సమాచారం

Jio Work From Home Pack: జియో నుంచి కొత్త ప్లాన్, రోజుకు 2జీబీ డేటా, 10 శాతం పెరిగిన ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌, డేటాను అనూహ్య డిమాండ్

Hazarath Reddy

కరోనా వైరస్ (Coronavirus) దేశ వ్యాప్తంగా పంజా విసురుతున్న తరుణంలో ప్రైవేటు సంస్థలే కాదు ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని (COVDI-19) నివారించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) సరికొత్త ప్లాన్ తో వచ్చింది. దీనిపేరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ (Jio Work From Home Pack).

Coronavirus in India: ఇండియాలో మరొక కరోనా పేషెంట్ మృతి, ఇప్పటివరకు 5 మంది మృతి, 324 పాజిటివ్ కేసులు, మూడవదశ వైపు మహారాష్ట్ర, గుజరాత్‌లో 13 కరోనా పాజిటివ్ కేసులు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కోరలు చాస్తోంది. చైనా నుంచి పాకిన ఈ వైరస్ దెబ్బకు వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భారతదేశంలో ఈ మహమ్మారి భయకంపితులను చేస్తోంది. రోజు రోజుకు కేసులు అధికమౌతున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ తో 5 మృతి చెందారు. కాగా 2020, మార్చి 22వ తేదీ ఆదివారం నాటికి 324 మంది కరోనా (Coronavirus in India) రాకాసి బారిన పడ్డారు. భారత ఆరోగ్య పరిశోధన మండలి (ICMR) పాజిటివ్ వివరాలను ప్రకటించింది.

Janata Curfew in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో సర్వం బంద్, సరిహద్దులు మూసివేత, నిర్మానుష్యంగా మారిన రోడ్లు, ప్రధాని పిలుపుతో ఇంటికే పరిమితమైన ప్రజలు

Hazarath Reddy

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Modi) ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూకు (Janata Curfew In Telugu States) రంగం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం స్తంభించిపోయింది. దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ఇదే కావడం గమనార్హం. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతావని కరోనాపై జరుపుతున్న సమరంలో అన్ని రాష్ట్రాలూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి.

Janata Curfew: జనతా కర్ఫ్యూ, నేడు దేశ వ్యాప్తంగా రైళ్లు, బస్సులు అన్నీ బంద్, సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో మారుమోగాలి, రాత్రి 9 వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రధాని పిలుపు

Hazarath Reddy

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ (COVID-19) రాజ్యమేలుతోంది. దీని వల్ల వేల మంది మరణించగా.. లక్షలాది మంది బాధితులుగా మారుతున్నారు. దీంతో దీన్ని నివారించేందుకు ప్రధాని మోదీ (PM Modi) దేశవ్యాప్తంగా నేడు జనతా కర్ఫ్యూ (PM Modi Janata Curfew) పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూకి (Janata Curfew) సిద్ధమయ్యారు.

Advertisement

COVID-19 Cases in India: ఇండియాలో 271కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు, నలుగురు మృతి, ప్రకటన విడుదల చేసిన ఐసీఎంఆర్‌, పాజిటివ్ కేసుల్లో 39 మంది విదేశీయులే

Hazarath Reddy

ఇండియాలో (India) కరోనావైరస్ రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases In India) 271కు చేరాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) ప్రకటన చేసింది. కరోనా కారణంగా ఇప్పటివరకు దేశంలో మొత్తం నలుగురు మృతి చెందారని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

Janata Curfew: దేశ వ్యాప్తంగా నిలిచిపోనున్న 3700 రైళ్లు, జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ రైల్వే, ఆదివారం అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపు

Hazarath Reddy

ప్రధాని మోదీ రేపు జనతా కర్ఫ్యూకి (PM Modi Janata Curfew) పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు దేశ వ్యాప్తంగా రైళ్లు నిలిచిపోనున్నాయి. కాగా హైదరాబాద్‌లో (Hyderabad) ఎంఎంటీఎస్‌ రైళ్లు (MMTS Trains) రెండు మూడింటిని అవసరాన్ని బట్టి నడిపించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ఆదివారం ఉదయం 7 గంటలకు ముందే ప్రయాణం ప్రారంభించిన దూరప్రాంత రైళ్లు (Trains) మాత్రం యథావిధిగా గమ్యం వైపు వెళ్లనున్నాయి.

COVID-19 Deaths In Italy: ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం, ఒక్కరోజే 627 మంది కరోనాకు బలి, చైనాను అధిగమించిన ఇటలీ

Hazarath Reddy

చైనాలో (China) పుట్టి ఆ దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ (Coronavirus) ప్రపంచదేశాలను నిర్భంధంలోకి నెట్టివేసింది.చైనాలో 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి 3,248 మంది చనిపోయారు. అయితే ఇప్పుడు ఇటలీ (Italy) కరోనా దెబ్బకు చావు అంచుల్లోకి వెళ్లింది. ఆ దేశంలో చావులు (COVID-19 Deaths In Italy) చైనాను మించిపోయాయి. ఇటలీలో 41,035 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 3,405 మంది మరణించారు. దీంతో కరోనా మృతులలో చైనాకు ఉన్న రికార్డును ఇటలీ సొంతం చేసుకుంది. ఈ వివరాలను ఆ దేశ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

Coronavirus Outbreak in India: కనికా కపూర్‌కు కరోనా, కరోనా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకున్న ఎంపీలు, అన్ని పర్యటనలను రద్దు చేసుకున్న రాష్ట్రపతి, ఇండియాలో 236 మార్క్‌ని దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య భారతదేశంలో (India) రోజు రోజుకు పెరుగుదలను నమోదు చేసుకుంటూ వెళుతోంది. ఇప్పటివరకు అత్యధిక సింగిల్-డే రికార్డు నమోదైంది. వైరస్ సోకిన రోగుల సంఖ్య శుక్రవారం 200 మార్కును దాటింది, ఈ నివేదిక ప్రచురించే సమయానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) 236 గా నిర్ధారించబడింది.

Advertisement

APPSC Revises Exam Schedules: ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పు, ఏప్రిల్ నుంచి మే నెలకు వాయిదా, సవరించిన పరీక్షల తేదీల వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కొన్ని పోస్టుల నియామకాలకు సంబంధించిన ప్రధాన పరీక్ష తేదీలను (APPSC Revises Exam Schedules) సవరించింది. కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ అంజనేయులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మార్చి 21 , 22వ తేదీ జరగాల్సిన డిగ్రీ కళాశాల లెక్చరర్ల పోస్టుకు నియామకం కోసం జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 3 మరియు 4 తేదీకి సవరించారు. ఈనెల 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది.

Reserve Bank of India: కరోనా కల్లోలం, కీలక నిర్ణయం తీసుకున్న ఆర్‌బిఐ, ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ ద్వారా రూ. 10 వేల కోట్ల ప్రభుత్వ బాండ్ల కొనుగోలు, మార్చి 20న ప్రారంభం

Hazarath Reddy

దేశంలో కరోనా (Covid-19) కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ధాటికి (coronavirus outbreak) ప్రపంచ ఆర్థికవృద్ధి అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో దాని ప్రభావం ఇండియా మీద తీవ్ర స్థాయిలో ఉంది. ఇండియాలో ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు ఆర్‌బిఐ తగు చర్యలు చేపట్టింది.

Andhra Pradesh: ఏపీలో అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేత, పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయి, కరోనా నియంత్రకు గట్టి చర్యలు తీసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (CoronaVirus) పంజా విసురుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో (Andhra Pradesh) రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లకు ఏపీ ప్రభుత్వం సెలవు (Schools and Colleges Closed in AP) ప్రకటించింది.దేశ వ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తాజగా ఏపీ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

COVID-19 Outbreak in India: ఇండియాలో కరోనా కల్లోలం, 147 కేసులు నమోదు, ముగ్గురు మృతి, అత్యధికంగా మహారాష్ట్రలో 41 కేసులు నమోదు, విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు

Hazarath Reddy

దేశంలో కరోనా (COVID-19) కేసుల సంఖ్య 147కు.. ఆ వైరస్‌ కారణంగా చనిపోయినవారి సంఖ్య 3కు చేరింది. తెలంగాణలో ఐదో పాజిటివ్‌ కేసు నమోదైంది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. కరోనా భారీన పడిన వారిలో (COVID-19 Outbreak in India) 122 మంది భారతీయులు కాగా, 25 మంది విదేశీయులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ర్టలో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

CoronaVirus Health Bulletin: 14 రోజులు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే 104కి కాల్ చేయండి, భయపడాల్సిన అవసరం లేదు: రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి

Hazarath Reddy

కోవిడ్‌-19 వైరస్‌ (COVID-19) నియంత్రణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ నిరంతరం సమీక్షిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి (Dr. KS Jawahar Reddy) అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడూతూ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. కరోనా వ్యాప్తిని (CoronaVirus) అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు.

Taj Mahal Shut Down: చరిత్రలో మూడోసారి, తాజ్‌ మహల్‌ సందర్శన నిలిపివేత, ఈ నెల 31 వరకు మహారాష్ట్రలోని షిరిడి, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం మూసివేత

Hazarath Reddy

దేశంలో కరోనా వైరస్ (Coronavirus Outbreak) పడగవిప్పి బుసలు కొడుతోంది. కోవిడ్ 19 వైరస్‌ (COVID-19) రోజు రొజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. భారత్‌లో ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య (coronavirus cases in India) 130కి చేరింది. మూడు మరణాలు కూడా నమోదయ్యాయి.

Railway Platform Ticket Price Hike: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్, ఫ్లాట్ ఫాం టికెట్ ధరలు 50 శాతం పెరిగాయి, కరోనా వ్యాప్తి నివారణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం, దేశంలో మూడో కరోనా వైరస్ మరణం నమోదు

Hazarath Reddy

కరోనా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చుతోంది. ఇండియాలో (India) ఇది మరింత ఆందోళనను రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే (IRCTC) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రైల్వే స్టేషన్లలో జనాభా ఉండకుండా ఉండేందుకు ఫ్లాట్ ఫాం ధరలను పెంచింది. సాధారణంగా పండుగల సమయంలో రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను (Railway platform ticket) రైల్వే శాఖ పెంచుతుంది. తాజాగా కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తి నివారణకు రూ.10 ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరను 50 రూపాయలకు పెంచుతున్నట్లు (Railway Platform Ticket Price Hike) ప్రకటించింది. మొత్తం 250 రైల్వే స్టేషన్లలో టికెట్ల ధర పెంపు వర్తిస్తుందని పేర్కొంది.

SBI Alert Message: యూజర్లకు ఎస్‌బీఐ అలర్ట్ మెసేజ్, బ్యాంకులకు ఎవరూ రావొద్దు, ఇంటి దగ్గర నుంచే డిజిటల్ యాప్ ద్వారా సేవలు వినియోగించుకోండి, కరోనా నుంచి కాపాడుకోండి

Hazarath Reddy

కరోనా (coronavirus) ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా వైరస్ దెబ్బకి ( coronavirus Outbreak) వణికిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 7వేలకు పైగా చేరింది. మన దేశంలో కరోనా కేసులు 125కు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన సందేశం పంపింది. ఈ సందేశం ప్రకారం బ్యాంకులకు ఎవరూ రావద్దని కోరింది. డిజిటల్ సేవలు (SBI digital channels) వినియోగించుకోవాలని తెలిపింది.

Advertisement

Coronavirus Treatment: కరోనా కట్టడిలో కీలకమలుపు, కరోనా సోకిన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై విజయం సాధించిన ఆస్ట్రేలియా పరిశోధకులు, కరోనా బారిన పడిన మహిళపై పరిశోధన

Hazarath Reddy

కరోనాపై (Coronavirus) పరిశోధనలో శాస్ర్తవేత్తలు ఓ అడుగు ముందుకేశారు. కరోనా వైరస్ (Coronavirus Patient) సోకిన వ్యక్తిలోని రోగ నిరోధక శక్తి ఎలా స్పందిస్తుంది అనే అంశంపై ఆస్ట్రేలియా పరిశోధకులు (Australian researchers) విజయం సాధించారు. ఇదే వ్యాధిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దిశగా కీలక ముందడుగు పడిందని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు.

Shirdi Temple Closed Down: కరోనా దెబ్బ, షిర్డీ ఆలయం మూసివేత, నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి అమల్లోకి, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు భక్తులకు సాయి దర్శనం ఉండదు

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (coronavirus outbreak) మహమ్మారి ప్రభావం ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ (Shirdi) పైనా పడింది. కరోనా వైరస్ ప్రభావంతో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీ సాయిబాబా ఆలయంలోకి భక్తులను అనుమతించొద్దని (Shirdi Saibaba Temple to Shut) నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

Cement prices Drop in AP: శుభవార్త..ఏపీలో తగ్గిన సిమెంట్ ధరలు, పీపీసీ బస్తా ధర రూ.225, ఓపీసీ సిమెంటు బస్తా ధర రూ.235, ప్రకటించిన సిమెంట్ కంపెనీల యాజమాన్యం

Hazarath Reddy

ఏపీ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త లాంటిదే. ప్రభుత్వ పనులు, పేదలకు ఇళ్ల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులకు సిమెంటు ధరలను తగ్గిస్తున్నట్లు (Reduction In Cement Prices) సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) సోమవారమిక్కడ ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు.

Rs 2,000 Bank Notes: రూ.2 వేల నోటు రద్దుపై స్పష్టత, ఈ నోట్ల ముద్రణ నిలిపివేతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, లోక్‌సభలో వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌

Hazarath Reddy

గత కొంతకాలంగా రెండు వేల రూపాయల నోటు (Rs 2,000 Bank Note) బ్యాన్ అవుతోందని సోషల్ మీడియాలో (Social Media) వార్తలు వస్తున్నాయి. ఆర్ బిఐ రూ. 2 వేల నోటు ప్రింటింగ్ ఆపేస్తుందనే రూమర్లు కూడా వచ్చాయి. దీనిపై కేంద్రం (Central Govt) పార్లమెంట్ వేదికగా స్పష్టతనిచ్చింది. రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement