రాజకీయాలు

Nawab Malik Arrested: మ‌నీలాండ‌రింగ్ కేసులో మంత్రి న‌వాబ్ మాలిక్ అరెస్ట్, మార్చి 3 వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు, దావూద్ ఇబ్ర‌హీంతో ఆర్థిక సంబంధాలున్నాయని ఆరోపణలు

Hazarath Reddy

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను ఈడీ అరెస్ట్ (Nawab Malik Arrested) చేసింది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం మార్చి 3 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీకి కోర్టు అప్పగించింది. ముంబై ప్రత్యేక కోర్టు (Special PMLA Court) ఈ మేరకు పేర్కొంది.

MP Sanjay Raut on CM KCR: సీఎం కేసీఆర్ అందర్నీ కలుపుకుపోతారు, ముందుకు నడిపించే సామర్థ్యాలు మెండుగా ఉన్నాయని తెలిపిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

Hazarath Reddy

కే చంద్రశేఖర్ రావు ఎంతో కష్టపడి పనిచేసే రాజకీయ నేత. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అందరికనీ కలుపుకునిపోయే, నాయకత్వం వహించే సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి’’ అని సంజయ్ రౌత్ అన్నారు. ఇద్దరు సీఎంలు (కేసీఆర్,ఠాక్రే), ఇతర రాజకీయ నాయకులు త్వరలోనే సమావేశమై చర్చలు నిర్వహిస్తారని చెప్పారు.

Fodder Scam Case: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల రూపాయలు ఫైన్ విధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, మొత్తం 950 కోట్ల రూ. దాణా స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు

Hazarath Reddy

బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు జైలు శిక్ష ఖరారైంది. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court).. సోమవారం ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.

CM KCR Meets Sharad Pawar: సరికొత్త ఎజెండాతో ముందుకు వస్తాం: కేసీఆర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ తో సుధీర్ఘంగా చర్చ, కేసీఆర్‌ తో కలిసి పనిచేస్తానన్న పవార్, త్వరలోనే అన్ని పార్టీల నేతలతో సమావేశం

Naresh. VNS

దేశం దశ, దిశను మార్చేందుకు తాను ప్రయత్నిస్తున్నాన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR). ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) తో సమావేశమైన ఆయన...పలు కీలక అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో పాలన సరైన రీతిలో జరగడం లేదని, కొత్త అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు కేసీఆర్.

Advertisement

Punjab, UP Polls: ఎస్పీకి ఓటేస్తే...బీజేపీకి పడుతోంది! యూపీ ఎన్నికల్లో ఎస్పీ ఏజెంట్ల గొడవ, పంజాబ్ లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, ఉత్తరప్రదేశ్ లో ముగిసిన మూడోదశ పోలింగ్, పంజాబ్‌ లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం

Naresh. VNS

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (Punjab Polling) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అటు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో కీలకమైన మూడో దశ కూడా పూర్తయింది. యూపీ (UP) కంటే పంజాబ్ లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటింగ్ ను పూర్తిచేశారు. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకేదశలో పోలింగ్ పూర్తవ్వగా... యూపీలో మూడోదశలో 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

CM KCR Mumbai Tour Highlights: సీఎం కేసీఆర్ ముంబై పర్యటన విజయవంతం, జాతీయ స్థాయిలో అందర్నీ ఏకం చేస్తామని ప్రకటన, దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చల కోసం ప్రముఖులతో భేటీ

Hazarath Reddy

తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ముంబై ప‌ర్య‌ట‌న (CM KCR Mumbai Tour Highlights) విజ‌య‌వంతంగా ముగిసింది. ముంబై ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాకరేతో పాటు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో వేర్వేరుగా సీఎం కేసీఆర్ (Telangana CM K Chandrashekar Rao) స‌మావేశ‌మై జాతీయ రాజ‌కీయాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

KCR Meets Uddhav: ఇది ఆరంభం మాత్రమే! త్వరలోనే అన్ని పార్టీల నేతల మీటింగ్, ఉద్దవ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్, ప్రతీకార రాజకీయాలు మంచివి కావన్న ఇరువురు సీఎంలు

Naresh. VNS

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ( Regional parties) ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అన్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఆదివారం ముంబయి వచ్చిన సీఎం కేసీఆర్‌... జాతీయ రాజకీయాలపై ఉద్ధవ్‌ ఠాక్రేతో (Uddhav Thackeray) చర్చించారు.

5 States Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలక ఘట్టం, యూపీలో మూడోదశ, పంజాబ్, ఉత్తరాఖండ్‌ ల్లో కొనసాగుతున్న పోలింగ్, అఖిలేష్ తొలిసారి బరిలోకి దిగుతున్న స్థానంలో ఓటింగ్, పంజాబ్‌ పోలింగ్‌పై ఉత్కంఠ

Naresh. VNS

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (5 States Elections) ఆదివారం కీలకమైన పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మూడోదశ అసెంబ్లీ ఎన్నికలు, పంజాబ్‌(Punjab), ఉత్తరాఖండ్‌ (Uttarakhand)ల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే యూపీలో రెండు దశల పోలింగ్ పూర్తికాగా, మూడో దశ పోలింగ్ (Third Phase) ఉదయం ఏడు గంటలకు మొదలైంది.

Advertisement

KCR To Meet Uddhav: జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం కేసీఆర్! మహారాష్ట్రతోనే తొలి అడుగు, ఆదివారం ఉద్దవ్‌ తో కేసీఆర్ కీలక భేటీ, కేంద్రంపై యుద్ధానికి స్కెచ్ వేయనున్న కేసీఆర్

Naresh. VNS

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌(CM KCR)...ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఒక్కొక్కరిని కలువనున్నారు. ఈ మేరకు ఆదివారం నాడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో (Uddhav Thackeray) సమావేశం కానున్నారు.

Nitish Meets PK: విపక్ష కూటమిలోకి బీహార్ సీఎం నితీష్‌? బీహార్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రశాంత్ కిషోర్ తో సీఎం నితీష్ భేటీ, రెండు గంటల పాటూ సుదీర్ఘంగా చర్చించిన పాత మిత్రులు

Naresh. VNS

రెండేళ్ల క్రితం విడిపోయిన పాత స్నేహితుడ్ని సడెన్ గా కలిశారు బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar). ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ( Prashant Kishor ) రెండు గంటల పాటూ సుధీర్ఘంగా చర్చించారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.

Jagga Reddy: అవసరమైతే కొత్త పార్టీ పెడతా: జగ్గారెడ్డి, వాళ్లు చెప్పారని మూడు రోజులు టైం ఇస్తున్నా, నన్ను ఎవరూ కలవొద్దు, కావాలనే పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారంటూ ఆవేదన

Naresh. VNS

కాంగ్రెస్ పార్టీకి మరో మూడు రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy MLA Jagga Reddy). కాంగ్రెస్ ( Congress) ను వీడాలని లేకపోయినప్పటకీ...తాజా పరిస్థితులు తనను అటువైపుగా ఆలోచించే విధంగా చేస్తున్నాయన్నారు.

UP Elections: వారికోసం బల్డోజర్లు సిద్ధం చేస్తున్నాం, యూపీ సీఎం కీలక వ్యాఖ్యలు, మార్చి 10 తర్వాత సిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్, ఎస్పీ-బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం, హీటెక్కిన ఎన్నికల ప్రచారం

Naresh. VNS

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Assembly elections) ఎస్పీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరికి ఒకరు వార్నింగ్స్ ఇచ్చుకుంటున్నారు నేతలు. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు ముగియగా...త్వరలోనే మూడో దశ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. దీనికోసం ప్రచారం ఊపందుకుంది. అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ (Election Campaign) లో సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Telangana Congress: కాంగ్రెస్ నేతపై గాడిద దొంగతనం కేసు, సీఎం జన్మదిన వేడుకల కోసం వాడిన గాడిదను కొట్టేసినట్లు గుర్తించిన పోలీసులు, బల్మూరి వెంకట్ పై పలు సెక్షన్ల కింద కేసు

Naresh. VNS

తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్‌ పై (Balmuri Venkat) గాడిదను దొంగతనం చేశారని (Donkey theft case) కేసు పెట్టారు పోలీసులు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు(CM KCR Birthday) సందర్బంగా ఆయన వినూత్నంగా నిరసన తెలిపారు.

Russia-Ukraine Crisis: రెండు-మూడు రోజుల్లోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి, సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, దాడులకు దిగితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక

Hazarath Reddy

ఉక్రెయిన్‌-రష్యా మ‌ధ్య యుద్ధ భ‌యం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం (Russia-Ukraine Crisis) ఉందని అమెరికా ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 16న దాడి చేస్తుంద‌ని అమెరికా ముందుగా చెప్పిన‌ప్ప‌టికీ ర‌ష్యా ఆ చ‌ర్య‌కు పాల్ప‌డ‌లేదు.

BJP MLA Raja Singh: యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తాం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, నోటీసులు జారీ చేసిన ఈసీ

Hazarath Reddy

యూపీలో యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేయని వారి ఇళ్లపైకి జేసీబీలను, బుల్డోజర్లను పంపిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాజాసింగ్ కు ఎన్నికల సంఘం నోటీసులు (Election Commission issues notice to BJP's T Raja Singh) పంపించింది.

KCR Will Meet Uddhav Thackeray: బీజేపీకి వ్య‌తిరేకంగా..మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ, ఈ నెల 20వ తేదీన ముంబైకి సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. ఈ నెల 20వ తేదీన మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మ‌హారాష్ట్ర సీఎం ఆహ్వానం మేర‌కు 20న కేసీఆర్ ముంబ‌యికి వెళ్ల‌నున్నారు.

Advertisement

West Bengal Civic Polls: బీజేపీకి భారీ షాక్ ఇచ్చిన మమతాబెనర్జీ, మున్సిప‌ల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్, నాలుగు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌ను కైవసం చేసుకున్న టీఎంసీ, ఖాతా తెరవని కాషాయపు పార్టీ

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ లో జరిగిన మున్సిప‌ల్ ఎన్నికల్లో (West Bengal Civic Polls) బీజేపీ పార్టీకి మమతాబెనర్జీ భారీ షాక్ ఇచ్చింది. ఈనెల 12న పోలింగ్ జ‌రిగిన నాలుగు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌నూ తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గెలుచుకుంది. విధాన్‌న‌గ‌ర్‌, అస‌న్‌సోల్‌, చంద‌న్‌న‌గ‌ర్‌, సిలిగురి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌లో (West Bengal Municipal Election Results 2022 ) టీఎంసీ అభ్య‌ర్ధులు విజ‌యం సాధించారు.

Assembly Elections 2022 Highlights: మూడు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్, భారీ ఎత్తున తరలివచ్చిన ఓటర్లు, మార్చి 10న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ (Assembly Elections 2022 Highlights) ముగిసింది. యూపీలో సాయంత్రం 6 గంటల సమయానికి 60.69 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో ఉత్తరప్రదేశ్ లో 55 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

Assembly Elections 2022: గోవా, ఉత్తరాఖండ్, యూపీలలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌, పోటీలో మహామహులు

Hazarath Reddy

ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీలకు సోమవారం ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. అలాగే ఉత్తర ప్రదేశ్ లో రెండో దశ ఎన్నికలు ఓటింగ్ కూడా ప్రారంభమైంది. ఉత్తర ప్రదేశ్‌, గోవాలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ (Assembly Election Results 2022) జరగనుంది. ఉత్తరాఖండ్‌లో మాత్రం సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియనుంది.

Manipur assembly polls rescheduled:అప్పుడు పంజాబ్...ఇప్పుడు మణిపూర్, అసెంబ్లీ ఎన్నికల తేదీని మార్చిన ఈసీ, ఎందుకు మార్చారంటే? మార్చి షెడ్యూల్ ఇదే!

Naresh. VNS

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ (Manipur assembly polls rescheduled) మారింది. ఎన్నికల సంఘం (Election Commission of India) పోలింగ్ తేదీని సవరించింది. షెడ్యూల్ ప్రకారం.. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 27న జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల సంఘం ఫిబ్రవరి 28వ తేదీకి సవరించింది. రెండో దశ పోలింగ్‌ మార్చి 3న జరగాల్సి ఉంది.

Advertisement
Advertisement