India
Andhra Pradesh: ములకల చెరువులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసింది వీళ్లే, మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
Hazarath Reddyఅన్నమయ్య జిల్లా మొలకల చెరువు సమీపంలోని కనుగొండ అటవీ ప్రాంతంలో ఉన్న అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈనెల 14వ తేదీన ధ్వంసం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మీడియా ముందు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రవేశపెట్టారు.
Telangana: వీడియో ఇదిగో, బండరాయి మధ్యలో ఇరుక్కుపోయిన తల్లి కుక్క, పిల్లల ఏడుపు శబ్దం విని షూటింగ్ వదిలేసి పరిగెత్తుకొచ్చి కాపాడిన ఫైటర్లు, పిల్లల చెంతకు చేర్చి..
Hazarath Reddyమొయినాబాద్ లోని అజీజ్ నగర్‌లో ఓ సినిమా షూటింగ్ షూట్ జరుగుతుండగా కుక్కల ఏడుపు శబ్దం విని పరిగెతుకొని రెస్క్యూ చేసి తల్లిని కాపాడి దాని పది కుక్క పిల్లల చెంతకు చేర్చారు.
Guntur Shocker: గుంటూరులో దారుణం, రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహాలు, ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల అనుమానం!
Arun Charagondaగుంటూరు పెద్దకాకాని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ట్రాక్ పై గుర్తించారు స్థానికులు. ఆత్మహత్య చేసుకున్న వారిని ప్రేమ జంటగా అనుమానించగా ఘటన స్థలి సమీపంలో ద్విచక్ర వాహనం మరియు లగేజీ బ్యాగులు లభ్యం అయ్యాయి. చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Weather Forecast: ఏపీకి వాతావరణ శాఖ మరో హెచ్చరిక, బంగాళాఖాతంలో అక్టోబర్ 22న అల్పపీడనం, ఇప్పటికే భారీ వర్షాలతో విలవిల
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు దంచికొట్టాయి. తడ వద్ద వాయుగుండం తీరం దాటింది, ఈ ముప్పు వీడిందని ప్రజలు భావిస్తుండగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.
Group 4 Candidates Protest: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 4 ఉద్యోగ అభ్యర్థుల ఆందోళన..బ్యాక్‌లాగ్ పోస్టులు ఉంచవద్దని డిమాండ్
Arun Charagondaహైదరాబాద్ కాంగ్రెస్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాంధీ భవన్ వద్ద గ్రూప్ -4 ఉద్యోగ అభ్యర్థులు ఇవాళ ఉదయం ఆందోళనకు దిగారు. కొందరు గ్రూప్ -2, గ్రూప్ -1 మెయిన్‌కు ఎంపిక అయిన వారిని గ్రూప్ 4 నుంచి వెంటనే అన్ లివింగ్ చేయాలని డిమాండ్ చేశారు. వారి పోస్ట్‌లు వచ్చి వెళ్లిన తర్వాత బ్యాక్ లాగ్‌లుగా ఉంచవద్దని డిమాండ్ చేయగా పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Toxic Foam On Yamuna River: యమునా నదిపై కాలుష్య వ్యర్థాలతో తెల్లటి నురగ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు
Arun Charagondaకాలుష్యవర్థాలతో యమున నదిలో తెల్లటి నురగ భారీగా పేరుకుపోయింది. ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, మురికినీరు యమునా నదిలోకి చేరుతుంది. దీంతో నదిలోని నీరు కలుషితమవుతోంది. ఈ నేపథ్యంలో కలింది కుంజ్ ఏరియాలోని యమునా నదిపై ఏర్పడిన విషపు నురుగు ఏర్పడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Drone Footage Of Hamas Chief Yahya Sinwar: హమాస్‌కు భారీ షాక్, ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ యహ్వా సిన్వార్ మృతి, వైరల్‌గా మారిన డ్రోన్ వీడియో
Arun Charagondaఇజ్రాయెల్ - హమాస్ మధ్య భీకర పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడిలో సంస్థ చీఫ్ యహ్యా సిన్వార్ మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించగా ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.
CM Revanth Reddy On Musi River Project: మూసీ సుందరీకరణ కాదు పునరుజ్జీవం, డీపీఆరే పూర్తి కాలేదు...లక్షన్నర కోట్లు అంటూ అసత్య ప్రచారం చేస్తారా...సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
Arun Charagondaతెలంగాణ ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ధేశించే కార్యాచరణలో భాగంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై సచివాలయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్... ఈ ప్రాజెక్టు కోసం అయిదు ప్రముఖ సంస్థలతో కలిసిన కన్సార్షియమ్ కు పనులు అప్పగించినట్టు తెలిపారు. ఈ కన్సార్షియమ్ వచ్చే 18 నెలల్లో డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR), ప్రాజెక్టుకు కావలసిన నిధులు, నిధుల సమీకరణకు ఉన్న మార్గాలను అధ్యయనం చేసి నివేదిస్తుందని చెప్పారు.
Bihar: బిహార్‌లో కల్తీ మద్యం సేవించి 27 మంది మృతి, మద్య నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రంలో కలకలం రేపుతున్న సంఘటన, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన ప్రభుత్వం
Arun Charagondaమద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్ రాష్ట్రంలో కల్తీ మద్యంతో 27 మంది మృతి చెందడం విషాదాన్ని నింపింది. సివాన్ జిల్లాలోని మఘార్, ఔరియా గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి 22 మంది, సరణ్ జిల్లాలోని ఇబ్రహీంపూర్లో 5మంది మృతి చెందారు. మరో 25 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా బాధితుల్లో చాలామంది కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది బిహార్ ప్రభుత్వం.
ICC Women’s T20 World Cup 2024: మహిళల టి20 ప్రపంచకప్, సెమీస్‌లో సఫారీ జట్టు గెలుపు గర్జన, వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారిగా కంగారులను ఇంటికి సాగనంపిన ఉమెన్ దక్షిణాఫ్రికన్లు, 8 వికెట్ల తేడాతో ఘన విజయం
Hazarath Reddyమహిళల టి20 ప్రపంచకప్‌లో ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా జట్టుకు.. దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను బోల్తా కొట్టించింది. తద్వారా సొంతగడ్డ (దక్షిణాఫ్రికా 2023)పై జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.
Supreme Court On Working Journalists: వర్కింగ్ జర్నలిస్టులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, జర్నలిస్టులను కొట్టినా, తిట్టినా రూ.50,000 జరిమానా.. 5 ఏళ్లు జైలు శిక్ష అని తీర్పు వెల్లడి
Arun Charagondaవర్కింగ్ జర్నలిస్టులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్కింగ్ జర్నలిస్టులతో ప్రభుత్వాలు జాగ్రత్త ఉండాలని...జర్నలిస్టులను కొట్టినా, తిట్టినా రూ.50,000 జరిమానా అని, 5 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Visakhapatnam: విశాఖపట్నంలో 150 కేజీల గంజాయి సీజ్, కారులో తరలిస్తుండగా ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, కారు సీజ్
Arun Charagondaఅక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పట్టుకున్నారు పడమట సీఐ పవన్ కిషోర్. తమిళనాడుకు చెందిన రమేష్ వినేష్ కుమార్, కుమరన్ మేరీ మూర్తి, అనే ఇద్దరు వ్యక్తుల దగ్గర సుమారు 150 కిలోలు గంజాయిని సిఐ పవన్ కిషోర్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుండి చెన్నైకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Case Against Harish Rao Relatives: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై పోలీసు కేసు నమోదు.. ఎందుకంటే??
Rudraమాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బంధువులపై పోలీసు కేసు నమోదైంది. తన ఐదంతస్తుల భవనంలో హరీశ్ రావు బంధువులు తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్ కుమార్ గౌడ్, గారపడి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు అక్రమంగా ఉంటున్నారని బాధితుడు దండు లచ్చిరాజు అనే వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hyderabad: మెడికల్ మాఫియా, ఆస్పత్రిలో చికిత్ర పొందుతూ యువతి మృతి, బంధువుల ఆందోళన..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ ఈసీఎల్‌లోని ఓ ఆస్పత్రి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుర్కపల్లి మండలం మాదాపూర్‌కు చెందిన ఎంటెక్ విద్యార్థిని నిఖిత(23) ఛాతి నొప్పితో ఈసీఐఎల్‌లోని శ్రీకర హాస్పిటల్‌లో చేరింది.
Salman Khan Gets Fresh Threat: ‘ఈ బెదిరింపులను తేలికగా తీసుకోవద్దు. ప్రాణాలతో ఉండాలంటే 5 కోట్లు ఇవ్వండి’.. సల్మాన్ ఖాన్ కు తాజాగా బెదిరింపులు
Rudraబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఫ్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న శత్రుత్వానికి ముగింపు పలకాలన్నా తమకు వెంటనే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ దుండగులు హెచ్చరికలు జారీ చేశారు.
Pottel Movie Promotion in Plane: విమానంలో ‘పొట్టేల్’ మూవీ ప్రమోషన్.. పాల్గొన్న నటి అనన్య నాగళ్ల (వైరల్ వీడియో)
Rudraయువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మాతలు.
Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. బైక్ పై నెమ్మదిగా వెళ్లమని చెప్పాడని వృద్ధున్ని చంపేశారు.. వీడియో ఇదిగో..!
Rudraహైదరాబాద్ లోని అల్వాల్ లో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై నెమ్మదిగా వెళ్లమని చెప్పాడని ఓ వృద్ధుడిని ఓ యువకుడు దారుణంగా కొట్టాడు. దవాఖానలో చికిత్సపొందుతూ తాజాగా ఆ వృద్దుడు మరణించాడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Tamannaah Questioned By ED: ఈడీ విచారణకు తమన్నా.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ గురించే ఈ విచారణ. అసలేంటీ విషయం??
Rudraమహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కు సంబంధించిన కేసులో ప్రముఖ హీరోయిన్ తమన్నాను ఈడీ గురువారం విచారించింది. గువహటీలోని ఈడీ ఆఫీసుకు తమన్నా తన తల్లితో కలిసి హాజరు అయ్యారు.
Hamas Chief Yahya Sinwar: హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ హతం.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్.. సిన్వర్ మృతి ప్రపంచానికి మంచిరోజు అన్న జో బైడెన్
Rudraహమాస్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ హతమయ్యారు. ఇజ్రాయెల్ దళాలు ఆయన్ని మట్టుబెట్టాయి.
Weather Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు.. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా
Rudraతెలుగు రాష్ట్రాలపై వరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.