India

Andhra Pradesh: పెన్ను గురించి గొడవ.. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య, నరసరావు పేట భావన కాలేజీ క్యాంపస్‌లో ఘటన...విషాద ఛాయలు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడ్ జిల్లా నరసరావు పేట భావన కాలేజీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెన్ను గురించి గొడవ జరిగి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనూష . మృతురాలి స్వగ్రామం బొల్లాపల్లి మండలం వెల్లటూరు.

Fact Check: ధోని గౌరవార్థం ఆర్బీఐ ఎలాంటి నాణెం విడుదల చేయలేదు, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నాణెం ఫేక్..!

Arun Charagonda

భారతీయ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ మహేంద్ర సింగ్ ధోనీని గౌరవిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ₹ 7 నాణెం విడుదల చేసిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది.

Nayanthara Slams Dhanush: నటుడు ధ‌నుష్‌పై న‌య‌న‌తార సంచలన ఆరోపణలు, అహంకారంతో తన భర్తపై కక్ష కట్టడాని లేఖలో పేర్కొన్న నయనతార..కోలీవుడ్‌లో సంచలనం

Arun Charagonda

నటుడు ధ‌నుష్‌పై సంచలన ఆరోపణలు చేశారు హీరోయిన్ న‌య‌న‌తార . నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైన త‌న డాక్యుమెంట‌రీలో త‌ను న‌టించిన పాట‌ను వినియోగించుకోవ‌డానికి ధ‌నుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ న‌య‌న‌తార లేఖలో పేర్కొంది. అహంకారంతో త‌న‌పై త‌న భ‌ర్తపై ధ‌నుష్ క‌క్ష క‌ట్టాడ‌ని లేఖలో పేర్కొన్నారు న‌య‌న‌తార.

Hyderabad: కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్, కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేలో వెల్లడి

Arun Charagonda

ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఫుడ్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది. దేశవ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.

Advertisement

Nara Ramamurthy Naidu Passed Away: ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి, మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు..హీరో నారా రోహిత్ తండ్రే రామ్మూర్తి నాయుడు

Arun Charagonda

ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. హైదరాబాద్‌లో AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నారా రామ్మూర్తి నాయుడు. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని మధ్యహ్నం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

Kannada Actress Rita Anchan Dies: ప్రముఖ కన్నడ నటి రీటా అంచన్ కన్నుమూత, అనారోగ్య సమస్యలతో మృతి...పలువురు ప్రముఖుల సంతాపం

Arun Charagonda

ప్రముఖ కన్నడ నటి రీటా రాధాకృష్ణ అంచన్(68) ఇక లేరు. అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. కన్నడతో పాటు హిందీ, పంజాబీ, గుజరాతీ బాషల్లో నటించి మెప్పించారు. 80వ దశకంలో నటిగా ఓ వెలుగు వెలిగారు రీటా. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Andhra Pradesh Assembly: జీరో అవర్.. డ్రైవర్ లేని కారులా ఉందన్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, సభ్యులు చెప్పే సమస్యలను రాసుకునే మంత్రులే లేరని కామెంట్.. మంత్రులపై స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Arun Charagonda

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన కామెంట్స్ చేశారు. సభ్యులు చెప్పే సమస్యలను రాసుకునే మంత్రి లేరని చెప్పారు. మరి సభలో సమస్యలు చెప్పి ఏం లాభమని ప్రశ్నించారు కూన రవికుమార్.

Viral Video: సింగపూర్‌లో షాకింగ్ రోడ్డు ప్రమాదం, మహిళను గుద్దిన కారు...డ్రైవర్ దిగి వెళ్లి చూసే సరికి ఏం జరిగిందో తెలుసా?

Arun Charagonda

సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌ను ఓ మహిళ ఫోన్‌లో లీనమై దాటుతుండగా కారు మహిళను ఢీకొట్టింది. మహిళ పరిస్థితిని చూడడానికి డ్రైవర్ కారు దిగి వచ్చాడు. ఆ మహిళ లేచి గాయాలను చూడకుండా ఫోన్ పాడైపోయిందో లేదో తనిఖీ చేసింది. కారు డాష్‌బోర్డ్ కెమెరా ఫుటేజ్ వైరల్‌గా మారింది.

Advertisement

Telangana: సంగారెడ్డి గురుకుల పాఠశాలలో దారుణం, ఉరేసుకుని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Arun Charagonda

తెలంగాణలోని సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల 9వ తరగతి విద్యార్థిని స్వాతి ఇవాళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. కాని అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

AP CM Chandrababu: ఢిల్లీలో బిజీగా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు నిర్మలా, జై శంకర్‌లతో భేటీ...రాష్ట్ర జీఎస్టీ సర్ ఛార్జ్‌ని పెంచాలని కోరిన ఏపీ సీఎం

Arun Charagonda

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర జీఎస్టీ సర్ ఛార్జ్ ని ఒక్క శాతం పెంచవల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు చంద్రబాబు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

Telangana Police: తెలంగాణ పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, TSSP స్థానంలో TGSPగా మార్చాలని ఆదేశాలు..

Arun Charagonda

తెలంగాణ పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. బ్యాడ్జిల్లో TSP స్థానంలో TGP, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, TSSP స్థానంలో TGSPని చేర్చారు. TSPS స్థానంలో TGPS ఉండే విధంగా బ్యాడ్జిలను మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Arun Charagonda

శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్తీక పూర్ణిమ శుభవేళ సతీసమేతంగా ఎన్ టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...ఒక్క దీపాన్ని వెలిగించినా, ఒక్క దీపాన్ని సంరక్షించినా అది మనకు ముక్తిని కలిగిస్తుంది అన్నారు. సమాజానికి మేలు జరుగుతుందని వేదపండితులు బోధిస్తున్నారు... అలాంటిది కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు.

Advertisement

Man Forcing Wife to Leave Her Job is Cruelty: ఉద్యోగం మానేయాలని భార్యపై ఒత్తిడి చేయడం క్రూరత్వమే.. మధ్యప్రదేశ్‌ హైకోర్టు

Rudra

ఉద్యోగం మానేయాలని, తన ఆకాంక్షలకు అనుగుణంగా బతకాలని భార్యను భర్త వేధించడం, ఒత్తిడి చేయడం.. అలా వినని సందర్భంలో నిర్బంధించడం క్రూరత్వమేనని మధ్యప్రదేశ్‌ హైకోర్టు చెప్పింది.

Wedding Loans: ఇంటి ఋణం, కారు రుణం గురించే విన్నాం.. ఇది వివాహం రుణం.. మ్యాట్రిమొనీ.కామ్‌ సంస్థ సరికొత్త సేవలు

Rudra

ఇంటి రుణం, కారు రుణం గురించే విన్నాం.. వివాహం కోసం రుణం గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే, ఈ వార్తా మీకోసమే.. ప్రీవెడ్డింగ్‌, సంగీత్‌, హల్దీ, మ్యారేజ్‌, రిసెప్షన్‌ అంటూ.. వివాహ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి.

Sex with Minor Wife Amounts to Rape: మైనర్‌ భార్యతో సెక్స్ రేప్ కిందనే లెక్క.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Rudra

మైనర్‌ భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకే వస్తుంది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌ సంచలన తీర్పు చెప్పింది. శృంగారానికి అంగీకారం తెలిపేందుకు కనీస వయసు 18 ఏండ్లు ఉండాలని ఈ సందర్భంగా కోర్టు పేర్కొన్నది.

Bomb Threat to Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం.. విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడి హల్ చల్

Rudra

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు దగ్గరికి రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు హల్ చల్ సృష్టించాడు.

Advertisement

Actress Disha Patani's Father Duped: నటి దిశాపటానీ తండ్రికి షాక్.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠా.. ఐదుగురిపై కేసు నమోదు

Rudra

ప్రముఖ సినీ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి మోసగాళ్ల నుంచి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ కమిషన్‌ లో మంచి పదవులు ఇప్పిస్తామని చెప్పి ఆయన నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు.

Hyderabad Fire Accident: హైదరాబాద్‌ లోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం.. అపార్ట్ మెంట్ లో మంటలు.. బయటకు పరుగులు తీసిన జనం (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ఘోర ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్‌ మెంట్‌ లోని మూడో అంతస్తులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి.

Fire Accident in UP: ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. రోజుల వయసున్న పది మంది నవజాత శిశువులు సజీవ దహనం.. (వీడియో)

Rudra

ఉత్తర ప్రదేశ్‌ లో ఘోరం జరిగింది. ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీ బాయి మెడికల్‌ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

Railway Shock To Reel Creators: రీల్స్ క్రియేట‌ర్ల‌కు రైల్వే శాఖ బిగ్ షాక్! ఇక‌పై ట్రైన్లు, రైల్వే ట్రాక్స్, స్టేష‌న్ల‌లో రీల్స్ చేస్తే నేరుగా ఎఫ్ఐఆర్ న‌మోదు

VNS

రైల్వే కార్యకలాపాలకు ముప్పు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రైల్వే బోర్డు (Indian Railways) సిద్ధమైంది. రైల్వే ప్రాంగణాలు, కదులుతున్న రైళ్లలో ప్రమాదకర రీల్స్‌ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై ఎఫ్‌ఐఆర్‌ (FIR) నమోదు చేయాలని అన్ని జోన్లకు సూచించింది.

Advertisement
Advertisement