జాతీయం

Bowenpally ka Raja RUDRA Ganesha: హైదరాబాద్ కి ప్రత్యేక ఆకర్షణగా మారిన బోయిన్ పల్లి కా రాజా.. ‘రుద్ర యూత్ గణేశా’.. ముంబై లాల్‌ బాగ్‌ గణేశాకు తీసిపోని విధంగా వైభోగం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేశ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Sonu Sood Helps Flood Victims: తెలుగు రాష్ట్రాలకు సోనూ సూద్ చేయూత, దుప్పట్లు, బకెట్లు పంపిణీ చేసిన సోనూ టీం..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చాపలు పంపిణీ చేసింది సోనూసూద్ టీం. ఆహారం, మంచినీరు, మెడికల్ కిట్లు అందించేందుకు తన ఫౌండేషన్ నుండి కృషి చేస్తానని తెలి సోనూసూద్ తెలిపిన సంగతి తెలిసిందే.

HYDRA Notices to Senior Actor: టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్‌ కు హైడ్రా నోటీసులు.. కూల్చకపోతే కూల్చేస్తాం అంటూ హెచ్చరిక

Rudra

ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడం, హైదరాబాద్ లో కుచించుకుపోయిన జలవనరులను కాపాడటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న హైడ్రా తాజాగా టాలీవుడ్‌ సీనియర్ నటుడికి నోటీసులు పంపింది.

West Bengal rape case : అత్యాచార నిందితుడికి మరణశిక్ష, బెంగాల్‌లోని సిలిగురి కోర్టు సంచలన తీర్పు, చర్చనీయాంశంగా న్యాయస్థానం తీర్పు

Arun Charagonda

అత్యాచారం, హత్య కేసులో బెంగాల్‌లోని సిలిగురి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్​ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన నిందితుడి మరణ శిక్ష విధించింది. పశ్చిమ్​ బెంగాల్​లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. 2023 ఆగస్టు 21న పాఠశాలకు వెళ్తున్న మైనర్ బాలికను అత్యాచారం, హత్య చేశారు నిందితుడు ఎండీ అబ్బాస్. ఈ ఘటన జరిగిన ఆరు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు

Advertisement

Fire at Ganesh Pandal: హైదరాబాద్ దిల్‌ సుఖ్‌ నగర్ లోని గణేష్ మండపం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియోతో)

Rudra

హైదరాబాద్ లోని దిల్‌ సుఖ్‌ నగర్ పీఎన్టీ కాలనీలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు.

Moving Ganesha in Nellore: నెల్లూరులో ఆకట్టుకుంటున్న 'కదిలే వినాయకుడు'.. వీడియో మీరూ చూడండి!

Rudra

గణేశ్ ఉత్సవాలతో ఊరూ-వాడా గొప్ప సంబురంగా ఉన్నది. నెల్లూరు జిల్లాలో కొలువుదీరిన గణపతులు చూడ ముచ్చటగా ఉన్నాయి.

Tirumala Srivari Laddu: హైదరాబాద్‌ లో ఉండి కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రుచి చూడొచ్చు.. ఇకపై నగరంలో ప్రతి రోజూ లడ్డూ ప్రసాదం విక్రయాలు.. కీలక ప్రకటన చేసిన టీటీడీ

Rudra

ఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం రుచికి సాటి మరొకటి రాదు. తిరుపతికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ లడ్డును కచ్చితంగా తీసుకోకుండా ఉండలేరు.

Jailer Villain Arrested: జైల‌ర్ విల‌న్ మ‌రోసారి అరెస్ట్, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నందుకు అరెస్ట్ చేసిన శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు (వీడియో ఇదుగోండి)

VNS

జైలర్‌ నటుడు వినాయకన్‌ను (Vinayakan arrested) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్‌ఎఫ్‌ (Central Industrial Security Force) కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్‌.. కొచ్చి నుంచి హైదరాబాద్‌ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

Advertisement

Puja Khedkar Dismissed From IAS: పూజా ఖేద్క‌ర్ కు కేంద్రం షాక్! అఖిల భార‌త సర్వీసుల నుంచి పూజా ఖేద్క‌ర్ తొల‌గింపు, వెంట‌నే అమల్లోకి ఉత్త‌ర్వులు

VNS

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ (Puja Khedkar Dismissed) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (IAS) నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

Flood Disaster Loss in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌ర‌ద బీభ‌త్సం మిగిల్చిన న‌ష్టంపై నివేదిక సిద్ధం, ఏయే శాఖ‌కు ఎంత న‌ష్టం వాటిల్లిందో పూర్తి వివ‌రాలు రెడీ చేసిన ప్ర‌భుత్వం

VNS

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో కురిసిన భారీ వర్షం, వరద విపత్తు (Flood disaster) వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని రాష్ట్రప్రభుత్వం (Government) వెల్లడించింది. సుమారు రూ. 6,882 కోట్ల నష్టం జరిగిందని పేర్కొంది. ఈ మేరకు కేంద్రానికి పంపేందుకు నివేదికను సిద్ధం చేసింది.

Deepthi Jeevanji: పారాలంపియ‌న్ దీప్తికి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫ‌ర్, కోటి రూపాయ‌ల న‌గ‌దు, గ్రూప్-2 ఉద్యోగం ప్ర‌క‌ట‌న‌

VNS

పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని (Deepthi Jeevanji) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం, కోచ్‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.

Whiskey Ice Cream Racket Busted: అక్క‌డ అమ్మేది చాకొలెట్ ఐస్ క్రీం కాదు, విస్కీ ఐస్ క్రీం! జూబ్లీహిల్స్ లో ముఠా అరెస్ట్, పార్టీ ఆర్డ‌ర్ కోసం ఏకంగా 23 కేజీలు రెడీ చేసిన అరికో కెఫే

VNS

పోలీసుల నిఘా పెరగడంతో మత్తుగాళ్లు కొత్త దారులు (Drugs) వెత్తుక్కుంటున్నారు. చివరికి చిన్న పిల్లలు ఎక్కువగాతినే ఐస్ క్రీములను తమ దందాకు వాడుకుంటున్నారు. హైదరాబాద్ లో ఐస్ క్రీముల్లో విస్కీ (Whiskey Ice Cream) కలిపి విక్రయిస్తున్న మత్తుదందా గుట్టురట్టయింది

Advertisement

Jaggareddy Sensational Comments: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్, ఎమ్మెల్యే - ఎంపీ కావాలంటే కోట్లు ఖర్చుపెట్టాల్సిందే, వీడియో వైరల్

Arun Charagonda

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలని..సంగారెడ్డి ఎమ్మెల్యే సీటుకి 50 కోట్లు ఖర్చు పెట్టాలి.. పటాన్‌చెరు ఎమ్మెల్యే సీటుకి 100కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. కులాలతో రాజకీయం నడుస్తలేదు పైసలతో నడుస్తుందని వెల్లడించారు.

Fire Accident At Hyderabad: హైదరాబాద్ మల్లాపూర్‌లో అగ్నిప్రమాదం, ఓ కంపెనీలో చెలరేగిన మంటలు..వీడియో

Arun Charagonda

హైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు చెలరేగగా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Duvvada Srinivas: మళ్లీ తెరపైకి దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్, దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చిన శ్రీను, ఇవాళ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి

Arun Charagonda

ఏపీలో సంచలనం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో కీలకంగా ఉన్న దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చారు దువ్వాడ శ్రీను. మూడు రోజుల క్రితమే రిజిస్ట్రషన్ ప్రక్రియ పూర్తికాగా రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో శ్రీను ఇంట్లోకి మాధురి ఎంట్రీ ఇచ్చింది.

Astrology: వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ మూడు రాశులు..వీరికి వినాయకుడి అనుగ్రహం ఉంటుంది.

sajaya

వినాయక చవితి సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమవుతుంది. వినాయకుడికి అత్యంత ఇష్టమైన రాశులు వారి అదృష్టాన్ని పెంచుతుంది. వారి జీవితంలో అపారమైన సంపదను పొందుతారు.

Advertisement

Minister Kollu Ravindra: ఉద్దేశ పూర్వకంగానే ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసం, కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టమన్నా కొల్లు రవీంద్ర

Arun Charagonda

వైసీపీపై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ రంగులతో ఉన్న 3 బోట్లు అక్కడికి ఎలా వచ్చాయ్? అని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజ్‌ గేట్ల ధ్వంసంపై అనుమానాలున్నాయ్ అన్నారు. కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టం అని హెచ్చరించారు.

Astrology:సెప్టెంబర్ 14న త్రీ గ్రహీయోగం..ఈ మూడు రాశుల వారికి అత్యంత ధన లాభం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు గ్రహాలు ఏర్పడితే దాన్ని త్రి గ్రహయోగం అంటారు ఈ త్రిగ్రహి యోగం చాలా శక్తివంతమైనది. చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఈ యోగం చాలా రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది.

Astrology:సెప్టెంబర్ 11న శుక్రుడు ,శని గ్రహాలు భద్రకాయోగాన్ని ఏర్పరుస్తాయి ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 11న శుక్రుడు శని భద్రత యోగాన్ని ఏర్పరుస్తారు. దీని కారణంగా అన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Typhoon Yagi: యాగి తుపాను ధాటికి చైనా అతలాకుతలం, భారీగా ఆస్తి - ప్రాణ నష్టం, రెడ్ అలర్ట్ జారీ చేసిన చైనా జాతీయ వాతావరణ కేంద్రం!

Arun Charagonda

యాగి తుపాన్ ఎఫెక్ట్‌తో చైనా అతలాకుతలమైంది. యాగి తుఫాన్ ప్రభావానికి చైనాలో అనేక ప్రాంతాలు నేలమట్టం కాగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Advertisement
Advertisement