రాజకీయాలు
Huzurabad Bypoll Result 2021: పనిచేయని దళిత బంధు మంత్రం, ఈటలకే జై కొట్టిన హుజూరాబాద్ ఓటర్లు, 15 రౌండ్ల ముగిసే నాటికి 11,157 ఓట్ల ఆధిక్యం, రౌండ్ల వారీగా ఫలితాలు ఇవే..
Hazarath Reddyఅత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో (Huzurabad Bypoll Result 2021) బీజేపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ కి ఉత్కంఠగా మారిన లెక్కింపులో ఈటల రాజేందర్ దే పై చేయిగా నిలుస్తోంది. మొత్తం 22 రౌండ్ల ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటివరకు 15 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరిగింది.
Huzurabad By Election Results 2021: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస యాదవ్ సొంత గ్రామంలో కారు డీలా, ఈటెలకే జై కొడుతున్న హుజురాబాద్
KrishnaHuzurabad By Election Results 2021: ఈటల రాజేందర్‌ను ఢీకొట్టడంలో టీఆర్ఎస్ పార్టీ తడబడుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ సొంత గ్రామమైన వీణవంకలోని హిమ్మత్‌ నగర్‌లో ఈటల రాజేందర్‌కు 191 ఓట్ల మెజారిటీ లభించింది.
Raghuveera Reddy: రఘువీరారెడ్డిని తాళ్లతో స్థంభానికి బంధించిన మనవరాలు సమీరా, తనకు సమయాన్ని కేటాయించాలంటూ డిమాండ్, ఫేస్‌బుక్‌లో వెల్లడించిన మాజీ మంత్రి
Hazarath Reddyమాజీ మంత్రి రఘువీరారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తన మనవరాలు సమైరా స్తంభానికి కట్టిపడేసి మరీ తనతో ఆడుకోవడానికి నేను ఇంట్లో ఉండాలని డిమాండ్ చేసిందంటూపోస్ట్‌ రఘువీరా ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్‌ చేశారు.
Huzurabad Bypoll Result 2021: ఈటెల కోటలో గెల్లు గెలుస్తాడా, గత ఎన్నికల గెలుపు ఫలితాలు ఎలా ఉన్నాయి, బీజేపీ ఓటు బ్యాంక్ అక్కడ ఎంత, ఈటెలను ఈ సారి ప్రజలు ఆదరిస్తారా..హుజూరాబాద్ గత ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ
Hazarath Reddyఈ ఏడాది జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల (Huzurabad Bypoll) గతంలో ఎన్నడూ జరగని విధంగా ఓ యుద్ధాన్నే తలపించింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల (TRS vs BJP)) మధ్యనే పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల బయటకు వచ్చి బీజేపీలో చేరడంతొ ఇక్కడ ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మంకగా తీసుకున్నాయి.
Bypoll Results 2021: హుజూరాబాద్‌ తొలిరౌండ్‌లో బీజేపీదే హవా, బద్వేల్‌లో దూసుకుపోతున్న వైసీపీ, రెండు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార పార్టీదే ఆధిక్యం, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyబద్వేల్ తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ నిలిచింది. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. ఇక హుజూరాబాద్ పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్‌ 32, చెల్లనవి 14గా ఉన్నాయి.
2013 Patna Bombings Case: మోదీని టార్గెట్ చేస్తూ వ‌రుస బాంబు పేలుళ్లు, పాట్నా గాంధీ మైదాన్ సీరియల్ బ్లాస్ట్ కేసులో న‌లుగురికి మ‌ర‌ణ‌శిక్ష‌ విధించిన ఎన్ఐఏ కోర్టు, ఇద్ద‌రికి జీవిత‌కాల శిక్ష‌, మ‌రో ఇద్ద‌రికి 10 ఏళ్ల జైలుశిక్ష
Hazarath Reddy2013లో పాట్నాలోని గాంధీ మైదాన్ లో జ‌రిగిన వ‌రుస పేలుళ్ల ఘ‌ట‌న‌లో నిందితులైన న‌లుగురికి ఎన్ఐఏ కోర్టు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది. 9 మంది దోషుల్లో ఇద్ద‌రికి జీవిత‌కాల శిక్ష‌ను అమ‌లు చేయ‌నున్నారు. మ‌రో ఇద్ద‌రికి 10 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. ఒక‌రికి ఏడేళ్ల శిక్ష‌ను విధించారు.
Narayana Swamy: ఏపీ డిప్యూటీ సీఎంకు షాక్‌, నారాయణస్వామికి ఆ శాఖ కోత, బుగ్గన ఖాతాలోకి మరో శాఖ
Naresh. VNSఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వద్ద ఉన్న వాణిజ్య పన్నుల శాఖను ఆయన నుంచి తప్పించింది. ఆ శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగిస్తూ జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. దీంతో ఎక్సైజ్ శాఖకే నారాయణ స్వామి పరిమితం కానున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో ఏపీ ప్రభుత్వం భావించింది.
National Unity Day 2021: పటేల్ బలమైన భారత దేశాన్ని కలగన్నారు, ప్రధాని మోదీ సందేశం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఐక్యతా కవాతులో పాల్గొన్న అమిత్ షా..
Krishnaసర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఏర్పాటు చేసిన ఐక్యతా కవాతులో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ రోజు వల్లభాయ్ పటేల్‌కు దేశం నివాళులు అర్పిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు.
Mamata Banerjee: అచ్చేదిన్ అంటూ దేశాన్ని సర్వనాశనం చేశారు, ప్రధాని మోడీపై మండిపడ్డ మమతా బెనర్జీ, గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తుపై దీదీ చర్చ
Naresh. VNSగోవాలో పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. గోవాలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుపుకొని కూటమిగా బరిలోకి దిగనున్నారు. ఇందుకోసం గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్‌తో సమావేశమయ్యారు.
By Elections: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్, ఉత్కంఠరేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
Naresh. VNSతెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నియోజకవర్గానికి ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
Telugu Desam Party: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీరెడ్డి, మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఫతావుల్లా, పలువురు నేతలను కీలక పదవుల్లో నియమించిన అచ్చెన్నాయుడు
Hazarath Reddyఇటీవలే తెలుగు దేశం పార్టీలో చేరిన ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన జీవీరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (TDP AP Chief Kinjarapu Atchannaidu) ప్రకటించారు. అలాగే, మరికొందరు నేతలను కీలక పదవుల్లో నియమించారు.
PM Modi Italy Tour: రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, సాదర స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ, 16వ జి-20 సదస్సులో పాల్గొననున్న భారత ప్రధాని
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలోని రోమ్ కు చేరుకున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ఆహ్వానం మేరకు అక్టోబర్ 30-31 వరకు ఇక్కడ జరిగే 16వ జి-20 సదస్సులో ఆయన పాల్గొంటారు. అలాగే ఇటలీ ప్రధాని మారియో డ్రాగీతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు.
'BJP Not Going Anywhere': రాహుల్ గాంధీకి ఇంకా అర్థం కావడం లేదు, మరో 40 ఏళ్లు బీజేపీదే రాజ్యం, సంచలనం రేపుతున్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యూహకర్త వ్యాఖ్యల వీడియో
Hazarath Reddyభారత దేశ రాజకీయాల్లో బీజేపీ పాత్రపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలను మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ (BJP Not Going Anywhere for Many Decades) ప్రభావితం చేస్తుంది. సరిగ్గా చెప్పాలంటే బీజేపీ (BJP) కేంద్రంగానే భారత రాజకీయాలు కొనసాగుతాయి.
Ayushman Bharat Health Infrastructure Mission: ఆయుష్మాన్ భార‌త్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ మిష‌న్ ప్రారంభించిన ప్రధాని, ఆప‌రేష‌న‌ల్ గైడెన్స్‌ విడుదల, యూపీలో 9 మెడిక‌ల్ కాలేజీలు లాంచ్ చేసిన నరేంద్ర మోదీ
Hazarath Reddyభారత ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌ధాన్ మంత్రి ఆయుష్మాన్ భార‌త్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ మిష‌న్ (PM ABHIM)ను ప్రారంభించారు. ఇవాళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఆయన‌.. సిద్ధార్థ‌న‌గ‌ర్‌, వార‌ణాసిలో న‌గ‌రాల్లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు రిబ్బ‌న్ క‌టింగ్ చేశారు. ఈ క్ర‌మంలోనే వార‌ణాసిలో PM ABHIMను ప్రారంభించారు.
TRS Plenary Meeting Highlights: ఏపీలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు వేల విజ్ఞాప‌న‌లు, ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, 9వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఏకగ్రీవంగా (CM KCR Unanimously Elected As TRS Party President ) ఎన్నికయ్యారు. పార్టీ ప్లీనరీ ఆయనను 9వ సారి అధ్యక్షుడిగా ఎన్నుకుంది. కేసీఆర్ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ కీలక నేత కేకే అధికారికంగా ప్రకటించారు.
Kakinada Municipal Corporation: కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్‌, ఏకగ్రీవగా ఎన్నిక, హాజరుకాని టీడీపీ కార్పోరేటర్లు
Hazarath Reddyకాకినాడ మేయర్‌గా 40 వ వార్డు కార్పొరేటర్ సుంకర శివప్రసన్న (sunkara siva prasanna) , డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఈ మేయర్‌ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు.
TRS Party Plenary 2021: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, 21వ వసంతంలోకి అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, గులాబిమయమైన హైదరాబాద్, మరోసారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్ బాధ్యతలు
Hazarath Reddyటీఆర్‌ఎస్‌ 20వ సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా ప్లీనరీ పండుగకు (TRS Party Plenary 2021) గ్రేటర్‌ సిద్ధమైంది. రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని (20 Years of TRS Party) పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధుల సభ (ప్లీనరీ) సోమవారం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనుంది.
TDP vs YSRCP: పట్టాబి వ్యాఖ్యలు దారుణం, దీనిపై దర్యాప్తు చేస్తామని తెలిపిన డీజీపీ సవాంగ్, నారా లోకేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు, చంద్రబాబుపై మండిపడిన వైసీపీ మంత్రులు
Hazarath Reddyఈ వ్యాఖ్యలపై డీజీపీ గౌతం సవాంగ్ (AP DGP Sawang) స్పందించారు. పట్టాభి నిన్న దారుణమైన భాష మాట్లాడారని డీజీపీ అన్నారు. పార్టీ కార్యాలయం నుంచి పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయని చెప్పారు. రాజకీయ పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని... రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని దుర్భాషలాడటం సరికాదని అన్నారు.
YS Sharmila Praja prasthanam: చేవెళ్ల నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం, 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు, 16 సెగ్మెంట్లను చుట్టేలా పాదయాత్ర, తరలి రానున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు
Hazarath Reddyతెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిలా రెడ్డి 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర (Praja prasthanam foot march) చేపట్టి తిరిగి చేవెళ్లలోనే ముగించనున్నారు
Andhra Pradesh: ప్రజలు ఆవేశాలకు గురికావొద్దు, రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన డీజీపీ సవాంగ్, నేడు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ
Hazarath Reddyటీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలను ముట్టడించాయి. ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఏపీ డీజీపీ సవాంగ్ రెచ్చగొట్టేవారికి హెచ్చరికలు జారీ చేశారు.