News

MG Astor Prices Hike: రూ. 27 వేలు పెరిగిన ఎంజీ ఆస్టర్ ఎస్‌యూవీ కారు ధర, ఈ ఏడాదిలో పెరగడం ఇది నాలుగోసారి..

Vikas M

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్‌యూవీ ఎంజీ ఆస్టర్ (MG Astor) ధర రూ.27 వేలు పెంచేసింది. 49 పై చిలుకు సేఫ్టీ ఫీచర్లతోపాటు 14 లెవల్-2 అడాస్ ఫీచర్లు, పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌తో ఈ కారు వస్తోంది. ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్‌యూవీ కారు ధర పెంచడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

Andhra Pradesh: దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తాం, ఏడాదికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్

Arun Charagonda

ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని దీపావళి నుండి ప్రారంభిస్తాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మీడియాతో మాట్లాడిన నాదెండ్ల..అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందివ్వనున్నాం అని చెప్పారు. ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. .. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం అన్నారు.

Mohammed Shami: వరల్డ్ కప్ హీరో మొహమ్మద్ షమీ మళ్లీ వచ్చేస్తున్నాడు, గాయం నుంచి కోలుకుని నెట్స్ లో బౌలింగ్ చేస్తున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

స్టార్ ఇండియన్ పేసర్ మొహమ్మద్ షమీ మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు ఇటీవల నివేదించబడింది, ఇది రాబోయే భారతదేశం vs ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం టీం ఇండియా టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలను అనిశ్చితికి గురి చేసింది

Toyota Glanza: త్వరపడండి రూ.6.68 లక్షల ధరకే టయోటా గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారు, ఫీచరు, ఇతర వివరాలు ఇవిగో..

Vikas M

ప్రముఖ కార్ల దిగ్గజం టయోటా.. గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లలో ఆవిష్కరించింది. అయితే లిమిటెడ్ యూనిట్లు మాత్రమే తీసుకొస్తోంది. రూ.20,567 విలువైన కాంప్లిమెంటరీ విడి భాగాలతో ఈ నెలాఖరు వరకూ బుక్ చేసుకున్న వారికి కార్లు డెలివరీ చేస్తుంది.

Advertisement

Telangana: డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టలేం, భద్రతకు భరోసా ఇస్తామంటేనే ముందుకు కదులుతామని తేల్చిచెప్పిన ఏఈవోలు..

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వేకు ఆరంభంలోనే ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు(AEO).శామీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో సమావేశమయ్యారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఈవోలు.

Ramandeep Singh Catch Video: క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుత క్యాచ్‌, శరీరం మొత్తం గాలిలోనే ఉంచి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ అందుకున్న భారత్ ఏ ఆటగాడు ర‌మ‌ణ్ దీప్

Vikas M

ఒమన్‌లోని మస్కట్‌లో పాకిస్థాన్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మిడ్ వికెట్ బౌండరీ వద్ద భారత్ ఏ ఆటగాడు రమణ్ దీప్ సూపర్ క్యాచ్ పట్టాడు. పాక్ ఇన్నింగ్స్ 9 ఓవ‌ర్‌లో స్పిన్నర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాల్ వచ్చిన వేగాన్ని గమనించిన రమణ్ దీప్ గాలిలోకి డైవ్ చేశాడు.

Jio Loses 10.9 Million Subscribers: రీఛార్జ్ ధరల పెరుగుదలతో జియోకి షాకిచ్చిన సబ్‌స్క్రైబర్లు, 10.9 మిలియన్ల మంది రిలయన్స్ జియో నుంచి బయటకు

Vikas M

బహుళ నివేదికల ప్రకారం, రిలయన్స్ జియో దాని రీఛార్జ్ ప్లాన్‌ల ధరల పెరుగుదల కారణంగా రెండవ త్రైమాసికంలో 10.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. అయినప్పటికీ, కంపెనీ ఇప్పటికీ బలమైన పనితీరును కలిగి ఉంది, 130 మిలియన్ల నుండి 147 మిలియన్ల వినియోగదారులకు అధిక కస్టమర్ బేస్ను పొందింది.

Rishabh Pant Six Video: వీడియో ఇదిగో, రిషబ్ పంత్ సిక్స్ కొడితే స్టేడియం పైకప్పు మీద పడింది, ఏకంగా 107 మీటర్లు సిక్స్ బాదిన భారత స్టార్

Vikas M

భారత్- న్యూజిలాండ్‌ జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. చివరికి ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకుని 99 పరుగుల వద్ద కివీస్ పేసర్ విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

Advertisement

CM Revanth Reddy: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుదాం, అందరూ సహకారం అందించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంచి నాయకుడిగా ఎదగడంలో ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ఐఎస్‌బీ నిర్వహించిన నాయకత్వ సదస్సులో పాల్గొన్న సీఎం...లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగించారు.

Astrology: అక్టోబర్ 26న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశిలో సూర్యుని సంచారం చాలా మంచిది. తుల రాశిలోకి సూర్యుని సంచారం కారణంగా అన్ని రాసి చక్రాల పైన ప్రభావం ఉంటుంది.

Astrology: అక్టోబర్ 28న గురుడు రోహిణి నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశులు వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే కొన్నిసార్లు రాసి మార్పు వల్ల అన్ని వారి రాశులు పైన ప్రభావాలు ఉంటాయి. అయితే అక్టోబర్ 28న మధ్యాహ్నం ఒంటిగంటకు గురు గ్రహం రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.

Health Tips: ఆరోగ్యంగా ఉండడానికి ఒక రోజులో మన శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరమో తేలుసా..

sajaya

ప్రతి మనిషికి వారి వారి పనులను బట్టి వారికి క్యాలరీలో అవసరం ఉంటాయి. అయితే వీటి ద్వారానే మనకు పోషకాహారం లభిస్తుంది. ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం అంత మంచిది కాదు.

Advertisement

Health Tips: ఈ అలవాట్లను వెంటనే మానుకోకపోతే ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు .

sajaya

కొన్నిసార్లు మనం చేసే పొరపాట్ల వల్ల ప్రమాదకరమైన వ్యాధులు కారణమవుతాయి.. కొన్ని అలవాట్లను మానుకున్నట్లయితే ప్రేగు క్యాన్సర్ నుంచి దూరమవ్వచు.

Talasanai Srinivas yadav:ముత్యాలమ్మ విగ్రహ విధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్న తలసాని శ్రీనివాస్ యాదవ్

Arun Charagonda

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన ఆందోళన పై స్పందించారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ముత్యాలమ్మ విగ్రహ విధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Health Tips: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనిపించే సంకేతాలు ఏంటో తెలుసా.

sajaya

మనకు వచ్చే అన్ని జబ్బులకు మొదటి కారణం కొలెస్ట్రాల్ చెరు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె పోటు బ్రెయిన్ స్ట్రోక్ వంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి.

Farmers Protest On Rythu Bharosa: తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆందోళన, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్, రాజీవ్ రహదారిపై రాస్తారోకో

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దిపూర్ గ్రామంలో డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శవ యాత్రను ఊరేగింపుగా నిర్వహించి చౌరస్తాలో దగ్ధం చేశారు రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.

Advertisement

Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబుకి అవమానం, యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో లేని చంద్రబాబు పేరు...సీఎం పేరునే మర్చిపోయి తప్పు చేసిన అధికారులు

Arun Charagonda

ఏపీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుకు అవమానం జరిగింది. యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు పెట్టకుండా ప్రోటోకాల్ పాటించలేదు అధికారులు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరు ముద్రించలేదు. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరును మరిచిపోవడం చర్చనీయాంశంగా మారింది.

Viral Video: India vs Newzeland: టెస్ట్ మ్యాచ్ మధ్యలో జస్ ప్రీత్ బూమ్రా చేసిన పనికి అందరూ షాక్...కెప్టెన్ రోహిత్ శర్మ సైతం చూస్తూ ఉండిపోయాడు..వైరల్ వీడియో..

sajaya

ఈ రోజు ప్రారంభంలో టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత్‌ లో ఆశలు రేపాడు. కివీస్ టీమ్ కెప్టెన్ టామ్ లాథమ్‌ ను రెండో బంతికే LBW ఔట్ చేశాడు. మొదట అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా, కెప్టెన్ రోహిత్ శర్మ అప్పీల్ చేయడంతో థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించారు.

IND vs NZ 1st Test: బెంగళూరు టెస్టులో టీమిండియా ఓటమి, 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్...3 టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలో న్యూజిలాండ్

Arun Charagonda

బెంగళూరు తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైంది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందగా 3 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది న్యూజిలాండ్. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 46, రెండో ఇన్నింగ్స్ 462 పరుగులు చేయగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402, రెండో ఇన్నింగ్స్‌ 110/2 పరుగులు చేసి గెలుపొందింది.

Vikarabad: గోల్డ్ మాయం చేసిన మేనేజర్, వికారాబాద్ మణప్పురం బ్రాంచ్‌లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్, బాధితుల ఆందోళన...వీడియో

Arun Charagonda

వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం లో మనప్పురం గోల్డ్ లోన్ లో బంగారం ఎత్తుకెళ్లారు మేనేజర్ విశాల్. దీంతో బాధితులు ఆందోళన చేపట్టారు. చోరికి గురైన బంగారం విలువ మూడు కోట్ల 25 లక్షలు ఉన్నట్లు అంచనా. .

Advertisement
Advertisement