రాజకీయాలు

GHMC Election Results 2020: కారు జోరుకు బీజేపీ బ్రేక్, 56 సీట్లకే పరిమితమైన టీఆర్ఎస్, 48 సీట్లతో సత్తా చాటిన బీజేపీ, 44 సీట్లతో ఎంఐఎం, రెండు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్, పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

Hazarath Reddy

ఎట్టకేలకు గ్రేటర్ ఫలితాల ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు (GHMC Election Results 2020) వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ (TRS) 56 డివిజన్లలో గెలుపొందింది. తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ సారి అంచనాలను పూర్తిగా తారుమారు చేసింది.

GHMC Election Results 2020: దూసుకెళ్తున్న కారు, గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ, ఎంఐఎం పార్టీలు, చతికిల పడిన కాంగ్రెస్, జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా కేసీఆర్ సర్కారు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకుపోతోంది. పోలింగ్ ఫలితాలు వెలువడే కొద్ది టీఆర్ఎస్ తన సీట్ల సంఖ్యను పెంచుకుంటో పోతోంది. మొదట లెక్కించిన పోస్టల్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్‌ఎస్‌... బ్యాలెట్‌ ఓట్లలో జోరుపెంచింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. టీఆర్‌ఎస్‌ 57 డివిజన్‌లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 22, ఎంఐఎం అభ్యర్థులు 31 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

GHMC Election Results 2020: ఎన్నికల కమీషనర్ సర్క్యులర్ కు హైకోర్ట్ బ్రేక్, గ్రేటర్ ఫలితాల్లో ట్విస్ట్, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం, రెండో స్థానంలో కొనసాగుతున్న టీఆర్ఎస్

Team Latestly

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ లో మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా పోస్టల్ బ్యాలెట్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఆధిక్యం లభిస్తుంది. ఉదయం 10:30 వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 85 స్థానాల్లో ఆధిక్యత కనబరచగా, తెరాస 34 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంది....

GHMC Election Results 2020: గ్రేటర్‌లో మేయర్ పీఠం దక్కేది ఎవరికి? ప్రారంభమైన జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్, బ్యాలెట్ ఓటింగ్ కారణంగా ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం

Team Latestly

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 స్థానాలు గెలుచుకోగా, ఈసారి కూడా 100 స్థానాలు పక్కా అంటూ తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ తెరాసకు 70 స్థానాలు వస్తాయని అంచనా వేసింది, బీజేపీకి 20-25 వచ్చే ఛాన్స్ ఉందని, కాంగ్రెస్ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకోవచ్చని పేర్కొన్నాయి...

Advertisement

Rajinikanth's Political Entry: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్, వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన తలైవా

Team Latestly

990 నాటి నుంచే రజినీ రాజకీయ ప్రవేశంపై ప్రచారం జరుగుతూ ఉంది. 1996లో రజిని బహిరంగంగా డిఎంకెకు మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా జయలలిత నుండి తమిళనాడును కాపాడాలని పిలుపునిచ్చారు. ఆ ఎన్నికలలో ఎఐఎడిఎంకె ఓడిపోయినప్పుడు రజిని ఒక గేమ్ ఛేంజర్ గా చూడబడ్డారు....

JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డి కంపెనీకి రూ.100 కోట్ల జరిమానా, త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని నిర్దారించిన ఏపీ గనుల శాఖ, ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తునకు వెనుకాడబోమని వెల్లడి

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి (JC Diwakar Reddy) భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని నిర్ధారించిన ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ (AP Mines Department) రూ.100 కోట్ల జరిమానా విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

GHMC Elections 2020: కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, సాయంత్రం 6 వరకు జరగనున్న పోలింగ్

Team Latestly

ఈసారి జిహెచ్‌ఎంసి ఎన్నికలను టిఆర్‌ఎస్, బిజెపి, ఎఐఐఎంఐఎం, కాంగ్రెస్ సహా ఇతర అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బిజీపీ తరఫున దిల్లీ నుంచి అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం తరలిరావడంతో బల్దియా ఎన్నికలు జాతీయ ఎన్నికలను తలపించాయి...

AP Assembly Winter Session 2020: అసెంబ్లీ నుంచి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, సభలో చర్చ సాగకుండా అడ్డుపడిన టీడీపీ సభ్యులు, నేటి సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేసిన స్పీకర్

Hazarath Reddy

అసెంబ్లీ సమావేశాల్లో తుపాను నష్టంపై వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు మాట్లాడుతున్న సంధర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు. దీంతో చంద్రబాబు సహా 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ ( Chandrababu naidu and tdp mlas suspended) చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

Advertisement

Rajinikanth's Political Entry Row: సస్పెన్స్ అలాగే కంటిన్యూ చేసిన రజినీకాంత్, అభిమానులతో ముగిసిన మీటింగ్, రాజకీయ ప్రవేశానికి టైం ఉందంటూ అభిమానులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన సౌత్ ఇండియా సూపర్ స్టార్

Hazarath Reddy

అమిత్ షా చెన్నై వచ్చి వెళ్లిన తరువాత రజినీకాంత్ హఠాత్తుగా అభిమాన సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈరోజు అభిమానులతో మీటింగ్ తరువాత పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ ఖచ్చితంగా ఒక ప్రకటన చేస్తారని అనుకున్నారు. అయితే, అభిమాన సంఘాలతో (Rajani Makal Mandaram) మీటింగ్ తరువాత రజినీకాంత్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

AP Assembly Winter Session 2020: ప్రారంభంమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సంతాపం తీర్మానాల అనంతరం సభ వాయిదా, నెల్లూరు మ్యూజిక్‌, డాన్స్‌ ప్రభుత్వ పాఠశాలలకు ఎస్పీ బాలు పేరు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రారంభం అయిన తర్వాత మొదటి అంశంగా సంతాప తీర్మానాలు (Andhra Pradesh Assembly Winter Session 2020) ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ మృతికి ముందుగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

Rajinikanth Political Suspense: అభిమానులతో రజినీకాంత్ రేపు కీలక భేటీ, రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ వీడే అవకాశం, సమావేశానికి అనుమతి కావాలని కోడంబాకం పోలీసులకు లేఖ రాసిన రజనీ ఫ్యాన్స్

Hazarath Reddy

జనీకాంత్ తన అభిమానులతో రేపు సమావేశం (Rajinikanth To Hold Key Meeting With RMM Cadre) కానున్నారు. అభిమానులంతో నవంబర్ 30న రజనీ మక్కల్ మండ్రాం ఆఫీసుకు రావాలని పిలుపునిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో రాజకీయాల్లోకి ఎంట్రీపై ఆయన కీలక నిర్ణయం (May End Suspense Over Political Move) తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

Delhi Chalo: ఢిల్లీ సరిహద్దుల్లో కదం తొక్కిన రైతులు, కొత్త వ్యవసాయ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమబాట, మద్దతు తెలిపిన కేజ్రీవాల్, పంజాబ్‌కు అన్ని సర్వీసులను రద్దు చేసిన హర్యానా ప్రభుత్వం

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్‌ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ (Farmers' protest against new farm laws ) ఐదు రాష్ట్రాలకు చెందిన రైతులు చలో ఢిల్లీ (Delhi Chalo) ప్రకటించారు. ఈ నిరసన ప్రదర్శన అంబాలా- పాటియాలా ప్రాంతానికి చేరుకునే సరికి ఉద్రిక్తంగా మారిపోయింది.

Advertisement

#MumbaiTerrorAttack: ముష్కర మూకలు విరుచుకుపడిన వేళ.. 26/11కు పన్నెండేళ్లు, ఉగ్రదాడిలో 166 మంది అమాయక ప్రజలు బలి, అమరులకు నివాళులు అర్పించిన యావద్భారతం

Hazarath Reddy

ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 12 ఏళ్లు (Mumbai terror attack 12 years on) పూర్తయ్యాయి. 2008 నవంబర్‌ 26న పాకిస్థాన్ నుంచి అరేబియా సముద్రం మార్గం ద్వారా వచ్చిన పది మంది అత్యాధునిక తుపాకులతో విరుచుకుపడిన వేళ, 18 మంది భద్రతా సిబ్బంది అమరులు కాగా, 166 మంది అమాయక ప్రజలు బలయ్యారు.

'Surgical Strikes in Old City': అధికారం ఇవ్వండి..పాతబస్తీలో వారిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

గ్రేటర్‌లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటాపోటీ ప్రచారం సెగలు పుట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి గ్రేటర్‌ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. టీఆర్‌ఎస్‌ నేతలకు ధీటుగా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్ చేస్తామని ('Surgical Strikes in Old City')సంచలన వ్యాఖ్యలు చేశారు.

GHMC Elections 2020: 24 గంటలు మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన టీఆర్ఎస్, ప్ర‌జా ర‌వాణాకు పెద్ద‌పీట వేస్తామని తెలిపిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

‌డిసెంబర్ 1న జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో (GHMC Elections 2020) భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోను (TRS Manifesto) విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మేనిఫెస్టోను (TRS Manifesto For GHMC Elections) విడుదల చేశారు.

TS Covid Report: తెలంగాణలో 602 కొత్త కేసులు, రాష్ట్రంలో 2,64,128కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, రెండవ దశలో కరోనా వచ్చే ప్రమాదం ఉందని అధికారులను అలర్ట్ చేసిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 602 కొత్త కేసులు (TS Covid Report) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,64,128 కేసులు (Coronavirus in Telangana) నమోదయ్యాయి. నిన్న కరోనా బారినపడి మరో ముగ్గురు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,433కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1015 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement

GHMC Elections 2020: ఆయన పావురాల గుట్టలో పావురమయ్యాడు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే, తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్న వైఎస్సార్ అభిమానులు, వైసీపీ నేతలు, టీఆర్ఎస్ నేతలు

Hazarath Reddy

వెనుకటికి ఒకడుండేవాడు. పావురాల గుట్టల్లో పావురమైపోయిండు. మీకు అదే గతి పడుతుంది.నేను సైన్స్‌ టీచర్‌ను. యాక్షన్‌కు రియాక్షన్‌ ఉంటుంది. టీఆర్‌ఎస్‌ నాయకత్వంపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శలు (Raghunandan Rao Comments Over YSR Death) గుప్పించారు. అయితే ఇక్కడ వైఎస్సార్ ప్రస్తావన తీసుకురావడంతో ఆయన అభిమానులు ఎమ్మెల్యేపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

GHMC Elections 2020: విపక్షాలకు దిమ్మతిరిగేలా గ్రేటర్‌లో విజయం సాధిస్తాం, ధీమా వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, అభ్యర్థుల తొలి జాబితా రెడీ, బీజేపీలో చేరిన కాంగ్రెస్ కీలక నేత, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి

Hazarath Reddy

డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections 2020) పోటీ చేసేందుకు వివిధ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో భాగంగా 105 డివిజన్లకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక బీజేపీ 21 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది.

Telangana: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత రఘునందన్ రావు, ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు

Hazarath Reddy

తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికల్లో (Dubbaka By poll) గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు (Goreti Venkanna, Baswaraju Saraiah, Dayanand) ప్రమాణ స్వీకారం చేశారు.

AP Local Body Elections: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు, న్యాయపరమైన ఇబ్బందులు లేవని తెలిపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్

Hazarath Reddy

ఏపీలో వచ్చే ఏడాది పంచాయితీ ఎన్నికల నగారా మోగనుంది. ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు (AP Local Body Elections 2020) జరగనున్నాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ (SEC Nimmagadda Ramesh Kumar) తెలిపారు.

Advertisement
Advertisement