Information
RTGS Payments: ఆర్బీఐ వడ్డీరేట్లు యధాతథం, డిసెంబర్ 2020 నుంచి 24/7 RTGS సేవలు, కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
Team Latestlyగవర్నర్ శక్తికాంత దాస్ మరో ప్రధాన ప్రకటన చేశారు - ఆన్‌లైన్ ఫండ్ బదిలీని సజావుగా చేయడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టిజిఎస్) చెల్లింపు వ్యవస్థను డిసెంబర్ 2020 నుండి 24/7 అందుబాటులో ఉంచబోతున్నట్లు ఆయన తెలియజేశారు....
English Medium Row: ఇంగ్లీష్ మీడియం జీవితంలో భాగమే, వ్యక్తిగతంగా సమర్థిస్తా, అయితే విచారణలో జోడించలేనని తెలిపిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, ఇంగ్లీష్ మీడియం కేసు వచ్చేవారానికి వాయిదా
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు (English medium education) సంబంధించి జారీచేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే (Chief Justice S.A. Bobde), జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
AP ECET Results 2020: ఏపీ ఈసెట్‌-2020 ఫలితాలు విడుదల, 30,654 మంది క్వాలిఫై, ఫలితాలను https://sche.ap.gov.in/ ద్వారా తెలుసుకోండి
Hazarath Reddyఇంజనీరింగ్‌ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్ధులు తదుపరి ఉన్నత సాంకేతిక విద్యన కొనసాగించేందుక వీలుగా నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2020 ఫలితాలు (AP ECET Results 2020) మంగళవారం విడుదల అయ్యాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను (AP ECET results 2020 declared) విడుదల చేశారు. విద్యా శాఖ స్పెషల్ సిఎస్ సతీష్ చంద్ర, ఎపి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, సెక్రటరీ సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 14న రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించారు.
Nobel Prize in Medicine 2020 Winners: వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమానాలు, హెపటైటిస్ సి వైరస్‌ను కనిపెట్టినందుకు అవార్డులు,ఈ వ్యాధి ద్వారా కాలేయ క్యాన్సర్‌ సోకే ప్రమాదం
Hazarath Reddyవైద్య రంగంలో 2020 సంవత్సరానికి గాను ముగ్గురికి నోబెల్ బహుమానాలు (Nobel Prize in Medicine 2020 Winners) వరించాయి. ఇందులో ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు కాగా, మరొకరు బ్రిటిష్ శాస్త్రవేత్త. అమెరికాకు చెందిన హార్వే, చార్లెస్ ఎం.రైజ్, బ్రిటీష్ కు చెందిన హైకెల్ హోటాలన్‌కు ఈ పురస్కారం లభించింది. ‘హెపటైటిస్ సి’ వైరస్‌ను (Hepatitis C virus) కనిపెట్టినందుకు గాను వీరికి ఈ అవార్డును ప్రకటించారు.
AP Weather Update: బంగాళఖాతంలో మరో అల్ప పీడనం, రానున్న రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు, తెలంగాణలో అక్కడక్కడా నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం
Hazarath Reddyబంగాళాఖాతంలో మరో అల్పపీడనం (Low pressure) 9వ తేదీన ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.ఉత్తర అండమాన్ తీర ప్రాంతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం నుంచి దానికి ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతం వరకూ అల్పపీడనం ఉందని, దానికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఉందని వెల్లడించిన అధికారులు, దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.
WhatsApp New Features: వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్లు, ఆల్వేస్‌ మ్యూట్‌ బటన్‌, కొత్తగా 138 ఎమోజీలు, న్యూ అటాచ్‌మెంట్‌ ఐకాన్స్‌..ఇతర ఫీచర్లు మీకోసం
Hazarath Reddyసోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్ స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ సరికొత్త ఫీచర్లను (WhatsApp New Features) యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్తగా మ్యూట్‌ బటన్‌, న్యూ ఐకాన్స్‌, కేటలాగ్‌ షార్ట్‌కట్‌, లెక్కలేనన్ని ఎమోజీలు.. ఇలా యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లను అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో పొందుపరిచింది. వీటిలో కొన్ని బీటా వెర్షన్లకే పరిమితమవగా మిగిలినివి సాధారణ యూజర్లకూ అందిస్తోంది.
Reliance-GIC,TPG Deal: రిలయన్స్‌లోకి తాజాగా రూ.7,350 కోట్లు పెట్టుబడులు, రిలయన్స్ రిటైల్ విభాగంలో ఈ మొత్తాన్ని పెట్టనున్నట్లు తెలిపిన జీఐసీ, టీపీజీ సంస్థలు, రూ.32,197.50 కోట్లకు చేరిన రిలయన్స్ మొత్తం పెట్టుబడులు
Hazarath Reddyజియో అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా రిలయన్స్ రిటైల్ విభాగంలో (Reliance Retail Ventures Ltd (RRVL) రూ.7,350 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ సంస్థ జీఐసీ, గ్లోబల్ ప్రయివేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ కాపిటల్ (Reliance-GIC,TPG Deal) అంగీకరించినట్టు ఆర్ఐఎల్ ప్రకటించింది.
Loan Moratorium: గుడ్ న్యూస్..రూ.2 కోట్ల లోపు రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, పలు రుణ గ్రహీతలకు భారీ ఊరట
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం రుణ గ్రహితలకు తీపి కబురును అందించింది. కరోనా సమయంలో ఆరు నెలల రుణ మారటోరియం కాలానికి (Moratorium Period) వడ్డీని మాఫీ చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని దేశ అత్యున్నత న్యాయస్థానానికి (Supreme Court) స్పష్టం చేసింది. రూ.2 కోట్ల (Rs 2 Crore) వరకు ఉన్న రుణాలపై 'వడ్డీపై వడ్డీని' మాఫీ (Waiving ‘Interest On Interest’) చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Unlock 5 Guidelines: అన్‌లాక్‌ 5 మార్గదర్శకాలు విడుదల, అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సీటింగ్‌కు అనుమతి, విద్యా సంస్థల రీఓపెనింగ్ నిర్ణయం రాష్ట్రాలకే..
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనావైరస్ లాక్ డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇస్తూ వస్తున్న విషయం విదితమే. తాజాగా అన్‌లాక్ 5.0లో (Unlock 5 Guidelines) భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులను ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌కు (multiplexes, swimming pools to partially open from October 15) అనుమతినిచ్చింది.
BrahMos Cruise Missile: దుమ్మురేపిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్, 400 కిలోమీటర్ల దూరంలో ఏమున్నా భస్మీ పటలం చేసే శక్తి దీని సొంతం, మిసైల్‌ను ప్రయోగించడం రెండోసారి
Hazarath Reddyబ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాత్మక పరీక్ష బుధవారం విజయవంతమైంది. స్వదేశీ బూస్టర్, ఎయిర్‌ఫ్రేమ్ విభాగంతో పాటు అనేక ఇతర మేడ్ ఇన్ ఇండియా ఉప వ్యవస్థలను కలిగి ఉన్న “బ్రహ్మోస్” సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి (BrahMos Cruise Missile) ఒడిశాలోని ఐటీఆర్ బాలాసోర్ నుంచి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు నిర్వహించిన ప్రయోగం విజయవంతం అయినట్టు ప్రకటించారు. దీంతో డీఆర్డీవో (DRDO) ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఇతర సిబ్బందిని భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అభినందించారు.
RBI's New Rules: డెబిట్, క్రెడిట్ కార్డులపై పలు ఆంక్షలు, అక్టోబర్ నుంచి కొత్త మార్గ దర్శకాలను జారీ చేసిన ఆర్‌బీఐ, అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపులు తీసివేయాలని బ్యాంకులకు ఆదేశాలు
Hazarath Reddyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) క్రెడిట్, డెబిడ్ కార్డు వాడే కస్టమర్లకు అక్టోబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలను (RBI's new debit credit card rules ) విడుదల చేసింది. బ్యాంకు కార్డు మోసాలకు చెక్ పెడుతూ కొత్త గైడ్ లైన్స్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇకపై అన్ని బ్యాంకులు, కార్డులను జారీ చేసే కంపెనీలు డెబిట్, క్రెడిట్ కార్డులపై ఉన్నఅంతర్జాతీయ డిజిటల్ చెల్లింపుల సేవలను తీసివేయాలని, కార్డు వినియోగదారుడు అభీష్టం మేరకు ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆర్‌బీఐ (Reserve Bank of India (RBI) కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది.
Amnesty Halts India Operations: మోదీ సర్కారుపై ఆమ్నెస్టీ తీవ్ర విమర్శలు, ఇండియాలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నామంటూ ప్రకటన, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
Hazarath Reddyఅంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత దేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు (Amnesty Halts India Operations) మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా (Amnesty India) ఆరోపించింది. 2020 సెప్టెంబర్ 10న తన బ్యాంకు ఖాతాలన్నీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్తంభింపజేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో ఇండియాలో కార్యకలపాలు ఆపేస్తున్నామని (Amnesty International to halt India operations) ఇది చాలా బాధాకర అంశమని ప్రకటించింది.
COVID-19 Vaccine Update: రూ. 250కే కరోనా వ్యాక్సిన్, 10 కోట్ల డోసుల అదనపు కోవిడ్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలని సీరం నిర్ణయం, మధ్యతరగతి వారికి అందించే దిశగా చర్యలు
Hazarath Reddyదేశంలో కరోనా వైరస్‌ కోరలు చాచిన నేపథ్యంలో దేశీయ ఔషద సంస్థలన్నీ వ్యాక్సిన్‌ తయారీ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సిరమ్ ఇనిస్టిట్యూట్ (Serum Institute of India) కీలక ప్రకటన చేసింది. 2021 ఆరంభంలోనే 10 కోట్ల డోసుల అదనపు కోవిడ్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. తొలి విడతలోనే మధ్యతరగతి వర్గాల వారికి వ్యాక్సిన్ అందించే దిశగా చర్యలు తీసుకుంటామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Zohra Sehgal: జోహ్రా సెహగల్ 108వ జన్మదినం, దిగ్గజ భారతీయ నటి జొహ్రా సెహ్గల్ బర్త్‌డే సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్, అంతర్జాతీయ వేదికపై మెరిసిన తొలి మహిళా నటి గురించి ఓ సారి తెలుసుకుందామా..
Hazarath Reddyదిగ్గజ భారతీయ నటి, రంగస్థల కళాకారిణి జోహ్రా సెహగల్‌కు గూగుల్ మంగళవారం నివాళులు అర్పించింది. పాత తరం నటిని డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా చూపించిన ప్రత్యేక డూడుల్‌ను ( Zohra Sehgal Google Doodle) గూగుల్ గెస్ట్ ఆర్టిస్ట్ పార్వతి పిళ్లై రూపొందించారు. గూగుల్ తన వెబ్‌సైట్‌లో రాసిన నోట్‌లో, ఎంఎస్ సెహగల్‌ను "అంతర్జాతీయ వేదికపై నిజంగా గుర్తింపు సాధించిన దేశంలోని తొలి మహిళా నటులలో ఒకరు" అని అభివర్ణించారు. ఏప్రిల్ 27, 1912 న జన్మించిన ఎంఎస్ సెహగల్ తన 102 సంవత్సరాల వయసులో న్యూ ఢిల్లీలో మరణించారు.
Book Two-Wheeler at Re 1: రూపాయికే బైక్ బుకింగ్, కస్టమర్లకు అద్భుత అవకాశాన్ని అందిస్తున్న ఫెడరల్ బ్యాంక్, బుకింగ్ ప్రాసెస్ వివరాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyకరోనా కాలంలో ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఫెడరల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే బైక్ బుక్ (Book two-wheeler at Re 1) చేసుకోవచ్చంటూ తన కస్టమర్లకు ఊరటనిచ్చింది. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు (Federal Bank customers) డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి, మిగిలిన సొమ్మును ఈఎంఐ చెల్లింపు అవకాశంతో (rest via debit card EMI) కొనుగోలు చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
DG Level Officer Beats Wife: భార్యపై అడిషనల్ డీజీ దాడి, ఇది కుటుంబ వ్యవహారమని తెలిపిన అడిషనల్ డీజీ పురుషోత్తం శర్మ, విధులనుంచి పోలీసు ఉన్నతాధికారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎంపీ సర్కారు
Hazarath Reddyఒక పోలీసు ఉన్నతాధికారి భార్యపై దాడిచేసి దారుణంగా కొట్టిన ఘటన (DG level Officer Beats Wife) మధ్యప్రదేశ్‌లో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి వివాహేతర సంబంధాన్నిరెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నందుకు భార్యపై ఎదురు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అయింది. వైరల్ వీడియో వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన అడిషనల్ డైరక్టర్ జనరల్ పురుషోత్తం శర్మ మరో మహిళతో ఇంట్లో అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా వారిద్దరిని ఆయన భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Notices to Chandrababu Residence: కృష్ణమ్మ ఉగ్రరూపం, చంద్రబాబు ఇంటితో సహా కరకట్టపై ఉన్న నివాసాలకు నోటీసులు, ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు సూచన
Hazarath Reddyఏపీలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలకు (Heavy Rains) ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) వరద నీరు పోటెత్తడంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలకు ప్రభుత్వ అధికారులు (AP Revenue Officials)నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు (Notices to Chandrababu Residence) జారీ చేశారు.
TSRTC: ఏపీకి నో..మహారాష్ట్ర,కర్ణాటకకు తెలంగాణ బస్సు సర్వీసులు, సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతాయని తెలిపిన టీఎస్ఆర్టీసీ, ఏపీతో ఒప్పందంపై ఇంకా తెగని పేచీ
Hazarath Reddyతెలంగాణ, ఏపీ మధ్య అంతర్‌ రాష్ట్ర సర్వీసులను నడిపే విషయంలో ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రకు సోమవారం నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు ప్రారంభం (TSRTC to resume bus services) కానున్నాయి. ఈ మేరకు బస్సులను నడపడానికి తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నుంచి అనుమతి లభించింది. ఆ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి అదే రోజున బస్సులు ప్రారంభమవుతాయని ఆర్టీసీ (TSRTC) ఓ ప్రకటనలో తెలిపింది.
Heavy Rains Hits Telugu States: భయపెడుతున్న భారీ వరదలు, రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు, నాగార్జునసాగ‌ర్ 10 గేట్లు ఎత్తివేత‌, పలుచోట్ల ప్రమాదకర స్థాయిలో నదులు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో వాన‌లు విస్తారంగా కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు (Heavy Rains Hits Telugu States) నదులు, డ్యాములు నిండిపోయాయి. పలు చోట్ల వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాగల నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ నిర్వాహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు (Minister K Kannababu) తెలిపారు.