Politics

Telangana Assembly Special Session: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించనున్న సభ

Arun Charagonda

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనుంది తెలంగాణ అసెంబ్లీ. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది తెలంగాణ అసెంబ్లీ. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానుండగా సంతాప దినాల్లో భాగంగా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనుంది శాసన సభ.

Sharmistha Mukherjee Slams Congress: కాంగ్రెస్ పార్టీపై ప్రణబ్ ముఖర్జీ కూతురు ఫైర్, నాన్న చనిపోతే కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించలేదు..తనని కూడా తప్పుదోవ పట్టించిందని ఆరోపణ

Arun Charagonda

కాంగ్రెస్ పార్టీపై మాజీ ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు.. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో.. సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత చెప్పారు.

Manmohan Singh Last Rites: మన్మోహన్ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు...కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు..నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్‌ అంత్యక్రియలు

Arun Charagonda

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యావత్ భారతావని కన్నీటి నివాళి అర్పించింది. కాసేపటి క్రితం అంతిమయాత్ర ప్రారంభంకాగా అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో మన్మోహన్‌సింగ్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

ED Notices To KTR: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్ కు ఈడీ నోటీసులు.. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు

Rudra

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Advertisement

Imtiaz Ahmed Resigns: కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం

Hazarath Reddy

వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి, కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు.ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సూచన మేరకే రాజీనామా చేశానని వెల్లడించారు.

CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ సీఎం

Arun Charagonda

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, చంద్రబాబు ష్యూరిటీ లేదు..భవిష్యత్తు గ్యారంటీ లేదు, మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాజీ మంత్రి రోజా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్స్ లో తిరిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారని విమర్శలు గుప్పించారు.

Andhra Pradesh: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్, వీడియోలు, ఫోటోలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.

Advertisement

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

Arun Charagonda

భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందారు మన్మోహన్. మన్మోహన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Manmohan Singh Last Rites On Saturday: శనివారం మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు.. ఏడు రోజులు సంతాపదినాలు.. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకం సగానికి అవనతం

Rudra

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూశారు. ఆయన అంతిమ సంస్కారాలను శనివారం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు.

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Rudra

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని ఆయన అన్నారు.

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

Rudra

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం అరవై ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటం జరిగినప్పటికీ, అప్పటి ప్రధాని మన్మోహనుడి ప్రభుత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది.

Advertisement

Telangana Govt. Declares Holiday: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు

Rudra

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించింది.

Manmohan Singh Health Update: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తీవ్ర అస్వస్థత, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు

Hazarath Reddy

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. మూలాల ప్రకారం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఢిల్లీ ఎయిమ్స్ అత్యవసర విభాగంలో చేరారు. గతంలో కూడా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో చేరడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

మూవీ ప్రొమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోను సూద్‌ మాట్లాడుతూ.. మహమ్మారి సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు గానూ తనకు సీఎం (Sonu Sood Was Offered Chief Minister Post), డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని తెలిపారు.

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Hazarath Reddy

బెంగళూరులోని నందిని లేఅవుట్‌లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి (Egg Attack On BJP MLA Munirathna) చేశారు.ఈ దాడికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు

Advertisement

Madhavaram Krishna Rao: ఆంధ్రోళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా, ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు రెచ్చగొడితే సహించేది లేదని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్

Hazarath Reddy

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు(Madhavaram Krishna Rao) అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. ఆంధ్ర ప్రజల(People of Andhra Pradesh) మనోభావాలను దెబ్బతీసేలా...రాజధాని హైదరాబాద్(Hyderabad)నగరం ప్రశాంతతను భగ్నం చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా వీకే సింగ్...5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించిన కేంద్రం

Arun Charagonda

5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ముగ్గురిని ఒక రాష్ట్రం నుండి మరో చోటికి బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది. మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది.

KA Paul Slams CM Revanth Reddy: వీడియో ఇదిగో, సీఎం రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు, కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి సంవత్సరం కాలంలో ఎప్పుడూ గొడవలే. ఒకరోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు.

Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

Rudra

సినీ నటుడు అల్లు అర్జున్ - సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement