే

Arun Charagonda

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్ చెబుతూ భార్య సైరా బాను నుండి విడిపోయారు. ఈ విషయాన్ని సైరా బాను విడిపోతున్నట్లు తరఫు న్యాయవాది ప్రకటించారు. విడాకులపై రెహమాన్ స్పందించారు. తమ వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించామని,

Advertisement

Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ షురూ, ఓటేసిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్, ఈసారి గెలుపు ఎవరిదో?

Arun Charagonda

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 9.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

YS Jagan Mohan Reddy: శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌, శ్రీ విధుశేఖర భారతి స్వామీజీని కలిసి ఆశీర్వచనం తీసుకున్నమాజీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు(మంగళవారం)సాయంత్రం విజయవాడ శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని దర్శించుకున్నారు. సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించి..,శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలిశారు

AP Assembly Session 2024: మైలవరంలో మైనింగ్‌లో అక్రమాలు, గత ఎమ్మెల్యే హస్తం ఉందని తెలిపిన కొల్లు రవీంద్ర, సభలో నా పరువుకు భంగం కలిగిందని వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం

Hazarath Reddy

అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్త చేశారు. మైలవరంలో మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని అందులో గత ఎమ్మెల్యే హస్తం ఉందని మంత్రి శాసన మండలిలో నా ప్రస్తావన తెచ్చారు. కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో సభలో నా పరువుకు భంగం కలిగింది.

Heart Touching Video: హృదయాన్ని హత్తుకునే వీడియో ఇదిగో.. ఆరేళ్ల క్రితం తప్పిపోయిన కన్నతండ్రిని చూసి బాగోద్వేగానికి గురైన కూతుర్లు

Hazarath Reddy

ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబిలిహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా బాలయ్య అనే వ్యక్తికి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో 'ఆశ్రయం' కల్పించడం జరిగింది.

Advertisement

CM Revanth Reddy Slams KCR: వీడియో ఇదిగో, తెలంగాణలో తిరిగే కేసీఆర్ అనే మొక్కను పెరగనీయను, కాస్కో ఇక చూసుకుందామంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్

Hazarath Reddy

CM Revanth Reddy: వరంగల్‌ గడ్డ నుంచి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రుణమాఫీ కాని రైతుల రుణాలన్నీ త్వరలో మాఫీ చేస్తామని ప్రకటన

Hazarath Reddy

తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు.

Revanth Reddy on Sonia Gandhi: వీడియో ఇదిగో, సోనియా గాంధీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా తక్కువే, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వరంగల్‌ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని సీఎం రేవంత్‌ (Revanth Reddy) రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్‌ (Warangal)ను అభివృద్ధి చేస్తామన్నారు.సోనియమ్మ మా తల్లి.. ఆమె కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా అది తక్కువేనని రేవంత్ రెడ్డి అన్నారు..

Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్‌ 10ఏ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను ధర్మాసనం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.

Advertisement

Andhra Pradesh Assembly Session 2024: వీడియో ఇదిగో, మీరు క‌ట్టుకున్న‌ చీర చేనేతదేనా, ఎమ్మెల్యే లోకం మాధవిని సరదాగా ప్రశ్నించిన డిప్యూటీ స్పీక‌ర్ రఘురామ

Hazarath Reddy

ఉద్యోగులు నెలకు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మాధవి ప్రశ్నించగా... ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనా? లేక వేరే చీరనా? అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు.

YS Sharmila Reddy: వీడియో ఇదిగో, కడప అమీన్‌పీర్‌ దర్గాను దర్శించుకున్న వైయస్ షర్మిల, దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన ఏపీసిసి చీఫ్

Hazarath Reddy

కడప అమీన్‌పీర్‌ దర్గాను ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి దర్శించుకున్నారు. దర్గాలో కు విచ్చేసిన ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి కు దర్గా సంప్రదాయం ప్రకారం దర్గా నిర్వాహకులు స్వాగతం పలికారు.దర్గాలో ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, కేరళలో చిక్కుకున్న ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు, సాయం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు వీడియో ద్వారా విన్నపం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధి వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు..కేరళలో చిక్కుకున్నారు. వారు బరిమల యాత్రకు వెళ్లగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనం చిక్కుకుందని వీడియో ద్వారా తెలిపారు.

Andhra Pradesh Shocker: విశాఖలో లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు, ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట రాక్షసుడిగా స్నేహితులకు..

Hazarath Reddy

విశాఖపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.లా చదువుతున్న విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. న్యాయ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి నిందితులు బెదిరించారు.

Advertisement
Advertisement