సమాచారం

Covid-19 Omicron: జనవరిలో ఒమిక్రాన్ విజృంభించే చాన్స్, ఆధారాలతో సహా బయటపెట్టిన IIT కాన్పూర్ ప్రొఫెసర్, 3rd వేవ్ గురించి ఆసక్తికర విషయాలు ఇవే...

Krishna

కరోనా (Covid-19) వైరస్ , కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రభావం కొత్త సంవత్సరంలో కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ వేరియంట్‌తో సోకిన వ్యక్తుల సంఖ్య జనవరి 2022 చివరి వారంలో , ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.

Nagaland Firing : నాగాలాండ్ లో ఘోరం, తీవ్రవాదులు అనుకొని కూలీలపై కాల్పులు, 14 మంది మృతి, భద్రతా దళాల వాహనాలకు నిప్పు పెట్టిన స్థానికులు..

Krishna

నాగాలాండ్‌లో దారుణం జరిగింది. మోన్‌ జిల్లాలో ఉగ్రవాదులనుకొని సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు భద్రతా బలగాలు. జవాన్ల కాల్పుల్లో 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రహంతో భద్రతాబలగాల వాహనాలను తగలబెట్టారు ప్రజలు. మోన్‌ జిల్లా తిరు గ్రామానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.

Covid-19: దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య, భారీగా పెరిగిన మరణాల సంఖ్య, కేరళలో అత్యధికంగా పాజిటివ్ కేసులు, తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఇదే..

Krishna

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో చూసుకుంటే గడిచిన నాలుగు రోజులుగా చూసుకుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. తెలంగాణలో డిశంబర్ 1న 184 కోవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. డిశంబర్ 2న 189 కేసులు.. డిశంబర్ 3న 198 కేసులు వచ్చాయి. కానీ డిశంబర్ 4న 213 మందికి కరోనా సోకింది.

Cyclone Jawad: తుఫానుగా మారిన వాయుగుండం, గంటకు 30 కి.మీ వేగంతో తీరం వైపు దూసుకువస్తున్న జవాద్, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతుఫానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో, ఒడిషా గోపాల్‌పూర్‌కు 530 కి.మీ. దూరంలో 'జవాద్' తుపాను (Cyclone Jawad) కేంద్రీకృతమైంది. గంటకు 30 కి.మీ వేగంతో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు (Tropical Cyclonic Storm Likely To Hit South Odisha Coast) దగ్గరగా వచ్చే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు (Minister Kannababu) తెలిపారు.

Advertisement

Cyclone Jawad: మరో గండం..నేడు జవాద్ తుపానుగా మారనున్న వాయుగుండం, శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Hazarath Reddy

విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాళాళాతంలో జవాద్‌ తుపానుగా (Cyclone Jawad) మారుతుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

Cyclone Jawad: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, మూడు రోజుల పాటు 95 రైళ్లు రద్దు, జవాద్ తుపాను నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తూర్పు కోస్తా రైల్వే

Hazarath Reddy

ఉత్తరాంధ్రపై జవాద్ తుపాను విరుచుకుపడుుతన్న నేపథ్యంలో రైల్వే శాఖ అలర్ట్ అయింది. జవాద్ ఎఫెక్ట్ (Cyclone Jawad) కారణంగా తూర్పు కోస్తా రైల్వే గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే (East Coast Railway) ప్రకటించింది.

Online Payments: ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నారా.. గూగుల్ అలర్ట్ మెసేజ్ చూడండి, జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించిన గూగుల్

Hazarath Reddy

గూగుల్ తన వినియోగదారులకు అలర్ట్ న్యూస్ చేసింది. స్మార్ట్‌‌ఫోన్‌, ఇతర డివైజ్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్‌ ముఖ్య సూచన (Google announces changes for automatic payments in India) చేసింది. గూగుల్‌ బేస్డ్‌ మంత్లీ పేమెంట్‌లు చేసే కస్టమర్లకు జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించింది.

APSRTC: పండగవేళ ఆర్టీసీ బస్సులో సీటు దొరకదనే బెంగను వదిలేయండి, 60 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకోండి, అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్నిపెంచిన ఏపీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని ఏపీఎస్ఆర్టీసీ విస్తరించింది. 60 రోజుల ముందుగానే ప్రయాణికులు సీట్లు రిజర్వేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆర్టీసీలో 30 రోజుల ముందుగా సీట్లు రిజర్వేషన్‌ (advance seat reservation) చేసుకునేందుకు అవకాశం ఉంది.

Advertisement

Cyclone Jawad: రాయలసీమ, నెల్లూరు జిల్లాకు తప్పిన ముప్పు, ఉత్తరాంధ్ర వైపు దూసుకువస్తున్న జవాద్ తుఫాను, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఇటీవల ఉపరితల ఆవర్తనం రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను అతలాకుతలం చేయగా.. ఇప్పుడు మరో తుపాను ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. దక్షిణ థాయ్‌లాండ్‌ వద్ద అండమాన్‌ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది

AP Government Holidays 2022: ఏపీలో వచ్చే ఏడాది సెలవుల లిస్ట్ విడుదల, మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు, మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా తెలియజేస్తామని ప్రకటన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది (2022)కి సంబంధించి ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక, నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ సోమవారం ఉత్తర్వులిచ్చారు.

Weather Update: నేడు మరో అల్పపీడనం, ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం

Hazarath Reddy

నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం (Low pressure) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు.

Omicron Covid Variant: ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు, మళ్లీ మాస్కులు ధరించాలని సూచన

Hazarath Reddy

కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (B.1.1.529) వేరియంట్‌పై ఢిల్లీకి చెందిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌ ప్రాంతంలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు.

Advertisement

Weather Alert: ఏపీకి తప్పిన వాయుగుండం ముప్పు, చెన్నైకు పొంచి ఉన్న భారీ వర్ష ముప్పు, ఈ నెల 29న అండమాన్‌ సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా (Low Pressure) మారకుండా అలాగే కొనసాగుతోంది. ఇది తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండడంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ అధికారులు (IMD) తెలిపారు.

Weather Alert: ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉన్న ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. వీటి ప్రభావంతో గురువారం కల్లా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది.

Multiple Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి, మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు ఉంటే ఉపయోగాలు, నష్టాలు ఓ సారి చూద్దాం

Hazarath Reddy

ఎక్కువ అకౌంట్లు (Multiple Savings Bank Accounts) ఉంటే లాభమా, నష్టమాఅనేది చాలామందికి అర్థం కాకపోవచ్చు. దీనిపై నిపుణులు కూడా పలు విధాలుగా చెబుతుంటారు. మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు (multiple savings accounts) ఉంటే చాలావరకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు.

New Low Pressure: మళ్లీ ఇంకో అల్పపీడనం, నెల్లూరుతో సహా రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాల ముప్పు, ఈ నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం (New Low Pressure) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది.

Advertisement

Petrol Pump Frauds: బండిలో పెట్రోల్ కొట్టిస్తున్నారా, అయితే తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే, లేకపోతే మోసపోతారు, డబ్బులు ఊరికేరావు..

Krishna

పెట్రోల్ వేసేటప్పుడు, పెట్రోల్ బంక్ వాళ్ళు చేసే మోసాలు గురించి తెలుసుకుని జాగ్రత తీసుకోకపోతే ఈ నష్టం చాలా భారీగా మనపై పడుతుంది.

TS Inter Special Exams 2021: తెలంగాణలో ఇంటర్ స్పెషల్‌ ఎగ్జామ్స్‌ ఉండవు, వార్షిక పరీక్షలప్పుడే విద్యార్థులందరికీ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌

Hazarath Reddy

కరోనావైరస్ బాధితులకు ప్రత్యేకంగా పరీక్షలు పెట్టే అంశంపై తెలంగాణ ఇంటర్‌బోర్డు అధికారులు స్పష్టతనిచ్చారు. కోవిడ్ బారినపడ్డ స్టూడెంట్స్‌ ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించడం లేదని వెల్లడించారు. గత నెలలో ఇంటర్‌ సెకండియర్‌లోని విద్యార్థులకు ఫస్టియర్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.

RBI Summer Internship 2022: బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..ఆర్‌బీఐ చక్కని అవకాశం, మూడు నెలల సమ్మర్‌ ఇంటర్న్‌షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Hazarath Reddy

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ).. 2022 సంవత్సరానికి సంబంధించి స్వదేశీ, విదేశీ విద్యార్థుల కోసం సమ్మర్‌ ఇంటర్న్‌షిప్ ప్రకటన విడుదల చేసింది. ఆర్‌బీఐ తాజా నోటిఫికేషన్‌ (RBI Summer Internship 2022) ద్వారా మొత్తం 125 ఇంటర్న్‌లకు (RBI Summer Internship) అవకాశం కల్పించనుంది.

APPSC Recruitment 2021: ఏపీపీఎస్సీ గెజిటెడ్‌ ఉద్యోగాలు, నెలకు వేతనం రూ.29,760 నుంచి రూ.93,780 వరకు, ఇప్పుడే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి, ఎలా అప్లయి చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)... వివిధ విభాగాల్లో గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 25గా ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే.. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

Advertisement
Advertisement