జాతీయం

Hyderabad Road Accident: వీడియో ఇదిగో, ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం, అతి వేగంగా వచ్చి తుఫాను వాహనాన్ని ఢీకొట్టిన మారుతి బెలెనో కారు, ఐదుగురి మృతి

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్‌ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనాన్ని అతి వేగంగా వచ్చిన మారుతి బెలెనో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలు అవ్వగా, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుక్కుగూడ నుంచి శంషాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Weather Forecast: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్‌ జారీ, హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Hazarath Reddy

తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని గురువారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Pawan Kalyan Selfie With Daughter: తండ్రితో క‌లిసి ఇండిపెండెన్స్ డే వేడుక‌ల్లో పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమార్తె, వైర‌ల్ గా మారిన తండ్రీ కూతుళ్ల సెల్ఫీ

VNS

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాకినాడలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.

How to Close Credit Card: క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఆర్బీఐ పెట్టిన ఈ రూల్స్ తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు

VNS

అవసరం లేకున్నా కొన్ని సార్లు క్రెడిట్‌ కార్డులు తీసుకుంటుంటారు. వీటికి వార్షిక రుసుములు లేకపోతే సమస్య లేదు కానీ, ఒక వేళ రుసుము చెల్లించాల్సి ఉంటే అవసరం లేనివాటిని క్లోజ్‌ చేసుకోవడం మంచిది.

Advertisement

Mpox Outbreak: ప్ర‌పంచ‌దేశాలకు మ‌రో వైర‌స్ ముప్పు, వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వైర‌స్ పై డ‌బ్లూహెచ్ వో ఆందోళ‌న‌, ఇంత‌కీ మంకీ పాక్స్ అంటే ఏంటి? ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి?

VNS

ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ (Mpox) మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఎంపాక్స్‌ (Mpox Alert) సుమారు 70 దేశాలకు పాకింది. ఇప్పటివరకు 100 మంది ఎంపాక్స్‌తో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

Rain in Hyderabad: హైద‌రాబాద్ లో ఒక్క‌సారిగా మారిన వాతావ‌ర‌ణం, ప‌లు ప్రాంతాల్లో కుండ‌పోత వాన‌

VNS

హైద‌రాబాద్ లో వాతావ‌ర‌ణం (Hyderabad rain) ఒక్క‌సారిగా మారిపోయింది. ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బోయిన్ ప‌ల్లి, సికింద్రాబాద్ (Rain), అల్వాల్, ప‌టాన్ చెరు, ఆర్సీపురం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీన్ పూర్, అమీర్ పేట్, హైటెక్ సిటీ లో వ‌ర్షం దంచికొడుతోంది.

Texas Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టినా క్షేమంగా బయటపడ్డ ఇద్దరు పసిబిడ్డలు, టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Hazarath Reddy

మంగళవారం జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, టెక్సాస్‌లోని ఫ్రీపోర్ట్‌లోని ఇంటర్‌స్టేట్ 10 ఈస్ట్ ఫ్రీవే మధ్యలో చాలాసార్లు పల్టీలు కొట్టిన కారు నుండి బయటకు తీయబడిన తర్వాత ఇద్దరు పసిబిడ్డలు అందులో చిక్కుకుపోయారు.

KTR Slams CM Revanth Reddy: రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ బిల్డప్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన కేటీఆర్, నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఎలా అంటూ సూటి ప్రశ్న

Hazarath Reddy

రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అని బిల్డప్ ఇచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆగస్ట్ 15వ తేదీ వచ్చినా రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదని... అందుకే తెలంగాణకు రావాలని పిలుస్తున్నా రాహుల్ గాంధీ రావడం లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

Varalakshmi Vratam Messages in Telugu: వరలక్ష్మీ వ్రతం మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కొటేషన్లతో బంధుమిత్రులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు చెప్పండిలా

Hazarath Reddy

ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.

Varalakshmi Vratham Wishes in Telugu: వరలక్ష్మీ వ్రతం విషెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కొటేషన్లతో అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.

NTR Anna Canteens Menu: అన్న క్యాంటీన్లలో రోజు వారీ మెనూ ఇదిగో, నేటి నుంచి 5 రూపాయలకే భోజనం, టిఫెన్ ప్రారంభం

Hazarath Reddy

NTR Anna Canteens: ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమే, అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో భోజనాలు వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు.

Advertisement

CM Revanth Reddy Challenges Harishrao:రుణమాఫీ చేసి చూపించాం.. చీము -నెత్తురుంటే హరీష్‌ రావు రాజీనామా చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, రాజీనామా చేయకపోతే ఏటిలో దూకాలని మండిపాటు

Arun Charagonda

రుణమాఫీ అమలు చేసి చూపించాం..బీఆర్ఎస్ నేత హరీష్‌ రావుకు సిగ్గుంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీనామా చేయకపోతే ఏటిలో దూకి చావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్..31 వేల కోట్లతో రుణమాఫీ పూర్తి చేశామన్నారు.

KTR On BRS - BJP Merge: బీజేపీతో బీఆర్ఎస్ కలిసుంటే కవిత జైలులో ఉండేదా?, త్వరలో స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నిక వస్తుందన్న కేటీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ తరగతులు

Arun Charagonda

తప్పకుండ స్టేషన్ ఘన్‌పూర్లో ఉప ఎన్నిక వస్తుంది.. మళ్లీ తిరిగి రాజయ్య గెలుస్తాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..హై కోర్టులో తీర్పు కూడా రిజర్వు చేసి పెట్టారు.. అక్కడ సానుకూల ఫలితం వస్తుందని అనుకుంటున్న అన్నారు. ఊసరవెల్లిలు రాజ్యం నడిపితే ఖచ్చితంగా ఉడుతలు, తొండలే వస్తాయి...కరెంటు పోతుందని సోషల్ మీడియాలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వాళ్లకు పెడితే.. ట్రాన్స్‌ఫార్మర్ మీద తొండ పడ్డది, ఉడుత పడ్డదని సమాధానం ఇస్తున్నారు అని దుయ్యబట్టారు.

National Flag Underwater: సముద్ర గర్భాన జాతీయ జెండా రెపరెపలు, విశాఖలో స్కూబా డైవర్ సాహసం, వీడియో వైరల్

Arun Charagonda

దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వైజాగ్ సముద్ర గర్భంలో జాతీయ జెండాను రెపరెపలాడించారు స్కూబా డైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

CM Revanth Reddy: పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, కేసీఆర్ - హరీష్ గోదావరి నీళ్లను నెత్తిన చల్లుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి, సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ ప్రారంభం

Arun Charagonda

ఖమ్మం సీతారామ ప్రాజెక్టులోని పూసుగూడెం పంప్‌హౌస్‌ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గోదావరి నీళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వవరరావుతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Advertisement

Karnataka Shocker: దారుణం, అందంగా తయారవుతోందని స్నేహితులతో కలిసి భార్యను చంపిన భర్త, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో అందగా తయారవుతున్న భార్యను చూసి ఓర్చుకోలేని భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. 32 ఏళ్ల దివ్య-ఉమేశ్ భార్యాభర్తలు. అందంగా కనిపించాలన్న తపనతో దివ్య రోజూ తయారయ్యేది. పెదవులకు లిప్‌స్టిక్ వేసుకునేది. ఒంటిపై టాటూ కూడా పొడిపించుకుంది.

Independence Day 2024: 78వ స్వాతంత్య్ర దినోత్సవం, పూరీ తీరంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం, సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్న పర్యాటకులు

Arun Charagonda

దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఊరూర, వాడ వాడలా మువ్వన్నెల జెండ రెపరెపలాడింది.

Telangana: వీడియో ఇదిగో, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు, అధికారుల వేధింపులే కారణం

Hazarath Reddy

అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు. రామగుండంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం.. మేయర్ కమీషనర్ ఉన్న సమయంలోనే.. ఆత్మహత్యాయత్నం చేసిన పారిశుద్ధ్య కార్మికుడు విజయ్.

Mobile Phone Explodes: ప్యాంటు జేబులో ఒక్కసారిగా పేలిన సెల్ ఫోన్, జేబు కాలిపోవడంతో పాటు..

Hazarath Reddy

కామారెడ్డి - పిట్లం మండల కేంద్రంలో పిట్లం ఎస్సీ కాలనీకి చెందిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ఎనిగే సాయిలు రోజు మాదిరిగానే తన క్లినిక్‌కు వచ్చారు. అకస్మాత్తుగా తన ప్యాంటు జేబులో నుంచి పొగలు రావడంతో గమనించి అప్రమత్తమయ్యారు. ఈలోపే జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలి పూర్తిగా ధ్వంసమై జేబు కాలిపోయింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు

Advertisement
Advertisement