జాతీయం
Kadambari Jatwani Case: కాదంబరి జత్వానీ కేసు..ఇద్దరు పోలీసులపై వేటు,పోలీసులు వేధించారని ఫిర్యాదుతో ఇద్దరు పోలీసుల సస్పెండ్
Arun Charagondaముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఐఓ సత్యనారాయణ సస్పెన్షన్ వేటు పడింది. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని నటి జత్వానీ ఆరోపణలు చేస్తుండగా.. ఇద్దరు పోలీసులు సస్పెండ్ కావడం గమనార్హం.
Ganesh Immersion: వీడియో ఇదిగో.. వినాయక నిమజ్జనంలో పాములతో చెలగాటం, అదుపులోకి తీసుకున్న పోలీసులు, తార్నాకలో ఘటన
Arun Charagondaవినాయక నిమజ్జనంలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. తార్నక వినాయక నిమజ్జనంలో పాములతో చెలగాటం ఆడారు కొంతమంది. దీంతో పాములతో ఆడుతున్న వేషధారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Uttarakhand:రిషికేష్‌ను ముంచెత్తిన గంగా నది, భారీ వర్షాలతో భక్తుల అవస్థలు..వీడియో ఇదిగో
Arun Charagondaఉత్తరాఖండ్‌ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రిషికేష్‌లోని ఆలయం నీట మునగగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Free Heart Surgeries at NIMS: హైదరాబాద్ నిమ్స్ లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు.. ఈ నెల 22 నుంచి 28 వరకు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraగుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ లోని నిమ్స్ లో ఉచిత శస్త్ర చికిత్సలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్ లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
TamilNadu CM Stalin On America Tour: ముగిసిన సీఎం స్టాలిన్ అమెరికా పర్యటన, రూ.7618 కోట్ల పెట్టుబడులు,11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు అని వెల్లడించిన తమిళనాడు సీఎం
Arun Charagondaతమిళనాడు సీఎం స్టాలిన్ అమెరికా పర్యటన ముగిసింది. తన అమెరికా పర్యటనలో భాగంగా 19 ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. తన పర్యటనలో భాగంగా రూ.7618 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 11,516 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.
YSRCP Spoke Persons: జగన్ మరో కీలక ప్రకటన, మాజీ మంత్రి రోజా- యాంకర్ శ్యామలకు కీలక పదవులు, పెద్దిరెడ్డికి సైతం పెద్దపీట వేసిన వైసీపీ అధినేత..కీలక పదవులు దక్కించుకున్న నేతలు వీరే
Arun Charagondaఏపీలో అధికారం దూరమైన తనదైన శైలీలో ముందుకు వెళ్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు కీలక పదవులు అప్పజెప్పిన జగన్ తాజాగా మరిన్ని కమిటీలను నియమించారు. అలాగే పార్టీ అధికార ప్రతినిధులను ప్రకటించారు.
Case Filed Against MLA Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు.. కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన గచ్చిబౌలి పోలీసులు
Rudraశేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. అరెకపూడి గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ ను కూడా నిందితులుగా పేర్కొంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
Population Crisis in China: బాబ్బాబు.. త్వరగా పెండ్లి చేసుకుని పిల్లల్ని కనండి.. యువతీ యువకులను వేడుకుంటున్న చైనా.. ఎందుకంటే?
Rudra‘బాబ్బాబు.. త్వరగా పెండ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్ అవ్వండి’ అంటూ యువతీ యువకులను చైనా ప్రభుత్వం వేడుకుంటున్నది.
Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టైరు పేలి 7 పల్టీలు కొట్టిన కారు, ప్రమాద సమయంలో కారులో 8 మంది..వీడియో
Arun Charagondaచిత్తూరు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఇన్నోవా కారు టైరు పేలడంతో పల్టీలు కొట్టింది. అరగొండకు వెళ్లే రహదారి ఓవర్ బ్రిడ్జిపైన జరిగిన ఘటనలో కారులో ఏడుగురితో పాటు ఒక పాప కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
UIDAI Extends Free Online Aadhaar Update: ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు మళ్లీ పొడిగింపు.. డిసెంబర్ 14 వరకూ అవకాశం
Rudraపదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకోవడానికి శనివారం ఆఖరు తేదీ కావడంతో ఈ గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు ఉడాయ్ ప్రకటించింది.
Symbol Of Communal Harmony: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. కేపీహెచ్‌బీలో వినాయకుడి నిమజ్జనంలో కలిసి డాన్సు స్టెప్స్ వేసిన హిందూ-ముస్లిం సోదరులు.. వీడియో వైరల్
Rudraమత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్ మరోసారి నిలిచింది. నగరంలోని కేపీహెచ్‌బీలో ఓ వినాయకుడి నిమజ్జనం వేడుకలో కలిసి పాల్గొన్న హిందూ-ముస్లిం సోదరులు ఎంతో సంబురంగా డ్యాన్సు స్టెప్స్ వేసి.. గణనాథుడికి భక్తితో వీడ్కోలు పలికారు.
Kaun Banega Crorepati: ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రాంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశ్న.. కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పారా? వీడియో ఇదిగో
Rudraప్రఖ్యాత ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పై ప్రశ్న అడిగారు. ఏపీ డిప్యూటీ సీఎం ఎవరంటూ అడగ్గా.. కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పారు. ఈ ప్రశ్న విలువ రూ.1.6 లక్షలు. దీనికి సంబంధించిన వీడియో చూడొచ్చు.
Ganesh Immersion: 17న గణేశ్ నిమజ్జనం.. ఈ జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అలా చూస్తే, మొత్తంగా నాలుగు రోజులు హాలీడే..
Rudraతెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు 17న నిమజ్జనం వేడుకలతో ముగియనున్నాయి.
Sankranti Trains Full: దసరా కూడా రాకుండానే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్.. కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్ లు ఫుల్
Rudraతెలుగువారికి ముఖ్యంగా ఆంధ్రులకు పెద్దపండుగగా పిలిచే సంక్రాంతి ఎంత ప్రముఖమైందో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ ఉన్నా సొంతూళ్ళకు చేరాల్సిందే.
Government Scraps Minimum Export Price: ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం, మహారాష్ట్ర ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్
VNSఉల్లి ఎగుమతులపై (onion exports) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస ఎగుమతి ధర (minimum export price condition) నిబంధనను ఎత్తివేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని డీజీఎఫ్‌టీ (DGFT) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర ఎన్నికల వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Wine Shops Close For 2 Days: రెండు రోజుల పాటూ వైన్ షాపులు బంద్, ఈ ప్రాంతాల్లో బార్లు, వైన్స్, మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిఘా
VNSగణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ (Cyberabad Police) పరిధిలో మద్యం షాపులు (Wine Shops Close), కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Petition on Hydra: హైడ్రాపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ! హైకోర్టులో పిటీషన్ దాఖలు, హైడ్రా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
VNSఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్‌పూర్‌లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియామకం
Hazarath Reddyసీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ బాధ్యతలతో పాటు అదనంగా నాలుగు నియోజకవర్గాలను భర్తీ చేస్తూ తిరుపతి జిల్లా వైస్సార్‌సీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు.
Traffic Restrictions in Cyberabad: సైబరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, సైబర్స్ టవర్స్ నుంచి వెళ్లే వారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
VNSఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Police) వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ ల్యాండింగ్ నుంచి యశోద హాస్పిటల్ వరకు కొత్తగా సర్వీసు రోడ్డు నిర్మిస్తుండడంతో.. 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
RBI on Interest Rates: వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు, తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేసిన శక్తికాంతదాస్
Vikas Mప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినప్పటికీ వడ్డీ రేట్లను తగ్గించడానికి తాను తొందరపడటం లేదని భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సంకేతాలు ఇచ్చారు.