దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,20,958 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,573 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,47,07, 525కి చేరింది.
ఇక దేశంలో యాక్టివ్ కేసులు (Active Cases) 11వేలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం 10,981 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ (Ministry of Health) అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కరోనా కారణంగా ఒక్క కేరళ (Kerala)లోనే నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,841కి చేరింది. మరోవైపు కరోనా మహమ్మారి నుంచి 4,41,65,703 మంది కోలుకున్నారు.
అధికమవుతున్న యూపీఐ మోసాలు, ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ డబ్బు భద్రంగా ఉంటుంది
ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 (220,65,65,361) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) వెల్లడించింది.