సమాచారం

Hyderabad Traffic Restrictions: రేపు హైదరాబాద్ లో ప్రధాని పర్యటన... ఆయా మార్గాల్లో రోడ్లను మూసివేస్తున్నట్టు పోలీసుల ప్రకటన

Rudra

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్‌ ట్రాపిక్‌ పోలీసులు తెలిపారు.

Orange Alert to Telangana: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం, హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట్‌, ఉప్పల్‌, నాగోల్‌, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో‌ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.

Telangana Govt Jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త, గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో

Hazarath Reddy

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్, 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతూ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది.

CRPF Constable Recruitment: లక్షా ముఫ్పై వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు, సీఆర్‌పీఎఫ్‌ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా సీఆర్‌పీఎఫ్‌ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను (CRPF Constable Recruitment) హోం మంత్రిత్వ శాఖ భర్తీ చేయనుంది.

Advertisement

Bank Holiday 2023: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్, నేటి నుంచి 5 రోజులు బ్యాంకులకు సెలవు, వరుస సెలవుల నేపథ్యమే కారణం

Hazarath Reddy

బ్యాంకుల‌కు వెళ్లాల‌నుకున్న అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది.ఈ రోజు న మ‌హా వీర్ జ‌యంతి.. మ‌హావీర్ జ‌యంతి సంద‌ర్భంగా ప‌లు ప్రైవేట్ బ్యాంకుల‌తోపాటు ప్ర‌భుత్వ బ్యాంకుల‌కు ప‌లు రాష్ట్రాల్లో సెల‌వు ఉంటుంద‌ని ఆర్బీఐ హాలీడే షెడ్యూల్ చెబుతున్న‌ది

IRCTC: రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వార్త అబద్దం, నమ్మి మోసపోవద్దని క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

ఇండియన్ రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే మంత్రిత్వశాఖ (The Ministry of Railways) క్లారిటీ ఇచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( Railway Protection Force)లో ఎలాంటి నియామక నోటిఫికేషన్ (Recruitment Notificaton) ఇవ్వలేదని స్పష్టం చేసింది.

Money Transfer: క్రెడిట్ కార్డు నుండి బ్యాంకు అకౌంట్‌కి నేరుగా డబ్బులు పంపుకోవచ్చని తెలుసా, ఈ విధానం ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చాలా సులభంగా చేయవచ్చు

Hazarath Reddy

మీకు చిటికెలో డబ్బు అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డ్‌లు లైఫ్‌గార్డ్‌గా పనిచేస్తాయి. కానీ కొన్నిసార్లు కొన్ని లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను ఉపయోగించలేరు. చాలామంది క్రెడిట్ కార్డు వినియోగదారులకు కార్డ్‌ ద్వారా బ్యాంకు అకౌంట్‌కి డబ్బు జమ చేయవచ్చనే విషయం తెలిసుండకపోవచ్చు

NCERT: 12వ తరగతి సిలబస్ నుండి మొఘల్ సామ్రాజ్యం చాప్టర్ తొలగించిన NCERT, చరిత్ర పాఠ్యాంశాలను సవరించిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్

Hazarath Reddy

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERT 12వ తరగతి చరిత్ర పాఠ్యాంశాలను సవరించింది. మొఘల్ సామ్రాజ్యంపై అధ్యాయాలను తొలగించింది. దీని తరువాత, NCERTని అనుసరించే CBSE, UP ఇతర రాష్ట్ర బోర్డులతో సహా అన్ని బోర్డుల సిలబస్ మార్చబడుతుంది. NCERT 2023-24 విద్యా సంవత్సరానికి హేతుబద్ధమైన సిలబస్‌ను ప్రవేశపెట్టింది.

Advertisement

Weather Forecast: బయటకు రావొద్దు, దేశంలో 3 నెలల పాటు వడగాడ్పులు, అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

భారత్‌లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం హెచ్చరించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ స్థాయి కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది.

HCLTech Openings: ఉద్యోగాలు ఊడుతున్న వేళ హెచ్‌సీఎల్‌ గుడ్ న్యూస్, 1000 మంది కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటన, రొమేనియాలో కార్యకలాపాలు విస్తరణ

Hazarath Reddy

ఉద్యోగాలు ఊడుతున్న వేళ హెచ్‌సీఎల్‌ టెక్‌ గుడ్ న్యూస్ తెలిపింది. రాబోయే రెండేళ్లలో రొమేనియాలో 1,000 మంది ఉద్యోగులను నియమించు కోనున్నట్లు ప్రకటించింది. రొమేనియాలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రోమేనియన్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా మూడో వంతు చోటు కల్పించనుంది

Different Weather conditions in AP: ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం.. ఓవైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు అకాల వర్షాలు, రైతన్నలో ఆందోళన

Rudra

ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకాల వర్షాలు రైతులను కష్టాల్లోకి నెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉంది.

Vande Bharat Express: కేవలం 8.30 గంటల్లోనే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి.. వందేభారత్‌ లో రయ్.. రయ్.. టైమింగ్స్‌ ప్రకటించిన రైల్వే శాఖ

Rudra

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. తిరుపతి పుణ్యక్షేత్రానికి అత్యంత వేగంగా చేరుకునేందుకు హైదరబాద్ వాసుల కోసం వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తోంది. ఏప్రిల్‌ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ పరుగులు పెట్టనుంది.

Advertisement

Railway Jobs News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, రైల్వేలో 2.93 లక్షల ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

మార్చి 1, 2021 నాటికి రైల్వేలో అత్యధికంగా 2.93 లక్షలతో సహా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం తెలిపారు

UPI Payments: యూపీఐ పేమెంట్స్ అలర్ట్, రూ.2 వేల పైన అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే 1.1 శాతం కట్, అయితే ఎవరికి వర్తిస్తుందో ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో వ్యాపార లావాదేవీలకు ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల (PPI) రుసుము వర్తించబడుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది.

South Central Railway: రైళ్లపై రాళ్ల దాడులు చేస్తే ఐదేండ్ల జైలు శిక్ష, దుండగులకు వార్నింగ్ ఇచ్చిన దక్షిణ మధ్య రైల్వే

Hazarath Reddy

దాడులకు పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్‌ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఐదేండ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. కాజీపేట్‌-ఖమ్మం, కాజీపేట్‌-బోంగీర్‌, ఏలూరు-రాజమండ్రి వంటి సమస్యాత్మక విభాగాల్లో వందేభారత్‌ రైళ్లపై దాడి జరిగిందన్నారు.

Andhra Pradesh: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 162 స్పెషలిస్ట్‌ వైద్యుల పోస్టులు భర్తీ, 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులను భర్తీ చేసిన అధికారులు

Hazarath Reddy

ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకానికి చేపట్టిన వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకూ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులను భర్తీ చేశారు

Advertisement

Group-1 Mains Postponed: ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా, జూన్ 3 నుంచి 9 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన విద్యాశాఖ

Hazarath Reddy

ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.

EC New Portal For Voters: ఓటర్ల నమోదు, సవరణల కోసం కొత్త పోర్టల్.. ఇప్పటివరకు nvsp పోర్టల్ ద్వారా ఓటర్ల నమోదు.. దాని స్థానంలో voters.eci.gov.in పోర్టల్

Rudra

దేశంలో కొత్త ఓటర్ల నమోదు, సవరణల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పోర్టల్ ను తీసుకువచ్చింది. ఇప్పుడున్న ఎన్వీఎస్పీ స్థానంలో ఇక నుంచి కొత్త పోర్టల్ ద్వారా సేవలు అందించాలని ఈసీ నిర్ణయించింది. ఇకపై voters.eci.gov.in పోర్టల్ ద్వారా ఓటర్ల నమోదు తదితర ప్రక్రియలు కొనసాగుతాయని వివరించింది.

EPFO Interest Rate: ఊరిస్తారో.. ఉసూరుమనిపిస్తారో?? ఈపీఎఫ్ఓ వడ్డీపై బోర్డు నేడు కీలక నిర్ణయం.. వడ్డీరేటు కొంత పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌.. అయితే, 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీరేటును లేదా 8% వడ్డీరేటును కొనసాగించే అవకాశం

Rudra

ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు మంగళవారం ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటును 8.1% లేదా 8 శాతంగా నిర్ణయించే అవకాశం ఉంది. 2022-23 ఆదాయాల ఆధారంగా EPFO ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్, ఆడిట్ కమిటీ దీనిని సిఫార్సు చేసింది.

Bank Holidays in April 2023: ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, కస్టమర్‌లు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించిన ఆర్బీఐ

Hazarath Reddy

గుడ్ ఫ్రైడే, ఈద్, బాబా అంబేద్కర్ జయంతి వంటి వివిధ పండుగల నేపథ్యంలో 2023 ఏప్రిల్‌లో సగం నెల పాటు బ్యాంకులు మూతపడనున్న (Bank Holidays in April 2023) నేపథ్యంలో.. వచ్చే నెలలో తమ సంబంధిత బ్యాంకులను సందర్శించాలనుకుంటున్న బ్యాంక్ కస్టమర్‌లు తమ పనిని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.

Advertisement
Advertisement