Hyderabad, Jan 10: ‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాట గుర్తుందా? సుస్వాగతం సినిమాలోని ‘హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు’ పాటలను మర్చిపోగలమా? ఇలాంటి అద్భుత పాటలను ఆలపించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన గాయకుడు పి.జయచంద్రన్ కన్నుమూశారు (Jayachandran Passes Away). ఆయన వయసు 80 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి త్రిసూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కేరళకు చెందిన జయచంద్రన్ మలయాళంతోపాటు తెలుగు(Telugu), హిందీ, తమిళం, కన్నడ భాషల్లో 16 వేలకు పైగా పాటలు పాడారు. జయచంద్రన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Famous playback singer P. Jayachandran passes away in a hospital in #Thrissur. He was 80 years old.
He sang more than 16,000 songs in Tamil, Malayalam, Telugu, Hindi and Kannada languages in his career spanning over six decades.#PJayachandran pic.twitter.com/jqsvNFwo9F
— All India Radio News (@airnewsalerts) January 9, 2025
జాతీయ అవార్డు కూడా
1986లో శ్రీ నారాయణ గురు సినిమాలోని పాటకు గాను బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే, రెండు తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్ అవార్డులు కూడా అందుకున్నారు. ఇళయరాజా, ఏఆర్ రహమాన్, ఎంఎం కీరవాణి, విద్యాసాగర్, కోటి తదితరుల సంగీత దర్శకత్వంలో జయచంద్రన్ ఎన్నో పాటలు పాడారు. ఆయన మృతిపై ప్రముఖులు సంతాపం తెలిపారు.