News
RJ Shekar Bhasha Arrest: బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అరెస్ట్, హర్షసాయి కేసులో బాధితురాలి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
VNSబాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు సంబంధించి యూట్యూబ్ ఛానెల్స్‌లో అసత్య ప్రచారం చేసినందుకు ఆర్జే శేఖర్‌పై యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ICC Women's T20 World Cup 2024: ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి న్యూజిలాండ్, ఉత్కంఠభరిత పోరులో 8 పరుగుల తేడాతో విజయం
VNSమహిళల టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో సీజన్‌లో మరో ఉత్కంఠ పోరు. ‘నువ్వా నేనా’ అన్నట్టు సాగిన రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో జయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్వల్ప ఛేదనలో టాపార్డర్ విఫలమైన వేళ జట్టును గెలపించేందుకు ఆల్‌రౌండర్ డియాండ్ర డాటిన్ (33) విశ్వ ప్రయత్నం చేసింది.
Satyendar Jain Walks out of Tihar Jail: రెండేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి, ఘనంగా స్వాగతం పలికిన ఢిల్లీ సీఎం అతిషి, ఇతర నేతలు (వీడియో ఇదుగోండి)
VNSమనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌కు (Satyendar Jain bail) భారీ ఊరట లభించింది. ఢిల్లీ మాజీ మంత్రి అయిన సత్యేందర్ జైన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదైన కేసులో ఆయన దాదాపు 18 నెల జైలులో ఉన్నారు.
Hyderabad: వీడియో ఇదిగో, తన ఆటోలో మందు తాగవద్దు అన్నందుకు డ్రైవర్‌పై బీర్ బాటిల్‌తో దాడి, పోలీసులపై రాళ్లు విసిరిన మందుబాబులు
Hazarath Reddyకొండాపూర్ రాఘవేంద్ర కాలనీ గుడ్ టైం లిక్కర్ స్టోర్ వైన్స్ వద్ద మద్యం మత్తులో యువకుల హల్ చల్.తన ఆటో లో మందు తాగకూడదు అన్నందుకు ఆటో డ్రైవర్ పై దాడి చేసిన మందుబాబులు.మద్యం మత్తులో ఆటో ఓనర్ పై బీర్ బాటిల్ తో దాడి
Viral Video: వీడియో ఇదిగో, రాడ్‌తో ఏటీఎం మిషన్ తెరిచేందుకు ప్రయత్నించిన దొంగ, ఓపెన్ కాకపోవడంతో నిరాశగా అక్కడి నుంచి వెళ్లిన విజువల్స్ వైరల్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో తిరుపతి రూరల్ (మం) చెర్లోపల్లిలో జరిగినట్లుగా తెలుస్తోంది. చెర్లోపల్లిలో ఓ దొంగ హిటాచీ ఏటిఎం లో చోరికి విఫలయత్నం చేశాడు.రాడ్ తో మిషన్ తెరెచేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు.
Weather Update: అక్టోబరు 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాయుగుండంగా మారే అవకాశం, ఏపీపై ప్రభావం ఎంతవరకు అంటే..
Hazarath Reddyఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడు, వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అలర్ట్ జారీ చేసింది. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) స్పందించింది.
Telangana: అసలు ఏంటీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ? పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 29 వల్ల కలిగే నష్టాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జీవో 29 రద్దు పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.
Telangana: అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు, ఎగ్జామ్స్ వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyగ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అక్టోబరు 21న నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మార్గం సుగమమైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించడంతో షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలు జరగనున్నాయి
Rats Found in IIT Roorkee Kitchen: ఐఐటీ హాస్టల్ మెస్‌లో జలకాలడుతున్న ఎలుకలు, బిత్తరపోయి ఆహారం బయట తిన్న విద్యార్థులు, వీడియోలు ఇవిగో..
Hazarath ReddyIIT రూర్కీలోని విద్యార్థులు అక్టోబర్ 17 న రాధాకృష్ణ భవన్ మెస్‌లో వంటగది పాత్రల చుట్టూ ఎలుకలు తిరుగుతున్నట్లు చూపిస్తూ షాకింగ్ చిత్రాలు మరియు వీడియోలు వెలువడిన తర్వాత నిరసనలు చేపట్టారు. పాన్‌లు, బియ్యం మరియు ఇతర రేషన్‌లపై ఎలుకలు తిరుగుతున్నట్లు ఫుటేజీలో చిత్రీకరించబడింది,
Gautam Adani Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ ఆదానీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళం అందజేత
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ ఆదానీ. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి భారీ విరాళాన్ని అందజేశారు. రూ. 100 కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో సీఎంకు అందజేశారు అదానీ.
Chandrababu Slam Jagan: మోదీ నుంచి మనం చాలా నేర్చుకోవాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని వెల్లడి
Hazarath Reddyమంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు.
KTR on Musi River: మూసి బ్యూటిఫికేషన్ కాదు లూసిఫికేషన్, గ్రాఫిక్స్ మాయాజాలంతో నానా తంటాలు పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మూసీ రివర్ ప్రాజెక్టుపై కేటీఆర్ పవన్ పాయింట్ ప్రజెంటేషన్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని ప్రజలకు తెలిసిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మూసి రివర్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో, ఏం చేయాలో తెలియక, గ్రాఫిక్స్ మాయాజాలంతో సీఎం రేవంత్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారన్నారు.
KA Paul: తెలంగాణలోని కొందరు ఎమ్మెల్యేలపై కేసు వేశా, చంపుతామని బెదిరిస్తున్నారు కేఏ పాల్ సంచలన కామెంట్
Arun Charagondaప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణాలో కొందరు ఎమ్మెల్యేలపై కేసు వేశాను...నేను వేసిన కేసులు విత్‌డ్రా చేసుకోవాలని లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. గతంలోనూ ఇలానే బెదిరింపులు వచ్చాయని... తనని తాను తగ్గించుకున్న వాడు ధన్యుడు.. పవన్‌కళ్యాణ్ అదే అంటాడు కానీ తగ్గడు అన్నారు.
Hyderabad: అశోక్‌నగర్‌లో గ్రూప్ 1 అభ్యర్థుల అరెస్ట్, జీవో 29 రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న వారిపై లాఠీ ఝుళిపించిన పోలీసులు, మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్
Arun Charagondaహైదరాబాద్, అశోక్ నగర్‌లో గ్రూప్ 1 అభ్యర్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. జీవో 29 రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నవారిపై లాఠీలు ఝుళిపించారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా మెయిన్స్ పరీక్ష వాయిదా వేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Andhra Pradesh: వీడియోలు ఇవిగో, ఉచిత ఇసుక ఎక్కడ బాబు అంటూ జంగారెడ్డిగూడెంలో ట్రాక్టర్ డ్రైవర్లు ధర్నా, ఒంటిపై పెట్రోల్ పోసుకుని డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
Hazarath Reddyజంగారెడ్డిగూడెంలో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. శ్రీనివాసపురం రోడ్ బైపాస్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్భంగా తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Jagan Slams Chandrababu: 5 నెలలు దాటినా సూపర్ సిక్స్ లేదు, దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే చంద్రబాబు పాలన అంటూ మండిపడిన వైఎస్ జగన్
Hazarath Reddyఏపీలో ఇసుక పాలసీపై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ శుక్రవారం మాట్లాడారు. చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత ధ్వజమెత్తారు. కూటమి పాలనలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అన్న చందంగా మారిందని మండిపడ్డారు.
Dalit Bandhu: ప్రజాభవన్ ముందు దళిత బంధు లబ్దిదారుల ఆందోళన, రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్..
Arun Charagondaహైదరాబాద్ ప్రజా భవన్ ముందు ధర్నా చేపట్టారు దళిత బంధు లబ్ధిదారులు. రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని...ఈనెల 23 నా జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దళిత బంధు నిధుల'పై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపు దళిత బంధు నిధులను విడుదల చేయాలని నినాదాలు చేపట్టారు.
Viral Video: వీడియో ఇదిగో, తల్లిదండ్రులకు భయపడి ప్రియుడ్ని ట్రంక్ పెట్టెలో దాచిన ప్రియురాలు, ఆ తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyబీహార్‌లో కుటుంబ సభ్యులకు భయపడి ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Bigg Boss Kannada 11: వివాదంలో కన్నడ బిగ్ బాస్ షో, న్యాయవాది ఫిర్యాదుతో మహిళా కమిషన్ నోటీసులు, బిగ్ బాస్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
Arun Charagondaటెలీవిజన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 11 కన్నడ విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కన్నడ బిగ్ బాస్‌కు కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా ఇప్పుడు ఈ షో నిర్వాహకులకు నోటీసులు జారీ అయ్యాయి. మహిళ కంటెస్టెంట్ల గోప్యతకు భంగం వాటిల్లిందని మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది.
YS Sharmila: ఉచిత బస్సు అమలు ఏది?, సీఎం చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్ షర్మిల, బస్సులో ప్రయాణించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బస్సులో ప్రయాణించిన షర్మిల...ఏపీ లో బాబు అధికారం లోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఉచిత బస్సు అమలు లేదంటూ ప్రశ్నించారు.