News

SEBI Imposes Ban On Ketan Parekh: స్టాక్ మార్కెట్‌ కుంభకోణంపై సెబీ కీలక నిర్ణయం, కేతన్ పరేఖ్‌తో పాటూ మరో ఇద్దరిపై నిషేధం విధిస్తూ నిర్ణయం

VNS

స్టాక్ మార్కెట్ ఆపరేటర్ కేతన్ పరేఖ్, మరో ఇద్దరిపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) నిషేధం విధిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నది. 2000లో జరిగిన స్టాక్ మార్కెట్ కుంభకోణంలో (Stock Market Scam) కేతన్ పరేఖ్ (Ketan Parekh) భాగస్వామిగా ఉన్నట్లు తేలడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది.

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

VNS

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ టర్బో 4 (Redmi Turbo4) ఫోన్‌ను గురువారం చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400-ఆల్ట్రా చిప్‌సెట్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6550 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.

High Court On FTL: ఎఫ్‌టీఎల్ పరిధి గుర్తించే ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది! నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకర్టు ఆదేశం

VNS

హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్‌ను (FTL) గుర్తించి నోటిఫికేషన్‌ జారీకి సంబంధించిన ప్రక్రియ ఏ దశలో ఉందో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు (high court) ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని రామమ్మ కుంటలో ఎఫ్‌టీఎల్‌ (FTL) పరిధిలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ నిర్మాణాలు చేపట్టడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Bashar al-Assad Allegedly Poisoned: సిరియా మాజీ అధ్యక్షుడిపై విషప్రయోగం, రష్యా పర్యటనలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన నేత

VNS

సిరియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ (Bashar al-Assad).. స్వదేశాన్ని వీడి రష్యాలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తీవ్ర దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.

Advertisement

Hyundai Creta Electric: త్వరలోనే మార్కెట్లోకి హ్యుండాయ్‌ నుంచి మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు, రెండు బ్యాటరీలు మరెన్నో ఫీచర్లు

VNS

దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా త్వరలో తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్రెటా ఈవీ (Creta EV) కారును ఆవిష్కరించనున్నది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో దీన్ని ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. హ్యుండాయ్ నుంచి భారత్ మార్కెట్లోకి వస్తున్న మూడో ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. మార్కెట్ నుంచి ఉపసంహరించిన కోనా ఎలక్ట్రిక్ స్థానంలో క్రెటా ఈవీ (Creta EV) వస్తోంది.

JC Prabhakar Reddy: వీడియో ఇదిగో, మీకన్నా జగనే మేలు కదరా, బస్సు దగ్ధంపై బీజేపీ నేతలపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి

Hazarath Reddy

బీజేపీ వాళ్లలాగా జగన్ బస్సులు తగలబెట్టలేదు.. ఆపినాడు అంతే.. కానీ మీరు తగలబెట్టారు. జగన్ రెడ్డే మేలు కదరా. 300 బస్సులు పోతేనే ఏడ్చలేదు. ఇప్పుడు ఎందుకు భాదపడతా. ఇంకా ఉన్నాయి. కాల్చుకోపోండి' అని అన్నారు.

Where is The Humanity ? మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది, అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో, ఆకలికి తట్టుకోలేక చిన్న పాప తిని పడేసిన ప్లేట్ల నుంచి..

Hazarath Reddy

రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. సమాజానికి ఆధునిక సాంకేతికత సోకినందున, మానవులు తన తోటి జీవుల పట్ల కనికరం మరియు శ్రద్ధ వహించకుండా కాలం గడిపేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ వీడియోని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఓ పాప ఆకలితో అలమటిస్తూ తిని పడేసిన ప్లేట్లలో నుంచి ఆహారాన్ని తీసుకోవడం కనిపించింది.

Maha Kumbh 2025: మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 26 ప్రత్యేక రైళ్లు, జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా, పూర్తి రైళ్ల వివరాలు ఇవే..

Hazarath Reddy

మహా కుంభమేళా - 2025లో పాల్గొనే ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఫిబ్రవరిలో వివిధ గమ్యస్థానాల మధ్య 26 అదనపు మహా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.కాగా జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా జరగనుంది.

Advertisement

Ram Charan on SSMB29: వీడియో ఇదిగో, SSMB29 ఏడాదిన్నరలో రిలీజ్ అవుతుందని తెలిపిన రామ్ చరణ్, వెంటనే మైక్ అందుకుని రాజమౌళి ఏమన్నారంటే..

Hazarath Reddy

కొవిడ్‌లాంటివి లేకపోతే, ఏమీ విచారించాల్సిన అవసరం లేదు. SSMB29 ఏడాదిన్నరలో వచ్చేస్తుంది అన్నారు. వెంటనే రాజమౌళి మైక్‌ అందుకుని బాగా ట్రైనింగ్‌ ఇచ్చా అనడంతో నవ్వులు వెల్లివిరిశాయి.

Navy Day Rehearsal in Vizag: వీడియో ఇదిగో, నేవీ డే రిహార్సల్స్‌లో తప్పిన ప్రమాదం, పారాషూట్లు ఢీకొనడంతో సముద్రంలో పడిపోయిన కమాండోలు, అప్రమత్తమైన నేవీ సిబ్బంది

Hazarath Reddy

కిందికి దిగుతుండగా కమాండోల పారాషూట్లు ఢీకొన్నాయి . పారాషూట్లు ఢీకొనడంతో కమాండోలు సముద్రంలో పడిపోయారు. అప్రమత్తమై నేవీ సిబ్బంది కమాండోలను రక్షించారు.

Mouni Roy: వీడియో ఇదిగో, న్యూ ఇయర్ వేళ తప్పతాగి పడిపోయిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్, భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకున్న నటి

Hazarath Reddy

తన భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకుంది. బార్ నుంచి బయటికి వస్తూ నడవలేక కింద పడిపోయింది. దీంతో మౌనీ రాయ్‌ను ఆమె భర్తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఎవరూ ఫోటోలు తీయవద్దంటూ ఆమె భర్త కెమెరాలకు తన చేతిని అడ్డు పెట్టడం వీడియోలో కనిపించింది.

Dabidi Dibidi Full Video Song out: ఊలాల, ఊలాల అంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న దబిడి దిబిడే సాంగ్, డాకు మహారాజ్ నుంచి కొత్త సాంగ్ విడుదల

Hazarath Reddy

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ నుంచి దబిడి దిబిడే" అనే పాటని మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేశాడు. అలాగే యంగ్ సింగర్ వాగ్దేవి తో కలసి పాడాడు.

Advertisement

Game Changer Trailer Out: నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్‌, గూస్ బంప్స్ తెప్పిస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'(Game Changer Movie) ట్రైలర్‌ను (Game Changer Trailer)మేకర్స్ రిలీజ్ చేశారు. తాజా ట్రైలర్ లో 'నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్‌.. నేను చనిపోయే వరకు ఐఏఎస్‌' ‍అనే డైలాగ్‌ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Andhra Pradesh:కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్ష, 1600 మీటర్ పరుగు పందెంలో కుప్పకూలి పడిపోయిన యువకుడు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు ఏ.కొండూరు గ్రామానికి చెందిన దారావత్తు చంద్రశేఖర్(25)తన స్నేహితుడు గోపితో కలిసి మచిలీపట్నం వచ్చాడు. 1600 మీటర్ల పరుగు పందెంలో సొమ్మసిల్లి కింద పడిపోయాడు.

Rs 450 Crore Chit Fund Scam: రూ.450 కోట్ల చిట్‌ఫండ్‌ కుంభకోణం, శుభ్‌మన్‌ గిల్‌‌తో సహా నలుగురు గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాళ్లకు సీఐడీ నోటీసులు

Hazarath Reddy

రూ.450 కోట్ల పోంజీ స్కామ్‌కు సంబంధించి గుజరాత్ సిఐడి క్రైమ్ బ్రాంచ్ సమన్లు ​​పంపే అవకాశం ఉన్న నలుగురు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లలో భారత అంతర్జాతీయ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. గిల్‌తో పాటు, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా మరియు మోహిత్ శర్మలను ప్రశ్నించే అవకాశం ఉంది.

Navsari Horror: దారుణం, సెక్స్ మాత్రలు వేసుకుని 5 గంటల్లో మూడుసార్లు మైనర్ బాలికపై అత్యాచారం, జీవిత ఖైదు విధించిన ప్రత్యేక పోక్సో కోర్టు

Hazarath Reddy

2021 అక్టోబర్‌లో 16 ఏళ్ల పాఠశాల విద్యార్థినిపై దారుణంగా అత్యాచారం చేసిన కేసులో నవ్‌సారిలోని ప్రత్యేక పోక్సో కోర్టు 35 ఏళ్ల వ్యక్తి మహమ్మద్ సాదిక్ ఖత్రీకి జీవిత ఖైదు విధించింది. న్యాయమూర్తి TS బ్రహ్మభట్ ఖత్రీ చర్యలను "నైతిక దిగజారుడు చర్య"గా అభివర్ణించారు.

Advertisement

Telangana Women's Commission: సీఎంఆర్ కాలేజీ ఘటనపై స్పందించిన మహిళా కమిషన్, సైబరాబాద్ కమిషనర్‌కు నోటీసులు, తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశం

Arun Charagonda

సీఎంఆర్ కాలేజీ ఘటనపై స్పందించింది మహిళా కమిషన్. సైబరాబాద్ కమిషనర్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాలేజీ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Rythu Bharosa Applications: రైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే..జనవరి 5 నుండి దరఖాస్తులు తీసుకునే అవకాశం, ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Arun Charagonda

రైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే. రైతు భరోసాపై ముగిసిన కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం ముగిసింది.

Khel Ratna Award 2024: మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలు వీరే, జనవరి 17 వ తేదిన రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డుల ప్రదానోత్సవం

Hazarath Reddy

ప్యారిస్ ఒలింపిక్ విజేత మను భాకర్, చెస్ ప్రపంచ ఛాంపియన్ డి గుకేశ్, హాకీ లెజెండ్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌ల‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వ‌రించింది.ఈ విజేతలకు జనవరి 17 వ తేదిన రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

MP Kirankumar Reddy: రేవంత్ రెడ్డి పాన్‌ ఇండియా సీఎం... కేటీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్తారు, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మండిపాటు

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్ట్ తో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారు అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసిందన్నారు.

Advertisement
Advertisement