Politics

Kancharla Chandrasekhar Reddy: వీడియో ఇదిగో, గాంధీ భవన్‌లో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాట్లాడేందుకు నిరాకరించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీ

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీని కలిసేందుకు వెళ్ళారు. కాగా ఆమె ఈరోజు ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నేపద్యంలో అక్కడికి వెళ్ళిన చంద్రశేఖర్ రెడ్డి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు

Rozgar Mela: రోజ్‌గార్ మేళా, 71 వేల మందికి నియామక పత్రాలు అందజేసిన ప్రధాని మోదీ, ఏడాదిన్న‌ర‌లో 10 ల‌క్ష‌ల ప‌ర్మ‌నెంట్ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి

Hazarath Reddy

రోజ్‌గార్ మేళాలో వర్చువల్ ఈవెంట్ ద్వారా రిక్రూట్ అయిన వారిని ఉద్దేశించి 71,000 మందికి పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇచ్చామని,ఏ ప్రభుత్వ ఉద్యోగాల హయాంలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి "మిషన్ మోడ్"లో కల్పించలేదని అన్నారు.

Sandhya Theatre Tragedy Row: పోలీస్ అధికారి మీడియా ముందు వీధి రౌడీ భాషలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు, చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించిన విష్ణు వర్థన్ రెడ్డి, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఎవ్వరైనా సరే పోలీసులను నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తోలు తీస్తామని సస్పెండెడ్​ ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి హెచ్చరించారు. అల్లు అర్జున్​ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్​ అయ్యారు. దీనిపై ఎక్స్ వేదికగా బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు.

DK Aruna on Sandhya Theatre Tragedy: అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారు, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన డీకే ఆరుణ

Hazarath Reddy

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆమె స్పందించారు. అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.

Advertisement

Kadapa Mayor Suresh vs MLA Madhavi: వీడియో ఇదిగో, కుర్చీ కోసం టీడీపీ, వైసీపీ మధ్య వార్, కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి రచ్చరచ్చ

Hazarath Reddy

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

Arun Charagonda

సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్...ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం దీనికి కారణం బీఆర్ఎస్ పాపాత్ములే కారణం అని మండిపడ్డారు. రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా చెప్పాలన్నారు.

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం 100శాతం రుణమాఫీ అంటాడు.. ఎమ్మెల్యేలు 70శాతం రుణమాఫీ అంటున్నారు...మీ ఎమ్మెల్యేలకు కనీసం ట్రైనింగ్ అయినా ఇవ్వండని చురకలు అంటించారు కేటీఆర్. ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ...కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా చెప్పాలన్నారు.

Hyderabad Traffic Restrictions: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడకలను నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

Advertisement

PM Modi to Visit Kuwait: 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని, రెండు రోజుల పాటు ప్రధానమంత్రి మోదీ పర్యటన, చివరిసారిగా 1981లో పర్యటించిన ఇందిరాగాంధీ

Hazarath Reddy

డిసెంబరు 21 నుంచి రెండు రోజుల పాటు కువైట్‌లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ.43 ఏళ్లలో తొలిసారిగా భారత ప్రధాని చేపట్టబోతున్న పర్యటన ఇది. చివరిసారిగా ఇందిరా గాంధీ 1981లో పర్యటించారు

Formula E Race Case: వీడియో ఇదిగో, తెలంగాణ ప్రభుత్వం మీద లండన్‌లో ఫార్ములా-ఈ కంపెనీ కేసు వేసింది, హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం మీద లండన్‌లో ఫార్ములా-ఈ కంపెనీ కేసు వేసిందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్థాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగిందని ఫార్ములా- ఈ వాళ్లు లండన్‌లో కేసు వేశారు.. రేపు వాళ్ళు అక్కడ కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం.

One Nation One Election: జమిలి బిల్లు కోసం జేపీసీలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితా ఇదిగో..

Hazarath Reddy

జమిలి బిల్లు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది.

Pawan Kalyan: వీడియో ఇదిగో, OG OG అని అరిస్తే పనులు జరగవు, అభిమానులకు చురకలు అంటించిన పవన్ కళ్యాణ్, సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారని వెల్లడి

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు చురకలు అంటించారు. ‘‘నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు.

Advertisement

BRS Vs Congress: అసెంబ్లీలో దాడి ఎవరు చేశారో మీరే చూడండి అంటూ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై రచ్చ

Hazarath Reddy

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి అసెంబ్లీ సమావేశంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.

Om Prakash Chautala Dies: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా తన 89వ ఏట మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా చాలా సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు మరియు చౌదరి దేవి లాల్ జీ యొక్క పనిని నిరంతరం ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అతని కుటుంబ సభ్యులకు మరియు మద్దతుదారులకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

Om Prakash Chautala Dies: గుండెపోటుతో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత, 1989 నుంచి 2005 వరకు హర్యానాకు ఐదుసార్లు సీఎంగా పనిచేసిన చౌతాలా

Hazarath Reddy

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురుగ్రావ్ లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత (ఐఎన్ఎల్ డీ) చీఫ్ చనిపోయారని ఐఎన్ఎల్ డీ వర్గాలు తెలిపాయి.

Nitin Gadkari on Same-Sex Marriages: స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను కూడా అనుమతించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

సహజీవనాలు, స్వలింగ వివాహాలపై కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండూ చాలా తప్పుడు పద్ధతులని, వీటి వల్ల సమాజం ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

KTR: అవినీతి జరగలేదని మంత్రులే చెప్పారు...ఈ కేసు నిలబడదన్న కేటీఆర్, అందరిని తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి...కేసులను లీగల్‌గానే ఎదుర్కొంటానని చెప్పిన కేటీ రామారావు

Arun Charagonda

ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్...ముఖ్యమంత్రిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు.

Delhi: అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి...పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన, అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు..వీడియో

Arun Charagonda

రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కొనసాగించాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇండియా కూటమి ఎంపీలు.

KTR on Formula E Race Case: రేవంత్ రెడ్డి చేసేది ల‌త్కోర్ ప‌ని, ఫార్ములా -ఈ రేస్ కేసుపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్

Hazarath Reddy

ఫార్ములా – ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు. ఈ వ్య‌వ‌హారంలో రేవంత్ రెడ్డి చేసేది ల‌త్కోర్ ప‌ని అని ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్. ఫార్ములా -ఈ రేస్‌పై అసెంబ్లీలో చ‌ర్చించేందుకు రేవంత్ స‌ర్కార్ భ‌య‌ప‌డుతోంద‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు.

Telangana: ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ అవకతవకలపై విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు, హరీష్‌రావు విజ్ఞప్తి మేరకు సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ (ORR Toll contract)లో జరిగిన అవకతవకలపై సిఎం రేవంత్ రెడ్డి SIT విచారణకు ఆదేశించారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.

Advertisement
Advertisement