విద్య
CAT 2022 Result Declared: క్యాట్‌ ఫలితాలు విడుదల, దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించిన 11 మంది విద్యార్ధులు, 99.99 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించిన 22 మంది
Hazarath Reddyఐఐఎంలు, ఇతర మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (క్యాట్‌) ఫలితాలను ఐఐఎం బెంగళూరు బుధవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 11 మంది 100, 22 మంది 99.99 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించారు. 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థుల్లో ఇద్దరు తెలంగాణకు చెందిన వారున్నారు.
TS Inter Exams Time Table 2023: తెలంగాణలో 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్‌ను విడుదల చేసిన బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌ మీడియట్‌
Hazarath Reddyతెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌ మీడియట్‌ విడుదల చేసింది. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.మార్చి 15 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, 16 నుంచి సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభకానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు.
JEE Fee Hiked: జేఈఈ మెయిన్ దరఖాస్తు ఫీజు భారీగా పెంపు.. రెండింతలు చేసిన ఎన్‌టీఏ
Rudraజేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను ఇటీవలే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష ఫీజులను భారీగా పెంచేసింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలకు ఇప్పటి వరకు రూ. 650 ఫీజు వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ. 1000కి పెంచేసింది. అదే కేటగిరీలోని అమ్మాయిల ఫీజును రూ. 325 నుంచి రూ. 800 చేసింది.
NEET UG 2023: నీట్‌ యూజీ- 2023 పరీక్ష తేదీ ఖరారు, మే 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ త్వరలో ప్రారంభం
Hazarath Reddyదేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ- 2023 తేదీ ఖరారయ్యాయి. మే 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు తీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) తెలిపింది
JEE Main Exam: జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. పరీక్షలు ఎప్పటి నుంచంటే?
Rudraదేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
TSPSC Group 4 Notification 2022: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో మరో రెండు గ్రూప్స్ నోటిఫికేషన్లు, తాజాగా 9,168 గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీపీఎస్సీ
Hazarath Reddyనిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గ్రూప్‌-1 ద్వారా 503 పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ.. తాజాగా గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ జారీ (TSPSC Group 4 2022 Notification out) చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 శాఖల్లో ఏకంగా 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ICSE Exam Schedule Released: ఐసీఎస్ఈ 10, ఐఎస్‌సీ 12 తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. పరీక్షల తేదీలివే!
Rudraఐసీఎస్ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించే కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ వచ్చే ఏడాది జరగనున్న సీఐఎస్‌సీఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సీఐఎస్‌సీఈ 2023 డేట్ షీట్‌ను cisce.org ద్వారా చెక్ చేసుకోవచ్చు.
AP Police Recruitment 2022: ఏపీ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్, 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌
Hazarath Reddyఏపీ ప్రభుత్వం పోలీసుశాఖలో భారీ సంఖ్యలో నియామకాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ విడుదలైంది. ఇక, ఫిబ్రవరి 19న ఎస్‌ఐ పోస్టులకు, జనవరి 22న కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.
JEE Main 2023: జేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్ అలర్ట్, వచ్చే వారం విడుదల కానుందని వార్తలు, పరీక్షలు తొలి విడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం
Hazarath Reddyజేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్‌ ఈ వారంలో విడుదల చేసే అవకాశంలేదని, వచ్చే వారంలో (నవంబర్‌ 30నాటికి) పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నట్టు సమాచారం.
India Post Office Recruitment 2022: పోస్ట్ ఆఫీస్‌లో 98083 ఉద్యోగాలకు నోటిఫికేషన్, అర్హతలు, ఖాళీలు, ఎలా అప్లయిచేయాలి, పూర్తి వివరాలు స్టోరీలో చూడండి
Hazarath Reddyప్రభుత్వ నిర్వహణలోని తపాలా వ్యవస్థ అయిన మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్‌లోని ఇండియా పోస్ట్ ఆఫీస్ భారతదేశంలోని అన్ని పోస్టల్ డిపార్ట్‌మెంట్ సర్కిల్‌లలో 98083 ఖాళీలను విడుదల చేసింది.
SSC GD Constable Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కేంద్రంలో 24369 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, అప్లయి పూర్తి వివరాలు ఇవే
Hazarath Reddyస్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSF, రైఫిల్‌మ్యాన్ (GD) మరియు అస్సాంలోని 24369 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఖాళీల కోసం 27 అక్టోబర్ 2022న SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ PDFని అప్‌లోడ్ చేసింది.
AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టుతో పాటు, జిల్లా కోర్టుల్లో 3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలతో కూడిన పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3,432 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశారు.అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్‌సైట్‌ http://hc.ap.nic.inలో పొందుపరిచారు.
AP TET Results 2022 Declared: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల, పరీక్షల్లో 58.07% మంది అర్హత, ర్యాంకు కార్డును aptet.apcfss.in ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Hazarath Reddyఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేశారు.
TS EAMCET Counselling Update: తెలంగాణలో అక్టోబర్ 11 నుంచి ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌, ఫీజుల విషయంలో కొలిక్కి రాకపోవడంతో కౌన్సెలింగ్‌ వాయిదా
Hazarath Reddyతెలంగాణలో ఈ నెల 28న జరగాల్సిన రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదాపడింది. వాయిదా పడిన కౌన్సెలింగ్‌ను వచ్చే నెల (అక్టోబర్‌) 11 నుంచి నిర్వహించనున్నట్లు ( TS EAMCET Counselling Update) టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.
Dussehra Holidays 2022: ఏపీలో సెప్టెంబర్‌ 26 నుంచి దసరా సెలవులు, అక్టోబర్‌ 6వరకు దసరా సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం,7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
Hazarath ReddyAPలోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 6వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6వరకు సెలవులు ఇచ్చారు.
Dussehra Holidays 2022: తెలంగాణలో 13 రోజుల పాటు దసరా సెలవులు, సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది దసరా పండుగకు 13 రోజులపాటు సెలవులను అధికారికంగా ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అక్టోబర్‌ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.
Myntra Jobs: ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం మింత్రాలో 16000 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం, నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
KrishnaFlipkart యొక్క ఆన్‌లైన్ ఫ్యాషన్ విభాగం Myntra ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో 16,000 ఉద్యోగాలను ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో దాదాపు 16 వేలమందికి ఉపాధి కల్పించనుంది. డెలివరీ, వేర్‌హౌస్ హ్యాండ్లింగ్ ,లాజిస్టిక్స్‌లో వివిధ స్థానాల కోసం 16,000 ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది
NEET UG 2022 Exam Results Declared: నీట్ యూజీ పరీక్షా ఫలితాలు విడుదల, రాజస్థాన్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్, తెలంగాణ విద్యార్థికి 5వ ర్యాంక్, ఫలితాలను neet.nta.nic.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyనీట్‌(యూజీ) 2022 మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను (NEET UG 2022 Exam Results Declared) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాజస్తాన్‌కు చెందిన తనిష్క టాప్‌ ర్యాంకు దక్కించుకున్నారు.
TSPSC EO Recruitment 2022: తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ A 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల, జీతం రూ. 1 లక్ష కన్నా ఎక్కువే..
Krishnaతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) తెలంగాణ ప్రభుత్వంలోని తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ A 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
FCI Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యమా, అయితే ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది, ఆన్ లైన్ ద్వారా అప్లై ఎలా చేయాలో తెలుసుకోండి..
Krishnaఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) సెప్టెంబర్ 3న కేటగిరీ 3కి చెందిన 5 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (నం.01/2022) జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 6, 2022 నుండి ప్రారంభమైంది.