News

Unstoppable With NBK: నేడే ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ ప్రారంభం..సీఎం హోదాలో గెస్ట్‌గా చంద్రబాబు!

Arun Charagonda

ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ నేటి నుండి ప్రారంభంకానుంది. సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా సీఎం చంద్రబాబు వస్తుండగా చంద్రబాబును బాలయ్య ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేదానిపై ఆసక్తి నెలకొంది.

Jagtial: యాప్ మోసం, రూ.లక్షాన్నర వరకు మోసం..యాప్ లాక్ అవడంతో లబోదిబోమంటున్న బాధితులు...వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఆర్.జీ.ఎస్ అనే యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు.తనతోపాటు తన భందువులు ఆరుగురితో పెట్టుబడి పెట్టించారు సంతోష్. సుమారు లక్షాన్నర వరకు మోసం,యాప్ లాక్, అవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.రెండు నెలలుగా జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు,ఇంగ్లాండ్ నుండి డబ్బులు వస్తాయని నమ్మించిన మోసగాళ్లు..తీరా యాప్ లాక్ అవడంతో నిండా మోసపోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Road Accident in Rajasthan: రాజస్థాన్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం.. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు

Rudra

రాజస్థాన్‌ లోని ధోల్‌పూర్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Raids in Nizamabad: స్టార్ హోటల్స్ లో 122 కిలోల కుళ్లిన మాంసం.. ప్రమాదకరమైన రంగులు కలిపిన చికెన్.. నిజామాబాద్ లో ఘోరం (వీడియోతో)

Rudra

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమార్కులు ఆహార నాణ్యతకు తిలోదకాలు పెడుతున్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Advertisement

Beard Hatao: గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్ కావాలి, ఇండోర్‌లో అమ్మాయిల వినూత్న నిరసన..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

ఇండోర్ అమ్మాయిలు వినూత్న నిరసన చేపట్టారు. అందంగా కనిపించేందుకు అబ్బాయిల్లో కొందరు చిన్నగా గడ్డం పెంచడం ఫ్యాషన్ గా భావిస్తుండగా మరికొందరు గడ్డం తీసేసి క్లీన్ షేవ్ తో కనబడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మాయిల్లో కొందరు గడ్డంతో ఉండే అబ్బాయి లను ఇష్టపడితే, మరికొందరు క్లీన్ షేవ్ తో ఉండే అబ్బాయిలను కోరుకుంటారు. అయితే తాజాగా ఇండోర్ లోని ఓ అమ్మాయిల బృందం మాత్రం గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి అంటూ, వీధుల్లో ర్యాలీ తీసి మరి తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చాటడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Blast in Delhi School: ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వ‌ద్ద పేలుడు.. పోలీసులు అప్ర‌మ‌త్తం (వీడియోతో)

Rudra

దేశ రాజ‌ధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రోహిణీలోని సీర్పీఎఫ్ స్కూల్ స‌మీపంలో ఆదివారం ఉద‌యం 7.50 ప్రాంతంలో భారీ పేలుడు సంభ‌వించింది.

Revanth Reddy On Cyber Crimes: పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు.. ఇదొక భావోద్వేగం, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలను మరిచిపోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతో మంది త్యాగాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

AP Jawan Martyred: ఛత్తీస్‌ గఢ్‌ లో అమరుడైన ఏపీకి చెందిన జవాన్‌.. నేడు స్వగ్రామానికి చేరుకోనున్న జవాన్ పార్దీవదేహం

Rudra

ఛత్తీస్‌ గఢ్‌ లో ఘోరం జరిగింది. మావోయిస్టులు అమర్చిన మైనింగ్‌ బాంబు పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ అమరుడయ్యారు.

Advertisement

Navya Haridas: వయనాడ్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక వాద్రాతో తలపడనున్న నవ్య హరిదాస్

Arun Charagonda

వయనాడ్ ఎంపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌ని ప్రకటించింది బీజేపీ. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ నుంచి పోటీ చేసి ఓడిపోరాఉ నవ్య. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2007లో బీటెక్ పూర్తి చేసి మెకానికల్ ఇంజనీర్ గా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు.

Scissors in Abdomen: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ కడుపులో 12 ఏళ్లుగా రెండు కత్తెరలు.. సిక్కింలో దారుణం

Rudra

ఓ వైద్యుడి నిర్లక్ష్య వైఖరితో ఓ మహిళ కడుపునొప్పితో పుష్కరకాలంపాటు తీవ్ర ఇబ్బంది పడింది. శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలను పొరపాటున మహిళ పొత్తి కడుపులో ఉంచి కుట్లు వేయడమే దీనికి కారణంగా తెలుస్తుంది.

Nagarjuna Sagar: ఎగువ నుంచి ప్రవాహం.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేత.. వీకెండ్ కావడంతో సందడిగా పరిసరాలు

Rudra

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతున్నది. ఈ క్రమంలో అటు శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు.. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తారు.

Badvel Horror Update: ప్రేమ పేరుతో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటన.. చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు

Rudra

అతనికి పెండ్లయ్యింది. భార్య గర్భిణి. అయితే ఏంటి? ప్రేమ పేరుతో ఆ మృగాడు రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా.. చంపేయమంటావా? అంటూ ఓ ఇంటర్ విద్యార్థినికి అల్టిమేటం జారీ చేశాడు.

Advertisement

GST Rejig Proposed: ప‌లు వ‌స్తువుల‌పై జీఎస్టీ త‌గ్గింపు, సైకిళ్లు, వాట‌ర్ బాటిళ్లు, నోట్ బుక్స్ స‌హా ప‌లు వ‌స్తువులు, సేవ‌ల‌పై జీఎస్టీ స‌వ‌ర‌ణ‌, ఏవేవి పెరుగుతాయి..ఏవేవి త‌గ్గుతాయంటే?

VNS

వస్తువులకు జీఎస్‌టీ మాత్రమే కాకుండా.. అదనంగా సెస్‌ను కూడా విధిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్ భీమా కవరేజీకి జీఎస్‌టీలో మినహాయింపు ఉండవచ్చు.

Jharkhand Assembly Elections 2024: జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జోరు పెంచిన బీజేపీ, ఒకేసారి 66 స్థానాల‌కు అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌, చంపై సోరెన్ పోటీ చేసేది ఇక్క‌డి నుంచే..

VNS

జార్ఖండ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ తమ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను (BJP Releases First List) ప్రకటించింది. జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలు ఉండగా.. 66 మందితో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేసింది

Kadapa Horror: ప్రేమ‌ను ఒప్పుకోలేద‌ని యువ‌తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆటో డ్రైవ‌ర్, క‌డ‌ప‌లో దారుణ ఘ‌ట‌న (వీడియో ఇదుగోండి)

VNS

గోపవరం అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.

Nayva Haridas As Wayanad By Election BJP Candidate: ప్రియాంక గాంధీపై బీజేపీ ఫైర్ బ్రాండ్ పోటీ, వ‌య‌నాడ్ బీజేపీ అభ్య‌ర్ధి పేరు ప్ర‌క‌టించిన బీజేపీ

VNS

వ‌య‌నాడ్ బై ఎల‌క్ష‌న్‌లో త‌మ పార్టీ త‌ర‌ఫున కేర‌ళ రాష్ట్ర బీజేపీ మ‌హిళా మోర్చా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అయిన న‌వ్య హ‌రిదాస్‌ (Navya Haridas)ను ఖ‌రారు చేసింది. త‌న‌ను ప్రియాంక‌కు పోటీ అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌డం ప‌ట్ల న‌వ్య సంతోషం వ్య‌క్తం చేసింది.

Advertisement

Astrology: అక్టోబర్ 22 నుండి బుధుడు ఒకే నెలలో మూడుసార్లు సంచరిస్తాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలివితేటలు అందం కమ్యూనికేషన్ వ్యాపారానికి సంబంధించినది. బుధ గ్రహం అయితే బుధ గ్రహం అక్టోబర్ 22న విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది

Tummala Nageshwarrao: ఈ ఖరీఫ్‌ సీజన్‌కు రైతు భరోసా లేదు, ప్రతీ రైతుకు రూ.500 బోనస్‌ ఇస్తాం, కాంగ్రెస్ హామీలన్ని నెరవేరుస్తామన్న మంత్రి తుమ్మల

Arun Charagonda

ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేదు అని తేల్చి చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు ₹500 లు బోనస్ ఇస్తాం...పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వం అన్నారు. పంట వేయని భూములకు ₹25 వేల కోట్లు గత ప్రభుత్వం ఇచ్చింది...రైతు భరోసా 7500 క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇస్తాం అన్నారు.

Nagarkurnool:  తన ముందు తల దువ్వుకున్నారని యువకులకు గుండు గీయించిన ఎస్సై, నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన

Arun Charagonda

తన ముందు తల దువ్వుకున్నారని ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. నాగర్‌ కర్నూల్‌ - లింగాలలో పెట్రోల్‌ బంక్‌ సిబ్బందితో గొడవపడ్డారు యువకులు. పీఎస్‌కు తీసుకెళ్లి పోలీసుల వార్నింగ్‌.. తన ముందు యువకులు తల దువ్వుకున్నారని ఎస్సై జగన్‌ ఆగ్రహం చెంది ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయగా పరిస్థితి విషమంగా మారింది.

Astrology: కుజ గ్రహం నవంబర్ 6వ తేదీన తిరోగమనం వల్ల మూడురాశుల వారికి అద్భుత లాభాలు.

sajaya

ప్రతి గ్రహం తన రాశిని తన కాలాను ఘనంగా మారుస్తూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా తిరోగమనడంలో కూడా కదులుతాయి. నవంబర్ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు కుజుడు తీరుగమనంలోనికి వెళతాడు.

Advertisement
Advertisement