Information

Fuel Price Hike: మళ్లీ పెట్రో బాదుడు బాదుడు మొదలైంది, దేశంలో 18 రోజుల తర్వాత పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు, దేశ రాజధానిలో పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు పెంపు

Hazarath Reddy

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను (Fuel Price Hike) పెంచేశాయి. 18 రోజుల పాటు పెరగని ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు (Petrol and Diesel Prices in India on May 4, 2021) ప్రకటన వెలువడింది.

Lockdown in India: భారత్‌లో సెకండ్ వేవ్‌ లాక్‌డౌన్, పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన అత్యున్నత న్యాయస్థానం, ఆక్సిజన్‌ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు.. తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వైరస్ మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్‌డౌన్‌ (Lockdown in India) విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు (Supreme Court to Centre, States) సూచించింది.

South Central Railway: అలర్ట్..ప్రయాణికులు లేక 25 రైళ్లు రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే, 35కు చేరుకున్న రద్దయిన మొత్తం రైళ్ల సంఖ్య, తాజాగా రద్దయిన రైళ్ల వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

దేశంలో కరోనా కల్లోలం రైళ్లపై పడింది. జనాలు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చే సాహసం చేయకపోవడం..ప్రయాణాలు లాంటివి పెట్టుకోకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 23 రైళ్లను తాత్కాలికంగా రద్దు (South Central Railway cancels 25 trains) చేయగా, మరో రెండింటిని పాక్షికంగా రద్దు చేసింది

Covid-19 Vaccine Registration: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్ చాలా ఈజీ, ఈ పద్ధతిలో మీరు తేలిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి, కొవిన్, ఆరోగ్య‌సేతు, ఉమాంగ్ యాప్‌ల‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

18 ఏండ్లు పైబ‌డిన వారికి టీకాల కోసం నేటి సాయంత్రం 4 గంట‌ల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభ‌మయ్యాయి. కొవిన్, ఆరోగ్య‌సేతు, ఉమాంగ్ యాప్‌ల‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభ‌మ‌య్యాయి. మొబైల్ నంబ‌ర్ ద్వారా రిజిస్ర్టేష‌న్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.

Advertisement

Moderate Rains: రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి, బలహీన పడిన ఉపరితల ఆవర్తనం, హైదరాబాద్‌లో భానుడి భగభగలు

Hazarath Reddy

గ్రేటర్‌లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు ఎండతీవ్రతకు అల్లాడుతున్నారు. నగరంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు రోజుకు సగటున 38 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అయితే తర్వాత వారం రోజులపాటు ఎండలు తగ్గాయి. మళ్లీ ఆరు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Coronavirus Scare: జాగ్రత్తగా ఉండండి..ఒక్కడి నుంచి 406 మందికి కరోనా, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించకుంటే జరిగేది అదే, కరోనాను నిరోధించేందుకు నిబంధనలు పాటించాలని కోరిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

కరోనా సోకిన వ్యక్తి సామాజిక దూరం నిబంధనను పాటించని పక్షంలో అతని వల్ల 30 రోజుల్లో 406 మంది ఈ మహమ్మారి బారిన పడతారని (one Covid-19 patient can infect 406 people in 30 days) కేంద్రం సోమవారం నాడు హెచ్చరించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కరోనాను నిరోధించేందుకు అత్యవసరమని మరోసారి స్పష్టం చేసింది.

'SC Cannot Sit Quietly': దేశంలో కోవిడ్ సంక్షోభం, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, ప్రేక్షకుడిగా చూస్తూ ఉండలేమని తెలిపిన అత్యున్నత ధర్మాసనం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు

Hazarath Reddy

యావత్ దేశం కోవిడ్ సంక్షోభం ఎదుర్కుంటున్న వేళ ప్రేక్షకుడిగా చూస్తూ ఉండలేమని (SC on Covid crisis) భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Delhi Lockdown: మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగింపు, తీవ్రమవుతున్న ఆక్సిజన్ కొరత, ఢిల్లీలో కొత్తగా వచ్చే పేషెంట్లను చేర్చుకోలేమంటూ ప్రముఖ ఆస్పత్రిలో బోర్డు

Hazarath Reddy

దేశ రాజధానిలో కరోనా కేసులు పెరగడంతో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ (Delhi Lockdown) పొడిగించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ ( lockdown in Delhi) అమల్లో ఉంటుంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ, ఢిల్లీలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్నారు.

Advertisement

SII Covid Vaccine Price Row: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై విమర్శలు, స్పందించిన సీరం ఇన్‌‌స్టిట్యూట్, భారత్‌లోని వ్యాక్సిన్ ధరను అంతర్జాతీయ ధరలతో పోల్చి చూడటం సరికాదని సూచన

Hazarath Reddy

భారత దేశంలోని వ్యాక్సిన్ ధరను అంతర్జాతీయ ధరలతో పోల్చి చూడటం (SII Covid Vaccine Price Row) సరికాదని సీరం తెలిపింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై వస్తున్న విమర్శలపై సీరం ఇన్‌‌స్టిట్యూట్ శనివారం స్పందించింది. కొన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీ కోసం ముందుగానే నిధులు సమకూర్చినందువల్ల ఆ దేశాల్లో వ్యాక్సిన్ ధర తక్కువగా ఉందని వివరించింది.

COVID-19 Vaccination in MP: 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్, సంచలన నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మే 1 నుండి అమల్లోకి..

Hazarath Reddy

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రజలందరికీ కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ప్రకటించారు.

COVID-19 Vaccine Price: కోవిషీల్డ్‌ టీకా కావాలంటే రూ. 600 చెల్లించాల్సిందే, కోవిషీల్డ్‌ టీకా ధరలను ప్రకటించిన సీరం, నాలుగైదు నెలల్లో రిటైల్‌ స్టోర్లలోనూ అందుబాటులోకి..

Hazarath Reddy

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో టీకా కొరతను తీర్చేందుకు కేంద్ర ‍ప్రభుత్వం వ్యాక్సిన్‌ ఉత్పత్తి దారులు 50శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగా మార్కెట్‌లో అమ్ముకునేందుకు వీలు కల్పించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా ప్రైవేటు మార్కెట్లో కోవిషీల్డ్‌ టీకా ధరలను (COVID-19 Vaccine Price) సీరమ్‌ సంస్థ బుధవారం ప్రకటించింది.

Coronavirus Scare: స్వీయ నిర్భంధంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కరోనా బారీన పడిన పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ ప్రధానులు, ​ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కరోనా బారీన పడి చికిత్స పొందుతున్నారు. అలాగే కోవిడ్ బారీన పడి చాలామంది ముఖ్యమంత్రులు కోలుకున్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కరోనా కోరల్లో చిక్కుకున్నారు. కొంతమంది కరోనాకి తోడుగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Advertisement

Oxygen 'Express’ Trains: దేశంలో ముంచుకొస్తున్న ఆక్సిజన్‌ కరవు, నేటి నుంచి పట్టాలెక్కనున్న ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సిలిండర్లను రవాణా చేయనున్న రైల్వే శాఖ, పరిశ్రమలకు ఆెక్సిజన్ సరఫరా నిలిపివేయాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం

Hazarath Reddy

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేప‌థ్యంలో రైల్వే శాఖ క‌ల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సిలిండర్లను ఆస్పత్రిలకు త్వరితగతిన చేరవేసేందుకు ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో రైళ్లను (Oxygen 'Express’ Trains) నడపనున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సిలిండర్లను రైళ్ల ద్వారా రవాణా చేయనుంది.

Corona ‘Airborne': ఇంట్లో ఉన్నా కరోనా అటాక్ చేస్తుంది, గాల్లో సుమారు మూడు గంటల పాటు వైరస్, ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు తప్పక ధరించాలని చెబుతున్న వైద్యులు, రెండు మాస్క్‌లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాల‌ని సూచించిన అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌

Hazarath Reddy

క‌రోనా గాలి ద్వారానే వ్యాపిస్తోంద‌న్న లాన్సెట్ అధ్య‌య‌నంపై అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌ (Diseases expert Dr Faheem Younus) ట్విట‌ర్‌లో స్పందించారు . దీనికి ప‌రిష్కారం మామూలు బ‌ట్ట‌తో చేసిన మాస్క్‌లు ధ‌రించ‌డం కంటే ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు (Use N95 or KN95 masks) ధ‌రించ‌డ‌మే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Remdesivir Price Reduced: భారీగా తగ్గిన రెమ్‌డెసివిర్‌ ధరలు, కొత్త ధరల వివరాలను వెల్లడించిన ఎన్‌పీపీఏ, రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 28 లక్షల నుంచి 41 లక్షలకు పెంచాలని ఫార్మాకంపెనీలను కోరిన కేంద్రం

Hazarath Reddy

కోవిడ్‌–19 చికిత్సలో సీరియస్‌ పెషెంట్లకు వాడే రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ధరలను తగ్గించాలని (Remdesivir Price Reduced) ఫార్మా కంపెనీలను కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యంతో రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ధరలను ఫార్మా కంపెనీలు స్వచ్ఛందంగా తగ్గించాయని (Remdesivir manufacturers cut price) నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) శనివారం తెలిపింది.

Indian Railways: రైల్వే స్టేషన్లో ఉమ్మివేసినా, మాస్క్ లేకున్నా రూ.500 ఫైన్, కీలక నిర్ణయం తీసుకున్న భారతీయ రైల్వే, యూపీలో మాస్క్ లేకుండా రెండో సారి పట్టుబడితే రూ. 10 వేల జరిమానా, రాష్ట్ర వ్యాప్తంగా మే 15 దాకా లాక్‌డౌన్‌

Hazarath Reddy

రోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్కు ధరించకపోయిన, రైళ్లలో, స్టేషన్ లలో ఉమ్మివేసిన రూ.500 జరిమానా (Indian Railways to Fine) విధించనున్నట్లు పేర్కొంది. ఆరు నెలల పాటు ఈ నిబంధన కొనసాగుతాయని రైల్వేశాఖ వెల్లడించింది.

Advertisement

Covid in India: తుమ్మినా, దగ్గినా కరోనా, గాలి నుంచి వేగంగా శరీరంలోకి, ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, బ్రిటన్‌కు పాకిన ఇండియా డబుల్ మ్యూటెంట్ వైరస్, రెండోసారి కరోనా బారిన సీఎం యెడ్డ్యూరప్ప, దేశంలో తాజాగా 2,34,692 మందికి కోవిడ్

Hazarath Reddy

సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రంజిత్‌ సిన్హాకు కరోనా సోకినట్టు గురువారం రాత్రే నిర్ధారణ అయింది. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 1974 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రంజిత్‌ సిన్హా 2012లో సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

AP 10th & Inter Exams Update: ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు, అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్

Hazarath Reddy

పీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఆరా తీశారు.

CBSE Board Exams 2021 Update: సీబీఎస్‌ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి ఎగ్జామ్స్‌‌ వాయిదా, విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని తెలిపిన కేంద్ర విద్యాశాఖ

Hazarath Reddy

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు (Class 10 Exams Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా (Class 12 Examinations Postponed) వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్వీట్‌ చేశారు.

Ambedkar Jayanti 2021:హైదరాబాద్ ట్రాఫిక్ రూట్లలో పలు మార్పులు, ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పుట్టినరోజు సంధర్భంగా ట్రాఫిక్ అడ్వైజరీ చార్ట్ విడుదల చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, వాహనాదారులు సహకరించాలని సూచన

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 14వ తేదీన ట్రాఫిక్ ఆంక్్షలు విధించనున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి, కార్యక్రమం పూర్తయ్యే వరకు ఈ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) వారి అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో వివరాలను పొందుపరిచారు..

Advertisement
Advertisement