Information
SC Bans BS-IV Vehicles Registration: బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీంకోర్టు వేటు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్లకు ఆదేశాలు
Hazarath Reddyదేశవ్యాప్తంగా లాక్డౌన్ కాలంలో అమ్ముడైన బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీంకోర్టు వేటు (SC Bans BS-IV Vehicles Registration) వేసింది. లాక్డౌన్ ఎత్తివేసిన పదిరోజుల్లో వాహన డీలర్ల వద్ద ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్న గత ఆదేశాలనూ అత్యున్నత న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. కరోనా లాక్డౌన్ సమయంలోనూ బీఎస్-4 వాహనాల అమ్మకాలు (BS-IV Vehicles Solds) జరగడంపై సుప్రీంకోర్టుమండిపడింది. ఈ వాహనాల రిజిస్ట్రేషన్లపై తాము చెప్పే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీం (Supreme Court) ఆదేశించింది.
LAC Face-Off: చైనాపై ఇండియా డేగ కన్ను, సరిహద్దుల్లో 35 వేల మందితో పహరా, ఇంకా ఫలితం తేలని ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు
Hazarath Reddyపొరుగుదేశం చైనాతో ఇండియా జరుపుతున్న చర్చలు (LAC Face-Off) ఫలితం వచ్చే దిశగా కనపడటం లేదు. అందుకని ఇండియా ముందే అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని ( India to add 35000 troops along China border) భారత ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పు లద్దాఖ్‌తోపాటు ( ladakh lac face off) ఇతర ప్రాంతాల్లో చైనా తరచూ సరిహద్దు వివాదాలు సృష్టిస్తూండటం, ఇటీవల గల్వాన్‌ లోయలో పొరుగుదేశపు సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీరమరణం పొందడంతో ఇండియా ఆచితూచి అడుగులు వేస్తోంది. చైనా ఏ మాత్రం నమ్మదగినది కాకపోవడంతో సరిహద్దులో అప్రమత్తమవుతోంది.
August Bank Holidays: ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, మొదటి మూడు రోజులు బ్యాంకులకు సెలవులే, లిస్ట్ మొత్తం ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyఈ రోజుతో జూలై నెల ముగిసిపోతుంది. రేపటి నుంచి ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. అయితే ఈ నెల అయినా డబ్బు అవసరమున్న ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది బ్యాంకు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ ఆ నెలల బ్యాంకు సెలవులు (August Bank Holidays) ఏముంటాయో తెలుసుకుంటారు. ఇక ఆగస్టు నెలలో కూడా బ్యాంకు సెలవులు (August 2020 Holidays) ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ వివరాల ప్రకారం ఆగస్ట్‌ నెలలో బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి.
Unlock 3 Guidelines: బార్లకు నో పర్మిషన్, ఆగస్టు 31 వరకు విద్యా సంస్థల మూసివేత, రాత్రి సమయాల్లో కర్ఫ్యూ ఎత్తివేత, అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోం శాఖ
Hazarath Reddyకరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో (Containment Zone) ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్ (Coronavirus lockdown) ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్‌లాక్-3 (Unlock 3) మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం కొంత ఊరట లభించే విధంగా సడలింపులను ప్రకటించింది.
Rafale Fighters: రాఫెల్‌కు వాటర్ సెల్యూట్, అంబాలా ఎయిర్ బేస్‌లో ల్యాండ్ కానున్న రాఫెల్‌ యుద్ధ విమానాలు, రిసీవ్ చేసుకునేందుకు అంబాలా చేరుకున్న వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా
Hazarath Reddyఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు (Rafale Fighter Aircrafts) కాస్సేపట్లో భారత్‌కు చేరుకోనున్నాయి. ఈ మధ్యాహ్నానికి హర్యానాలోని అంబాలాలో గల భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ఇవి ల్యాండ్ కాబోతున్నాయి. రాఫెల్‌ ల్యాండింగ్ కోసం భారత్ ఎదురుచూస్తున్న తరుణంలో.. ఈ రోజు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ (Ambala airbase) వద్ద రఫాలే ల్యాండ్ అయిన తరువాత ఐదు రాఫెల్ యుద్ధ విమానాలకు 'వాటర్ సెల్యూట్' (Water Salute ) ఇవ్వబడుతుంది.
Rajasthan Political Crisis: గుజరాత్‌, తమిళనాడును తాకిన రాజస్థాన్ రాజకీయ సెగలు, రాజ్‌భవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చీఫ్ సహా 60 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyరాజస్థాన్ రాజకీయ సంక్షోభం గుజరాత్ ను తాకింది. బిజెపికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు (Congress workers) గాంధీనగర్‌లోని రాజ్ భవన్ వైపు దూసుకెళ్లారు. బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్‌ కాంగ్రెస్ చేపట్టిన ఈ నిరసన (Gujrath Congress protest) ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అమిత్ చావ్డా (Gujarat Congress president Amit Chavda), ప్రతిపక్ష నేత పరేశ్ ధానాని (Paresh Dhanani) సహా దాదాపు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
APJ Abdul Kalam Death Anniversary: ఏ.పి.జె.అబ్దుల్ కలాం 5వ వర్థంతి, ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు, స్ఫూర్తినిచ్చే కొటేషన్లు మీకోసం
Hazarath Reddyనేడు భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీబీ అబ్దుల్ కలాం 5వ వర్ధంతి. ఆయన వర్థంతి (APJ Abdul Kalam 5th Death Anniversary) సంధర్భంగా పలువురు నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా హోం మంత్రి అమిత్ షా (Amit Shah) , రవిశకంర్ ప్రసాద్, రాష్ట్రపతి, బిజెపి పార్టీ ఇలా పలువురు ఆయనకు నివాళి అర్పించారు. అబ్దుల్ కలాం జీవితం (APJ Abdul Kalam Biography) ఎంతో మందికి స్ఫూర్తి. ఇక ఆయన ప్రసంగాలు (Abdul Kalam Most Inspirational Messages) కుర్రాళ్లకు జీవిత పాఠాలు. అబ్దుల్ కలాం పేరు వింటే గుర్తొచ్చేవి స్ఫూర్తినిచ్చే ఆయన మాటలు. యువతలో ఆయన ప్రసంగాలకు, కొటేషన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
India Coronavirus: గుజరాత్‌లో మిస్టరీగా మారిన కరోనా మరణాలు, దేశంలో 14 లక్షలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, మరోసారి రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
Hazarath Reddyభారత్‌లో కరోనావైరస్ కేసులు (India Coronavirus Pandemic), మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 49,931 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 708 మంది కరోనా కారణంగా ప్రాణాలు (COVID-19 Deaths) కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య (Coronavirus Cases) ఇప్పటివరకు మొత్తం 14,35,453కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 32,771కి పెరిగింది.
Permanent Commission for Women Officers: ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర రక్షణ శాఖ
Hazarath Reddyఇండియన్ ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ను (Permanent Commission for Women Officers) ఏర్పాటు చేస్తూ రక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. షార్ట్‌ సర్వీసు కమిషన్‌ (SSC) కింద రిక్రూట్‌ చేసే మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు (Supreme court) చరిత్రాత్మక తీర్పు చెప్పిన సంగతి తెల్సిందే. ఈ తీర్పు మేరకు రక్షణ శాఖ శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
Rains In Telugu States: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వానలు, ఉపరితల ద్రోణికి నైరుతి రుతుపవనాలు తోడు, రానున్న రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyచత్తీస్‌ఘఢ్‌ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి నైరుతి రుతుపవనాల ప్రభావం (Southwest Monsoon) కూడా తోడయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో (Rains In Telugu States) కుండపోతగా వానలు కురుస్తున్నాయి. గురువారం కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణకోస్తా జిల్లాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు జల్లులు పడ్డాయి. ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States RainFall) గురువారం పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
EC Defers By-polls in 7 States: ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వాయిదా, కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్
Hazarath Reddyదేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా (EC Defers By-polls in 7 States) వేసింది. కరోనా వైరస్‌, వరదల నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా వేసినట్లు గురువారం ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది. దీంతో ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి.
Thyrocare Survey: భారత్‌లో 18 కోట్ల మందికి కరోనా భయమే లేదు, వారి శరీరం కోవిడ్-19 రోగనిరోధక శక్తిని కలిగి ఉంది, థైరోకేర్‌ సర్వేలో వెల్లడి
Hazarath Reddyభారత్‌లో 18 కోట్ల మందికి (18 crore Indians) కరోనా భయమే లేదు. దీనికి ప్రధాన కారణం వారంతా ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని థైరోకేర్ డేటా (Thyrocare Survey) పేర్కొంది. దేశంలో దాదాపు 15 శాతం మంది కోవిడ్-19 వైరస్ కు వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ (Antibodies Against Coronavirus) కలిగి వుండవచ్చని తమ డేటాలో తేలిందని సర్వే తెలియజేసింది.
India-China Border Tensions: చైనా మళ్లీ బరి తెగించింది, 40,000 మంది సైనికులని సరిహద్దుల్లో మోహరించింది, కఠిన పరిస్థితులను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపు
Hazarath Reddyసరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలంటూ చైనా ఓ పక్క చెబుతూనే మరోపక్క తన జిత్తులమారితనాన్ని బయటపెట్టుకుంటూ వస్తోంది. సరిహద్దుల నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరం చైనా బలగాలు వెనక్కి వెళ్లాయనే వార్తలు ఈ మధ్య వినిపించగా..అవి ఒట్టి పుకారులేనని తేలిపోయింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం తూర్పు లఢక్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి దాదాపు 40 వేల సైనిక దళాలను (40,000 Chinese Troops on Ladakh Front) మోహరించింది.
Gold Price: భగ్గుమన్న బంగారం, వెండి ధరలు, తొలిసారిగా రూ.50 వేల మార్కుకు చేరుకున్న గోల్డ్, రూ. 60 వేలు దాటిన వెండి
Hazarath Reddyదేశంలో బంగారం, వెండి ధరలు (Gold, Silver Price) బుధవారం భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 9 ఏళ్ల గరిష్టస్ధాయికి పెరగడంతో దేశీయ మార్కెట్‌లోనూ పసిడి రికార్డు స్థాయి పెరుగుదల నమోదు చేసింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా 500 రూపాయలు పెరిగి తొలిసారిగా (Gold Price Hits Rs 50,000) రూ. 50,026కు ఎగిసింది. బంగారం బాటలోనే దూసుకెళ్లిన వెండి ఒక్కరోజులోనే 3502 రూపాయలు పెరిగి ఏకంగా 60,844కు ఎగబాకింది.
Work From Home: డిసెంబర్ 31 వరకు ఇంటి నుంచే పని, ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం, దేశంలో కొనసాగుతున్న కరోనావైరస్ కల్లోలం
Hazarath Reddyకరోనావైరస్‌ దేశంలో పెను కల్లోలాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు (Work From Home) అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఐటీ కంపెనీలు ( IT Companies) ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయడానికి వెసులుబాటు కల్పించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మరికొన్ని నెలల పాటు 'వర్క్ ఫ్రం హోం' సౌకర్యాన్ని కేంద్రం పొడిగించింది.
AP Schools Reopen Date: సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం, మీడియాతో మాట్లాడిన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీలో కొవిడ్‌–19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభించాలని (AP Schools Reopen Date) నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మెరుగైన విద్య, విద్యార్థులకు రుచికరమైన జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం)పై మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం అనంతరం మంత్రి (Education Minister Adimulapu Suresh) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
Privatisation of Banks: మిగిలేది 5 ప్రభుత్వ రంగ బ్యాంకులే, బ్యాంకుల ప్రైవేటీకరణ వైపు మోదీ సర్కారు చూపు, కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ కుదేల్
Hazarath Reddyప్రస్తుతం దేశంలో డజను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అయితే రానున్న కాలంలో ఇవి అయిదు లేకుంటే నాలుగుగా అవతరించనున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు (PSB)ల్లో సగానికిపైగా బ్యాంకులను ప్రైవేటీకరించాలని (Privatisation of Banks) మోదీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాసెస్ లో భాగంగా తొలుత ఆరు బ్యాంకులను ప్రైవేటీకరించే అవకాశం ఉంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (CBI), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (IOB), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (BOM), యూకో బ్యాంక్‌ను వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు విక్రయించనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వార్తలు అందుతున్నాయి.
Lalji Tandon Dies: మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్‌జీ టాండన్ కన్నుమూత, గ‌వ‌ర్న‌ర్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోదీ సంతాపం, ఆనందీబెన్ పటేల్‌కు మధ్యప్రదేశ్ అదనపు బాధ్యతల‌ు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్ (85) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Lalji Tandon Dies) విడిశారు. బీజేపీ తొలినాళ్ల నుంచి క్రమశిక్షణగల నేతగా గుర్తింపు పొందిన లాల్జీ.. ఉత్తరప్రదేశ్‌ శాసన సభకు, శాసన మండలికి పలు పర్యాయాలు ఎన్నికైయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా మాయావతి సర్కార్‌లో రాష్ట్రమంత్రిగా కూడా వ్యహరించారు. కళ్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వంలోనూ కొనసాగారు.
Assam Floods: ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర నది, అసోం వరదల్లో 85కు చేరిన మృతుల సంఖ్య, 70 ల‌క్ష‌ల మందిపై వరదల ప్రభావం, అసోం సీఎం సోనోవాల్‌కు ప్రధాని మోదీ ఫోన్
Hazarath Reddyఅసోంలో వ‌ర‌ద ఉధృతి (Assam Floods) తీవ్ర‌రూపం దాల్చింది. బ్రహ్మపుత్రా నది (Brahmaputra river) ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడంతో అనేక వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు నేలమట్టమయ్యాయి. దాదాపు 70వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు దాదాపు లక్ష క్వింటాళ్ల బియ్యం, 19,397 క్వింటాళ్ల కందిపప్పు, 173,006 లీటర్ల వంట నూనె అందజేసినట్టు అధికారులు తెలిపారు.
Ayodhya Bhoomi Poojan: భూమి పూజకు 250 మంది అతిథుల‌ు, ప్రధాని మోదీని ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, ఆగ‌స్టు 5న అయోధ్య రామాలయ భూమి పూజ కార్యక్రమం
Hazarath Reddyవ‌చ్చే నెల 5వ తేదీన అయోధ్యలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్న శ్రీరాముని మందిర నిర్మాణం భూమి పూజ‌కు (Ayodhya Bhoomi Poojan) శ్రీరామ‌భ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు (Shri Ram Janmbhoomi Teerth Kshetra) ఆహ్వానాలను పంపుతోంది. భూమి పూజ కార్యక్రమానికి (Ram Temple Construction) సుమారు 250 మంది అతిథుల‌ను పిల‌వనున్న‌ట్లు అనధికార సమాచారం. అయోధ్యలోని ప్ర‌ముఖ సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్య‌క్తులు ఈ ఆహ్వాన లిస్టులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి (PM Narendra Modi) ఈ కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా శ‌నివారం ఆహ్వానం అందింది.