Information

Trump Urges PM Modi: అమెరికాలో కరోనా మృత్యుఘోష,మోడీ సాయం కోరిన ట్రంప్, హైడ్రా​క్సీ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ ఎగుమతి చేయాలని ఇండియాను కోరిన అమెరికా

Hazarath Reddy

కరోనా కోరల్లో నుంచి తప్పించుకునేందుకు ట్రంప్‌ భారత సహాయాన్ని (Trump urges PM Modi) కోరారు. మలేరియా నిరోధానికి వాడే హైడ్రా​క్సీ క్లోరోక్వీన్‌(hydroxy chloroquine) మెడిసిన్‌ను తమ దేశానికి ఎగుమతి చేయాలని ట్రంప్‌ భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీని (Prime Minister Narendra Modi) అభ్యర్థించారు. కోవిడ్-19 బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు మలేరియా నియంత్రణకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను మరింత విరివిగా సరఫరా చేయాలని ప్రధాని మోదీని ట్రంప్ కోరారు.

Salute Police Officers: పోలీసులపై పూల వర్షం, దారి పొడవునా పోలీస్ వాహనాలపై పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్న మీరట్ ప్రజలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో

Hazarath Reddy

విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పోలీసులు త‌మ కుంటుంబాల‌ను వ‌దిలిపెట్టి ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం రోడ్ల‌పై నిద్రాహారాలు మానేసి..విధులు నిర్వ‌ర్తిస్తూ దేశ‌సేవ‌కు అంకిత‌మ‌వుతున్నారు. వారిపై ఏదో విధంగా తమ ప్రేమను ప్రజలు చాటుకుంటున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ వాసులు (UP's Meerut Shower Flowers) పోలీసులపై తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు.

Indian Railways: లాక్‌డౌన్ తర్వాత రైళ్లు నడవడంపై స్పందించిన రైల్వే శాఖ , ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, త్వరలోనే అనౌన్స్ చేస్తామంటూ కీలక ప్రకటన

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రైల్వే సేవలను పునరుద్ధరించే అంశమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తాము తప్పకుండా వెల్లడిస్తామని ట్విటర్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ ఈ నెల 12తో ముగుస్తున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి రైల్వే సేవల పునరుద్ధరణ, టికెట్ బుకింగ్‌పై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

Coronavirus in Dharavi: గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ముంబై మురికివాడ ధారావి, మరో రెండు కొత్త కేసులు నమోదు, మొత్తం 5కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Hazarath Reddy

ముంబై లోని మురికి వాడ ధారావి (Dharavi) ఇప్పుడు ముంబై వాసుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in Dharavi) నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా కేసుల (Coronavirus Cases in Dharavi) పెరుగుదల ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.

Advertisement

Telangana Weather Alert: కరోనావైరస్‌కి వర్షాలు తోడు, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు, హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం, పరిస్థితులు పూర్తిగా మారిపోయే ప్రమాదం

Hazarath Reddy

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో (Telangana) వేడి ఉష్ణోగ్రతలు ఉండడంతో కరోనా విస్తరణ తగ్గు ముఖం పడుతుందని అందరూ భావిస్తున్నారు. కాని తాజాగా హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్నమూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం (Rain Alert in Telangana) ఉందని తెలిపింది. తేలికపాటి జల్లుల నంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. కోమెరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ప్రభావం ఏర్పడింది.

AP CM Jagan Video Message: కరోనా కాటుకు కుల, మత భేదాలు లేవు, మర్కజ్‌ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదు, ప్రధాని పిలుపును స్వీకరించాలన్న ఏపీ సీఎం

Hazarath Reddy

ఏపీలో రోజు రోజుకు కోవిడ్ 19 కేసులు (COVID-19 Cases In India) పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan) మీడియా ముందుకు వచ్చారు. విపత్కర పరిస్థితిలో సీఎం జగన్ ఏపీ ప్రజలకు వీడియో సందేశాన్ని (CM Jagan Video Message) ఇచ్చారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మర్కజ్‌ ఘటనకు (Delhi Nizamuddin Markaz) మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు (Coronavirus) కుల, మత బేదాలు లేవని సీఎం జగన్‌ చెప్పారు.

Telangana Lockdown: మందుబాబుల చేతి వాటం, వైన్ షాపు పగులకొట్టి మద్యం లూటీకి పాల్పడిన దుండుగులు, హైదరాబాద్‌లో గాంధీనగర్‌లో ఘటన

Hazarath Reddy

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు మద్యం షాప్ లూటీకి పాల్పడ్డారు. షాప్ మూసివేడంతో వెనుక నుంచి రంద్రం చేసి లోపలికి ప్రవేశించారు. వేల రూపాయల విలువైన మద్యం బాటల్స్‌తో (Miscreant loots wine shop) పరారయ్యారు. ఇది సీసీటీవీలో (CCTV) రికార్డయింది. ఈ దుకాణం ప్రభుత్వ గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) ఎదురుగా ఉంది. లాక్డౌన్ కారణంగా మూసివేయబడింది.

COVID-19 in Delhi: కోవిడ్-19లో కీలక మలుపు, పండంటి బాబుకు జన్మనిచ్చిన పాజిటివ్ మహిళ, పుట్టిన బిడ్డకు నో వైరస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఘటన

Hazarath Reddy

దేశంలో రోజురోజుకీ కొత్త కరోనా కేసులు (Coronavirus Cases) నమోదు అవుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. 24 గంటల పాటు కరోనా బాధితుల కోసమే పనిచేస్తున్నారు. అయితే ఢిల్లీలో (Delhi) ఓ ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ 19 పాజిటివ్ ఉన్న మహిళ ( COVID-19 Positive Woman) పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు కరోనా నెగిటివ్ అని తేలింది.

Advertisement

Robotic Nurses in TN: తమిళనాడులో కరోనా కల్లోలం, రోబోలే నర్సులు, కరోనా రోగులకు ఆహారం, మందులు ఇచ్చేందుకు రంగంలోకి దిగిన రోబోలు, 411కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య

Hazarath Reddy

కరోనా రోగుల నుంచి ఆ వ్యాధి మరోకరికి సోకకుండా.. చెన్నైలోని స్టాన్‌లీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి (Stanley hospital) ఓ విభిన్నమైన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వ సహాయంతో ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా (Coronavirus) రోగులకు ఆహారం మరియు మందులు ఇచ్చేందుకు ఈ ఆస్పత్రిలో రోబో నర్సులను (Robot Nurse) రంగంలోకి దించింది.

'Aao Fir Se Diya Jalaye': ప్రధాని మోదీ 9 నిమిషాల మెసేజ్ రహస్యం, అటల్ బిహారీ వాజపేయి కవిత ‘ఆవో ఫిర్ సే దియా జలాయే’ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ప్రధాని

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనావైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నిన్న దేశ ప్రజలకు వీడియో ద్వారా ఓ మెసేజ్ ఇచ్చిన విషయం విదితమే. దేశ ప్రజలంతా ఏప్రిల్ 5 న రాత్రి 9 గంటలకు లైట్లు ఆపి 9 నిమిషాలు పాటు కొవ్వొత్తి వెలిగించాలని దేశానికి విజ్ఞప్తి చేసిన ఒక రోజు తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ తన గురువు, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) వీడియోను ట్విట్టర్‌లో (PM Narendra Modi Tweets) పంచుకున్నారు.

Corona Disinfection Tunnel: ఈ దెబ్బతో కరోనావైరస్ చస్తుంది, తమిళనాడులో సరికొత్త ప్రయోగం, తిర్పూర్‌ జిల్లా మార్కెట్లో కరోనా డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌ ఏర్పాటు, ప్రశంసించిన ఆర్థిక మంత్రి

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) పంజా విసురుతున్న నేపథ్యంలో అది రాకుండా ఉండేందుకు రాష్ట్రాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు (Tamil Nadu) సర్కారు ముందడుగు వేసింది. అక్కడ తిర్పూర్‌ జిల్లాలో (Tamil Nadu’s Tiruppur) మార్కెట్ల ముందు ‘కరోనా డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌’ (Corona Disinfection Tunnel) ఏర్పాటుచేశారు. సుమారు 16 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఈ టన్నెల్‌ నిర్మించారు. దానికి రెండు సెట్ల స్ప్రేయర్లను అమర్చారు.

US Coronavirus Deaths: కరోనా కోరల్లో అమెరికా, రికార్డు స్థాయి మరణాలు, 2.70 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు, మృతదేహాలను భద్రపరిచేందుకు లక్ష సంచులు కావాలని ఫెమా ఆర్డర్

Hazarath Reddy

కరోనా కోరల్లో చిక్కి అగ్రరాజ్యం అమెరికా (United States Coronavirus) అతలాకుతలమవుతున్నది. కాగా కరోనా మరణాల ( Coronavirus) విషయంలో ఇతర దేశాలు అందుకోలేనంత ఎత్తులోకి అమెరికా (America) చేరుకుంది . గురువారం-శుక్రవారం వరకు 24 గంటల సమయంలో ప్రపంచ రికార్డు స్థాయి మరణాలు (Coronavirus Deaths) సంభవించాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ పేర్కొంది.

Advertisement

Fight Against Covid-19: కరోనా కట్టడికి రాష్ట్రాలకు అత్యవసర నిధులు, రూ. 11,092 కోట్ల విడుదలకు హోంశాఖ అమోదం, ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌ కింద తొలి విడత నిధులు విడుదల

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపుతున్న కరోనావైరస్ (Coronavirus pandemic) కట్టడికి కేంద్రం నడుం బిగించింది.ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు అత్యవసర నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (SDRMF) కింద రాష్ట్రాలకు 11,092 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆమోదం (Home Minister Amit Shah) తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌కు తొలి విడత కింద ఈ నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ నిధులను క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు సహా ఇతర వ్యవహారాల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ( PM Modi Video Conference) నిర్వహించారు అనంతరం ఈ నిధులు విడుదల చేయడం గమనార్హం.

CM YS Jagan on COVID-19: ఎవరూ ఆందోళన చెందవద్దు, వైరస్‌ వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకండి, కరోనావైరస్ కట్టడిపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్ (Andhra pradesh in AP) చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీని నియంత్రించేందుకు లాక్ డౌన్ (Lockdown) అమలు చేస్తున్నారు. కాగా కరోనా నియంత్రణ చర్యలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan Press Meet)బుధవారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని తెలిపారు

Religious Congregation in Rajasthan: లాక్‌డౌన్ బేఖాతర్, మరోసారి దర్గాలో కార్యక్రమానికి వందమందికి పైగా హాజరు, ఢిల్లీ ఘటన మరచిపోకముందే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఘటన

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (lockdown) ప్రకటించినా కొందరు మాకెందుకులే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కరోనావైరస్ ( Coronavirus) దేశ వ్యాప్తంగా పంజా విసురుతున్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేసినప్పటికీ కొందరు మత సంబంధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని నిజాముద్ధీన్ ఘటన మరచిపోకముందే మళ్లీ రాజస్థాన్ లో (Religious Congregation in Rajasthan) అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

COVID-19 in Delhi: వైద్యం చేస్తూ చనిపోతే కోటి రూపాయలు, దాతృత్వాన్ని ప్రకటించిన కేజ్రీవాల్ ప్రభుత్వం, జాబితా కిందకు నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు

Hazarath Reddy

ఢిల్లీలో కరోనావైరస్ (COVID-19 in Delhi) జడలు విప్పింది. తాజాగా అక్కడ నిజాముద్దీన్ మర్కజ్ (Nizamuddin Markaz) విషాద ఘటన వెలుగులోకి రావడంతో యావత్ దేశం నివ్వెరపోయింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సర్కారు (Delhi Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ (Coronavirus) సోకిన వారికి వైద్య సహాయం చేస్తూ మరణించిన వారికి కేజ్రీవాల్ ప్రభుత్వం భారీ దాతృత్వాన్ని ప్రకటించింది.

Advertisement

COVID-19 Fake News: వలస కార్మికుల్లో భయాన్ని పోగొట్టండి, కరోనాపై ఖచ్చితమైన సమాచారం కోసం వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయండి, కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

కరోనా వ్యాప్తి (coronavirus Spread)నివారణలో భాగంగా అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోయిన వలసకార్మికులకు ఆహారం, ఆశ్రయం, వైద్యం కల్పించాలని సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, మత పెద్దలతో చర్చించి వారికి ఆశ్రయం కల్పించేలా చూడాలని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ.బాబ్డే (Chief Justice S A Bobde) నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వలసకార్మికుల్లో భయం పోగొట్టేందుకు శిక్షణ పొందిన కౌన్సిలర్లను వారితో మాట్లాడేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది.

LPG Cylinder Price Slashed: ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్, 14.2 కేజీ సిలిండర్‌పై రూ.65 తగ్గింపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

Hazarath Reddy

సబ్సీడియేతర లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) సిలిండర్‌ (14.2 కేజీ) ధరను రూ.65 తగ్గిస్తున్నట్లు (LPG Cylinder Price Drops) ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ ధరలు 55 శాతం మేర పడిపోవడంతో రేట్లు తగ్గించినట్లు ఐఓసీ తెలిపింది. ఈ తగ్గించిన రేట్లు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. దీంతో ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్‌ రూ. 744కి లభించనుంది. గత నెలలో ఇది రూ. 805.5 ఉండగా ఇది ఇప్పుడు రూ. 61.5 రూపాయలు తగ్గింది.

Salaries Defer in AP: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీతాల చెల్లింపు వాయిదా, లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత జీత భత్యాలు చెల్లించే అవకాశం, కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్ (Coronavirus in AP) చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు (Jagan Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీత భత్యాలను ఈ నెలకు ఇవ్వడం లేదని తెలిపింది. వారందరి జీత భత్యాలు చెల్లింపును వాయిదా వేసింది. దీనికి సంబంధించిన జీవోను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan) జారీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో 100 శాతం జీత భత్యాలను వారికి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

Coronavirus Global Report: ప్రపంచాన కరోనా మృత్యుఘోష, ఇటలీలో 50 మంది డాక్టర్లు బలి, 8 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, 37 వేలకు చేరిన మృతులు, కోలుకుంటున్న ఇటలీ

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 37,820 మంది కరోనా (Coronaviru) మహమ్మారికి బలైయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 8 లక్షలకు దగ్గర్లో ఉంది. వైరస్‌ నిర్థారణ అయినవారిలో మంగళవారం ఉదయం నాటికి 1,65,659 మంది కోలుకున్నారు.

Advertisement
Advertisement