Hyderabad, JAN 10: పాన్ ఇండియా నటుడు ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్ (Raaja Saab). టాలీవుడ్ డైరెక్టర్ భలే భలే మొగాడివోయ్ ఫేమ్ మారుతి (Maruthi) దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ ఆలస్యం అవ్వడం.. పోస్ట్ ప్రోడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో ఈ చిత్రం ఏప్రిల్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా అధికారిక విడుదల తేదీని సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్‌తో ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు.