Politics
PM Modi In UAE: మోదీగా మీకు గ్యారెంటీ ఇస్తున్నా, మూడో టర్మ్‌లో భారత్‌‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారుచేస్తా, యూఏఈలో అహ్లాన్ మోదీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ఉన్నారు . ఈ సందర్భంగా ఆయన 'అహ్లాన్ మోదీ' కార్యక్రమంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
CM Revanth Reddy Slams KCR: కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది, కాలు విరిగిందని తప్పించుకున్నా వదిలిపెట్టేది లేదు, మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyరూ. 95 వేల కోట్లను ఖర్చు చేస్తే... 97 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (CM Revanth Reddy Slams KCR) ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ సీఎం అన్నారు.
Nalgonda BRS Public Meeting: పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు, నల్గొండ సభలో ధ్వజమెత్తిన కేసీఆర్, తెలంగాణ కోసం ఎందాకైనా వెళతానని స్పష్టం
Hazarath Reddyకేసీఆర్ మాట్లాడుతూ..ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు.కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం (I will not allow injustice to Telangana) వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. చ‌లో న‌ల్ల‌గొండ స‌భ రాజ‌కీయ స‌భ కానేకాదు.. ఉద్య‌మ స‌భ‌, పోరాట స‌భ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు.
Nalgonda BRS Meeting: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి, నల్లచొక్కాలు ధరించి ‘గోబ్యాక్‌ గోబ్యాక్‌’ అంటూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నినాదాలు
Hazarath Reddyకృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. నల్గొండ జిల్లా వీటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది.
YV Subba Reddy on Capital: విశాఖ రాజధాని అయ్యేవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి
Hazarath Reddyరాష్ట్ర రాజధాని మీద వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడా గడువు కూడా పూర్తి కావొస్తోంది. రాష్ట్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు.
Ashok Chavan Joins BJP: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌, రాజ్యసభ సీటు ఖరారైనట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌ బీజేపీలో చేరారు. ముంబైలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సమక్షంలో మంగళవారం ఆయన కాషాయ తీర్థం పుచుకున్నారు.కాగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మరుసటి రోజే బీజేపీలో చేరిన చవాన్‌ను కాషాయ పార్టీ రాజ్యసభకు నామినేట్‌ చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
Qatar - 8 Indian Navy Veterans: ఆ 8 మంది భారతీయులను ఖతార్ విడిపించడం వెనుక షారుక్ ఖాన్ పాత్ర, సంచలన వ్యాఖ్యలు చేసిన సుబ్రమణ్యస్వామి
Hazarath Reddyఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ల విజయంగా చెప్పబడుతున్నప్పటికీ, అప్పగింత ప్రక్రియలో షారుక్ ఖాన్ పాత్ర కూడా ఉందని బిజెపికి చెందిన సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.
T-Congress to Visit Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, వీడియో ఇదిగో...
Hazarath Reddyకాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలు దేరారు. అసెంబ్లీ నుండి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ను నేతలు సందర్శించనున్నారు
Farmers' Protest 2.0: టిక్రీ సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం, పోలీసుల హైఅలర్ట్‌ మధ్య మొదలైన రైతుల ఢిల్లీ ఛలో మార్చ్, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyదేశరాజధాని వేదికగా మరోసారి కదం తొక్కేందుకు రైతులు సిద్ధమయ్యారు. పలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలోను ప్రారంభించారు. పంజాబ్‌, హర్యానా ఇలా సమీప ప్రాంతాల నుంచి రైతులు తమ యాత్రను ప్రారంభించారు.
Farmers' Protest 2.0: దేశ రాజధానిలో రైతులు నిరసన, బవానా స్టేడియంను జైలుగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్నికోరిన కేంద్రం, రైతుల అరెస్టు సరికాదని తిరస్కరించిన కేజ్రీవాల్ సర్కారు
Hazarath Reddyదేశరాజధాని వేదికగా మరోసారి కదం తొక్కేందుకు రైతులు సిద్ధమయ్యారు. పలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలోను ప్రారంభించారు. పంజాబ్‌, హర్యానా ఇలా సమీప ప్రాంతాల నుంచి రైతులు తమ యాత్రను ప్రారంభించారు. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.. సరిహద్దుల్లో కంచెలతో భారీగా మోహరించారు.
Manish Sisodia Bail: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మూడు రోజులు బెయిల్, మేనకోడలి పెళ్లికి హాజరయ్యేందుకు లక్నో వెళ్లనున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి
Hazarath Reddyఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia Bail) మూడు రోజులు బెయిల్ మంజూరు అయింది. మేనకోడలి పెళ్లికి హాజరయ్యేందుకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయనకు మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది.
Bihar Floor Test: ఫ్లోర్ టెస్ట్‌లో విజయం సాధించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్, తీర్మానానికి మద్దతు ఇచ్చిన 129 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నుంచి ప్రతిపక్షం వాకౌట్
Hazarath Reddy129 మంది ఎమ్మెల్యేలు తీర్మానానికి మద్దతు ఇవ్వడంతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్‌లో విజయం సాధించింది. అయితే రాష్ట్ర అసెంబ్లీ నుంచి ప్రతిపక్షం వాకౌట్ చేసింది.బీహార్ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ అధినేత అవద్ బిహారీ చౌదరిపై రాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది.
Ashok Chavan Resigns From Congress: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, మహరాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్ రాజీనామా, త్వరలో బీజేపీలో చేరుతున్నట్లుగా వార్తలు
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ సోమవారం ఆ పార్టీ నుంచి వైదొలిగారు, ఆయన బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. "నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను" అని అశోక్ చవాన్ పార్టీ యూనిట్ చీఫ్ నానా పటోలేకు లేఖ రాశారు.
CM Revanth Reddy vs Harish Rao: కొడంగల్‌ ప్రజలు తరిమితే మల్కాజ్‌గిరిలో పడ్డావు, కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్
Hazarath Reddyసీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని, అలాంటి చర్చ సందర్భంగా అపొజిషన్ పార్టీ లీడర్ కేసీఆర్ సభలో లేకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, కరీంనగర్ ప్రజలు తరిమితే మహబూబ్ నగర్ వచ్చారని ఏద్దేవా చేశారు.
Bihar Floor Test: బీహార్ అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ఆమోదం, తీర్మానానికి అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు,వ్యతిరేకంగా 112 ఓట్లు
Hazarath Reddyబీహార్ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ అధినేత అవద్ బిహారీ చౌదరిపై రాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానానికి అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేశారు; వ్యతిరేకంగా 112. ఓటు వేసే అర్హత లేని డీసీఎం సామ్రాట్ చౌదరి అవిశ్వాసానికి ముందే బీహార్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
SC on Dy CMs in States: రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంల నియామ‌కంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, రాజ్యాంగ వ్య‌తిరేకం కాదని విలువలకు లోబడే జరుగుతుందని స్పష్టం చేసిన ధర్మాసనం
Hazarath Reddyరాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రుల(Deputy Chief Ministers) నియామ‌కంపై సుప్రీంకోర్టు ఇవాళ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. డిప్యూటీ సీఎంల నియామ‌కం రాజ్యాంగ వ్య‌తిరేకం కాదు అని కోర్టు తెలిపింది. చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం నేడు ఈ తీర్పును ఇచ్చింది.
Bihar Floor Test: బలపరీక్షలో సీఎం నితీష్ కుమార్ గెలుపు నల్లేరు మీద నడకేనా, అసెంబ్లీలో ఎవరి బలం ఎంత, నేడు విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న ముఖ్యమంత్రి
Hazarath Reddyబీహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ప్రభుత్వం నేడు బలపరీక్షకు రెడీ అయింది. మహాఘట్ బంధన్ నుంచి బయటకి వచ్చాక బీజేపీతో జట్టుకట్టి నితీశ్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో నితీశ్ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.
CM Revanth Reddy Slams KCR: కృష్ణా జలాల మీద కేసీఆర్ మరణ శాసనం రాశారు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్, మా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే సూచనలు ఇవ్వండని తెలిపిన ముఖ్యమంత్రి
Hazarath Reddyఅసెంబ్లీలో రెండో రోజు సమావేశాలు (Telangana Assembly Session 2024) హాట్ హాట్ గా సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల పై గంటకు పైగా చర్చలు
Hazarath Reddyఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీతో గంటకు పైగా సీఎం వైఎస్ జగన్‌ సమావేశం కొనసాగింది. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చలు జరిపారు
Bharat Ratna To Chaudhary Charan Singh: మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న పురస్కారం, దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలకు ఈ గౌరవం అంకితమని తెలిపిన ప్రధాని మోదీ
Hazarath Reddyమాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం మా ప్రభుత్వ అదృష్టమని, దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలకు ఈ గౌరవం అంకితం అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.