రాజకీయాలు
CM Tirath Singh Rawat: మన దేశాన్ని అమెరికా పాలించింది, 20 మంది పిల్లల్ని కంటే రేషన్ ఎక్కువొస్తుంది, లేడిస్ ఆ చిరిగిన జీన్స్ ఎందుకు ధరిస్తున్నారు, ఉత్తరాఖండ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు, మండిపడుతున్న బీజేపీ అధిష్ఠానం, తీరత్ సింగ్ రావత్‌కి కరోనా పాజిటివ్
Hazarath Reddyఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ప్రతీసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతున్నారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సీఎం (Uttarakhand CM Tirath Singh Rawat) తాజాగా కరోనా నేపథ్యంలో పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని... వారికి ప్రభుత్వం ఇస్తున్న ఎక్కువ రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని వివాదాస్పద వ్యాఖ్యలు చెప్పారు. ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం (ration) ఇస్తున్నామని... ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 50 కేజీలు అందుతున్నాయని తెలిపారు.
MP Sanjay Raut: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అంశంపై మండిపడిన సంజయ్ రౌత్, కేంద్రం మంటల్లో కాలిపోక తప్పదని ఘాటు వ్యాఖ్యలు, ప్రకంపనలు రేపుతున్న హోం మంత్రి రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు
Hazarath Reddyరాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను అడ్డు పెట్టుకుని, రాష్ట్రంలో అరాచకాలు చేయాలని చూస్తోంది, కలహాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అలా చేయాలని చూస్తే ఆ అగ్నిలో కేంద్రమే కాలిపోతుందని ఆయన హెచ్చరించారు.
Randeep Surjewala: మోదీజీ..అవినీతి ముఖ్యమంత్రి యడ్డ్యూరప్పని ఎందుకు తొలగించడం లేదు, ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా, నడ్డాజీ ఎక్కడ అంటూ ట్వీట్
Hazarath Reddyఅవినీతి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం యడ్డ్యూరప్పను ముఖ్యమంత్రిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా (Senior Congress leader Randeep Surjewala) ఆదివారం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. "సిఎం యడ్ఢ్యూరప్పపై" అవినీతి ఆరోపణలు "న్యాయ తీర్పుల ద్వారా బయటపడటంతో, బిజెపి" మమ్ "ఎందుకు? పీఎం మోడీ జీ ఎందుకు మౌనంగా ఉన్నారు? నడ్డాజీ ఎక్కడ? సీఎంను ఎందుకు తొలగించలేదు? కథను తాకడానికి కూడా మీడియా ఎందుకు భయపడుతోంది? ” అంటూ సుర్జేవాలా ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు.
Karnataka Politics Row: కర్ణాటకలో బీజేపీ బతకాలంటే సీఎం యడ్డ్యూరప్పను తొలగించాల్సిందే, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ రెబల్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, అవినీతి ముఖ్యమంత్రిని వెంటనే తొలగించాలని ట్విట్టర్‌లో విరుచుకుపడిన సుర్జేవాలా
Hazarath Reddyకర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పపై బీజేపీ రెబల్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ విరుచుకుపడ్డారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల తరువాత రాష్ట్రంలో సీఎం మార్పు అనివార్యమని తెలిపారు. ఎందుకంటే బిజెపి సీఎం యడ్డ్యూరప్ప నాయకత్వంలో తదుపరి ఎన్నికలకు వెళ్ళలేదని ఆయన అన్నారు.
Australia Floods: మెరుపు వరదలు..భయం గుప్పిట్లో వేలాదిమంది ప్రజలు, 1960 తర్వాత ఆ స్థాయి వరదలతో విలవిలలాడుతున్న ఆస్ట్రేలియా, జలమయమైన సిడ్నీ,న్యూసౌత్ వేల్స్
Hazarath Reddyఅనుకోని వర్షాలతో ఆస్ట్రేలియా అతలాకుతలం అవుతోంది. అక్కడి జనాలు అర్ధరాత్రిళ్లు ఇళ్లొదిలి.. ప్రాణాలు అరచేత పట్టుకుని.. బిక్కు బిక్కుమంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సిడ్ని నగరాన్ని, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రాన్ని వానలు (Australia floods) ముంచెత్తాయయి. నదులు పొంగి ఇళ్ళలోకి రావడంతో అక్కడి వాసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోడ్ల మీదకు పరుగులు తీస్తున్నారు.
Param Bir Singh Letter Row: మహారాష్ట్రలో నెలకు వంద కోట్లు వసూలు లేఖ ప్రకంపనలు, రంగంలోకి దిగన శరద్ పవార్, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌సింగ్‌
Hazarath Reddyపారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలోని శివసేన–ఎన్‌సీపీ–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో ఈ కేసు రాజకీయ ప్రకంపనలను పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌సింగ్‌ ఏకంగా రాష్ట్ర హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు (Allegations of Corruption Against Anil Deshmukh) చేశారు.
Telangana MLC Results: ఫలించిన కేసీఆర్ వ్యూహం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ రెపరెపలు, సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘన విజయం, ఓటమితో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నా‌రెడ్డి, డబ్బుతో నన్ను ఓడించారని తెలిపిన బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు, దొంగ ఓట్లతో టీఆర్ఎస్ గెలిచిందన్న తీన్మార్ మల్లన్న
Hazarath Reddyతెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో (Telangana MLC Election 2021 Results) టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి (surabhi Vanidevi), నల్లగొండ-ఖమ్మం- వరంగల్‌ స్థానంలో డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) గెలిచారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానాన్ని బీజేపీ నుంచి వశం చేసుకున్న టీఆర్‌ఎస్‌ నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌లో వరుసగా రెండోసారి గెలుపొందింది.
Fire at Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం, భారీ ఎత్తున చెలరేగిన మంటలు, 'ఎమ్మెల్సీ' గెలుపు సంబరాల్లో అపశృతి
Hazarath Reddyతెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు సంబరాల్లో అపశృతి (fire-broaken-in-telangana-bhavan) చోటుచేసుకుంది. హైదరాబాదు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చుతుండగా అగ్నిప్రమాదం (Fire at Telangana Bhavan) సంభవించింది. ఈ ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి.
MLC Polls 2021 Counting: తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సీ స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్, ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులు, రెండో ప్రాధాన్యత ఓట్లు తమకేనని ప్రత్యర్థుల ధీమా!
Team Latestlyశుక్రవారం ఉదయం నాటికి నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సీ స్థానానికి మొత్తం 7 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఈ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.....
MLC Polls 2021 Results: తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, రెండు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థుల ఆధిక్యం, పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న
Team Latestlyకొద్దిసేపటి క్రితమే తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి గానూ 16,130 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. ఈయనకు సమీపంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న 12,046 ఓట్లతో....
Indra Pratap Singh Shot Dead: కాంగ్రెస్ నేత దారుణ హత్య, గువారా బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఇంద్ర‌ ప్ర‌తాప్ సింగ్ ప‌ర్మార్‌పై కాల్పులు జరిపి హతమార్చిన దుండుగులు, ఉన్నత స్థాయి ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని మాజీ సీఎం క‌మ‌ల్‌నాథ్‌ డిమాండ్
Hazarath Reddyమధ్యప్రదేశ్ రాష్ట్రం చత్తార్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చత్తార్పూర్ జిల్లాలోని గువారా బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఇంద్ర‌ ప్ర‌తాప్ సింగ్ ప‌ర్మార్‌ను దుండ‌గులు అతి స‌మీపం నుంచి ఛాతీపై కాల్పులు జరిపి (Congress Leader Shot Dead) హతమార్చారు. మంగ‌ళ‌వారం రాత్రి ఇంద్ర‌ ప్ర‌తాప్‌.. మిత్రులతో కలిసి స్థానికంగా ఉండే ఓ హోటల్‌ ముందు నిలబడి ఉండగా, బైక్‌పై వ‌చ్చిన ఇద్దరు దుండ‌గులు ఆయ‌న‌పై కాల్పులు (Indra Pratap Singh Parmar Shot Dead) జ‌రిపి పారిపోయారు.
Amaravati Land Scam: భూదందా కేసులో హైకోర్టుకు చంద్రబాబు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్, భూములు కాజేసిన వారికి శిక్ష తప్పదంటున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, బాబును ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన సీఐడీ
Hazarath Reddyఅమరావతిలో భూ దందా జరిగిందని, చంద్రబాబు హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందన్న ఆరోపణలపై నిన్న సీఐడీ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. సీఐడీ నోటీసుల అంశంపై న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న చంద్రబాబు... రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అమరావతి భూముల అంశంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ లో కోరనున్నారు.
MLC Election Results: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ, ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (MLC Election Results) ప్రారంభమైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు (MLC Election Result 2021) ఏర్పాట్లు చేశారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్‌ శాఖ గిడ్డంగిలో లెక్కిస్తున్నారు.
KV Reddy Quits Congress: కాంగ్రెస్‌కు గుడ్ బై, సంచలన నిర్ణయం తీసుకున్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం, బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు
Hazarath Reddyటీఆర్ఎస్ పార్టీ దెబ్బకు తెలంగాణలో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చేవెళ్ల ఎంపీ, వ్యాపారవేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Former Chevella MP Konda Vishweshwar Reddy) ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు.
CID Notices to CBN: రాజధాని భూ అక్రమాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సిఐడి నోటీసులు, విచారణకు హాజరుకావాలని సూచన
Team Latestlyఅమరావతి భూ అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఏపి ప్రతిపక్షనేత, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం సిఐడి అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చారు. మార్చి 23 న విచారణకు హాజరు కావాలని కోరారు.....
Telangana Budget Session 2021: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు, మార్చి 18న అసెంబ్లీలోకి తెలంగాణ బడ్జెట్‌, 20 నుంచి బడ్జెట్‌, పద్దులపై చర్చ, మాస్క్‌ లేకుంటే సభకు రావద్దని తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‎రెడ్డి
Hazarath Reddyనేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Telangana Budget Session 2021) తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ( Tamilisai Soundararajan) ప్రసంగిచనున్నారు. అనంతరం సభా నిర్వహణపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy ) అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. అనంతరం చనిపోయిన సభ్యులకు మంగళవారం సంతాప తీర్మానాలు ఉంటాయి.
AP Municipal Election Results 2021: ఫ్యాన్ హోరులో కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ-జనసేన, జగన్ సర్కారుకు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లు, విజయవాడ, గుంటూరు, విశాఖ, కర్నూలు, ఇంకా పలు జిల్లాల్లో వైసీపీదే ఆధిక్యం
Hazarath Reddyమున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ( AP Municipal Election Results 2021) కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అన్ని చోట్ల విజయభేరి మోగించింది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఫ్యాన్‌ దూకుడును అందుకోలేక టీడీపీ, బీజేపీ, జనసేన వెనుకబడిపోయాయి.
YSRCP MLA Ambati Rambabu: ప్రజలు మూడు రాజధానులకు జై కొట్టారు, ప్రతిపక్షాలకు ఇక పనే లేదు, మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు
Hazarath Reddyదత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సొంత పుత్రుడు లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో టీడీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయిందని, రాష్ట్రంలో ఈ దెబ్బతో టీడీపీ కనుమరుగైపోయిందని అంబటి రాంబాబు తెలిపారు.
AP Municipal Poll Results 2021: గుంటూరులో వైసీపీదే హవా, విజయవాడ కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైసీపీ విజయం, ఒంగోలుతో సహా 5 కార్పోరేషన్లు అధికార పార్టీ కైవసం, తాడిపత్రి ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, ఏపీ మునిసిపల్ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
Hazarath Reddyఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించే దిశగా దూసుకువెళుతోంది. చాలా చోట్ల కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా అధికార పార్టీ ముందుకు వెళుతోంది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ తన హవా కొనసాగిస్తోంది. ఇక ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గుంటూరులోనూ అధికార పార్టీనే ఆధిపత్యం సాధించింది.
AP Municipal Poll Results 2021: దూసుకుపోతున్న వైసీపీ, ప్రతిచోటా ఆధిక్యంలో జగన్ సర్కారు, డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం, కనిగిరి మున్సిపాలిటీలో వైసీపీ క్లీన్ స్వీప్, కొవ్వూరు మునిసిపాలిటీ వైసీపీ ఖాతాలోకి..
Hazarath Reddyఏపీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కౌంటింగ్ ఆరంభం నుంచి వైసీపీ ఆధిక్యత కనపరుస్తూ వస్తోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ముందుగా లెక్కించిన పోస్టల్‌ బ్యాలెట్‌ల్లో వైఎస్ఆర్‌సీపీదే ఆధిక్యం సాధించింది. ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది.