Information

Locust Attack in TS: ఇక తెలుగు రాష్ట్రాలే టార్గెట్, పశ్చిమ భారతాన్ని వణికించిన మిడతల గుంపు, మహారాష్ట్రలో ప్రస్తుతం తిష్ట వేసిన రాకాసి మిడతలు

Hazarath Reddy

కొద్దిరోజులుగా పశ్చిమభారతానికే పరిమితమైన ఎడారి మిడతల దండు (Locust) క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు దూసుకొస్తున్నది. బుధవారం నాటికి మహారాష్ట్రలోని (Maharashtra) అమరావతి వరకు ఈ మిడతలు చేరుకున్నాయి. పాకిస్తాన్ (Pakistan) నుంచి భారత్‌లోకి ప్రవేశించిన మిడతలు.. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో పంటలకు నష్టం (Locust Attack) కలిగించాయి. మధ్యప్రదేశ్ నుంచి కొన్ని మిడతలు ఝాన్సీ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించగా.. ఇంకొన్ని మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చేరాయి. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదం ఉండటంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది.

Pakistani 'Spy' Pigeon: సరిహద్దుల్లో అనుమానాస్పదంగా గూఢాచారి పావురం, పాకిస్థాన్‌ గూఢచార కపోతంగా నిర్థారించిన కథువా జిల్లా ఎస్పీ శైలేంద్రమిశ్రా, ఆర్మీ అధికారులకు అప్పగింత

Hazarath Reddy

సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక గూఢచార పావురాన్ని (Suspected spy pigeon) కథువా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రకరకాల రంగుల్లో కనిపిస్తున్న ఈ పావురాయిని జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా వాసులు బంధించి పోలీసులకు అప్పగించారు. పాక్ వైపు నుంచి ఆ ప్రాంతంలోకి రావడం గమనించిన వారు.. దీన్ని పాక్ కొత్త ఎత్తుగడగా (Pakistani 'Spy' Pigeon) భావిస్తున్నారు. పావురాయి కాళ్లకి ఓ రింగ్ తొడిగి ఉందన్న విషయాన్ని కూడా వారు పోలీసుల దృష్టికి తెచ్చారు.

Lockdown Love: యాచకురాలితో స్నేహం పెళ్లిగా మారింది, ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్ సమయంలో ఒక్కటైన జంట, ఆశీర్వదించిన రెండు కుటుంబాలు

Hazarath Reddy

కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో విరబూసిన ప్రేమ (Lockdown Love) లాక్‌డౌన్ లోనే పెళ్లి వరకు (Lockdown love culminates in marriage) వెళ్లింది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన ఓ జంట లాక్‌డౌన్ సమయంలో ఒక్కటయింది. ఇందులో పెళ్లి కొడుకు డ్రైవర్ కాగా, పెళ్లి కూతురు ఓ యాచకురాలు. వివరాల్లోకెళితే..యూపీకి (Uttar Pradesh)చెందిన‌ నీల‌మ్‌ డ్రైవ‌ర్‌.. లాక్‌డౌన్ సమయంలో అందరికీ తనకున్న దాంట్లో ప‌ట్టెడ‌న్నం పెట్టి క‌డుపు నింపుతున్నాడు. అలా ఓ రోజు ఆహారం పంచిపెడుతుండ‌గా కాన్పూర్‌లోని కకాడియో క్రాసింగ్ ద‌గ్గ‌ర ఫుట్‌పాత్ మీద అడుక్కుంటున్న నీల‌మ్‌ను చూశాడు. అందరితోపాటు ఆమెకూ ఆహారం పంపిణీ చేశాడు. ఆమెతో మాట క‌లిపి అన్ని వివ‌రాలు అడిగి తెలుసుకున్నాడు. అలా మొద‌లైన స్నేహం ప్రేమ వ‌ర‌కూ వెళ్లింది.

Flight operations: చివరి నిమిషంలో విమానాలు రద్దు, అయోమయంలో ప్రయాణికులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రద్దు చేయడంపై ఆగ్రహం

Hazarath Reddy

రెండు నెలల విరామం తర్వాత దేశీయ విమానాలు (Flight operations) సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి దశలో కొందరు ప్రయాణికులను కూడా తమ తమ గమ్య స్థానాలకు చేర్చాయి. అయితే కొన్ని విమానాలను మాత్రం ప్రయాణికులకు ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండానే వాటిని రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 82 విమానాలు ఆకస్మికంగా రద్దయ్యాయి.

Advertisement

Amazon India Jobs: నిరుద్యోగులకు శుభవార్త, అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు, స్వతంత్ర కాంట్రాక్టర్లు,పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసిన అమెజాన్ ఇండియా

Hazarath Reddy

కోవిడ్‌-19 సంక్షోభం, లాక్‌డౌన్‌ COVID-19 Lockdown) ఆంక్షల్లో చిక్కుకుని దిగ్గజాలనుంచి స్టార్టప్‌ కంపెనీల దాకా అందరూ ఉద్యోగులను తొలగించుకుంటూ పోతున్న విషయం విదితమే. అలాగే వేతనా కోత కూడా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ నిరుద్యోగులకు శుభవార్తను చెప్పింది. తమకు 50 వేల సిబ్బంది అవసరం (Amazon India Jobs) పడుతుందని అమెజాన్ ఇండియా (Amazon India) శుక్రవారం ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 50వేల మందిని నియమించుకోనున్నామని తెలిపింది.

India Post: ప్రారంభమైన తపాలా శాఖ సేవలు, 15 దేశాలకు అంతర్జాతీయ స్పీడ్ పోస్టులు రెడీ, మిగిలిన దేశాలకు నిలిపివేశామని తెలిపిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

Hazarath Reddy

లాక్‌డౌన్ వల్ల నిలిచి పోయిన తపాలా శాఖ సేవలు ( Indian Postal Service) తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇండియా పోస్టు ఆఫీసుల్లో అంతర్జాతీయ స్పీడ్ పోస్టు (International Speed Post) కోసం 15 దేశాలకు బుకింగ్ లను తపాలా శాఖ శుక్రవారం ప్రారంభించింది. ఎంపిక చేసిన 15 దేశాలకు ఇండియా పోస్ట్ అంతర్జాతీయ స్పీడ్ పోస్ట్ కోసం బుకింగ్లను తిరిగి ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సరుకులను పంపించడానికి ప్రత్యేకంగా రూపొందించిన సర్వీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ కూడా అందుబాటులో ఉందని రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) తెలిపారు.

RBI New Repo Rates: వ్యవసాయంపైనే ఆశలు, వినియోగదారులకు ఆర్‌బీఐ ఊరట, రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గింపు, మీడియా సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌

Hazarath Reddy

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధింపు నేపథ్యంలో కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌(RBI) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను (RBI New Repo Rates) చేసింది. రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌ (Shaktikanta Das) మీడియా సమావేశంలో ప్రకటించారు. రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై ఆర్‌బీఐ (Reserve Bank of India) సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి తగ్గించింది.

Ramjanmabhoomi Update: రామజన్మభూమి స్థలంలో బయటపడిన దేవతా విగ్రహాలు, గతంలో జరిపిన తవ్వకాల్లోనూ అవశేషాలు,ఆధారాలు లభించాయన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామజన్మభూమి ( Ayodhya Ramjanmabhoomi) స్థలం చదును చేస్తుండగా దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. బయటపడిన విగ్రహాల్లో పుష్ప కలశం, ఐదడుగుల శివలింగం, విరిగిన దేవతా విగ్రహాలు, ఏడు నల్లరాతి స్థంభాలు, ఆరు ఎర్రరాతి స్థంభాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర (Sri Ram Janmabhoomi Tirth Kshetra) ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడారు.

Advertisement

Lockdown 5.0 or Lockdown Exit?: లాక్‌డౌన్ 5 ఉంటుందా లేక ఇదే లాస్ట్ అవుతుందా? ప్రారంభమైన విమానాలు, రైళ్లు, షాపులు, ఇండియా సాధారణ స్థితికి చేరుకున్నట్లేనా..?

Hazarath Reddy

ఈ నెల 31తో నాలుగవ దశ లాక్‌డౌన్ ముగిసిపోతున్న నేపథ్యంలో కేంద్రం తరువాత వ్యూహం ఎలా ఉండబోతోంది. లాక్‌డౌన్ 5 కొనసాగిస్తుందా లేక లాక్‌డౌన్ 4 (Lockdown 4) చివరిది అవుతుందా (Lockdown 5.0 or Lockdown Exit) అనే ప్రశ్నలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే కొన్ని సడలింపులతో అన్ని ప్రయాణాలకు అనుమతినిచ్చారు. దేశంలో రైళ్లు, బస్సులు, విమానాలు (Domestic Flights) తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రజలు సాధారణ స్థితికి వచ్చేందుకు అడుగు దూరంలో ఉన్నారు. మరి కేంద్రం (Center) తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Heat Wave Warning: వడగాడ్పుల ముప్పు, ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశం, ఈ మూడు రోజులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వడగాడ్పుల ముప్పు పొంచి ఉందని తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ ఎండలు భగ్గుమంటాయని (Heat Wave Warning) తెలిపింది. ఈ నెల 25వ తేదీ ఉదయం రోహిణి కార్తె ప్రవేశించనుంది.

Cyclone Amphan Videos: విధ్వంసం సృష్టించిన అంఫాన్, వెస్ట్ బెంగాల్,ఒడిషాలో భారీగా ఆస్తి నష్టం, నీటిలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు, వీడియోల్లో విధ్వంసం ఎలా ఉందో మీరే చూడండి

Hazarath Reddy

బెంగాల్ తీరాన్ని తాకిన అంఫాన్ తుఫాన్ (Cyclone Amphan) వెస్ట్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో బీభ‌త్సం సృష్టించింది. తుఫాన్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది చ‌నిపోయారు. బ‌ల‌మైన ఈదురుగాలులు, వ‌ర్షాల‌కు.. వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి. క‌రోనా వైర‌స్ క‌న్నా అంఫాన్ తుఫాన్ ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ (West Bengal CM) అన్నారు. అంఫాన్ నష్టం సుమారు ల‌క్ష కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని ఆమె అంచ‌నా వేశారు. దాదాపు అయిదు ల‌క్ష‌ల మందిని షెల్ట‌ర్ హోమ్‌ల‌కు త‌ర‌లించారు. ఒడిశాలో కూడా ల‌క్ష‌కు పైగా మందిని షెల్ట‌ర్ హోమ్స్‌కు పంపించారు.

Indian Railways: ప్రారంభమైన రైల్వే బుకింగ్స్, జూన్ 1న పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్ రైళ్లు, సాధారణంగానే టికెట్ ధరలు, జనరల్‌ కోచ్‌ల్లోనూ రిజర్వుడ్‌ సీట్లు

Hazarath Reddy

వచ్చే నెల 1 నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు గురువారం ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. టికెట్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ (IRCTC Website) లేదా యాప్‌ (APP) ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి. కౌంటర్లు బంద్‌ ఉంటాయి. నాన్‌ ఏసీతోపాటు ఏసీ కోచ్‌లనూ (AC And Non AC) కూడా నడుపనున్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఏపీ (TS And AP) నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు ఉన్నాయి.

Advertisement

Amphan Cyclone: తీరాన్ని తాకిన అంఫాన్, నాలుగు గంటల పాటు ప్రభావం, అల్లకల్లోలంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరప్రాంతాలు, రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు

Hazarath Reddy

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అంఫన్ తుపాను తీరాన్ని (Amphan Cyclone) తాకింది. పశ్చిమబెంగాల్‌లోని దిఘా బంగ్లాదేశ్ హతియా దీవుల మధ్య తీరాన్ని తాకిందని భారత వాతావరణ విభాగ అధికారులు(IMD) తెలిపారు. నాలుగు గంటల పాటు బెంగాల్‌పై తుపాను ప్రభావం ఉంటుందన్నారు. ఆంఫన్ కారణంగా పశ్చిమబెంగాల్‌లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 165 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని అధికారులు చెప్పారు. తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Cyclone Amphan Update: తీరం వైపు అంఫాన్ తుఫాను, ఒడిశా, పశ్చిబెంగాల్‌ మధ్యలో తీరం దాటే అవకాశం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

అంఫాన్‌ తుఫాన్‌ (Cyclone Amphan) తీరంవైపు పరుగులు పెడుతోంది. ఈ తుపాను మంగళవారం బలహీనపడి, అత్యంత తీవ్ర తుపానుగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా, తర్వాత తుఫాన్‌గా, ఆ తర్వాత మహాతుఫాన్‌గా మారి ఉత్తర దిశగా వేగంగా కదులుతున్నది. అంఫాన్‌గా పేరు ఖరారైన ఈ తుఫాన్‌ బుధవారం ఒడిశా, పశ్చిబెంగాల్‌ మధ్యలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

Schools Reopen in AP: ఏపీలో ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ 19 లాక్‌డౌన్‌ (Covid-19 Lockdown) కారణంగా మూత పడిన స్కూళ్లు ఆగస్టు 3 నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ (AP CM YS jagan) ప్రకటించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు (nadu nedu scheme) కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. విద్యావ్యవస్థలో నూతన మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందని, కలెకర్ట్‌లు అందరూ సమష్టిగా పని చేయాలని సూచించారు.

TS-AP Water Dispute: మలుపులు తిరుగుతున్న నీటి వివాదం, రాయలసీమకు గోదావరి మిగులు జలాలు తీసుకుపొమ్మన్న కేసీఆర్, మా నీళ్లను మేము వాడుకుంటామని స్పష్టం చేసిన ఏపీ సర్కారు

Hazarath Reddy

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచడం కోసం ఏపీ సర్కారు (AP Govt) జీవో జారీ చేయడం.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి (TS-AP Water Dispute) దారి తీసిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేసీఆర్ సర్కారు ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రం పాలయ్యే గోదావరి నీళ్లు సీమకు తరలించడంలో తప్పేం లేదని, రాయలసీమకు (Rayalaseema) నీళ్లు ఎందుకు పోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. తెలిసీ తెలియక మాట్లాడేవారి గురించి తాను పట్టించుకోనన్నారు.

Advertisement

Nellore Child Labour Issue: ఆరేళ్ల చిన్నారితో గది శుభ్రం, తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీకి ఆదేశాలు

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారి గదిని శుభ్రం చేస్తుండగా, కొందరు పోలీసులు అక్కడే నిలుచుని చూస్తూ ఉండడం మీడియాలో కనిపించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఆ చిన్నారి గదిని శుభ్రం చేస్తుండగా (Nellore Child Labour Issue) ఖండించకుండా చూస్తూ ఉండటంతో ఇది ఇంకా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ (AP DGP Gautam Sawang) ఘటనపై స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు.

#AmphanCyclone: పెను తుఫానుగా మారిన అంఫాన్, ఒడిశాకు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు, రేపు తీరం దాటే అవకాశం, ఒడిశా, బెంగాల్‌కు పొంచి ఉన్న ముప్పు, ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

Hazarath Reddy

పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అంఫాన్‌' తుఫాన్‌ (Cylcone Amphan) మహాతుఫానుగా (super cyclone) మారినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఈ తుఫాను తాకిడికి గంటకు 200 కిమీవేగంతో పెనుగాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. బుధవారం మధ్యాహ్నానికి ఇది అతి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడి, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఎన్డీఆర్‌ఎఫ్‌ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ ( NDRF chief SN Pradhan) తెలిపారు.

FASTag in India: ఫాస్టాగ్‌ లేకుంటే డబుల్‌ టోల్‌ ఫీజు, ఆదేశాలు జారీ చేసిన రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, దేశవ్యాప్తంగా 1.68 కోట్ల ఫాస్టాగ్‌లను మంజూరు చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

జాతీయ రహదారులపై తిరిగే వాహనాలకు గతేడాది డిసెంబర్‌ 15 నుంచి ఫాస్టాగ్‌ను (FASTag in India) ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం విదితమే. అయితే చాలా వాహనాలు ఇంకా ఫాస్టాగ్ లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయి. ఇలా ఫాస్టాగ్‌ (FASTags) లేని వాహనాలకు ఇకపై జాతీయ రహదారులపై (National Highways) డబుల్‌ టోల్‌ ఫీజు వసూలుచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఆదివారం ఆదేశాలు జారీచేసింది.

CBSE Class 10, 12 Board Exam 2020: జూలై 1 నుంచి 15 వరకు 12 వ తరగతి పరీక్షలు, ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షల నిర్వహణ

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) సోమవారం పెండింగ్ లో ఉన్న 10వ తరగతి మరియు 12 వ తరగతి పరీక్షల తేదీ షీట్ (CBSE Class 10, 12 Board Exam 2020) ప్రకటించింది. ఇది ఇప్పుడు జూలై 1-15 నుండి జరుగుతుంది. COVID-19 వ్యాప్తి నియంత్రణకు దేశ వ్యాపంగా లాక్ డౌన్ విధించడంతో మార్చి 25 న దేశవ్యాప్తంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) ఇంటర్‌ పరీక్షల డేట్‌షీట్‌ను విడుదల చేసింది.

Advertisement
Advertisement