Information

Delhi Nizamuddin Markaz: ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం, ఆరుమంది మృతి, క్వారంటైన్‌లోకి 2వేల మంది, మర్కజ్‌ మౌలానాపై కేసు నమోదు, ఆదేశించిన ఢిల్లీ సర్కారు

Hazarath Reddy

ఢిల్లీలో జరిగిన ఓ మత కార్యక్రమం (Delhi Nizamuddin Markaz) దేశంలో ఇప్పుడు కరోనావైరస్ (coronavirus) కల్లోలానికి కారణమైంది. ఆ ప్రార్థనలు దేశంలో ప్రమాద ఘంటికలు మోగించాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ (Delhi Nizamuddin) ప్రాంతంలోని ‘తబ్లిగి ఏ జమాత్‌' మార్చి 1-15 మధ్యలో జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి ఎంతోమంది హాజరయ్యారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వందలమంది ఇందులో పాల్గొన్నారు. కాగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వీరిలో పలువురికి కరోనా వైరస్‌ సోకినట్టు ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.

Donated To Fight Coronavirus: కరోనా అంతు చూస్తామంటున్న కార్పోరేట్, సెలబ్రిటీల నుంచి మినిష్టర్ల దాకా.., పీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీగా విరాళాలు, ఇప్పటివరకు అందిన మొత్తం లిస్టు ఇదే

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) మెల్లిగా విస్తరించుకుంటూ పోతున్న నేపథ్యంలో దాన్ని నియంత్రించేందుకు కార్పోరేట్ (Corporates) ప్రపంచం ముందుకు వచ్చింది. సెలబ్రిటీల నుంచి మినిష్టర్ల దాకా అందరూ దాన్ని అంతు చూసేందుకు రెడీ అయ్యారు. ఇండియాలో సోమవారం సాయంత్రానికి 1071 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అలాగే 34 మంది మరణించారు. భారతదేశం కరోనావైరస్ వ్యాప్తిపై పోరాడుతూనే ఉండటంతో, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు (Business Mans) మరియు రాజకీయ నాయకులతో (Political Leaders)సహా అన్ని వర్గాల ప్రజలు దాని నియంత్రణకు భారీగా విరాళాలు (Donated To Fight Coronavirus) అందిస్తున్నారు. భారతదేశంలో కరోనావైరస్‌పై పోరాటానికి ఇప్పటివరకు విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జాబితాను ఓ సారి చూద్దాం.

WhatsApp Update: వాట్సాప్ స్టేటస్‌లో కీలక మార్పు, ఇకపై వీడియోల నిడివి 15 సెకన్లకే పరిమితం, ఇకపై స్టేటస్ ద్వారా 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే షేర్ చేయలేరు

Hazarath Reddy

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ (WhatsApp) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ (Lockdown) పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో వాట్సాప్ స్టేటస్ లో అప్‌లోడ్ చేసే వీడియోల నిడివిని (Status video) సగానికి కుదించింది. వాట్సాప్ వినియోగంలో వస్తున్న అంతరాయాన్ని నివారించే చర్యల్లో భాగంగా దీన్ని15 సెకన్లకు (15 seconds) పరిమితం చేసింది.

India Lockdown: ఆ వార్తలను నమ్మకండి, 21రోజుల తర్వాత లాక్‌డౌన్‌ పొడిగింపు అంతా పుకారు, కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా వెల్లడి

Hazarath Reddy

కరోనా వైరస్‌ (Coronavirus) నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 21రోజుల లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. లాక్‌డౌన్‌ గడువు పెంచుతారన్న వదంతులు ఒట్టి పుకార్లేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా (Cabinet Secretary Rajiv Gauba) స్పందించారు. దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ 21 రోజులేనని స్పష్టం చేశారు.

Advertisement

Coronavirus Cases in India: మహారాష్ట్రలో చేయి దాటుతున్న పరిస్థితి, 1,071కు చేరుకున్న కరోనా కేసులు, ఒక్కరోజే 8మంది మృతి, దేశ వ్యాప్తంగా 30కి చేరుకున్న కోవిడ్-19 మృతుల సంఖ్య

Hazarath Reddy

భారత దేశంలో కరోనావైరస్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases in India) వెయ్యి మార్కును దాటింది. ఆదివారం 106 కొత్త కేసులు (New Cases) నమోదు కాగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 1,024కు చేరింది. ఒక్కరోజే 8 మంది మరణించగా దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య (COVID 19 Deaths) 29కు పెరిగింది. ఢిల్లీలో (Delhi) ఆదివారం కొత్తగా 23 కేసులు నమోదుకాగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 72కు చేరింది. మహారాష్ట్రలో (Maharashtra) అత్యధికంగా 186, ఆ తర్వాత కేరళలో 182 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

Telangana Lockdown: ఏప్రిల్ 15 తర్వాత కూడా తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తేసే ఛాన్స్ లేదు, ఇది ఎంత దూరం పోతుందో తెలియదు, అందరూ కదిలిరావాలి, పిలుపునిచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్

Hazarath Reddy

కోవిడ్-19 (COVID-19) నియంత్రణకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి విదితమే. ఇది ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇది తెలంగాణలో (Telangana Lockdown) ఆ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) స్పష్టం చేశారు. మనది చాలా పెద్ద దేశమని అంతా మంచిగా ఉన్న సమయంలో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందితే పరిస్థితి ఏంటని అన్నారు.

Free Ration Distribution in AP: ఏపీలో ఉచితంగా రేషన్ సరుకులు, నెల సరుకులను ముందుగానే పంపిణీ చేస్తున్న ఏపీ సర్కారు, మార్చి 29 నుంచి ఏప్రిల్‌ చివరిలోగా 3సార్లు ఇవ్వాలని నిర్ణయం

Hazarath Reddy

కరోనావైరస్ (Covid 19 outbreak) దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) అమలవుతోంది. దేశంలోని దాదాపు అన్నీ రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ ( coronavirus lockdown) అమలు అవుతున్న నేపథ్యంలో సామాన్యులు నిత్యావసర సరుకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు (Andhra Pradesh government) కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకులను అందరికీ ఉచితంగా (Free Ration Distribution in AP) అందిస్తోంది.

Coronavirus Lockdown: వలస కూలీలను ఎక్కడికక్కడే ఆపేయండి, లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు, వెల్లడించిన కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు

Hazarath Reddy

కరోనావైరస్‌పై పోరుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ (India Lockdown) ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు (Centre orders) జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు (migrant workers) ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది.ఇందులో భాగంగా లాక్‌డౌన్‌ను (coronavirus lockdown) పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఈమేరకు వెల్లడించారు.

Advertisement

CM KCR Press Meet: ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా సమస్య ఉండదు, కొత్త కేసులు నమోదు కాకుంటే జరిగేది అదే, తెలంగాణలో 70కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య, మీడియతో సీఎం కేసీఆర్

Hazarath Reddy

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases) 70కి చేరిందని, మరో 11 మంది కూడా చికిత్స తీసుకుని కోలుకున్నారని తెలిపారు. మన దగ్గర చికిత్స తీసుకుని కోలుకున్న వ్యక్తితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. గాంధీ వైద్యులు అందించిన ధైర్యంతోనే కోలుకున్నానని కోలుకున్న వ్యక్తి చెప్పాడు. మిగిలిన 58 మందిలో కూడా పరీక్షలు నిర్వహించి తగ్గినవారిని క్రమంగా పంపిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

COVID-19 Death Toll In India: ఇండియాలో 29కు చేరిన మృతులు, 24 గంటల్లో 106 కొత్త కేసులు, పాజిటివ్‌ కేసులు సంఖ్య 979, కోవిడ్‌-19పై హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

Hazarath Reddy

ఇండియాలో చాపకింద నీరులా కరోనా (Coronavirus) విస్తరిస్తోంది. రోజు రొజుకు దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో (India) 979 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కొత్తగా106 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..ఆరుగురు మరణించారని వెల్లడించింది. దీంతో కోవిడ్‌-19 కారణంగాంఖ ఇప్పటి వరకు దేశంలో మృతిచెందిన వారిసంఖ్య 29కు (COVID-19 Death Toll In India) చేరింది. తాజాగా కోవిడ్‌-19పై (COVID-19) కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది.

Kerala Lockdown: మందు లేక 5మంది ఆత్మహత్య, కేరళ సర్కారు కీలక నిర్ణయం, ఇకపై మద్యం అందించాలని ఎక్సైజ్ విభాగానికి ఆదేశాలు జారీ చేసిన కేరళ సీఎం పినరయి విజయన్

Hazarath Reddy

కరోనా వైరస్‌ ( Coronavirus) వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ( Lockdown) అమలవుతోంది. ఇక అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు, బార్లను మూసివేశారు. కేరళలో అయితే గత రెండు రోజుల నుంచి మద్యం షాపులు మూసివేయడంతో.. మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. కేరళలో (Kerala) మద్యం (alcoholics) దొరక్కపోవడంతో త్రిసూర్‌ జిల్లాకు చెందిన సనోజ్‌(35) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 5 మంది మందు దొరక్క ఆత్మహత్య చేసుకోవడంతో కేరళ సర్కారు అలర్ట్ అయింది.

Coronavirus in US: అమెరికాలో కరోనా మృత్యు ఘోష, నెలల పసికందును మింగేసిన కోవిడ్-19, లక్షా 21 వేలకు పైగా కరోనా కేసులు, రెండు వేలు దాటిన మృతులు సంఖ్య

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికా (America) కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఆ దేశంలో కరోనా (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అమెరికాలో కోవిడ్ 19కు (COVID 19) ఓ ముక్కుపచ్చలరారని చిన్నారి బలైంది. చికాగోకు చెందిన నెలల పసికందు కోవిడ్‌-19 బారినపడి ప్రాణాలు విడిచిందని ఇల్లినాయిస్‌ ఆరోగ్యశాఖ (ఐడీపీహెచ్‌) శనివారం వెల్లడించింది.

Advertisement

COVID-19 in Spain: కరోనా కాటుకు బలైన స్పెయిన్‌ రాణి, పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మారియా థెరీసా, స్పెయిన్‌లో 73 వేలకు చేరిన కరోనా కేసులు

Hazarath Reddy

కరోనా మహమ్మారి కరోనాకు (COVID 19) స్పెయిన్‌ రాణి మారియా థెరీసా (Princess Maria Teresa) బలయ్యారు. ఆమె వయసు 86 ఏళ్లు. ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన యువరాణి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా స్పెయిన్‌ రాజు ఫెలిప్‌-6కు సోదరి. 1933 జులై 28 న ఆమె జన్మించారు. ఫ్రాన్స్‌లో చదువుకున్న మారియా సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి ‘రెడ్‌ ప్రిన్సెస్‌’గా పేరు సంపాదించారు.

Coronavirus Hits Paramilitary Forces: భారత రక్షణ దళాలను తాకిన కరోనావైరస్, బీఎస్ఎఫ్ అధికారికి కోవిడ్ 19, క్వారంటైన్‌లో పలువురు బీఎస్ఎఫ్ అధికారులు,వారి కుటుంబసభ్యులు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, ఉగ్రవాదుల నుండి రక్షణ బలగాల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా ఈ వైరస్ భారత రక్షణ బలగాలను (Coronavirus Hits Paramilitary Forces in India) తాకింది. పారామిలిటరీ ఫోర్స్ లో పనిచేస్తున్న బీఎస్ఎఫ్ అధికారికి (BSF Officer) కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

Coronavirus pandemic: కరోనాను ఇండియా నుంచి తరిమికొడదాం, రూ.1500 కోట్ల విరాళం ప్రకటించిన టాటా గ్రూపు, తక్షణమే స్పందించాల్సిన సమయమిది, ట్విట్టర్లో రతన్ టాటా ట్వీట్

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తూ.. ప్రజలకు నిద్రలేని రాత్రులను చూపిస్తున్న కరోనావైరస్ మహమ్మారిపై (Coronavirus pandemic) యుద్ధానికి టాటా గ్రూప్‌ (Tata Trusts) శనివారం భారీ విరాళం ప్రకటించింది. తొలుత రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించిన టాటా ట్రస్టు, అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని అందిస్తున్నట్లు ‘టాటా సన్స్‌’ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ (N CHANDRASEKARAN) ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్‌ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది.

AP DGP Damodar Goutam Sawang: మాకు కుటుంబం ఉంది, సెలవులు లేకుండా మీకోసం కష్టపడుతున్నాం, కరోనాని ఏపీ నుండి తరిమికొట్టడానికి అందరూ సహకరించాలి, మీడియాతో గౌతం సవాంగ్

Hazarath Reddy

కరోనా వైరస్ (COVID-19) ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ (AP DGP Goutam Sawang) పిలుపునిచ్చారు. ఏపీలో లాక్ డౌన్‌ను (AP Lockdown) పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.పోలీసులు మీ సేఫ్టీ కోసమే పనిచేస్తున్నారు. ప్రతి పోలీస్‌కూ కుటుంబం ఉంటుందని, కానీ రాత్రింబవళ్లు సెలవులు కూడా లేకుండా వారు ప్రజల కోసం కష్టపడుతున్నారని తెలిపారు.

Advertisement

COVID-19 Deaths in India: కేరళను కాటేసిన కరోనావైరస్, తొలి మరణం నమోదు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 69 ఏళ్ల వృద్ధుడు మృతి, ఇండియాలో 20కి చేరిన మృతులు

Hazarath Reddy

కేరళ రాష్ట్రంలో తొలి కరోనా మరణం (First Coronavirus Death in Kerala) నమోదైంది. వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వ్యక్తి కొచ్చి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృత్యువాత పడ్డాడు. దుబాయ్‌నుంచి ఇండియాకు వచ్చిన సదరు వ్యక్తి ఈనెల 22న నిమోనియా లక్షణాలతో కొచ్చిలోని కాలమస్సేరి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేరాడు. అతడి ఆరోగ్య పరిస్థితి అదుపు తప్పటంతో వెంటిలేటర్‌పై ఉంచారు వైద్యులు.

Operation Namaste: కరోనాపై ఆర్మీ ‘ఆపరేషన్ నమస్తే’ వార్, ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ చీఫ్, 13 లక్షల మంది సైనికులను, కుటుంబాలను కాపాడటమే లక్ష్యమన్న మనోజ్ ముకుంద్ నరవణే

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) చాపకింద నీరులా మెల్లిగా విస్తరిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు ఇళ్లలోనుంచి ఎవరూ బయటకు రావద్దని ప్రధానమంత్రి మోడీ (PM Modi) లాక్ డౌన్ విధించారు. అన్ని రాష్ట్రాలు ఈ లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అయితే ఆర్మీలో (Indian Army) పనిచేస్తున్న వారి పరిస్థితి ఏంటి.. వారికి రక్షణ ఎలా అనే సందేహం అందరికీ రావచ్చు. ఈ నేపథ్యంలో ఆర్మీ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్మీ చీఫ్ ప్రారంభించారు.

Infosys Software Engineer Arrest: కరోనాపై చెత్త పోస్ట్, జైలుపాలయిన ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగి, ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం, బెంగుళూరులో ఘటన

Hazarath Reddy

ఒకవైపు ప్రపంచమంతా కరోనా (Coronavirus) కల్లోలంతో భయకంపితులవుతోంది. మరీ ముఖ్యంగా శరవేగంగా పెరుగుతున్నకరోనా(COVID-19) పాజిటివ్ కేసులతో కర్ణాటక రాష్ట్రం అల్లకల్లోలమవుతోంది. ఈనేపథ్యంలో అక్కడ కరోనాను విస్తరింపజేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కటకటాలను (Infosys Software Engineer Arrest) లెక్కిస్తున్నాడు. అంతేకాదు ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు.

Covid-19 'Methanol Rumours': ఇది తాగితే కరోనావైరస్ చస్తుంది, ఇరాన్‌లో షికార్లు చేస్తున్న పుకార్లు, మెథనాల్‌ తాగి 400 మంది మృతి, 1000 మందికి పైగా అనారోగ్యం, వదంతులు నమ్మవద్దంటున్న వైద్యులు

Hazarath Reddy

ఇరాన్ లో కరోనావైరస్ కి విరుగుడు ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు (Fake News Turns Fatal) కొడుతోంది. మెథనాల్‌ తాగితే (Drinking Methanol) కరోనాని అరికట్టవచ్చని అక్కడ ఫేక్ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కరోనాకు విరుగుడుగా ఇక్కడి ప్రజలు ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ను సేవిస్తుండటంతో పరిస్థితి విషమిస్తోంది. మెథనాల్‌ ను తాగడంతో ఈనాటివరకు ఇరాన్‌లో 400 మంది మరణించారు.

Advertisement
Advertisement