Politics

Visakha Railway Zone Row: విశాఖకు రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తా, ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యమని తెలిపిన జీవీఎల్

Hazarath Reddy

విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి (YSRCP MP Vijayasai Reddy) మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి సమావేశంలో రైల్వే జోన్‌ (Visakha Railway zone Row) అంశమే చర్చకు రాలేదన్నారు.

Harsh Mahajan Joins BJP: కాంగ్రెస్ పార్టీకి మళ్లీ బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత హర్ష మహాజన్‌

Hazarath Reddy

కొద్ది రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హాస్తం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీనియర్ లీడర్‌ హర్ష మహాజన్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, బీజేపీ తీర్థం తీసుకున్నారు.

Ban on PFI: పీఎఫ్ఐని నిషేధించినట్లే RSSని కూడా నిషేధించండి, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధం నిర్ణయాన్ని స్వాగతించిన ప్రతిపక్షాలు, ఆర్ఎస్ఎస్ కూడా నిషేధించాలని పిలుపు

Hazarath Reddy

కేరళలోని ప్రతిపక్ష కాంగ్రెస్, దాని సంకీర్ణ భాగస్వామి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) బుధవారం నాడు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)ని ఆరోపించిన ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి నిషేధించాలనే కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించింది, అయితే RSS కూడా అదే విధంగా నిషేధించబడాలని పేర్కొంది.

Ban on PFI: పీఎఫ్‌ఐపై ఐదేళ్లపాటు నిషేధం విధించిన కేంద్రం, దాని అనుబంధ సంస్థలపై కూడా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ

Hazarath Reddy

పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పై కేంద్రం నిషేధం విధించింది. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది

Advertisement

Ban on PFI: టెర్రర్ ఫండింగ్‌తో సంబంధాలు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు మొత్తం 8 సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

టెర్రర్ ఫండింగ్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ రాడికల్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)ని ఐదేళ్ల పాటు నిషేధించినట్లు హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) బుధవారం తెలిపింది.

Assam: సమావేశంలో తన్నుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, భారత్ జోడో యాత్రపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు

Hazarath Reddy

అసోంలోని ధుబ్రీ జిల్లాలోని రాజీవ్ భవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తల రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో ప్రారంభించనున్న భారత్ జోడో యాత్రపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

Democratic Azad Party: డెమోక్రటిక్ ఆజాద్ పార్టీని స్థాపించిన గులాం నబీ ఆజాద్, మూడు రంగులతో కూడిన జెండాను ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

Ghulam Nabi Azad: జమ్ముకశ్మీర్‌లో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్న గులాం నబీ ఆజాద్‌, జాతీయ పార్టీనే ప్రకటిస్తారని వార్తలు

Hazarath Reddy

గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad) నేతృత్వంలో జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ ప్రారంభంకానుంది. నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్‌ ప్రకటించే అవకాశం ఉన్నది. సోమవారం మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ పేరును వెల్లడించనున్నారు.

Advertisement

Italian PM: ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని.. తాజా ఎన్నికల్లో నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి మెజారిటీ

Jai K

ఇటలీ ప్రధాని పీఠాన్ని తొలిసారిగా ఓ మహిళ అధిష్టించనున్నారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీకి మహిళ ప్రధాని కావడం ఇదే మొదటిసారి.

Rajasthan Congress Crisis: మళ్లీ రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం, తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కొనసాగుతున్న సస్సెన్స్, సిఎల్‌పి సమావేశం రద్దు

Hazarath Reddy

మళ్లీ రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం (Rajasthan Congress Crisis) మొదలైంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశం రద్దు చేయబడింది, సీనియర్ పార్టీ నేతకు విధేయులైన 90 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా ( 90 MLAs Threaten To Resign) చేస్తామని బెదిరించారు,

Andhra Pradesh: ఎన్టీఆర్ మాకు అవసరం లేదని చంద్రబాబు గతంలో చెప్పిన న్యూస్ క్లిప్స్ వైరల్, విజయవాడలో ఎక్కడ చూసినా అవే..

Hazarath Reddy

ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాజకీయాలు వేడెక్కిన సంగతి విదితమే. తాజాగా విజయవాడలో చంద్రబాబుకు సంబంధించిన పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు..ఎన్టీఆర్ మాకు అవసరం లేదని చెప్పినట్లుగా ఉన్న డెక్కన్ క్రానికల్ కథనం రాసింది.

Three Capitals Row: 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదు, అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ పాలనా రాజధాని అయితే నష్టమేముందని ఆయన అన్నారు. యాత్రలను అడ్డుకోవడం తమకు ఐదు నిమిషాల పని అని చెప్పారు.

Advertisement

CM Seat: మహారాష్ట్రలో రాజకీయ దుమారం.. సీఎం ఏక్‌నాథ్ షిండే కుర్చీలో కూర్చున్న తనయుడు.. ‘సూపర్ సీఎం’ అని విమర్శిస్తున్న విపక్షాలు

Jai K

సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న ఫొటో ఒకటి మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి కారణమైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సీఎం కుర్చీలో కూర్చున్న ఫొటో ఇది. ఆ గదిలో ప్రభుత్వాధికారులు నిల్చుని ఉన్నారు.

CM Jagan Speech in Kuppam: నా కుప్పం అక్కా చెళ్లెళ్లు అంటూ జగన్ స్పీచ్, కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు పాలన కాదు,కుప్పం అంటే ఈరోజు అక్కాచెల్లెమ్మల అభివృద్ధని తెలిపిన ఏపీ సీఎం

Hazarath Reddy

కుప్పంలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. కుప్పం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం. కుప్పం అంటే ఈరోజు నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల్లో అభివృద్ధి కనిపిస్తోంది. కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు పాలన కాదు.. కుప్పం అంటే ఈరోజు అక్కాచెల్లెమ్మల అభివృద్ధని సీఎం జగన్ అన్నారు

TS Congress: నలుగురు టీకాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో భాగంగా నలుగురికి నోటీసులు, అక్టోబర్ 10న విచారణకు రావాలని స్పష్టం చేసిప ఈడీ

Hazarath Reddy

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో​ నలుగురు టీకాంగ్రెస్‌ నేతలకు (Four senior Congress leaders) ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో (ED notices in National Herald case) భాగంగా షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డికి నోటీసులు అందినట్టు సమాచారం.

Iran: యాంకర్ హిజాబ్ వేసుకోకపోవడంతో ఇంటర్యూ క్యాన్సిల్ చేసిన ఇరాన్ అధ్యక్షుడు,ట్విట్టర్లో మండిపడిన సీఎన్ఎన్ ఇంటర్నేషనల్ యాంకర్

Hazarath Reddy

ఇరాన్‌లో హిజాబ్‌ హీట్‌ కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో CNN‍చీఫ్‌ ఇంటర్నేషనల్‌ యాంకర్‌ క్రిస్టియానే అమన్‌పౌర్ ఛానల్ తరపున ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసిని ఇంటర్యూ చేయాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయింది. దీనికి ప్రధాన కారణం ఆమె హిజాబ్ ధరించకపోవడమే.

Advertisement

YSRCP Permanent President Row: జగన్ పార్టీ జీవితకాల అధ్యక్షుడు కాదు, కేవలం ఐదేళ్ల వరకే పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతారని తెలిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి కూడా శాశ్వత అధ్యక్షులు, సభ్యులు ఉండరని తెలిపింది. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై వివరణ ఇవ్వాలని వైసీపీకి ఎన్నికల సంఘం లేఖ రాసింది.

West Bengal: నేను మగవాడిని, ఈడీ,సీబీఐ నా శరీరాన్ని తాకలేవు, అసెంబ్లీ లోపలికి ఈ డైలాగులు రాసిన కుర్తాతో వెళ్లిన టీఎంసీ ఎమ్మెల్యే ఇద్రిస్‌ అలీ

Hazarath Reddy

టీఎంసీ శాసన సభ్యుడు ఇద్రిస్‌ అలీ ‘ఈడీ, సీబీఐ నా శరీరాన్ని తాకలేవు.. నేను మగవాడిని’ అని రాసి ఉన్న కుర్తా ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లాడు. టీఎంసీ ఎమ్మెల్యే ఇలాంటి డ్రెస్ ధరించి అసెంబ్లీకి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా.. ‘తనను సీబీఐ, ఈడీ తాకలేవని భావించే ఓ బీజేపీ నేత అన్నారు’ అంటూ సువేందు అధికారిని ఉద్ధేశిస్తూ చురకలంటించారు.

AP Assembly Sessions 2022: ప్రజలకు నాణ్యమైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం, మేం వచ్చాక ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ చెల్లించాం, వైద్యరంగంపై అసెంబ్లీలో సీఎం జగన్

Hazarath Reddy

సీఎం జగన్ మాట్లాడుతూ.. వైద్యరంగంలో నాడు-నేడుతో భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) అన్నారు.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ఎనర్జీ మాములుగా లేదుగా, స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న కాంగ్రెస్ నేత, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం (సెప్టెంబర్ 19) కేరళలోని పున్నమడ సరస్సులో స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. తన "భారత్ జోడో యాత్ర" అలప్పుజా జిల్లాకు చేరుకున్నప్పుడు, గాంధీ మత్స్యకారులతో సంభాషించారు.

Advertisement
Advertisement