సమాచారం

Bank Strike On Jan 8: ఈ నెల 8న బ్యాంకులు, ఏటీఎంలు అన్నీ బంద్, ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా నేషనల్ బంద్ నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, 8వ తేదీ ఎవరూ విధులకు హాజరు కావద్దని ఉద్యోగులకు తేల్చి చెప్పిన బ్యాంకు యూనియన్లు

Hazarath Reddy

నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదో ఒక ప్రభుత్వ శాఖ వారు వారి సమస్యలను పరిష్కరించాలని సమ్మెలు, బంద్ లు నిర్వహించారు. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు కూడా అదే బాటలోకి వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వం(Central GOVT) అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంక్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Virat Kohli-T20 World Record: ప్రపంచ రికార్డుకు పరుగు దూరంలో కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్, శ్రీలంకతో మూడు టీ20ల సీరిస్‌కు సిద్ధమైన భారత్, ఈ ఏడాది ఆరంభంలో తొలి సీరిస్ ఇదే

Hazarath Reddy

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు(sri lanka Vs india T20I series) టీమిండియా సిద్ధమైంది. ఆదివారం శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను, మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ ఏడాది ఆరంభపు సిరీస్‌లో కూడా సత్తాచాటి శుభారంభం చేయాలనుకుంటోంది.

AP Disha Police Station: ఏపీలో ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్, జిల్లాకు ఒక దిశ ప్రత్యేక కోర్టు, ఈనెల 7 నుంచి దిశ యాప్‌ అందుబాటులోకి, నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా చట్టం, రాష్ట్రపతి ఆమోదం కోసం వెయిటింగ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh GOVT) ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ చట్టం (Disha Act) ఏపీలో (AP)త్వరలో అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్‌స్టేషన్‌ను(Disha Police Station) ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దిశ చట్టం అమలులో భాగంగా కాకినాడ నగరంలో(Kakinada) దిశ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు.

Telangana Municipal Elections: మూడేళ్లకే ఓటు హక్కు, బిత్తరపోయిన తల్లిదండ్రులు, కరీంనగర్ జిల్లా ఓటరు జాబితాలో పేరు, వెంటనే తొలగించాలని కోరిన పాప తండ్రి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓటరు ఐడి కార్డు

Hazarath Reddy

సాధారణంగా భారత దేశంలో (India)ఓటు హక్కు పొందాలంటే 18ఏళ్లు నిండాలన్న నిబంధనలు ఉన్నాయి. అయితే తెలంగాణాలో (Telangana) కరీంనగర్ జిల్లాలో (karimnagar) మాత్రం ఇది రివర్స్ అయింది. కేవలం మూడేళ్లకే ఓ చిన్నారికి ఓటు హక్కు వచ్చింది. తెలంగాణాలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Telangana Muncipal Elections)ఉన్న నేపథ్యంలో అధికారులు విడుదల చేసిన ఓటరు ముసాయిదా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరీంనగర్‌ నగరపాలకసంస్థ పరిధిలోని ఓ మూడేళ్ల చిన్నారిని ఓటరు ముసాయిదాలో చేర్చారు.

Advertisement

Anantapur School Bus Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం, జోగ్ జలపాతం వద్ద లోయలో పడిన అనంతపురం జిల్లా స్కూల్ బస్సు, విద్యార్థి మృతి, 46 మందికి గాయాలు, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్, తక్షణమే సహాయక చర్యలు అందించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

అనంతపురం జిల్లా కదిరి (Kadiri) నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలో ప్రమాదానికి (Kadiri School Bus Accident) గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్‌ జలపాతం(Jog Falls) వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి.

Amma Vodi: జనవరి 9 నుంచి అమ్మఒడి, లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒకేసారి రూ.15 వేలు, 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించిన ప్రభుత్వం, అమ్మఒడికి మొత్తం రూ.6400 కోట్లు కేటాయింపు, వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

Hazarath Reddy

అమ్మఒడి పథకం (Amma Vodi Scheme)లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌(AP Education Minister Suresh) తెలిపారు. అన్ని గ్రామాలు,పాఠశాలల్లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలు పెట్టామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు.

Maharashtra Farmer Suicides: 300 మంది రైతుల ఆత్మహత్యలు, మహారాష్ట్రలో అధికార కుమ్ములాటకు బలైన కర్షకులెందరో..,ఒక్క నవంబర్ నెలలోనే జరిగిన విషాద ఘటన ఇది, దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించిన రెవిన్యూ శాఖ

Hazarath Reddy

మహారాష్ట్రలో (Maharashtra) జరిగిన అధికారిక కుమ్ములాటలో 300 మంది రైతులు ఆత్మహత్యలు(Maharashtra farmer suicides) చేసుకున్నారు. గతేడాది నవంబర్ నెలలో(November) సీఎం పీఠం కోసం నాయకులు (Fight For Cm Seat)) కొట్టుకుంటూ రైతుల సమస్యలను గాలికొదిలేసారు. అకాల వర్షాలతో పంటంతా నేలపాలవ్వడంతో రైతులు (farmers) రోడ్డెక్కారు. చేసిన అప్పులు ఎక్కువ కావడం, చేతికి అందిన పంటను అకాల వర్షాలు నాశనం చేయడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు.

Hyderabad Rains: రాజధానిలో అకాల వర్షాలు, 1992 తర్వాత మళ్లీ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు,మరో 2 రోజుల పాటు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తనున్న వానలు, ఏపీకి భారీ వర్ష సూచన

Hazarath Reddy

కొత్త సంవత్సరం అడుగుపెడుతూనే హైదరాబాద్లో (Hyderabad)ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు..వానలు.. మూడురోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబరు వరకు చలిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వర్షాకాలాన్ని తలపిస్తోంది. గురువారం మధ్యాహ్నం నగరంలో 14 మి.మీ వర్షపాతం నమోదైంది.

Advertisement

WhatsApp Tricks: వాట్సప్ వెబ్‌లో ఈ ట్రిక్స్ ప్రయత్నించారా..?, రెండు అకౌంట్లను ఎలా రన్ చేయవచ్చు..,వీడియోలు నేరుగా ఎలా చూడవచ్చు..,ఎమోజీలకు షార్ట్ కట్ ఏంటీ..,మరిన్ని వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ (WhatsApp) ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది. 2015లో వెబ్-ఫ్రెండ్లీ వెర్షన్ యాప్ (WhatsApp Web) ప్రవేశపెట్టిన సంగతి విదితమే. మొబైల్ వెర్షన్ మాదిరిగానే డెస్క్ టాప్ యూజర్ల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Helpline Number 139: ఇక నుంచి రైల్వేలో అన్నింటికి ఒకటే నెంబర్! ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబర్‌ '139' ను ప్రారంభించిన రైల్వేశాఖ, అన్ని రకాల సేవలు మరియు విచారణలు ఇదే హెల్ప్‌లైన్ నంబర్‌‌కు అనుసంధానం

Vikas Manda

రైల్వేలో ఇదివరకే ఉన్న అనేక రైల్వే హెల్ప్‌లైన్‌ నెంబర్లను అన్నింటినీ (182 మినహా) 139 కే అనుసంధానం చేశామని, కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో ఏదైనా ఇబ్బంది లేదా సమస్య తలెత్తితే ఫిర్యాదు చేయడంగానీ, మరేదైనా విచారణల కోసం ఇక నుంచి 139....

Manoj Mukund Naravane: ఎవరీ నూతన సైన్యాధిపతి మనోజ్‌ ముకుంద్‌?, ఆర్మీ చీఫ్ కాకముందు ఆయన ఏం విధులు నిర్వర్తించారు, సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో ఆయన పాత్ర ఏంటీ ? కొత్త ఆర్మీ చీఫ్‌పై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

భారత ఆర్మీకి నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే మంగళవారం డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు. బిపిన్‌ రావత్‌ (General Bipin Rawat)స్థానంలో సైన్యాధిపతిగా జనరల్‌ నరవణే బాధ్యతలు(Lieutenant General Manoj Mukund Naravane) స్వీకరించారు. ఆర్మీ చీఫ్‌గా(Chief of Army Staff) బాధ్యతలు స్వీకరించిన నరవణే.. 28వ సైన్యాధిపతిగా నిలిచారు.

PAN-Aadhaar Linking: భయపడకండి, పాన్-ఆధార్ లింక్ గడువును కేంద్రం పొడిగించింది, 2020 మార్చి 30 లోపు ఎప్పుడైనా మీరు లింక్ చేసుకోవచ్చని తెలిపిన ఆదాయపు పన్ను శాఖ

Hazarath Reddy

ఆధార్‌తో పాన్‌ కార్డు లింక్ (PAN-Aadhaar Linking) చేయలేదని భయపడుతున్నారా.. ఇకపై ఆ భయం అవసరం లేదు. ఆధార్‌తో (Aadhaar)పాన్‌ (PAN)వివరాలను లింక్‌ చేయని వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్స్ (సీబీడీటీ)(Central Board of Direct Taxes)శుభవార్త అందించింది. పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. నేటితో ముగియనున్న గడువును మరో మూడు నెలల పాటు పొడిగించింది.

Advertisement

Telugu Doctors Missing In Delhi: ఢిల్లీలో మిస్సింగ్ కలకలం, ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం, 6 రోజులైనా దొరకని ఆచూకి, పోలీసులకు కంప్లయింట్ చేసిన సమీప బంధువు, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఇంకా క్లూ కూడా చిక్కని వైనం

Hazarath Reddy

ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల అదృశ్యం(Telugu Doctors Missing) కలకలం రేపుతోంది. వైఎస్సార్‌ జిల్లా (YSR Kadapa) ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్‌ హిమబిందు, ఆమె స్నేహితుడు, అనంతపురం జిల్లా (Ananthapuram) హిందూపురానికి చెందిన డాక్టర్‌ దిలీప్‌ సత్య డిసెంబర్‌ 25 నుంచి కనిపించకుండా పోయారు. హిమబిందు భర్త డాక్టర్‌ శ్రీధర్‌ అదేరోజు ఢిల్లీలోని హాజ్‌కాస్‌ పోలీస్‌స్టేషన్‌లో (Hauz Khas police station) ఫిర్యాదు చేశాడు.

Fire At PM Modi Residential Area: ప్రధాని నివాసం సమీపంలో మంటలు, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమన్న ప్రధాని కార్యాలయం, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది

Hazarath Reddy

ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) నివాసం సమీపంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. లోక్‌ కళ్యాణ్ మార్గ్‌లోని(7 Lok Kalyan Marg) ప్రధాని నివాసం సమీపంలోని ఎస్పీజీ రిసెప్షన్( SPG reception area) ప్రాంతంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది… ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో 9 ఫైరింజన్లు(Nine fire tenders) సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

New Year's Eve 2019: నూతన సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధం, స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్న ప్రపంచం, తొలిసారి స్వాగతం చెప్పే దేశం కిరిబాటి ద్వీపం, చివరిగా స్వాగతం చెప్పే దేశం బేకర్ ద్వీపం

Hazarath Reddy

ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్..(Search engine giant Google) ప్రతిరోజూ ఏదో ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేస్తూ వుంటుంది. విలక్షణమయిన డూడుల్ (Doodle) రూపొందిస్తూ వుంటుంది. గతంలో అనేక సందర్భాల్లో నేతలు, వివిధ వీఐపీలు, సాంస్కృతిక వేత్తల జయంతులు, వర్థంతులను డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేస్తుంటుంది.

AP Entrance Exam Shedule: ఏపీ ప్రవేశ పరీక్షలు-2020 షెడ్యూల్‌ విడుదల, ఐసెట్‌ను ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో..,లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్‌ 9, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

Hazarath Reddy

ఏపీ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్‌) (APCETs-2020common entrance test) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌(Educational minister Adimulapu Suresh) సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ప్రవేశపరీక్షలను(AP EAMCET-2020) నిర్వహించనున్నారు. ఐసెట్‌ను(AP ICET-2020) ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30న, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు.

Advertisement

Indian Navy Bans Smartphones: సంచలన నిర్ణయం తీసుకున్న ఇండియన్ నేవీ, స్మార్ట్‌ఫోన్లు, ఫేస్‌బుక్‌పై నిషేధం, నేవీ స్థావరాల్లో సోషల్ మీడియాను ఉపయోగించరాదని ఉత్తర్వులు జారీ చేసిన నేవీ ఉన్నతాధికారులు

Hazarath Reddy

భారత నౌకాదళం (Indian Navy) తన సిబ్బందికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నేవి సిబ్బంది ఇకపై సోషల్‌ మాధ్యమాలు (Social Media Apps) అయిన ఫేస్‌బుక్‌,(Facebook) ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లు (WhatsApp) వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Burglar Gang Busted: దెబ్బకు ఠా, దొంగల ముఠా! సంచారజాతి దోపిడీ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి మొత్తం 150 గ్రాముల బంగారం స్వాధీనం, చడ్డీలు వేసుకొని తిరుగుతుండటంతో, 'చడ్డీ గ్యాంగ్' గా మొదట అనుమానపడిన పోలీసులు

Hazarath Reddy

కొంతకాలంగా హైదరాబాద్‌ (Hyderabad) నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ (Cheddi Gang) ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. చెడ్డీ గ్యాంగ్‌లోని ఏడుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ (Cheddi Gang Arrested) చేశారు. వారి దగ్గర నుండి భారీమొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Dangerous Video Clip: భయంకరమైన వీడియో, రైలు డోర్ వద్ద నిలబడి డేంజరస్ స్టంట్ చేసిన యువకుడు, వికటించిన ఫీట్, అక్కడికక్కడే మరణం, అనాలోచిత ప్రయోగాలు చేయవద్దంటూ వార్నింగ్ ఇచ్చిన రైల్వే మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

ఈ రోజుల్లో సాహసం అనేది అత్యంత ప్రమాదకరమైన అంశం అయిపోయింది. టిక్ టాక్(TIK TOK) లాంటి సోషల్ మీడియా యాప్స్ (Social media apps) వచ్చిన తరువాత పాపులారీటీ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా వారు వినడం లేదు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నా కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది.

North India Cold Wave: చలి దెబ్బకు వణుకుతున్న ఉత్తర భారతం, చలి గుప్పిట్లో చిక్కుకుపోయిన దేశ రాజధాని ఢిల్లీ, పొగమంచుతో ప్రమాదాలు, పొగమంచుకు తోడవుతున్న వాయు కాలుష్యం

Hazarath Reddy

చలికి ఉత్తర భారతం (North India Cold Wave)వణికిపోతోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు (Temperatures) దారుణంగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ దాల్‌ సరస్సు గడ్డకడుతున్నది. సరస్సుపై మంచు పలుకలు తేలియాడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)అయితే పూర్తిగా చలి గుప్పిట్లో చిక్కుకుపోయింది.

Advertisement
Advertisement