India

Chiranjeevi At IIFA 2024: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం, ఐఫా అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న మెగాస్టార్, వేదికపై బాలయ్య,వెంకీ కూడా

Arun Charagonda

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. IIFA (ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024) అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. దుబాయ్‌లో జరుగుతున్న IIFA కార్యక్రమంలో ఈ అవార్డును ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అక్తర్.. మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఇదే వేదికపై బాలయ్య, వెంకటేష్ సైతం సందడి చేశారు.

RK Roja On Chandrababu: శ్రీవారి మీదే నమ్మకం లేకుండా చేశారు, ఫేక్ రిపోర్టుతో డిఫెన్స్‌లోకి చంద్రబాబు, దేవుడు శిక్ష వేసిన బాబుకు బుద్దిరాలేదన్న మాజీ మంత్రి రోజా

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. చెన్నైలో మీడియాతో మాట్లాడిన రోజా.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబు కు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేసిన బుద్దిరాలేదన్నారు. చంద్రబాబు తన విధానాలతో వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేకుండా చేశాడన్నారు. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దేశంలో ఏ రాజకీయ నేత చేయలేదు అని దుయ్యబట్టారు.

Hydra Victims At Telangana Bhavan: ఆంధ్రా నుండి వచ్చి పదేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు కూల్చేస్తామంటున్నారు..హరీశ్‌ రావుతో బాధితురాలు మొర..వీడియో

Arun Charagonda

హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. ఆంధ్ర నుండి వచ్చి పది ఏండ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాము.. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్లో ఉంది కూలకొట్టేస్తాం అంటున్నారు అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

CM Chandrababu On Religions: ఏపీలో త్వరలో కొత్త చట్టం, ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలన్న సీఎం చంద్రబాబు, ఆలయాల్లో అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదని వెల్లడి

Arun Charagonda

ఏపీలో త్వరలో కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు. ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలన్నారు.

Advertisement

Jani Master Case: ముగిసిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ, ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్..అనంతరం చంచల్‌ గూడ జైలుకు

Arun Charagonda

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. నాలుగు రోజుల పాటు జానీ మాస్టర్‌ను విచారించారు నార్సింగి పోలీసులు. కాసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్‌ను తరలించారు. కోర్టులో హాజరు పర్చిన అనంతరం చంచల్‌గూడ జైలుకు జానీ మాస్టర్‌ను తరలించనున్నారు.

Devara: దేవర తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా?, అమెరికాలో దుమ్మురేపిన ఎన్టీఆర్, ఆచార్య డిజాస్టర్‌ను తుడిపేసిన కొరటాల!

Arun Charagonda

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్టు సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకువచ్చింది. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది దేవర.

ENG vs AUS: లివింగ్ స్టోన్ విధ్వంసం, ఒకే ఓవర్ లో 28 పరుగులు, స్టార్క్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..వీడియో ఇదిగో

Arun Charagonda

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లివింగ్ స్టోన్ విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ స్టార్ బౌలర్ స్టార్క్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 28 పరుగులు చేశాడు.6,0,6,6,6,4 ఇలా సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 27 బంతుల్లో 7 సిక్స్‌లు 3 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు లివింగ్ స్టోన్. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 186 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

Mass Suicide In Delhi: ఢిల్లీలో ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా.. తండ్రి, నలుగురు కుమార్తెల ఆత్మహత్య

Rudra

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా కనిపించారు. బీహార్‌ నుంచి కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన ఓ వ్యక్తి దివ్యాంగులైన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగపురి ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Harish Rao: తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. హైడ్రా మూసీ బాధితులతో మాట్లాడనున్న మాజీ మంత్రి (వీడియో)

Rudra

హైడ్రా మూసీ బాధిత కుటుంబాలు శనివారం ఉదయం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. కాసేపట్లో వారితో మాట్లాడి వారి సమస్యలను వినబోతున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి చేరుకున్నారు.

Telangana Darshini: తెలంగాణ దర్శిని..విద్యార్థులు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం

Arun Charagonda

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన. కల్పించనున్నారు.

FIR Against Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బిగ్ షాక్.. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నకోర్టు.. అసలేం జరిగింది?

Rudra

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు బిగ్ షాక్ తగిలింది. మంత్రిపై కేసు నమోదు చేయాలని బెంగళూర్ తిలక్ నగర్ ఠాణా పోలీసులకు చట్టసభ ప్రతినిధుల కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Road Accident: వావిలాలలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బోళ్తా, 40కి పైగా ఆవులు మృతి..వీడియో ఇదిగో

Arun Charagonda

జనగామ జిల్లా పాలకుర్తి మం. వావిలాల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడగా ఈ ఘటనలో 40కి పైగా ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. 60కి పైగా ఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అర్థరాత్రి హైదరాబాద్ కు అక్రమంగా ఆవులను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement

Mumbai On Alert: ఉగ్ర ముప్పు హెచ్చరికలు.. ముంబై హైఅలర్ట్.. ఎక్కడికక్కడ తనిఖీలు

Rudra

దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు నగర పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో అలర్ట్ అయిన సిటీ పోలీసులు ముంబై నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.

HYDRA Notices to Shilpa Mohan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డికి 'హైడ్రా' నోటీసులు.. సంగారెడ్డి జిల్లాలోని న‌ల్ల‌వాగును క‌బ్జా చేసి వెంచ‌ర్ వేసిన‌ట్లు గుర్తింపు

Rudra

ఏపీ మాజీ మంత్రి, వైఎస్సాఆర్ సీపీ నేత శిల్పా మోహ‌న్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేట మండ‌లం నాగ్స‌న్‌ ప‌ల్లిలోని న‌ల్ల‌వాగును ఆయన ఆక్ర‌మించి వెంచ‌ర్ వేసిన‌ట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.

HYDRA Ranganath: 'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేద‌న్న క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

Rudra

సహజ నీటి వనరులను అక్రమంగా చెరపట్టిన అక్రమార్కులపై పంజా విసురుతూ హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అయితే, కూక‌ట్‌ ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మ‌హిళ హైడ్రా తమ ఇంటిని ఎక్కడ కూల్చివేస్తదో అన్న భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.

Constable Suicide: తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన

Rudra

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Advertisement

Money Rules Will Affect Finances From October: అక్టోబ‌ర్ 1 వ తేదీ కొత్త రూల్స్, క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగ‌దారుల‌పై చార్జీల భారం, ఇళ్లు కొనేవారికి టీడీఎస్..మ‌రిన్ని మార్పులివిగో..!

VNS

పెట్టుబడులు పెడుతున్నారా? సేవింగ్స్ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? వచ్చే నెల నుంచి ఆర్థిక విషయాలకు సంబంధించి నిబంధనలు మారనున్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్ అమల్లోకి రానున్నాయి.

Traffic Advisory in Hyderabad: హైద‌రాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు, రాష్ట్రప‌తి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఎక్క‌డెక్క‌డ డైవ‌ర్ష‌న్స్ ఉన్నాయంటే?

VNS

శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (draupadi murmu) హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్‌ ఇన్‌ వెయిటింగ్‌గా మంత్రి సితక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్‌ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే వుండనున్నారు సీతక్క. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు

GHMC Commissioner Amrapali: హైదరాబాద్‌లో పోస్టర్లు బ్యాన్‌, ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలి,పోస్టర్లు వేస్తే భారీ జరిమానా విధించాలని ఆదేశం

Arun Charagonda

హైదరాబాద్‌‌లో పోస్టర్లు బ్యాన్ చేస్తున్నట్లు వెల్లడించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి. వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్‌పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేశారు కమిషనర్. సినిమా థియేటర్ వాళ్ళు కూడ ఎక్కడా పోస్టర్లు అతికించకుండ చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టర్లు వేస్తే జరిమానా విధించాలని ఆదేశించారు.

CM Revanth Reddy On Musi River Development: పర్యాటక ప్రాంతాలుగా చారిత్రాత్మక భవనాలు,సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ‌తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐ తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.

Advertisement
Advertisement