సమాచారం

Summer Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్, ప్రయాణికుల కోసం 968 స్పెషల్‌ ట్రైన్స్‌, ఏప్రిల్‌ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని తెలిపిన రైల్వే శాఖ

Hazarath Reddy

IRCTC రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల కోసం స్పెషల్‌ ట్రైన్స్‌ను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే పేర్కొంది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్‌ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Bank holidays in May 2022: బ్యాంక్ కస్టమర్లు అలర్ట్, మే నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్, పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకుని ముందే ప్రిపేర్ అవ్వండి

Hazarath Reddy

బ్యాంకు కస్టమర్లకు గమనిక. చాలా మంది బ్యాంకులో (Bank holidays in May 2022) అత్యవసర పనులుంటాయి. కొంత మంది వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వచ్చే నెలలో మీరు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది. మే నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు ఉన్నాయి. ప్రతి నెల బ్యాంకులకు సెలవులనేవి అంటాయి.

SBI: ఈ నంబర్లు నుంచి వచ్చే కాల్స్ బ్లాక్ చేయండి, ఖాతాదారులకు అలర్ట్ మెసేజ్ జారీ చేసిన SBI, ఎస్‌బీఐ కేవైసీ వెరిఫికేషన్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిక

Hazarath Reddy

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆన్‌లైన్‌లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని త‌న ఖాతాదారుల‌ను (SBI warns customers) తాజాగా హెచ్చరించింది. నో యువర్ క‌స్ట‌మ‌ర్‌ (కేవైసీ) వెరిఫికేష‌న్ పేరుతో మోసాల‌కు పాల్ప‌డే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ సూచించింది

Gold, Silver Prices Today: భారీగా పెరిగిన బంగారం ధరలు, సిల్వర్‌ ఒకరోజులోనే రూ. 1000కిపైగా పెరుగుదల

Hazarath Reddy

బంగారం, సిల్వర్‌ ధరలు సోమవారం రోజున (Gold, Silver Prices Today) భారీగా పెరిగాయి. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యవిధానాలను కఠినతరం చేసే అవకాశాలు, రష్యా-ఉక్రెయిన్‌ వార్‌, ప్రపంచ ద్రవ్యోల్భణ ప్రభావం వంటి అంతర్జాతీయ పరిణామాలతో గోల్డ్‌, సిల్వర్‌ ధరలు గణనీయంగా పెరిగాయి.

Advertisement

Monsoon Forecast 2022: ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు, ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలు, సమృద్ధిగా వానలు కురుస్తాయని తెలిపిన వాతావరణశాఖ

Hazarath Reddy

ఏపీకి ఐఎండీ చల్లని కబురు అందించింది. ఏటా జూన్‌ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) సీజన్.. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలను కురిపిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.

SBI: ఖాతాదారులకు ఎస్‌బీఐ గట్టి షాక్‌, ఎంసీఎల్‌ఆర్‌ రేటు 10 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం, మరో 0.10 శాతం పెరగనున్న వడ్డీ రేట్లు

Hazarath Reddy

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు గట్టి షాక్‌ను ఇచ్చింది. మార్జినల్‌ కాస్ట్‌ లెండింగ్‌ రేట్‌(ఎంసీఎల్‌ఆర్‌)ను పెంచుతూ ఎస్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎంసీఎల్‌ఆర్‌ రేటును 10 బేసిస్‌ పాయింట్లను పెంచుతున్నట్లు ( Sbi Hikes Mclr Across All Tenors) ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

Andhra Pradesh: ఏపీలో మే 9 నుంచి వేసవి సెలవులు, వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం జూలై 4 నుంచి ప్రారంభం, ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ

Hazarath Reddy

ఏపీలో పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం జూలై 4 నుంచి మొద‌లు కానుంది. ఈ మేర‌కు శ‌నివారం ఏపీ విద్యా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు (AP School Summer Holidays 2022) మొద‌లు కానున్నాయి.

WhatsApp: వాట్సాప్‌ నుంచి అదిరిపోయే ఫీచర్లు, ఇకపై ఒకేసారి 32 మందికి వీడియో కాల్ చేసుకోవచ్చు, వీడియో, పీడీఎఫ్‌ వంటి 2జీబీ డేటా ఫైల్స్‌ ఫార్వార్డ్ చేసుకోవచ్చు

Hazarath Reddy

వాట్సాప్‌ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఎనిమిది మంది మాత్రమే గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉంది. కానీ తాజాగా జుకర్‌ బెర్గ్‌ వాయిస్‌ కాల్స్‌ చేసే సదుపాయాన్ని 8 మంది నుంచి 32 మందికి పెంచనున్నట్లు తెలిపారు.

Advertisement

Southwest Monsoon: రైతులకు వాతావరణశాఖ శుభవార్త, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

భారత వాతావరణశాఖ (IMD రైతులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో (Southwest Monsoon) దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావొచ్చని పేర్కొంది

Telangana: నిరుద్యోగులకు శుభవార్త, 3,334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపిన తెలంగాణ సర్కారు, విడివిడిగా జీవోలు జారీ చేసిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు

Hazarath Reddy

తొలి విడతలో 30,453 పోస్టుల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ.. తాజాగా బుధవారం మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు విడివిడిగా జీవోలు జారీ చేశారు

Bank Holiday Alert: బ్యాంకులో పనుందా? బీఅలర్ట్, వరుసగా నాలుగురోజులు సెలవులు, ఏదైనా పని ఉంటే శనివారమే దిక్కు, ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు బ్యాంకులు బంద్ ఉన్నాయో తెలుసా?

Naresh. VNS

బ్యాంకింగ్ సేవలకు మరోసారి ఆటంకం కలగనున్నాయి. సెలవులతో కస్టమర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈరోజు ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanthi) సందర్భంగా, రేపు ఏప్రిల్ 15 న గుడ్ ఫ్రైడే (Good Friday) సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులకు సెలవు (Bank Holiday) ప్రకటించారు. ఇక శనివారం ఏప్రిల్ 16న ఒక్కరోజు బ్యాంకులు తెరుచుకోనుండగా.. మళ్ళీ ఆదివారం సెలవు ఉంది.

Srilanka Emergency: శ్రీలంక వదిలి విదేశాలకు పారిపోయేందుకు రాజపక్సే ప్రయత్నం, ఆగ్రహం తట్టుకోలేక అధ్యక్ష, ప్రధాని భవనాలపై దాడులు చేస్తున్న ప్రజలు...

Krishna

శ్రీలంకలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయే యోచనలో ప్రధాని మహీంద రాజపక్స ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

WhatsApp Attack: వాట్సాప్‌లో కొత్త తరహా మోసం, వాయిస్ మెసేజ్‌తో లక్షలు దోచేస్తున్న కేటుగాళ్లు, ఈ మెసేజ్ మీకు వస్తే అస్సలు క్లిక్ చేయొద్దు, ఈ మెయిల్ ద్వారా కోల్లగొడుతున్న సైబర్ క్రిమినల్, వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక

Naresh. VNS

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వారి కన్ను ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ పై పడింది. వాట్సాప్ వేదికగా కొత్త తరహా చీటింగ్ కు తెరలేపారు సైబర్ క్రిమినల్స్. వాట్సాప్ లోని వాయిస్ నోట్ మెసేజ్ పేరుతో యూజర్లకు ఈ-మెయిల్ పంపుతున్నారు. ఆ మెసేజ్ ను క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులుమాయం అయిపోతాయి.

Covid Omicron XE: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఎక్స్‌ఈ లక్షణాలు ఇవే, జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గరగర, దగ్గు, జలుబు, చర్మంపై దద్దర్లు, రంగు మారడం, జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలు

Hazarath Reddy

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఎక్స్‌ఈ భారత్‌లోకి ప్రవేశించింది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 వేరియంట్ల కలయితో ఏర్పడిన ఈ కొత్త మ్యుటేషన్‌ వైరస్‌ (Covid Omicron XE) మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన మహిళకు సోకినట్లు బుధవారం గుర్తించారు.

Gold Silver Price Today: బంగారం కొనేవారు ఆలోచించుకోండి, మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు, మార్కెట్లో‌ తాజా ధరల వివరాలు ఇవే

Hazarath Reddy

బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరలు ఒక రోజు తగ్గుముఖం పడితే.. మరో రోజు పెరుగుతున్నాయి. క్రితం సెషన్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Gold Silver Price) నేడు ప్రారంభంలో స్వల్పంగా పెరిగాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.24 లాభపడి రూ.51,395 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48 క్షీణించి రూ.66,669 వద్ద ట్రేడ్ అయింది.

HDFC Merger with HDFC Bank: దేశ కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద విలీనం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనం, దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో రెండో ర్యాంకుకు ఎగబాకనున్న దిగ్గజం

Hazarath Reddy

ప్రైవేట్‌ రంగంలో నంబర్‌ వన్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో దేశీయంగా అతిపెద్ద గృహ రుణ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనం (HDFC merger with HDFC Bank) కానుంది.

Advertisement

TS EDCET-2022: టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌ల, రెండేండ్ల బీఎడ్ కోర్సుకు ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు

Hazarath Reddy

తెలంగాణలో టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి గానూ రెండేండ్ల బీఎడ్ కోర్సుకు (TS EDCET-2022) సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి, ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ రామ‌కృష్ణ‌, ఎడ్‌సెట్ కో క‌న్వీన‌ర్ శంక‌ర్ విడుద‌ల చేశారు.

Weather Forecast: తెలంగాణకు ఎల్లో అల‌ర్ట్, రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని తెలిపిన హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ

Hazarath Reddy

తెలంగాణలో గత వారం రోజుల నుంచి ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. తాజాగా ఎండ‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త‌ను హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ వినిపించింది.

Pakistan Political Crisis: పాక్‌ జాతీయ అసెంబ్లీ రద్దు, 90 రోజుల్లో తాజా ఎన్నికలు, ఇమ్రాన్ సిఫారసుకు ఆమోదం తెలిపిన పాక్ అధ్యక్షుడు, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా నాటకీయ పరిణామాలు

Naresh. VNS

పాకిస్తాన్‌లో (Pakistan) రాజకీయాలు పీక్‌ స్టేజ్‌ కు చేరాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫారసుతో జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు (dissolve Assemblies) పాక్‌ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ . 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికలు జరిగేవరకు ఇమ్రాన్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగనున్నారు. అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ పై (Imran Khan) అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు.

Blood Sugar Levels: బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే ఆరు అద్భుతమైన ఆహారాలు ఇవే! ఈ ఫుడ్స్ తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ మీ కంట్రోల్‌లోనే ఉంటాయ్..

Naresh. VNS

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, బీన్స్, గింజలు, విత్తనాలు లేదా టోఫు, చేపలు మరియు సముద్రపు ఆహారం, చికెన్ , ఇతర పౌల్ట్రీ, గుడ్లు మరియు తక్కువ కొవ్వు పాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్లు మధుమేహం ఉన్నవారికి మంచి ఆహారాలుగా సూచించబడ్డాయి. మధుమేహం ఉన్నవారు తమకు నచ్చిన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.

Advertisement
Advertisement