సమాచారం

Rs. 2000 Note Withdrawn: నేటి నుంచి రూ. 2000 నోటు మార్పిడి షురూ.. 55 వేల బ్యాంక్‌ బ్రాంచీలు రెడీ.. రోజుకు ఎన్ని మార్చుకోవచ్చంటే??

Rudra

2 వేల నోటు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన చేసి నాలుగు రోజులైనా.. డిపాజిట్లు మొదలయ్యేది మాత్రం మరికాసేపట్లోనే. ఇదే ఇప్పుడు అసలు కథ. ముందు జాగ్రత్తగానే ఆర్‌బీఐ కూడా అలర్ట్‌ అయింది. గతంలో ఉన్న అనుభవాలను మళ్లీ పునారావృతం కాకుండా ప్రత్యేక ప్రకటన చేసింది.

Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు... పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ కూడా

Rudra

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో వచ్చే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచన చేసింది. తూర్పు తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

RBI Governor on 1,000 Notes: మళ్లీ రూ.1000 నోట్లు చలామణిలోకి వస్తున్నాయా, వైరల్ అవుతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన RBI గవర్నర్ శక్తికాంత దాస్

Hazarath Reddy

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రూ. 2,000 నోట్ల ఉపసంహరణ తర్వాత ప్రభావాన్ని తగ్గించడానికి రూ. 1,000 బ్యాంకు నోట్లను తిరిగి ప్రవేశపెట్టే ప్రణాళిక లేదని RBI గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. రూ వేయి నోట్లు ప్రవేశపెడుతున్నారనే నివేదికలను "ఊహాజనితం" అంటూ కొట్టిపారేశారు.

Rs 2000 Notes Deposit in Bank: రూ.2000 నోట్లు రూ. 50 వేల పైన డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు తప్పని సరి, ఈ మొత్తానికి ఆదాయపు పన్నువర్తిస్తుందని తెలిపిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Hazarath Reddy

బ్యాంకు ఖాతాల్లో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లకు ప్రస్తుత ఆదాయపు పన్ను ఆవశ్యకత రూ.2,000 నోట్లపై కూడా వర్తిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రూ. 2000 నోట్లలో రూ. 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డ్ అవసరమని ఆయన అన్నారు.

Advertisement

RBI Governor on Rs 2,000 Note: ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధన రూ. 2,000 నోట్లకు కూడా వర్తిస్తుంది, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం నాడు రూ. 2,000 నోట్లను, అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటును చలామణి నుండి ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం సెంట్రల్ బ్యాంక్ యొక్క కరెన్సీ నిర్వహణ కార్యకలాపాలలో ఒక భాగమని తెలిపింది.

Rs 2000 Note Exchange: రేపటి నుంచి ఏ బ్యాంకులోనైనా రూ.2000 నోట్లు మార్చుకోవచ్చు, బ్యాంక్ కౌంటర్లలో ఇంతకు ముందు లాగే సేవలు అందించనున్న బ్యాంకులు

Hazarath Reddy

బ్యాంక్ కౌంటర్‌లో రూ. 2000 నోట్లను మార్చుకునే సదుపాయం సాధారణ పద్ధతిలో ప్రజలకు అందించబడుతుంది, అంటే ఇంతకుముందు అందించిన విధంగానే ఈ సేవలు అందిచడం జరుగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)తెలిపింది. రూ. 2000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్లలోకి మార్చుకోవడానికి రేపు, మే 23 నుండి ఏ బ్యాంక్‌లోనైనా ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చు.

Rains In AP: ఏపీకి చల్లని కబురు.. నేడు పలుచోట్ల వర్షాలు.. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నదన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

Rudra

మండుటెండలు, వడగాలులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Special Trains For Summer: వేసవి కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. 380 ప్రత్యేక రైళ్లు సిద్ధం.. దేశంలోని ప్రధాన కేంద్రాల మీదుగా 6,369 ట్రిప్పుల నిర్వహణకు నిర్ణయం

Rudra

వేసవిలో ప్రయాణాలు, టూర్స్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement

Toor Dal Price Hike: దేశంలో కందిపప్పు కొరత.. కొండెక్కిన ధర.. దుకాణాల్లో దర్శనమిస్తున్న నోస్టాక్ బోర్డులు.. ప్రస్తుతం కిలో కందిపప్పును రూ. 140కి విక్రయిస్తున్న వైనం

Rudra

పెట్రోల్, గ్యాస్ ధరలతో ఇప్పటికే కుదేలైన సామాన్యులను.. ఇప్పుడు కందిపప్పు ధరలు భయపెడుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లోనూ నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.

How To Exchange Rs 2000 Notes? 2000 రూపాయల నోట్లను ఎలా మార్చుకోవాలి, ఏ తేదీ లోపల మార్చుకోవాలని ఆర్ బీఐ చెప్పింది, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

Rs 2,000 Notes To Be Withdrawn: మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోండి, వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ

Hazarath Reddy

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది

Telangana Weather Forecast: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు, రాబోయే మూడు రోజుల్లో వర్షాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరిన నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

తెలంగాణలో మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది

Advertisement

Andhra Pradesh Weather Report: ఏపీని వణికిస్తున్న భానుడు, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత, 33 మండలాలకు వడగాడ్పుల హెచ్చరిక

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురు­వారం ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

IMD Weather Update: ఐఎండీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో, 5 రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరిక, తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రిపోర్ట్ ఇదే..

Hazarath Reddy

దేశంలో భానుడు భగభగమంటున్నాడు.ప్రతిరోజు 40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఇప్పటికే ఎండలతో జనం మాడిమసైపోతుంటే రాగల మూడు నాలుగు రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.

SCR Cancels 17 Trains: రైల్వే ప్రయాణికులకు గమనిక, రేపు,ఎల్లుండి 17 రైళ్లు రద్దు చేసిన ఎస్‌సీఆర్, మరికొన్ని ప్రధాన రైళ్లు భారీ ఆలస్యం, రద్దయిన రైళ్ల పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

సికింద్రాబాద్‌(Secunderabad) నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఈనెల 20, 21 తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా.. ఇంకొన్ని ప్రధాన రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడవనున్నాయి.చర్లపల్లి టెర్మినల్‌ వద్ద ఆర్‌యూసీ నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 21న ఆ మార్గంలో నడిచే 17 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Setting Up 8 New Cities Across India: భారత్‌లో 8 కొత్త నగరాల ఏర్పాటు దిశగా కేంద్రం.. ప్రస్తుతం పట్టణాలపై జనాభా ఒత్తిడి తగ్గించేందుకే..

Rudra

నగరాలకు వలస వెళ్తున్న జనాభా అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో ప్రస్తుతమున్న నగరాలపై జనాభా ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో దేశంలో మొత్తం ఎనిమిది నగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.

Advertisement

RBI's Remittance Scheme and TCS: ఎల్ఆర్ ఎస్ కిందకు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్.. ఆర్బీఐ అనుమతి లేకుండా 2.50 లక్షల డాలర్ల వరకు పంపే వెసులుబాటు.. కేంద్రం నోటిఫికేషన్

Rudra

విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు డబ్బులు పంపించే వారికి శుభవార్త. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ తో విదేశీ కరెన్సీతో నిర్వహించే లావాదేవీలను ఆర్బీఐ సరళీకృత చెల్లింపు పథకం (ఎల్ఆర్ఎస్) కిందకు తీసుకొస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

Summer Rush at Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్, దర్శనానికి 36 గంటల సమయం, మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

Hazarath Reddy

వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్‌మెంట్లు,షెడ్లు కిక్కిరిసిపోయాయి

Mahila Samman Certificate Scheme: మహిళలకు మోదీ సర్కారు శుభవార్త, మహిళా సమ్మాన్‌ పథకంపై నో టీడీఎస్, పెట్టుబడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్‌లో మహిళా సమ్మాన్‌ (Mahila Samman Scheme) పేరుతో ప్రత్యేక డిపాజిట్‌ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్‌ను తీసుకొచ్చింది

TS High Court Recruitment 2023: రూ.90 వేలకు పైగా జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు, మూడు విభాగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

నిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు శుభవార్తను తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Advertisement
Advertisement