News
Secundrabad: ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఉద్రిక్తత, పోలీసుల లాఠిచార్జీ,ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన అధికారులు...వీడియో ఇదిగో
Arun Charagondaసికింద్రాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు అధికారులు. ముత్యాలమ్మ గుడి ఘటనలో ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. ఇక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలిరావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Health Tips: బెల్లం మంచిదా తేనె మంచిదా? ఏది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుందో తెలుసా.
sajayaబెల్లము తేన రెండిట్లో కూడా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. అయితే బెల్లం లో అనేక పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం, ఐరన్, మినరల్స్, వంటివి ఉంటాయి.
Health Tips: చలికాలంలో పిల్లల్లో ఎక్కువగా జలుబు, దగ్గు సమస్య వేధిస్తుంది.. దీనికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం..
sajayaచలికాలం వస్తుందంటే చాలు పిల్లలలో ,పెద్దల్లో కూడా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది.
Health Tips: మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ కషాయాలతో సమస్యకు పరిష్కారం.
sajayaదీర్ఘకాలికంగా చాలామందిలో మోకాళ్ళ నొప్పుల సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా ఒక్కసారి సంభవిస్తాయి.అయితే ఇది ఏ వయసులో వారిని అయినా ప్రభావితం చేస్తుంది.
Health Tips: విటమిన్ డి సమస్యతో బాధపడుతున్నారా. విటమిన్ డి సహజంగా లభించే మార్గాలు.
sajayaమన శరీరానికి ఎంతో ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ డి చాలా ప్రముఖ స్థానంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ,ఎముకల బలానికి, కండరాలను నిర్మాణానికి సహాయపడుతుంది.
Odisha: ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు, ఇంట్లో వారు రావడంతో అడ్డంగా దొరికిపోయింది..వీడియో ఇదిగో
Arun Charagondaప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసింది ప్రియురాలు. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రియురాలు తన ప్రియుడిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి రప్పించింది. అయితే ప్రియుడు వచ్చిన కొద్దిసేపటికే ఇంటి సభ్యులు రావడంతో ఏం చేయాలో తోచక ఓ ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసింది. అయితే అనుమానం వచ్చిన ఇంట్లోని సభ్యులు పెట్టే ఓపెన్ చేసి చూడగా ప్రియుడు బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Singireddy Niranjan Reddy: బండి సంజయ్...కేంద్ర సహాయమంత్రా?..సీఎం రేవంత్ రెడ్డి సలహాదారా?,రేవంత్ కుర్చి గురించి నీకెందుకు బాధని మండిపడ్డ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Arun Charagondaబండి సంజయ్...కేంద్ర సహాయ మంత్రా ?, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారా ? చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రేవంత్ కుర్చీ గురించి .. బండి సంజయ్ కి ఎందుకు బాధ ? చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిని దించేందుకు కాంగ్రెస్ మంత్రులు ప్రయత్నిస్తున్నారు అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు నిరంజన్ రెడ్డి.
Palakurthi: పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి, తన చావుకు సీఐ,ఎస్‌ఐలే కారణమని సెల్ఫీ వీడియో
Arun Charagondaపోలీస్ స్టేషన్లో న్యాయం జరగడంలేదని పోలీసుల ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి చెందాడు. చనిపోయే ముందు పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ లే.. నా చావుకు కారణం అంటూ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు.
Palakurthi: పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యా యత్నం, కుటుంబ సమస్యలతో పెట్రోల్‌తో నిప్పంటించుకున్న యువకుడు,కాపాడబోయిన ఎస్సై- కానిస్టేబుల్‌కు గాయాలు
Arun Charagondaజనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లాకవత్ శీను(22) పెట్రోల్ పోసుకొని అగాయత్యానికి పాల్పడ్డారు.
Kurnool:కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ వర్షం,జలమయమైన లోతట్టు కాలనీలు, నీట మునిగిన వాహనాలు..వీడియో ఇదిగో
Arun Charagondaకర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా గంటపాటు వర్షం కురవడంతో పట్టణం లోని ప్రధాన కూడలి అయినా సోమప్ప సర్కిల్ ల్లో భారీగా వర్షం నీరు చేరడంతో వాహ నదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజి నిండి పోవడంతో వర్షం నీరుతో కాలనీలు అంత జలమయమయ్యాయి.
Raids On Chutneys: వామ్మో! కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు.. చట్నీస్ రెస్టారెంట్ పై కేసు నమోదు
Rudraహైదరాబాద్ లో బయట భోజనం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు ఆహార కల్తీ అధికమవ్వడమే దీనికి కారణం. కుల్లిన కూరగాయలు, మాంసం, నాసిరకమైన పదార్థాలతో ఆహారాన్ని తయారుచేస్తూ కొందరు కక్కుర్తికి పాల్పడుతున్నారు.
Hyderabad Horror: నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. హైదరాబాద్ లో ఘోరం
Rudraహైదరాబాద్ లో ఘోరం జరిగింది. నడి రోడ్డుపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై బ్లేడ్ తో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది.
Lady Aghori: కీసరగుట్టలో మహిళా అఘోరి, ఒంటి కాలిపై నిలబడి శివుడికి ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు
Arun Charagondaమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరగుట్టలో శుక్రవారం మహిళా అఘోరి ప్రత్యక్షమయ్యారు. శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామికి స్వయంగా తన చేతులతో భస్మాభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ మహిళా అఘోరి కొండపైన వెలిసిన శివలింగాలను స్పృశిస్తూ శివలింగాన్ని తాకి ఆనంద పరవశంలో ఒంటి కాలిపై నిలబడి ఆ దేవదేవుడిని ధ్యానించారు.
Chaddi Gang In Ongole: ఒంగోలులో చెడ్డి గ్యాంగ్ హల్ చల్..35 టీంలు,400 మంది పోలీసులతో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు
Arun Charagondaఒంగోలులో చెడ్డి గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. రామ్ నగర్ లోని నర్సింగ్ కాలేజిలో రూ.50 వేలు ఎత్తికెళ్లారు దొంగలు. రావు అండ్ నాయుడు ఇంజనిరింగ్ కాలేజిలోకి కూడా చొరబడింది చెడ్డి గ్యాంగ్. 35 టీములు, 400 మంది పోలీసులు తనిఖీలు చేపట్టగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తాన్ని అలర్ట్ చేశారు పోలీసులు.
Pochamma Temple Vandalized: హైదరాబాద్ మీర్ పేట లో పోచమ్మ తల్లి ఆలయం ధ్వంసం.. దుండగుడిని చితకబాదిన స్థానికులు (వీడియో)
Rudraఆందోళన కలిగించేలా ఆలయాల ధ్వంసరచన కొనసాగుతున్నది. హైదరాబాద్ లో మరో ఆలయాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో ఈ ఘటన జరిగింది.
Hyderabad: పులి కాదు పిల్లి...మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత సంచారం ఉత్తదే అని తేల్చిన అటవీ శాఖ అధికారులు...
Arun Charagondaనిన్న మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత తిరిగినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది చిరుత కాదు అడవి పిల్లి అని తేల్చేశారు అటవీశాఖ అధికారులు. హైదరాబాద్ - మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారంతో భయాందోళనలో స్థానికులు ఉండగా పోలీసులకు సమాచారం అందించారు.
Car Accident: బ్రేకులకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు.. అంతే.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. జనగామలో ఘటన (వీడియో)
Rudraఅతను కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. మాస్టర్ సరిగానే డ్రైవింగ్ సూచనలు ఇస్తున్నాడు. ఇంతలో ఓ చెరువు వచ్చింది. బ్రేకులు వెయ్యాలని స్టూడెంట్ కు మాస్టర్ ఆర్డర్ చేశాడు.
Car Accident: హైదరాబాద్ ప్రజాభవన్ ముందు కారు బీభత్సం.. అతివేగంగా వచ్చి రోడ్డుపై పల్టీ కొట్టిన కారు.. యువకులకు గాయాలు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ప్రజాభవన్ ముందు కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై పల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న యువకులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు.
Nude Video Call: తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి నగ్నంగా ఉన్న మహిళ నుంచి వీడియో కాల్.. కంగుతిన్న ఎమ్మెల్యే.. పోలీసులకు ఫిర్యాదు
Rudraఅతనో ఎమ్మెల్యే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు.
Leopard Spotted near Miyapur Metro: వామ్మో హైదరాబాద్ లో చిరుత సంచారం, మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక తిరుగుతోందని వార్తలు, ఫోన్ లో వీడియోలు తీసిన స్థానికులు
VNSఅడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో చిరుత సంచరించింది.