Politics
Telangana Politics: అవమానాలు భరిస్తూ ఉండలేం, కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Hazarath Reddyగత కొద్దిరోజులుగా బీజేపీ ( BJP) వైపు వెళుతున్నట్లుగా సంకేతాలిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి(MLA Rajagopal Reddy) కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో స్పీకర్‌ను కలసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు.
Patra Chawl Land Scam Case: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అరెస్ట్, పత్రాచల్ భూ కుంభకోణంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు
Hazarath Reddyశివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్‌ కేసు) (Patra Chawl Land Scam Case) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో విచారించిన ఈడీ అతన్నిఅదుపులోకి (ED Detains Shiv Sena Leader Sanjay Raut ) తీసుకుంది.
WBSSC scam: టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌, మంత్రి పార్థా ఛటర్జీకీ షాకిచ్చిన దీదీ, మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు, అధికారాన్ని దుర్వినియోగం చేసేవారిని టీఎంసీ సహించదని స్పష్టం
Hazarath Reddyపశ్చిమ బెంగాల్లో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీకీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకిచ్చారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ వేటేశారు.
GVMC Standing Committee Polls: జగన్ మరో క్లీన్ స్వీప్, జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ పార్టీ
Hazarath Reddyపాలనలో దూసుకుపోతున్న జగన్ సర్కారు మరో సంచలన విజయం (GVMC Standing Committee Polls) నమోదు చేసింది. గ్రేటర్‌ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ (YSR Congress Party) క్లీన్‌ స్వీప్‌ చేసింది. పది స్థానాలకు గాను పదీ గెల్చుకుంది.
MP Sri Krishna Devarayalu Lavu: టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇంట్లో వైసీపీ ఎంపీ, ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో కలిసి ఫోటోకు ఫోజు ఇచ్చిన న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు
Hazarath Reddyవైసీపీ యువ నేత‌, న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు మంగ‌ళ‌వారం టీడీపీ ఎంపీల‌తో కలిసి దర్శనమిచ్చారు. టీడీపీతో పాటు మ‌రికొన్ని పార్టీల ఎంపీల‌తో క‌లిసి ఆయ‌న నేరుగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి చెందిన ఢిల్లీ నివాసానికి వెళ్లారు.
National Herald Case: సోనియా గాంధీని 6 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు, నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో మళ్లీ రేపు హాజరు కావాలని తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్
Hazarath Reddyసోనియాను మ‌ధ్యాహ్నం దాకా విచారించిన ఈడీ అధికారులు ఆమెకు మ‌ధ్యాహ్న భోజ‌న విరామం ఇచ్చారు. అనంత‌రం విచార‌ణ‌ను కొన‌సాగించిన అధికారులు... నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో నిధుల గోల్ మాల్‌పై ప్ర‌శ్న‌లు సంధించారు.
Parliament Monsoon Session: పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళనలు, 19 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చ జరపాలని డిమాండ్
Hazarath Reddyపార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చ జరపాలని రాజ్యసభ పోడియం ముందు విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
CM KCR Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్, రెండు మూడు రోజులు దేశ రాజధానిలోనే, వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో భేటీ అయి దేశ రాజ‌కీయాల‌పై చర్చలు
Hazarath Reddyఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి దేశ రాజధానికి చేరుకున్నారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎంపీలు సంతోష్‌కుమార్‌, జీ రంజిత్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు ఉన్నారు.
Telangana: కాంగ్రెస్‌లో అసలైన ఉద్యమకారులు లేరు, సినిమా డైలాగులకు ఓట్లు రావు, తాను కన్ఫ్యూజన్‌లో లేనని, ఫుల్ క్లారిటీతో ఉన్నానని స్పష్టం చేసిన రాజగోపాల్‌రెడ్డి
Hazarath Reddyకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిది కాంగ్రెస్ కుటుంబమని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka ) అన్నారు.
Parliament Monsoon Session 2022: లోక్ సభ నుంచి 4గురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్, స‌భా నిబంధ‌నావ‌ళిని ధిక్క‌రించినందుకు వ‌ర్షాకాల స‌మావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీకర్ ప్రకటన
Hazarath Reddyకాంగ్రెస్ పార్టీకి చెందిన న‌లుగురు సభ్యులు లోక్ సభ నుంచి సస్పెండ్ అయ్యారు. వీరిలో తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు ర‌మ్య హ‌రిదాస్‌, జ్యోతి మ‌ణి, టీఎన్ ప్ర‌తాప‌న్‌లు ఉన్నారు.
Minister Ambati Rambabu: కాసులకు కక్కుర్తిపడిన చంద్రబాబు, పోలవరం విధ్వంసం అంటూ విష ప్రచారం, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపిన మంత్రి రాంబాబు
Hazarath Reddyపోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మండిపడ్డారు. మీడియాకు పోలవరంపై మ్యాప్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాసులకు కక్కుర్తిపడి పోలవరం ( Polavaram Project) విషయంలో చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని విమర్శించారు.
Ram Nath Kovind: రాష్ట్రపతి భవన్ ఖాళీ చేసిన రామనాథ్ కోవింద్, సోనియా గాంధీ పక్క ఇంటికి మారిన మాజీ రాష్ట్రపతి, జన్‌పథ్‌లోని 12లో ఇకపై నివాసం
Hazarath Reddyప్రస్తుతం భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, దేశ పదిహేనవ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిలో తన వారసురాలు ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, సోమవారం రాష్ట్రపతి భవన్‌ను ఖాళీ చేశారు.
President Draupadi Murmu: రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము, ఒక ఆదివాసీ రాష్ట్రపతి భవన్ వరకు రావడం దేశ ప్రజల విజయమని తెలిపిన ముర్ము
Hazarath Reddyభారత దేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu) పదవీ బాధ్యతలను చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. 15వ రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ద్రౌప‌ది ముర్ము ఇవాళ జాతిని ఉద్దేశించి (President Draupadi Murmu address to the nation) ప్ర‌సంగించారు.
Draupadi Murmu Oath Ceremony: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలు, ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించిన సీజేఐ ఎన్వీ రమణ
Hazarath Reddyభారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం చేశారు, భారత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమె చేత ప్రమాణం చేయించారు. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు.అంతకుముందు రామ్‌నాథ్‌ కోవింద్‌, ద్రౌపది ముర్ము పార్లమెంట్‌కు చేరుకున్నారు.
Draupadi Murmu Biography: ద్రౌపది ముర్ము జీవితమంతా విషాదాలే, భర్తతో పాటు ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్నా చెదరని ధైర్యం, టీచర్ నుండి రాష్ట్రపతి దాకా ద్రౌపది ముర్ము జీవిత ప్రస్థానం ఇదే..
Hazarath Reddyభారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము (NDA Presidential Candidate Droupadi Murmu) నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో (President Election 2022 Result) బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయ దుందుభి మోగించారు
PM Modi Greets Droupadi Murmu: కంగ్రాట్స్ ద్రౌపది ముర్ము, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర
Hazarath Reddyభారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము (NDA Presidential Candidate Droupadi Murmu) నిలిచారు.
President Election 2022 Result: రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త చరిత్ర, సగానికి పైగా ఓట్లతో విజయదుంధుబి మోగించిన ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా రికార్డు
Hazarath Reddyభారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము (NDA Presidential Candidate Droupadi Murmu) నిలిచారు
President Election 2022 Result: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే, ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో 1,349 ఓట్లు సాధించిన ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి, యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు
Hazarath Reddyఇప్పటివరకు మొత్తం 1,886 చెల్లుబాటు అయ్యే ఓట్ల విలువ 6,73,175, అందులో ద్రౌపది ముర్ముకు 1,349 ఓట్లు 4,83,299 వచ్చాయి. యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు వచ్చాయి, ఇప్పటివరకు వాటి విలువ 1,89,876గా ఉంది.
Congress Protest: కర్ణాటకలో ఈడీ ఆఫీసు ఎదుట కారుకు నిప్పు పెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పార్టీ నిరసనలు
Hazarath Reddyకర్ణాటకలో ఈరోజు తెల్లవారుజామున బెంగళూరులోని శాంతినగర్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కారుకు నిప్పు పెట్టారు.
Congress Protest: ఈడీ ఆఫీస్ ముందు బైక్‌ను తగులబెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, సోనియాగాంధీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
Hazarath Reddyఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం దగ్గర ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు.