Delhi, January 10: హెచ్1 బి వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త నిబంధనలతో జనవరి 17 నుండి హెచ్ 1బీ వీసాలను జారీ చేసేందుకు రెడీ అవుతోంది అగ్రరాజ్యం అమెరికా. వాస్తవానికి హెచ్ 1బీ వీసా అనేది అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేసేవారికి ఇచ్చే కీలకమైన డాక్యుమెంట్. ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో ఇండియా నుంచి అమెరికాలో స్థిరపడేవారికి ఈ వీసా ఉండాల్సిందే.
కొత్త తీసుకున్న ఈ నిబంధనల ద్వారా ఐటీ, ఫైనాన్స్, ఫార్మా కంపెనీల అవసరాలు తీర్చేందుకు మరింత దోహదపడనున్నాయి. అంతేగాదు వీసా ప్రక్రియను ఎంత సులభతరం చేస్తే అంత ఈజీగా వీసా పొందే అవకాశముంటుంది. కొత్తగా చేపట్టిన మార్పులు, తీసుకొస్తున్న నిబంధనలతో హెచ్1బీ వీసా కోసం అప్లై చేసే కంపెనీలు లేదా ఉద్యోగులు ఫామ్ ఐ 129 వినియోగించాల్సి ఉంటుంది. వీడియోలు ఇవిగో, మక్కాలో వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, సౌదీ అరేబియాను ముంచెత్తిన భారీ వర్షాలు, ప్రభావిత ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ
వీసా కోసం అప్లై చేసేటప్పుడు విదేశీ సిబ్బంది తాను చేసే ఉద్యోగానికి కావల్సిన డిగ్రీని పొంది ఉండాలి. నాన్ ప్రోఫిట్ ప్రభుత్వ రీసెర్చ్ సంస్థలకు హెచ్ 1బీ వీసాల వార్షిక పరిమితి ఉండదు. మినహాయింపు ఉంటుంది. ఎలిజిబిలిటీ కూడా మారవచ్చు.
అమెరికాలో ప్రతి ఏటా 65 వేల హెచ్1 బీ వీసాలు జారీ అవుతున్నాయి. ఎఫ్ 1 వీసాతో చదువు నిమిత్తం వచ్చేవారు వీసా కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే హెచ్1 బీ వీసా ఉండి ఇంకోసారి అప్లై చేస్తుంచే అమెరికా ప్రభుత్వం వెంటనే ఆమోదిస్తుంది.