సమాచారం
1 Year Since Coronavirus Outbreak: వణుకుపుట్టిస్తున్న కరోనాకి ఏడాది, కుప్పకూలిన గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ, ఇంకా కోలుకోలేకపోతున్న దేశాలు, అందుబాటులోకి రాని వ్యాక్సిన్, నవంబర్ 17న హుబేయి ప్రావిన్సులో తొలి కేసు
Hazarath Reddyసరిగ్గా గతేడాది ఇదే రోజు (coronavirus, first case) కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచానికి పరిచయమైంది. ఇప్పటికీ ముప్పతిప్పలు పెడుతోంది. ఎన్నో విషాద గాథలు, మరోన్నో నిద్రలేని రాత్రులు..ఉంటామా పోతామా తెలియని పరిస్థితి, వైరస్ వస్తే బతుకుతామా లేదా అనే దానిపై సందేహం..వెరసి కరోనా వైరస్ ప్రపంచానికి వణుకుపుట్టిస్తోంది. ఇప్పటికి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదంటే దాని విశ్వరూపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Google: జీమెయిల్ వినియోగదారులకు హెచ్చరిక, రెండు సంవత్సరాలు మీ అకౌంట్ ఉపయోగించకుంటే ఖాతాను డిలీట్ చేయనున్న గూగుల్
Hazarath Reddyగూగుల్ జీమెయిల్ వాడేవారికి షాక్ లాంటి వార్త చెప్పింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనటైతే (inactive accounts) మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్‌ (Google) తొలగించనుంది.
COVID-19 in India: దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు, తాజాగా 41,100 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు, 447మంది మృతితో 1,29,635కి చేరిన మరణాల సంఖ్య
Hazarath Reddyదేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 41,100 కరోనా పాజిటివ్ కేసులు ( 2020 Coronavirus Pandemic in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 88,14,579కి (Coronavirus Cases in India) చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది.
Diwali 2020: మీ వల్లే దేశం సురక్షితంగా ఉంది, మీతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి, సైనికుల మధ్యలో దీపావళి వేడుకలను జరుపుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, సైనికుల కుటుంబాలకు ప్రధాని కృతజ్ఞతలు
Hazarath Reddyహిమాలయ శిఖరాల్లో ఉన్నా... ఎడారిలో ఉన్నా, దట్టమైన అడువులు, లోతైన సముద్రాలు... ఇలా ఎక్కడ ఉన్నా శౌర్యంతో జవాన్లు పోరాడతారని, ఎదురయ్యే ప్రతి సవాల్‌లోనూ విజయం సాధిస్తూనే ఉంటున్నారని ప్రధాని మోదీ సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు.
OTT Platforms Row: ఇకపై ఆన్‌లైన్ ఛానల్స్‌ ప్రారంభించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి, ఓటీటీ కంటెంట్‌ సంస్థలను సమాచార శాఖ పరిధిలోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyఆన్‌లైన్ ఛానల్స్‌పై (Online Channels) ఇకపై కేంద్రం నిఘా ఉండనుంది. కొత్తగా ఎవరైనా ఆన్‌లైన్‌ ఛానల్స్‌ ప్రారంభించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
IRCTC New Rules: రైల్వే టికెట్‌ బుకింగ్‌ కొత్త రూల్స్, రెండో రిజర్వేషన్‌ చార్ట్‌‌లో పలు మార్పులు, ఇకపై రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధం
Hazarath Reddyరైల్వే టికెట్‌ బుకింగ్‌కు సంబంధించి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) కొత్త నియమాలను (New rule for ticket booking) ప్రకటించింది. కాగా రెండో రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధంచేసే సమయంలో కొన్ని మార్పులను (IRCTC New Rules) తీసుకొచ్చింది. కొత్తగా వచ్చిన నియమాల ప్రకారం రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్‌ చార్ట్‌ను సిద్ధం చేయనున్నారు.
Heay Rain Alert: మళ్లీ ముంచెత్తనున్న భారీ వర్షాలు, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ పరిశోధనా కేంద్రం
Hazarath Reddyతమిళనాడును మరో అయిదు రోజులపాటు భారీ వర్షాలు (Heay Rain Alert) ముంచెత్తనున్నాయని చెన్నైలోని వాతావరణ పరిశోధనా కేంద్రం డైరెక్టర్‌ పువియరసన్‌ తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికగా ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. తమిళనాడులో ( heavy rains in Tamil Nadu) గతనెల 28న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే నాలుగురోజులు గడిచినా చెప్పుకోదగ్గ అల్పపీడన ద్రోణి ఇంతవరకు ఏర్పడలేదు. సహజమైన ఉష్ణోగ్రతల వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తొలిరోజునే చెన్నైలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Mega Projects in AP: ఏపీలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు, త్వరలో మూడు మెగా ప్రాజెక్టులు, రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం, విశాఖలో ఐటీ యూనివర్సిటీ ఏర్పాటు
Hazarath Reddyఏపీలో ఇకపై భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టులకు (Mega Projects in AP) సంబంధించిన రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) సమావేశం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇంటెలిజెంట్‌ సెజ్‌ లిమిటెడ్, ఏటీసీ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌లు తమ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, వీటి ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.
Indane Gas Online Booking Number: ఇకపై గ్యాస్ బుకింగ్ చేయాలంటే 7718955555 నంబర్‌‌కి కాల్ చేయండి, దేశమంతా ఒకటే నంబర్‌ను ప్రవేశపెట్టిన ఇండేన్ గ్యాస్
Hazarath Reddyఇండేన్ గ్యాస్ వినియోగదారులకు అలర్ట్ న్యూస్.. నవంబర్‌ 1 నుంచి ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు దేశంలో ఎక్కడ నుంచి అయినా 7718955555 నంబర్‌ (Indane Gas Online Booking Number) ద్వారానే బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్‌ ఆయిల్‌ డీజీఎం (LPG) ఎల్‌పీ ఫులిజిలే తెలిపారు. ఆయన విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డీలర్ల వద్ద నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్ల నుంచి ఎస్‌ఎంఎస్‌ లేదా ఐవీఆర్‌ విధానంలో సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు.ఇది వినియోగదారులకు 24x7 అందుబాటులో ఉంది.
BECA Agreement: చైనా, పాకిస్తాన్‌కు చెక్ పెట్టేలా బెకా అగ్రిమెంట్, ఇంతకీ బెకా అంటే ఏమిటీ ? దీని ద్వారా ఇండియాకు కలిగే ప్రయోజనం ఏమిటీ? బీఈసీఏ ఒప్పందంపై పూర్తి సమాచారం
Hazarath Reddyభార‌త్‌‌, అమెరికా దేశాలు బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కోఆప‌రేష‌న్ అగ్రిమెంట్‌(BECA) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా సైనిక సాంకేతిక అంశంపై రెండు దేశాలు స‌హ‌కారం అందించుకోనున్నాయి. భారత్‌-అమెరికాల మధ్య ప్రారంభమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై ఇరు దేశాల నేతలు సంతకాలు (BECA Signed During India-US) చేశారు.
Diwali Gift for Loan Customers: లోన్ తీసుకున్న వారికి శుభవార్త, నవంబర్‌ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లోకి వడ్డీ మొత్తం, మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్య గల వాయిదాలకు వర్తింపు
Hazarath Reddyలోన్ తీసుకున్న కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు (Diwali Gift for Loan Customers) అందించింది. మారటోరియం అమలైన ఆరు నెలల కాలంలో (moratorium period) ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్‌ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమచేయనున్నామని కేంద్రం తెలిపింది.
Covid in India: కరోనా నుంచి కోలుకుంటున్న ఇండియా, పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, తాజాగా 50,129 కోవిడ్ కేసులు, 62,077 మంది డిశ్చార్జ్, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,68,154, మరణాల సంఖ్య 1,18,534
Hazarath Reddyభారత్‌లో గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,64,811కి చేరింది. నిన్న ఒక్క రోజే 578 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,18,534 మంది కరోనాతో (Covid Deaths) మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం కరోనాపై ( 2020 Coronavirus Pandemic in India) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 62,077 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 70,78,123 మంది కోలుకున్నారు.
Onion Price Rise Row: హైదరాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లి, ఏపీలో రూ. 40కే.., దేశ వ్యాప్తంగా సెంచరీ కొట్టిన ఉల్లి ధరలు, పూణేలో ఉల్లిపాయల దొంగతనం, ధరల నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్రం
Hazarath Reddyహైదరాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నేటి నుంచి రైతుబజార్లలో ఉల్లి విక్రయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో ఉల్లిని అందుబాటులోకి తెచ్చామన్నారు.
Guidelines for Schools & Colleges: తల్లిదండ్రులు అనుమతిస్తేనే స్కూళ్లకు పిల్లలు, నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్, నేటి నుంచి ప్రారంభమైన ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్
Hazarath Reddyకరోనావైరస్ రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ( Anil Kumar Singhal) చెప్పారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన అనిల్ సింఘాల్.. ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని చాలా నష్టపోయిన నేపథ్యంలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు (Guidelines For Schools & Colleges) తీసుకుంటున్నామని తెలిపారు.
COVID-19 Vaccine: ఒక్క వ్యాక్సిన్ కోసమే రూ. 51 వేల కోట్లు పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం, ఒక్కో వ్యక్తికీ సగటున రూ.450-550 వరకు ఖర్చవుతుందని అంచనా
Hazarath Reddyభారత్‌లో మొత్తం జనాభాకు కరోనా టీకాలు (COVID-19 Vaccine) ఉచితంగా వేయటానికి కేంద్రప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను ఇప్పటికే సిద్ధం చేసిందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. అందరికీ టీకాలు వేయటానికి రూ.51,592 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టి, ఆ మేరకు నిధులను సమీకరించారని వెల్లడించాయి.
Coronavirus Outbreak: కరోనాపై షాక్ ఇస్తున్న కొత్త నిజాలు, కోవిడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్‌, గుండెపోటు సమస్యలు, ఫిబ్రవరి నాటికి సగం మందికి కరోనా, దేశంలో తాజాగా 46,791కేసులు నమోదు
Hazarath Reddyవచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 130 కోట్ల దేశ జనాభాలో సగం మందికి కరోనా (Coronavirus Outbreak) సోకే అవకాశమున్నదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తెలిపింది.
Heavy Rain Alert: మరో రెండు రోజులు..భారీ వర్షాల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ,అధికారులు అప్రమత్తం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను వర్షాలు కుదిపేస్తున్నాయి. తీవ్ర స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ వర్షాలు ఇప్పట్లో పోయేలా లేవు. తాజాగా రాష్ట్రానికి భారీ వర్షసూచన (Heavy Rain Alert) ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Paytm Credit Cards: పేటీఎం నుంచి 2 మిలియన్ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు మార్కెట్లో పాగా వేసేందుకు పేటీఎం సరికొత్త వ్యూహం
Hazarath Reddyభారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం 'నెక్స్ట్ జనరేషన్ క్రెడిట్ కార్డులు'(next-generation credit cards) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 'న్యూ టు క్రెడిట్' వినియోగదారులను డిజిటల్ ఎకానమీలో చేరడానికి వీలు కల్పించడం ద్వారా క్రెడిట్ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Rain Alert for Telugu States: మరో హెచ్చరిక, తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు, వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ (Rain Alert for Telugu States) చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains thundershowers)ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Weather Alert in Telugu States: మళ్లీ దూసుకొస్తున్న ముప్పు, 19న బంగాళఖాతంలో అల్ప పీడనం, రానున్న రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం, హెచ్చరించిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వర్షాలు ఇప్పట్లో ఆగే సూచనలు కనపడటం లేదు. ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర నష్టాలను చవి తెలుగు రాష్ట్రాలపై ( Heavy Rains in Telugu States) మరో ముంపు కాచుకూర్చుని ఉంది. మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (meteorological department) పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా (Low pressure) మారే అవకాశముందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.